
Bengaluru Open: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత రెండో ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్ 7–6 (7/4), 6–2తో మథియాస్ బుర్గె (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరోవైపు భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ 6–3, 0–6, 5–7తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో అర్జున్ ఖడే 1–6, 2–6తో సెలిక్‌బిలెక్ (టర్కీ) చేతిలో, రిషి రెడ్డి 1–6, 3–6తో కుకాడ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు.
చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో'