
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆశాకిరణం రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేశాడు. 148వ ర్యాంకర్ రామ్‌కుమార్ తొలి రౌండ్లో 7–6 (7/4), 6–2తో తనకన్నా మెరుగైన కార్బలెస్ బయెనా (స్పెయిన్; 106వ ర్యాంకు)ను కంగుతినిపించాడు. మంగళవారం జరిగే రెండో రౌండ్లో అతనికి క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్, టోర్నీ ఫేవరెట్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో రామ్‌కుమార్ తలపడనున్నాడు.
డబుల్స్‌లో హైదరాబాద్ ఆటగాడు విష్ణువర్ధన్ జోడీకి తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జోడీ 6–3, 6–7 (6/8), 6–10తో అదిల్ షమస్దిన్(కెనడా)–నీల్ స్కప్‌స్కీ (అమెరికా) జంట చేతిలో ఓడింది.