వివాదంలో బాలీవుడ్ సింగర్ | Twitter controversy: Singer Abhijeet Bhattacharya says ‘this is not the end’ | Sakshi
Sakshi News home page

స్వాతికి క్షమాపణ చెప్పేది లేదు: అభిజిత్

Published Mon, Jul 4 2016 11:09 AM | Last Updated on Wed, Apr 3 2019 7:03 PM

వివాదంలో బాలీవుడ్ సింగర్ - Sakshi

వివాదంలో బాలీవుడ్ సింగర్

ముంబై : బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్పై అభ్యంతరకర ట్విట్లు చేయటంతో ఆయనపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే చెన్నైలో ఇన్పోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతంపై గాయకుడు అభిజిత్ భట్టాచార్య వివాదాస్పదంగా ట్విట్ చేశారు. స్వాతి హత్యకు లవ్ జీహాదే కారణమని ఆయన తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అభిజిత్ భట్టాచార్య వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ స్వాతి అభ్యంతరం వ్యక్తం చేశారు.

హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ జర్నలిస్ట్ రీట్వీట్‌ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ... జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీటర్‌ దాడిపై స్వాతి చతుర్వేది ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయకుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

దీనిపై అభిజిత్ స్పందిస్తూ జర్నలిస్ట్కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  ట్విట్ల ద్వారా జర్నలిస్ట్ ప్రచారం పొందాలని ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి హత్యకు...జర్నలిస్ట్ మతం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని అభిజిత్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయాలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉందని అభిజిత్ అన్నారు. కాగా అభిజిత్ ట్విట్ లను పలువురు సపోర్టు చేస్తుండగా, మరి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement