Orlando
-
గ్రేటర్ ఓర్లాండోలోనాట్స్ ప్రస్థానం
అమెరికాలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన శాఖలను విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ చాప్టర్‌ని ప్రారంభించింది. గ్రేటర్ ఓర్లాండోలోని మా దుర్గా కన్వెన్షన్ హాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వారి కోసం గ్రేటర్ ఓర్లాండోలో ప్రారంభమైన ఈ చాప్టర్‌కు కో ఆర్డినేటర్‌గా రావి రవి కుమార్‌కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. వేణు మల్ల, శ్రీధర్ గోలీ, శ్రీదేవి మల్ల, మీనా నిమ్మగడ్డ, లక్ష్మి అంగ, శేషు అచంట తదితరులు నాట్స్‌లో పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. నాట్స్ ఉన్నతమైన విలువలు పాటిస్తూ సామాజిక సేవలో వేస్తున్న అడుగులు అందరికి ఆదర్శంగా మారాయని.. గ్రేటర్ ఓర్లాండో నాట్స్ ప్రతినిధులు కూడా ఆ దిశగా కృషి చేసి నాట్స్ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి కొత్త జట్టు చురుకుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాట్స్ ఉచిత వైద్య సేవలతో తెలుగు వారికి చేరువైన వైనాన్ని నాట్స్ బోర్డు సభ్యులు టీపీ రావు వివరించారు. నాట్స్‌లో మహిళా సాధికారత, యువతను నాట్స్‌లో భాగస్వామ్యం లాంటి అంశాలపై నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి గ్రేటర్ ఓర్లాండో నాట్స్ సభ్యులకు దిశా నిర్ధేశంచేశారు. తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా ఐక్యతగా ఉండాలని.. అదే మనకు, నాట్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ప్రసాద్ ఆరికట్ల తెలిపారు. గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ బాధ్యతలు తీసుకున్న వారంతా చిత్తశుద్ధితో పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అన్నారు.గ్రేటర్ ఒర్లాండో చాప్టర్ జట్టు సభ్యులకు తన అభినందనలు తెలిపారు. తన మీద ఉన్న నమ్మకంతో గ్రేటర్ ఓర్లాండో బాధ్యతలు అప్పగించిన నాట్స్ బోర్డుకు నాట్స్ గ్రేటర్ ఓర్లాండో కో ఆర్డినేటర్ రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై, తన టీం సభ్యులపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేలా గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ కోసం పనిచేస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జాతీయ నాయకత్వంతో పాటు నాట్స్ వివిధ రాష్ట్రాల్లోని ఆయా చాప్టర్ల నాయకులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. నాట్స్ సౌత్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామినేని, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ళ తో పాటు నాట్స్ టాంపా బే చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. చాప్టర్ ప్రారంభోత్సవానికి సహకారం అందించిన దాతలు బావర్చీ, పెర్సిస్, హైదరాబాద్ కేఫ్, నాన్‌స్టాప్, నాటు నాటు, ఇంచిన్స్, శివి కేక్స్, మరియు స్మార్ట్ గ్లోబల్ వంటి సంస్థలకు గ్రేటర్ ఓర్లాండో నాట్స్ టీం తమ ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం) -
USA: 99 ఏళ్ల భారతీయ బామ్మకు అమెరికా పౌరసత్వం
వాషింగ్టన్: భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ‘వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనడానికి 99 ఏళ్ల దైబాయి నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి ఆమె ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు’అని యూఎస్సీఐఎస్ పోస్టు చేసింది. దైబాయికి అమెరికా పౌరసత్వం లభించడం పట్ల పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి.. అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి -
పోలీసోడివా.. అయితే ఏంటి? లైసెన్స్ తియ్యి
నేనో పోలీస్నయ్యా.. పని మీద వెళ్తున్నానంటే వినవేంటయ్యా.. అంటూ తనను వెంబడించి అడ్డగించిన పైస్థాయి అధికారికి ఆ పోలీస్ అధికారి బదులిచ్చాడు. అయితే ఏంటి? అలా బండి నడుపుతావా? లైసెన్స్ చూపించు అని నిలదీశాడు పైస్థాయి అధికారి. అయితే నిర్లక్ష్య ధోరణి ఉన్న ఆ అధికారి మాత్రం అదే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. రూల్స్ బ్రేక్ చేసిన ఆ అధికారి ఉద్యోగం ఊడింది. నిర్లక్ష్య ధోరణితో బండి నడపడంతో పాటు పలు రకాల కేసుల కింద అతనిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కూడా అయ్యాడు. చేసిన తప్పునకు అతనికి శిక్ష కఠినంగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడాలో ఓర్లాండో నగరంలో గంటకు 45 మైళ్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన చోట.. 80 మైళ్ల వేగంతో అధికారిక వాహనంలోనే దూసుకెళ్లిన ఓ పోలీసోడికే పడిన శిక్ష ఇది. అక్కడంతే.. చట్టాలు వెరీ పవర్ఫుల్. ఎవరికీ చుట్టంగా వ్యవహరించదు మరి!. “I am going into work" Speeding police officer pulled over by another officer https://t.co/NKV4xszcZq pic.twitter.com/mZtnZXmC4P — BBC News (World) (@BBCWorld) June 15, 2023 Video Credits: BBC News World ఇదీ చదవండి: బరువు తగ్గాలనుకుంటే.. మనిషే లేకుండా పోయాడు పాపం -
Tesla: టెస్లాను నమ్మొచ్చా?
టెస్లా.. వాహన తయారీలో కొత్త ఒరవడిని సృష్టించిన బ్రాండ్. అమేజింగ్ టెక్నాలజీ, సేఫ్టీ చర్యలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎన్నో సంచలనాలతో అమెరికా నుంచి ప్రపంచానికి దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆటోపైలట్ ఫీచర్ ద్వారా వాహనతయారీ రంగంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిందనే పేరుంది టెస్లాకి. అలాంటిది వరుస ప్రమాదాలు ఆ బ్రాండ్‌ను దెబ్బకొట్టే అవకాశాలున్నాయా? అనేదానిపై ఇప్పుడు వాహన నిపుణుల నడుమ సమీక్ష జరుగుతోంది. ఓర్లాండోలో ఆగష్టు 28.. ఉదయం ఐదు గంటల సమయంలో ఆటోపైలెట్తో వెళ్తున్న టెస్లా కారు..ఓ పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన పోలీస్ అధికారి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో పాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన యాక్సిడెంట్లను వీడియోలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. దీంతో టెస్లా సాంకేతికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Happening now: Orange County. Trooper stopped to help a disabled motorist on I-4. When Tesla driving on “auto” mode struck the patrol car. Trooper was outside of car and extremely lucky to have not been struck. #moveover. WB lanes of I-4 remain block as scene is being cleared. pic.twitter.com/w9N7cE4bAR — FHP Orlando (@FHPOrlando) August 28, 2021 టెస్లా క్లియర్‌గానే.. నిజానికి ఆటోపైలట్ ఫీచర్ విషయంలో టెస్లా మొదటి నుంచి క్లియర్‌గానే ఉంది. డ్రైవర్ సీట్లో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలని చెబుతోంది. ఆటోపైలెట్ ఫీచర్‌ను ఇప్పటికిప్పుడు డ్రైవర్ లేకుండా ఉపయోగించకూడదని టెస్లా హోం పేజీలో హెచ్చరికను ప్రదర్శిస్తోంది కూడా. కానీ, తాజా యాక్సిడెంట్ వెనుక సీట్లో డ్రైవర్ ఉండగానే జరగడంతో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇక టెస్లా కార్లు గతంలో యాక్సిడెంట్లను పసిగట్టి తప్పించిన సందర్భాలు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో వాటి ద్వారా అనుమానాల్ని నివృత్తి చేస్తోంది టెస్లా. అయినప్పటికీ నెగెటివిటీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంపై టెస్లా ఆందోళన చెందుతోంది. భారత వర్తకంపై ప్రభావం? టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మీద ఓవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. భారత్‌లో ఎంట్రీలో చర్చ నడుస్తోంది. కానీ, భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక టెస్లా సాంకేతికత.. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిపై ఎలాంటి ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే నాలుగు మోడల్స్‌కు అప్రూవల్ కూడా దొరికింది. ముందుగా భారత్‌కు ఈవీ కార్ల ఎగుమతి, అటుపైనే ప్రొడక్షన్‌పై ఫోకస్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది టెస్లా. ఇప్పటికే సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు టెస్లాకు విడిభాగాలు అందిస్తున్న తరుణంలో.. వీటి సహకారంతోనే భారత్‌లోనూ తమ జోరును చూపేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతుంది. ఇక కీలకమైన పన్నుల తగ్గింపు విషయంలోనే భారత ప్రభుత్వంతో టెస్లా జరిపే చర్చలు ఓ కొలిక్కి వస్తే.. టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి ముహుర్తం ఖరారు కావడం ఒక్కటే మిగులుతుంది. చదవండి: టెస్లాకు పోటీగా ఓలా? -
ముసలి వేషంతో కరోనా టీకా, కానీ..
