న్యూఢిల్లీ: తొలి మూడు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించి జోరు మీదున్న విష్ణువర్ధన్‌కు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడి పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో విష్ణు 7-5, 3-6, 6-7 (4/7)తో శ్రీరామ్ బాలాజీ (భారత్) చేతిలో ఓటమి చవిచూశాడు.
3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో విష్ణు కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. అవకాశం దొరికినపుడల్లా బాలాజీ నెట్‌వద్దకు దూసుకొచ్చి పాయింట్లు సాధించాడు. భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరైన విష్ణు బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు, బేస్‌లైన్ ఆటతో బాలాజీని నియంత్రించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మరో సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్) 6-3, 6-1తో వీటోస్కా (జర్మనీ)పై గెలిచి శనివారం జరిగే ఫైనల్లో బాలాజీతో అమీతుమీకి సిద్ధమయ్యాడు. డబుల్స్ విభాగంలో ఏపీ ఆట గాడు అశ్విన్ విజయరాఘవన్ రన్నరప్‌గా నిలి చాడు. ఫైనల్లో అశ్విన్-రామ్‌కుమార్ (భారత్) జంట 6-7 (3/7), 3-6తో శ్రీరామ్ బాలాజీ- రంజిత్ (భారత్) జోడి చేతిలో ఓడిపోయింది.
పోరాడి ఓడిన విష్ణు
Published Sat, Nov 16 2013 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement