techie swathi murder case
-
స్వాతి హత్యకేసులో ఊహించని మలుపు
-
స్వాతి హత్యకేసులో ఊహించని మలుపు
- నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య - జైలులోనే కరెంటు తీగలు పట్టుకుని బలవన్మరణం - ఆత్మహత్యకాదు.. హత్యే అంటున్న కుటుంబసభ్యులు చెన్నై: ఇన్ఫోసిన్ ఉద్యోగిని స్వాతి(24) హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. స్వాతిని హత్యచేసి, ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీగా ఉన్న రామ్ కుమార్ ఆదివారం జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు ప్రాంగణంలోని కరెంటు తీగలను పట్టుకుని రామ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని జైలు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది ఆత్మహత్యకాదు.. హత్యే అని నిందితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. (ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు) జూన్ 24న చైన్నై నగరంలోని సుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు వచ్చిన స్వాతిని రామ్ కుమార్ దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన కొద్ది రోజులకే తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను చూసి రామ్ కుమార్ బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. దీంతో అతని మెడకు 18 కుట్లు పడ్డాయి. కోర్టు రామ్ కుమార్ కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న అతను ఆదివారం ఆత్మహత్యచేసుకున్నాడు. (నేను అమాయకుణ్ని...స్వాతిని హత్య చేయలేదు) -
వివాదంలో బాలీవుడ్ సింగర్
ముంబై : బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌పై అభ్యంతరకర ట్విట్లు చేయటంతో ఆయనపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే చెన్నైలో ఇన్పోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతంపై గాయకుడు అభిజిత్ భట్టాచార్య వివాదాస్పదంగా ట్విట్ చేశారు. స్వాతి హత్యకు లవ్ జీహాదే కారణమని ఆయన తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అభిజిత్ భట్టాచార్య వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ స్వాతి అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుపుతూ జర్నలిస్ట్ రీట్వీట్ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ... జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీటర్ దాడిపై స్వాతి చతుర్వేది ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయకుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనిపై అభిజిత్ స్పందిస్తూ జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ట్విట్ల ద్వారా జర్నలిస్ట్ ప్రచారం పొందాలని ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి హత్యకు...జర్నలిస్ట్ మతం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని అభిజిత్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయాలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉందని అభిజిత్ అన్నారు. కాగా అభిజిత్ ట్విట్ లను పలువురు సపోర్టు చేస్తుండగా, మరి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. बेशर्म बुढ़िया..U not proud of Indians? Wats your breed? U sk pakis..I fk Pakis, U lick..I kick, dnt block just wait https://t.co/0BWHU60rPm — abhijeet (@abhijeetsinger) 2 July 2016 -
టెకీ స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్
చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలిలో తలదాచుకుంటున్న రామ్‌కుమార్‌ను శుక్రవారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్లో ఉంటున్నాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. -
టెకీ హత్య కేసులో నిందితుడి ఊహాచిత్రం విడుదల
హైదరాబాద్: ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం విడుదల చేశారు. రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని కనుగొన్నారు. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న స్వాతి(24)పై శుక్రవారం ఉదయం చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో దుండగుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.