వాషింగ్టన్ : నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు మహిళలు అక్రమంగా కరోనా టీకాను తీసుకున్నారు. ఇందుకు తమను తాము పెద్దవారిలా కనిపించేలా వేషధారణ మార్చి అధికారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన అమెరికాలోని ఓర్లాండోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..35, 45 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు తమకు 65పైబడినట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకు తగ్గట్లుగానే పెద్దవారిలా మారువేషం వేసుకొని కోవిడ్ టీకా సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వారి పేర్లు, సంబంధిత రిజిస్ట్రేషన్ ఐడీతో సరిపోలడంతో అధికారులు వారికి వ్యాక్సిన్ మొదటి డోస్‌ను వేసి ఇంటికి పంపించారు. అయితే వారి పుట్టినతేదీ వివరాలు మ్యాచ్ కావడం లేదని తర్వాత పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. ఇద్దరు మహిళలు చేసిన టీకా మోసంతో అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయంపై వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. అయితే వారు ఏ సెంటర్ నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ పొందారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 'మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్‌ను దొంగిలించారు' అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని, అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. అసలు ఆ మహిళలు ఎవరి నుంచి అపాయ్‌ంట్‌మెంట్ పొందారు? ఈ విషయంలో ఎవరైనా సహాయం చేశారా వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. చదవండి : (రిపోర్టర్ లైవ్ చేస్తుండగా.. గన్‌తో బెదిరించి దోపిడి) (పాపం లిగాన్.. 68 ఏళ్లు జైల్లో.. అందర్నీ కోల్పోయి..) -
ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఒర్లాండో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ శుభారంభం చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్నేశ్ 6–3, 7–5తో సాడ్లో డుంబియా (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 137వ ర్యాంకర్ ప్రజ్నేశ్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో ఆడుతున్న మరో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. రామ్‌కుమార్ 3–6, 4–6తో నిక్ చాపెల్ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
ఓర్లాండోలో 'మౌర్యచరితం'
ఓర్లాండో(అమెరికా) : అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది. బుర్రకథను పద్యనాటకాన్ని కలుపుతూ తయారు చేసిన కథనం, కథనానికి ధీటుగా సంభాషణలు సాగాయి. ప్రవాస యువకవి తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి రాసిన పద్యాలు సంభాషణలకు ప్రాణం పోశాయి. చాణక్య పాత్రలో శర్మమొదలి అద్భుతంగా నటిస్తే, చంద్రగుప్తమౌర్యునిపాత్రలో సాయిప్రభాకర్ యెర్రాప్రగడ అభినయం ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా సాగింది. గ్రీకు చక్రవర్తిగా ఈశ్వర్ కనుమూరి అభినయం అందరిని ఆకట్టుకుంది. బుర్రకథ పాటని చంద్రశేఖర్ అయ్యలరాజు, సత్యమంతెన, కళ్యాణ్ తటవర్తి చక్కగా పాడారు. శిరీష ఖండవిల్లి, జాహ్నవీ తటవర్తిలు సంగీతం అందించగా, కూర్పు చేసిన రవి ఖండవిల్లిని వేడుకలకు వచ్చిన వారందరూ ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కొత్తతరహా పద్యనాటకాలు మరింత రావాలని, తెలుగు భాషను సుసంపన్నం చేయాలని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో తమ కరతాళధ్వనులద్వారా తెలిపారు. -
కుక్కకు గ్రాండ్ రిటైర్మెంట్ పార్టీ..!
