విష్ణు జంటకు డబుల్స్ టైటిల్ | Vishnu couple's doubles title | Sakshi
Sakshi News home page

విష్ణు జంటకు డబుల్స్ టైటిల్

Published Sat, Apr 30 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

విష్ణు జంటకు డబుల్స్ టైటిల్

విష్ణు జంటకు డబుల్స్ టైటిల్

చండీగఢ్: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్-1 టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6-1, 6-4తో యుచి ఇటో-షో కటయామ (జపాన్) జోడీపై విజయం సాధించింది.

విష్ణు కెరీర్‌లో ఇది 25వ ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-1, 7-6 (7/5)తో షో కటయామ (జపాన్)పై గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement