
న్యూఢిల్లీ: ఒర్లాండో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్ 6–3, 7–5తో సాడ్లో డుంబియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 137వ ర్యాంకర్ ప్రజ్నేశ్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో ఆడుతున్న మరో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. రామ్‌కుమార్ 3–6, 4–6తో నిక్ చాపెల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment