
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్‌లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చైనీస్ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్ జోడీ 6–3, 6–2తో సాండెర్ ఆరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) జంటపై విజయం సాధించింది. టైటిల్ నెగ్గిన బాలాజీ జోడీకి 9,300 డాలర్ల (రూ. 6 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో బాలాజీ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–100లోకి వచ్చే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment