
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్‌చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.
‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్‌తో తలపడనున్నారు.
మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్‌లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్‌లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు.