క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట | Bopanna couple in Quarter-final | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట

Published Wed, Aug 5 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

Bopanna couple in Quarter-final

 వాషింగ్టన్ : సిటీ ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-మెర్జియా జంట 2-6, 6-1, 10-3తో ఆండీ ముర్రే (బ్రిటన్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడీపై గెలిచింది. తొలి సెట్‌ను కోల్పోయిన బోపన్న జోడీ రెండో సెట్‌లో వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. ఇక నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచి విజయాన్ని దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్లో దిమిత్రోవ్ (బల్గేరియా)-మార్డీ ఫిష్ (అమెరికా) జంటతో బోపన్న-మెర్జియా తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement