ఇన్ఫోసిన్ ఉద్యోగిని స్వాతి(24) హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. స్వాతిని హత్యచేసి, ప్రస్తుతం జైలులో విచారణ ఖైదీగా ఉన్న రామ్ కుమార్ ఆదివారం జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు ప్రాంగణంలోని కరెంటు తీగలను పట్టుకుని రామ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని జైలు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది ఆత్మహత్యకాదు.. హత్యే అని నిందితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు