హగ్‌ ఇస్తుంటే కంగారుపడ్డాడు | Ram kumar feels tense while giving hug says Amala paul | Sakshi
Sakshi News home page

హగ్‌ ఇస్తుంటే కంగారుపడ్డాడు

Published Mon, Oct 15 2018 2:13 PM | Last Updated on Mon, Oct 15 2018 4:29 PM

Ram kumar feels tense while giving hug says Amala paul - Sakshi

ఈ రోజుల్లో యువతీ యువకులు అభినందించుకోవడంలో భాగంగా కౌగిలించుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక సినీరంగంలో అయితే చెప్పనక్కర్లేదు. అయితే అలా ఇక హీరోయిన్‌ దర్శకుడికి హగ్‌ ఇస్తుంటే ఆయన కంగారు పడి తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్, దర్శకుడు ఎవరనేగా మీ ఆసక్తి. అది సంచలన నటి అమలాపాల్, యువ దర్శకుడు రామ్‌కుమార్‌. ఈ దర్శకుడి చిత్రం రాక్షసన్‌లో నటి అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల జరిగిన ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌లో తాను దర్శకుడికి హగ్‌ ఇవ్వబోతే ఆయన కంగారు పడి తప్పించుకున్నారని నటి అమలాపాల్‌ స్వయంగా చెప్పింది.

దీని గురించి ఈ అమ్మడు చెబుతూ 'దర్శకుడు రామ్‌ చాలా మంచి వ్యక్తి. అంతే కాదు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. రాక్షసన్‌ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. చిత్ర షూటింగ్‌ పూర్తి కాగానే హమ్మయ్య పూర్తి అయ్యింది అని సంతోషంతో దర్శకుడు రామ్‌కుమార్‌ను హగ్‌ చేసుకోబోయాను. ఆయన కాస్త కంగారు పడి వెనక్కు వెళ్లారు. ఆయన ముండాసిపట్టి చిత్రం సక్సెస్‌ తరువాతనే పెళ్లి చేసుకోవలసింది. ఈ రాక్షసన్‌ చిత్రం తరువాత ఆయనకు పిల్ల దొరకడం కష్టమే అంటూ నవ్వుతూ సెటైర్‌ వేసింది. నిజంగా రామ్‌ చాలా మంచి వ్యక్తి. ఆయనకు త్వరలోనే మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని భావిస్తున్నాను.

రాక్షసన్‌ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇకపోతే ఇప్పుడు మీటూ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి దీని గురించి ట్వీట్‌ చేసిన మొదటి వ్వక్తిని నేనే. గత ఫిబ్రవరిలో లైంగికవేధింపులు ఎదురైనప్పుడు నేను మీటూ అని ట్వీట్‌ చేశాను. ఆ తరువాతే మీటూ అంతర్జాతీయంగా పాచుర్యం అయ్యింది. మీటూ అనేది ఒక మంచి విషయం. ఇది ఇంకా విస్తరించాలి.  18 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి వచ్చాను. నటించడానికి వచ్చినప్పుడే ప్రముఖ నటిని కావాలని అనుకున్నాను. అయితే ఆ పేరు తెచ్చుకోవడానికి 8 ఏళ్లు పట్టింది. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. ఇకపై నటనకు బ్రేక్‌ ఇవ్వను. చిత్రపరిశ్రమనే నాకు తల్లి. చిత్రాలను ఆస్వాదిస్తూ నటిస్తా' అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement