journalist Swati chaturvedi
-
జర్నలిస్టు స్వాతికి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ఫర్ కరేజ్–2018 భారత్‌కు చెందిన పరిశోధనాత్మక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిని వరించింది. సామాజిక మాధ్యమాల్లో వేధింపుల్ని ధైర్యంగా ఎదుర్కొన్నందుకు ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఆన్లైన్లో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగాల విద్వేషపూరిత వేధింపులను ఆమె వెలుగులోకి తెచ్చారు. ఇటలీ, టర్కీ, మొరాకోకు చెందిన జర్నలిస్టులను అధిగమించి ప్రియాంక ఈ అవార్డును గెలుచుకున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా ఆమె ’ఐ యామ్ ఏ ట్రోల్: ఇన్సైడ్ ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ది బీజేపీ డిజిటల్ ఆర్మీ’ అనే పుస్తకాన్ని రచించారు. గురువారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో రిపోర్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్(ఆర్‌డబ్ల్యూబీ) అనే సంస్థ అవార్డును స్వాతికి ప్రదానం చేసింది. స్వాతి మాట్లాడుతూ ‘ సమర్థంగా చేసిన నా పనికి కాకుండా నా ధైర్యానికి ఈ అవార్డు పొందడం కొంత విచారకరం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాను శత్రువుగా చిత్రీకరిస్తున్నారు. భారత్‌లో గతేడాది ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ తన ఇంటి బయటే హత్యకు గురవడం భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. విమర్శల పట్ల ప్రభుత్వాలు సహనం పాటించడంలేదు. ఆన్లైన్లో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. అవి నాపై ప్రభావం చూపి ఉంటే విధుల్ని సరిగా నిర్వర్తించేదాన్నే కాదు. దాడులు, ప్రాణ హాని ఎదుర్కొంటున్న జర్నలిస్టుల కోసం ఆర్‌డబ్ల్యూబీ పాటుపడటం ధైర్యాన్నిస్తోంది’ అని అన్నారు. స్వాతి చతుర్వేది -
వివాదంలో బాలీవుడ్ సింగర్
ముంబై : బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌పై అభ్యంతరకర ట్విట్లు చేయటంతో ఆయనపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే చెన్నైలో ఇన్పోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతంపై గాయకుడు అభిజిత్ భట్టాచార్య వివాదాస్పదంగా ట్విట్ చేశారు. స్వాతి హత్యకు లవ్ జీహాదే కారణమని ఆయన తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అభిజిత్ భట్టాచార్య వ్యాఖ్యలపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ స్వాతి అభ్యంతరం వ్యక్తం చేశారు. హత్యకేసులో పోలీసులు రామ్‌కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలుపుతూ జర్నలిస్ట్ రీట్వీట్ చేశారు. పాకిస్తానీ గాయకులపై ద్వేషంతోనే అభిజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడుతూ... జర్నలిస్ట్‌ను దూషిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీటర్ దాడిపై స్వాతి చతుర్వేది ఆదివారం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాయకుడిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. దీనిపై అభిజిత్ స్పందిస్తూ జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ట్విట్ల ద్వారా జర్నలిస్ట్ ప్రచారం పొందాలని ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ స్వాతి హత్యకు...జర్నలిస్ట్ మతం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని అభిజిత్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తాను భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన అభిప్రాయాలకు దేశవ్యాప్తంగా మద్దతు ఉందని అభిజిత్ అన్నారు. కాగా అభిజిత్ ట్విట్ లను పలువురు సపోర్టు చేస్తుండగా, మరి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. बेशर्म बुढ़िया..U not proud of Indians? Wats your breed? U sk pakis..I fk Pakis, U lick..I kick, dnt block just wait https://t.co/0BWHU60rPm — abhijeet (@abhijeetsinger) 2 July 2016