
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న–జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–దివిజ్ జోడీ 7–5, 2–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జంటను బోల్తా కొట్టించింది.
మరో మ్యాచ్‌లో బోపన్న–జీవన్ జంట 3–6, 5–7తో హెర్బర్ట్–గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment