టెకీ స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలిలో తలదాచుకుంటున్న రామ్కుమార్‌ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు.
తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే.