సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీకి టైటిల్‌ | Title for Saket and Ramkumar pair | Sakshi
Sakshi News home page

సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీకి టైటిల్‌

Published Sun, Feb 11 2024 3:50 AM | Last Updated on Sun, Feb 11 2024 3:50 AM

Title for Saket and Ramkumar pair - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ స్టార్, భారత డేవిస్‌కప్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని ఖాతాలో 16వ ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ చేరింది. రామ్‌కుమార్‌ రామనాథన్‌తో జోడీ కట్టిన సాకేత్‌ చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టోర్నమెంట్‌లో డబుల్స్‌ విజేతగా నిలిచాడు.

శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ జంట 3–6, 6–3, 10–5తో భారత్‌కే చెందిన రిత్విక్‌ చౌదరి– నిక్కీ పునాచా ద్వయంపై గెలుపొందింది. సాకేత్‌ జోడీ ఒక ఏస్‌ సంధించగా, 2 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఆఖరిదాకా పోరాడిన రిత్విక్‌–నిక్కీ జంట 2 ఏస్‌లు సంధించి ఒకసారి డబుల్‌ ఫాల్ట్‌ చేసింది.

మరో వైపు ఇదే టోర్నీ సింగిల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ సుమిత్‌ నగాల్‌ టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో 26 ఏళ్ల నగాల్‌ 6–3, 6–4తో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన డలిబర్‌ విర్సినాపై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో సుమిత్‌... ఇటలీ ఆటగాడు లుకా నర్డితో తలపడతాడు. మరో సెమీస్‌లో లుకా నర్డి 6–4, 4–6, 7–6 (8/6)తో చున్‌ సిన్‌ సెంగ్‌ (చైనీస్‌ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement