స్వాతి హత్యకేసులో ఊహించని మలుపు
- నిందితుడు రామ్ కుమార్ ఆత్మహత్య
- జైలులోనే కరెంటు తీగలు పట్టుకుని బలవన్మరణం
- ఆత్మహత్యకాదు.. హత్యే అంటున్న కుటుంబసభ్యులు
చెన్నై: ఇన్ఫోసిన్ ఉద్యోగిని స్వాతి(24) హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. స్వాతిని హత్యచేసి, ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీగా ఉన్న రామ్ కుమార్ ఆదివారం జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు ప్రాంగణంలోని కరెంటు తీగలను పట్టుకుని రామ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని జైలు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది ఆత్మహత్యకాదు.. హత్యే అని నిందితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. (ప్రేమోన్మాదంతో స్వాతి ప్రాణాలు తీసిన మృగాడు)
జూన్ 24న చైన్నై నగరంలోని సుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు వచ్చిన స్వాతిని రామ్ కుమార్ దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన కొద్ది రోజులకే తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను చూసి రామ్ కుమార్ బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. దీంతో అతని మెడకు 18 కుట్లు పడ్డాయి. కోర్టు రామ్ కుమార్ కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న అతను ఆదివారం ఆత్మహత్యచేసుకున్నాడు. (నేను అమాయకుణ్ని...స్వాతిని హత్య చేయలేదు)