అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ టో ర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్ సొంతం చేసుకుంది.
డబుల్స్ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్–ఆకాంక్ష (భారత్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక జోడీ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో రష్మిక పోరాటం సెమీఫైనల్లో ముగిసింది.
మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్ 6–2, 6–1తో డేవిడ్ పిచ్లార్ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. రెండు నెలల వ్యవధిలో రామ్‌కుమార్‌కిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment