Prajnesh Gunneswaran
-
Davis Cup 2022: తొలి సింగిల్స్‌లో ప్రజ్నేశ్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. యూఎస్ ఓపెన్ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 335వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్ విక్టర్ దురాసోవిచ్, రామ్‌కుమార్ రామనాథన్ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్ మ్యాచ్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
Prajnesh Gunneswaran: ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం
Bengaluru Open: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత రెండో ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 7–6 (7/4), 6–2తో మథియాస్ బుర్గె (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరోవైపు భారత నంబర్‌వన్ రామ్‌కుమార్ 6–3, 0–6, 5–7తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో అర్జున్ ఖడే 1–6, 2–6తో సెలిక్బిలెక్ (టర్కీ) చేతిలో, రిషి రెడ్డి 1–6, 3–6తో కుకాడ్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ క్వాలిఫయింగ్ బరిలో మిగిలిన చివరి భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ప్రజ్నేశ్ 3–6, 4–6తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. క్రిస్టోఫర్ 14 ఏస్‌లు సంధించగా... ప్రజ్నేశ్ 5 ఏస్‌లను మాత్రమే కొట్టాడు. ఇతర భారత ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్‌కుమార్... మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్లోనే ఓడారు. -
ప్రజ్నేశ్ ముందంజ
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 134వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–4, 2–6, 7–6 (7/1)తో ప్రపంచ 102వ ర్యాంకర్ జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన ప్రజ్నేశ్ 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ థామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఒర్లాండో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–3, 7–5తో సాడ్లో డుంబియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 137వ ర్యాంకర్ ప్రజ్నేశ్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో ఆడుతున్న మరో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. రామ్‌కుమార్ 3–6, 4–6తో నిక్ చాపెల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
ప్రజ్నేశ్ శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేయగా... భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. 29వ సీడ్ ప్రజ్నేశ్ 6–3, 6–1తో సిమ్ ఇల్కెల్ (టర్కీ)పై గెలుపొందగా... 16వ సీడ్ సుమీత్ నాగల్ 6–7 (4/7), 5–7తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ) చేతిలో... రామ్‌కుమార్ 5–7, 2–6తో లమసినె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇల్కెల్తో 65 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. రెండో రౌండ్లో అలెగ్జాండర్ వుకిచ్ (ఆస్ట్రేలియా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత నంబర్‌వన్ అంకితా రైనా బరిలో ఉంది. నేడు జరిగే తొలి రౌండ్లో ఆమె జొవానా జోవిచ్ (సెర్బియా)తో తలపడుతుంది. -
భారత్ ముందుకెళ్లేనా?
జాగ్రెబ్ (క్రొయేషియా): డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ బెర్త్‌పై కన్నేసిన భారత పురుషుల టెన్నిస్ జట్టుకు నేటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు రోజుల పాటు సాగే ఈ పోరులో భారత్... 2014 యూఎస్ ఓపెన్ విజేత మారిన్ సిలిచ్‌తో కూడిన క్రొయేషియాను ఎదుర్కోనుంది. అయితే మారిన్ సిలిచ్ మినహా మిగతా క్రొయేషియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయి ప్లేయర్లు కాకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, లియాండర్ పేస్, రోహన్ బొపన్న, రామ్‌కుమార్ రామనాథన్‌లతో కూడిన భారత్ ఈ మ్యాచ్‌లో అండర్ డాగ్స్‌గా బరిలో దిగనుంది. తన కెరీర్లో చివరి డేవిస్ కప్ సీజన్ ఆడుతున్న లియాండర్ పేస్ ఘనమైన ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్నాడు. రెండు సింగిల్స్... డబుల్స్... రెండు రివర్స్ సింగిల్స్ పద్ధతిన జరిగే ఈ పోరులో మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు మాడ్రిడ్ వేదికగా నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లు బరిలో దిగనున్నారు. భారత నంబర్‌వన్ సుమీత్ నాగల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో బోర్నా గోజోతో ప్రజ్నేశ్; రెండో మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మారిన్ సిలిచ్‌తో రామ్‌కుమార్ తలపడతారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో మ్యాట్ పావిచ్–స్కుగోర్‌లతో లియాండర్ పేస్–రోహన్ బోపన్న... నాలుగో మ్యాచ్‌లో సిలిచ్‌తో ప్రజ్నేశ్; ఐదో మ్యాచ్‌లో గోజోతో రామ్‌కుమార్ ఆడతారు. చివరిసారిగా ఈ రెండు జట్లు 1995లో న్యూఢిల్లీ వేదికగా తలపడగా... అందులో భారత్ 3–2తో గెలుపొందింది. -
ప్రజ్నేశ్ పరాజయం
దుబాయ్: ఈ ఏడాది బరిలోకి దిగిన ఐదో టోర్నమెంట్లోనూ భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో చెన్నైకి చెందిన 30 ఏళ్ల ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ డెన్నిస్ నొవాక్ (ఆస్ట్రియా)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 134వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 3–6తో ఓడిపోయాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. క్వార్టర్ ఫైనల్లో పేస్ జంట ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–3తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఫిలిప్ పొలాసెక్ (స్లొవేకియా) జోడీపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) జంటతో పేస్–ఎబ్డెన్ ద్వయం ఆడుతుంది. -
ప్రజ్నేశ్ శుభారంభం
పుణే: టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 7–6 (7/4), 7–6 (7/5)తో యానిక్ మాడెన్ (జర్మనీ)పై గెలుపొందాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అర్జున్ ఖడే (భారత్) 2–6, 4–6తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–2, 7–6 (7/5)తో రెండో సీడ్ దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. -
అదృష్టం కలిసొచ్చింది...
మెల్బోర్న్: అనుకున్నట్లే జరిగింది. భారత టెన్నిస్ నంబర్‌వన్ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో ‘లక్కీ లూజర్’గా ప్రజ్నేశ్‌కు చోటు లభించింది. వాస్తవానికి 30 ఏళ్ల ప్రజ్నేశ్ క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లోనే ఓడిపోయాడు. అయితే ఆ్రస్టేలియన్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ‘డ్రా’ విడుదల అయ్యాక ఆ ‘డ్రా’లో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు నికోలస్ జారీ (చిలీ), కామిల్ మజ్చార్జక్ (పోలాండ్), అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) వైదొలిగారు. దాంతో ఈ మూడు బెర్త్‌లను భర్తీ చేసేందుకు క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లో ఓడిపోయిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్లకు ‘లక్కీ లూజర్’ ‘డ్రా’లో అవకాశం లభించింది. మూడు బెర్త్‌ల కోసం ‘లక్కీ లూజర్’ ‘డ్రా’లో ప్రజ్నేశ్తోపాటు లొరెంజో గియెస్టినో (ఇటలీ), మిలోజెవిచ్ (సెర్బియా), డాన్స్కాయ్ (రష్యా), కొవాలిక్ (స్లొవేకియా) పోటీపడ్డారు. ‘డ్రా’లో ప్రజ్నేశ్, డాన్స్కాయ్, కొవాలిక్ పేర్లు రావడంతో ఈ ముగ్గురికి ‘లక్కీ లూజర్స్’గా ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం లభించింది. తొలి రౌండ్లో ప్రపంచ 144వ ర్యాంకర్ టట్సుమా ఇటో (జపాన్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. ఒకవేళ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గెలిస్తే రెండో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఏడుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఎదురయ్యే అవకాశముంది. -
ప్రజ్నేశ్ పరాజయం
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తుది మెట్టుపై తడబడ్డాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–7 (2/7), 2–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్లో ఓడినప్పటికీ... 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌కు ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెయిన్ ‘డ్రా’ విడుదల కావడం... ఎంట్రీలు ఖరారు చేసిన ముగ్గురు ఆటగాళ్లు వైదొలగడంతో ఈ మూడు బెర్త్‌లను క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లతో భర్తీ చేస్తారు. మూడు బెర్త్‌ల కోసం క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్ల మధ్య ‘డ్రా’ నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేస్తారు. -
ప్రజ్నేశ్ ముందంజ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల మెయిన్ ‘డ్రా’కు భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అడుగు దూరంలో నిలిచాడు. ఇక్కడ జరుగుతున్న క్వాలిఫయర్స్ టోర్నీలో అతడు ఫైనల్‌కు అర్హత సాధించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 1–6, 6–2, 6–2తో యానిక్ హంఫ్మాన్ (జర్మనీ)పై గెలుపొందాడు. ఫైనల్లో ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా)తో ప్రజ్నేశ్ తలపడతాడు. మరో భారత సింగిల్స్ ఆటగాడు సుమీత్ నాగల్ 6–7 (2/7), 2–6,తో మొహమ్మద్ సావత్ (ఈజిప్ట్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతనితో పాటు ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్స్ బరిలో దిగిన రామ్‌కుమార్ రామనాథన్ (భారత్), మహిళల విభాగంలో అంకిత రైనా (భారత్) ఇప్పటికే వెనుదిరిగారు. ఈ నెల 20న ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభమవుతుంది. -
రెండో రౌండ్లో ప్రజ్నేశ్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేయగా... రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–4తో హ్యారీ బుర్చియెర్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 6–4, 4–6, 1–6తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. అంకిత రైనా 2–6, 6–7 (2/7)తో విక్టోరియా తొమోవా (బల్గేరియా) చేతిలో పరాజయం పాలైంది. -
త్వరలో ప్రజ్నేశ్ పెళ్లి... ఇంతలోనే తండ్రి మృతి
చెన్నై: భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్న సమయంలోనే ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో విషాదం నెలకొంది. అతని తండ్రి ఎస్.జి.ప్రభాకరన్ అనారోగ్య సమస్యలతో శనివారం తుదిశ్వాస విడిచారు. స్థిరాస్తి వ్యాపారి అయిన ప్రభాకరన్ గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే శనివారం ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతిచెందారని ప్రజ్నేశ్ సన్నిహితులు వెల్లడించారు. తండ్రి తుదిశ్వాస విడిచే సమయంలో అతను అక్కడే ఉన్నాడు. 29 ఏళ్ల ప్రజ్నేశ్‌కు ఈ నెల 28న కొచ్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లితంతు ఏమవుతుందో తెలీదుకానీ... సోమవారం మొదలయ్యే పుణే ఏటీపీ చాలెంజర్ టోర్నీలో అతను పాల్గొంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: మెక్సికో ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 90వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. మెక్సికోలోని లాస్ కబోస్లో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–4, 1–6, 6–2తో ప్రపంచ 67వ ర్యాంకర్ జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో జీవన్ నెడుంజెళియన్–పురవ్ రాజా (భారత్) ద్వయం 3–6, 3–6తో లుకాస్ పుయి–గ్రెగోరి బరెరే (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రజ్నేశ్ ప్రత్యర్థి రావ్‌నిచ్
లండన్: భారత టెన్నిస్ నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్, 2016 రన్నరప్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్ మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబుల్స్ విభాగంలో భారత్ నుంచి దివిజ్ శరణ్, రోహన్ బోపన్న, లియాండర్ పేస్, జీవన్ నెడుంజెళియన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. ఒకే పార్శ్వంలో ఫెడరర్, నాదల్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ నాదల్ (స్పెయిన్) ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా అంతా సజావుగా సాగితే వీరిద్దరు సెమీఫైనల్లోనే తలపడతారు. మరో పార్శ్వంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ఉన్నాడు. తొలి రౌండ్లో లాయిడ్ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్; సుగిటా (జపాన్)తో నాదల్; కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతారు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్
కొంతకాలంగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్ టోర్నమెంట్లలో నిలకడగా రాణిస్తోన్న భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అధిరోహించాడు. ఆదివారం చైనాలో ముగిసిన కున్మింగ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్... సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 75వ ర్యాంక్‌ను అందుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ ఐదు స్థానాలు... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి వరుసగా 151వ ర్యాంక్‌లో, 247వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ఫైనల్లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఈ ఏడాది తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. చైనాలో జరుగుతున్న కున్మింగ్ ఓపెన్‌లో ఈ చెన్నై ఆటగాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రజ్నేశ్ 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో మూడో సీడ్ కామిల్ మజార్జక్ (పోలాండ్)పై విజయం సాధించాడు. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఈ ఏడాది మూడు ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో పాల్గొన్న ప్రజ్నేశ్ రెండింటిలో సెమీస్ చేరుకోగా... మరో టోర్నీలో రెండో రౌండ్లో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్లో 14వ సీడ్ జే క్లార్క్ (బ్రిటన్)తో ప్రజ్నేశ్ ఆడతాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–ప్రజ్నేశ్ జోడీ 7–6 (7/5), 6–4తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్)–లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్) జంటపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట రెండో సెట్లో ఏకంగా తొమ్మది బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం 6–4, 7–6 (7/4)తో యెకాంగ్ హి–డి వు (చైనా) జోడీపై నెగ్గగా... విష్ణువర్ధన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 6–7 (4/7), 6–7 (7/9)తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
తొలి రౌండ్లో ప్రజ్నేశ్ పరాజయం
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 84వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–7 (3/7), 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ జౌమి మునార్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్లోనే ఓడిన ప్రజ్నేశ్‌కు 16,425 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 లక్షల 35 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మెయిన్ ‘డ్రా’కు ప్రజ్నేశ్
మయామి: భారత నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మయామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇటీవల ఇండియన్ వెల్స్లోనూ మెయిన్ డ్రా చేరిన అతను వారం వ్యవధిలో వరుసగా రెండో మాస్టర్స్ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. గురువారం జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను 6–4, 6–4తో బ్రిటన్‌కు చెందిన క్లార్క్‌ను కంగుతినిపించాడు. ఈ వారమే కెరీర్ బెస్ట్ సింగిల్స్ 84వ ర్యాంకుకు ఎగబాకిన ప్రజ్నేశ్ వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. శుక్రవారం జరిగే మెయిన్ డ్రా తొలి రౌండ్ మ్యాచ్‌లో 29 ఏళ్ల భారత ఆటగాడు జేమ్ మునర్ (స్పెయిన్)తో తలపడతాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో విశేషంగా రాణించిన భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ... సోమవారం విడుదల చేసిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకాడు. 97వ ర్యాంక్ నుంచి 84వ ర్యాంక్‌కు చేరుకొని కెరీర్లోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన ఈ తమిళనాడు ప్లేయర్ మూడో రౌండ్‌కు చేరి 61 ర్యాంకింగ్ పాయింట్లను సమకూర్చుకున్నాడు. ప్రజ్నేశ్ తర్వాత రామ్‌కుమార్ 139వ ర్యాంక్‌లో నిలువగా... గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న యూకీ బాంబ్రీ 36 స్థానాలు పడిపోయి 207వ ర్యాంక్‌కు చేరాడు. -
పోరాడి ఓడిన ప్రజ్నేశ్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన 29 ఏళ్ల ప్రజ్నేశ్ తొలి రౌండ్లో ప్రపంచ 69వ ర్యాంకర్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై... రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ నికోలజ్ బాసిలాష్విలి (జార్జియా)పై సంచలన విజయాలు సాధించాడు. అయితే మూడో రౌండ్లో ప్రపంచ 97వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 3–6, 6–7 (4/7)తో ప్రపంచ 89వ ర్యాంకర్, అపార అనుభవజ్ఞుడు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 40 ఏళ్ల కార్లోవిచ్ ఏకంగా 16 ఏస్‌లు సంధించాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ బుల్లెట్‌లాంటి సర్వీస్‌లకు ప్రజ్నేశ్ వద్ద జవాబు లేకపోయింది. తొలి సెట్ తొలి గేమ్‌లోనే కార్లోవిచ్ సర్వీస్‌లో రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించిన ప్రజ్నేశ్ వాటిని సద్వినియోగం చేసుకోలేదు. అనంతరం ఎనిమిదో గేమ్‌లో ప్రజ్నేశ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కార్లోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్ గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కార్లోవిచ్ పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మూడో రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 48,775 డాలర్ల (రూ. 34 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 61 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో వచ్చే వారం విడుదలయ్యే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ 97 నుంచి 82వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. -
ప్రజ్నేశ్ మరో సంచలనం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మరో సంచలనం సృష్టించాడు. తన కెరీర్లో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన ఈ చెన్నై ప్లేయర్... పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ నికోలజ్ బాసిలాష్విలి (జార్జియా)పై గెలిచి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్, 29 ఏళ్ల ప్రజ్నేశ్ 6–4, 6–7 (6/8), 7–6 (7/4)తో బాసిలాష్విలిని ఓడించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 69వ ర్యాంకర్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై ప్రజ్నేశ్ గెలిచిన సంగతి తెలిసిందే. గతేడాది çస్టుట్గార్ట్ ఓపెన్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపొవ లోవ్ (కెనడా)పై గెలుపొందడమే ప్రజ్నేశ్ కెరీర్లో సాధించిన గొప్ప విజయంగా ఉంది. బాసిలాష్విలితో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఏకంగా పది ఏస్‌లు సంధించాడు. మరోవైపు బాసిలాష్విలి పది డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడో రౌండ్లో ప్రపంచ 89వ ర్యాంకర్, 40 ఏళ్ల ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో ప్రజ్నేశ్ తలపడతాడు. బోపన్న జంట ముందంజ... ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–షపొవలోవ్ (కెనడా) ద్వయం 6–4, 6–4తో రెండో సీడ్ బ్రూనో సొరెస్ (బ్రెజిల్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంటపై గెలిచింది. -
ప్రజ్నేశ్ సంచలనం
కాలిఫోర్నియా: కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ ఆడుతోన్న భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సంచలనంతో శుభారంభం చేశాడు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఈ చెన్నై క్రీడాకారుడు రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 7–6 (7/5), 6–4తో ప్రపంచ 69వ ర్యాంకర్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. 89 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్ ప్రజ్నేశ్ కీలకదశలో పాయింట్లు సాధించి ఫలితాన్ని శాసించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మూడేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 18వ ర్యాంక్‌లో నిలిచిన బెనోయిట్ పెయిర్... 2017 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, 2015 యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్ 80వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. ‘నా కెరీర్‌లోమరో గొప్ప విజయమిది. కీలక సమయంలో ఈ గెలుపు లభించింది. వింబుల్డన్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు చేరువయ్యాను. మేటి ఆటగాళ్లపై విజయాలు సాధిస్తే నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని ప్రజ్నేశ్ అన్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ నికోలజ్ బాసిలాష్విలి (జార్జియా)తోప్రజ్నేశ్ ఆడతాడు.