వాషింగ్టన్: ఉద్యోగులు రిటైర్ అవుతారు.. ఆ సందర్భంగా పార్టీ చేసుకోవడం తెలిసిందే. కానీ ఇక్కడ రిటైర్ అయింది ఉద్యోగి(మనిషి) కాదు.. ఓ కుక్క. అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో జెమా అనే ఓ కుక్క పనిచేసింది. దాదాపు ఐదేళ్లపాటు సేవలందించి గత వారం రిటైర్ అయింది. దాని సేవలకు కృతజ్ఞతగా ఎయిర్‌పోర్టు సిబ్బంది రిటైర్మెంట్ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో జెమా అందించిన సేవలను గుర్తుచేసుకొని దానికి కిరీటం పెట్టి సన్మానించారు. అంకితభావం కలిగిన, విశ్వసనీయమైన తమ సిబ్బంది రిటైర్మెంట్ సందర్భంగా తాము పార్టీ చేసుకున్నామని దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
అమెరికాలో భారీగా కాల్పుల మోత
ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలో ఓ దుండగుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఒర్లాండోని ఓ పారిశ్రామిక వాడలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కంపెనీకి చెందిన ఐదుగురు కార్మికులు చనిపోయినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ధ్రువీకరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బలగాలు హతం చేశాయని ఒర్లాండోని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ తెలిపారు. ఫోర్సిత్ రోడ్డు, హ్యాంగింగ్ మాస్ రోడ్డులో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఉలిక్కిపడిన భద్రతా బలగాలు పెద్ద మొత్తంలో ఎమర్జెన్సీ వాహనాలతో కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో దారి పొడవునా వాలిపోయారు. గత ఏడాది (2016) జూన్ 12న ఇదే ఓర్లాండోలోని పల్స్ నైట్ క్లబ్బులో కాల్పులు చోటుచేసుకొని 49మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తిరిగి ఏడాది తిరగకుండానే ఇదే నెలలో అలాంటి ఘటన చోటుచేసుకోవడం అధికారులను విస్మయపరుస్తోంది. -
ఒర్లాండోలో 'భువన విజయం'
అలరించిన భువన విజయం ఒర్లాండో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఒర్లాండో(టాగో) ఆధ్వర్యంలో సెంట్రల్ ఫ్లోరిడా ఆడిటోరియంలో జరిగిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. కౌంటీ ప్రాపర్టీ అప్రైజర్ రిక్ సింగ్ ఆరెంజ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'భువన విజయం' నాటిక అందరిని అలరించింది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలతో జరిపిన సంభాషణలను నాటికలో అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయల పరాక్రమపాటవాన్ని, కవితాభినివేశాన్ని, దానగుణాలను కవులు పద్యరూపంలో ప్రస్తుతించారు. తెలుగు భాషా గొప్పదనాన్ని నాటికలో వివరించారు. రాయల కాలం నుంచి ఆధునిక యుగం వరకు జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలతో కొత్తదనంగా ఈ నాటికను రూపొందించారు. కిభాశ్రీ, సాయి ప్రభాకర్, కళ్యాణ్, మూర్తి బొందాడ, మధు చెరకూరిలు నాటికని విజయ వంతంగా ప్రదర్శించడంలో తమ వంతు కృషి చేశారు. టాగో ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. -
రంజాన్ మాసం.. రక్తసిక్తం
ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం. ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో! -
ఆర్లెండోలో పర్యటించనున్న ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన చేసింది. ఆర్లెండో నగరంలో ఆదివారం తెల్లవారుజామున నైట్ క్లబ్లో జరిగిన నరమేధంలో 49మంది మృతి చెందగా, సుమారు 50మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో మృతి చెందినవారికి సంతాపంతో పాటు, వారి కుటుంబాలను ఒబామా పరామర్శించనున్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒబామా విస్కాన్సిన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా ఆయన వచ్చేవారం న్యూ మెక్సికో, కాలిఫోర్నియాలోని ఎన్నికల క్యాంపెన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనిపై వైట్‌హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాల్పుల నేపథ్యంలో ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఆర్లెండో ఉగ్రఘటనకు పాల్పడిన ఉగ్రవాది మతిన్ ఐసిస్ సభ్యుడు కాదని.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐసిస్ ఉగ్ర సాహిత్యంతో ప్రభావితుడై ఈ ఘటనకు పాల్పడ్డాడని ఒబామా వెల్లడించారు. ఈ ఘటన దేశీయంగా పెరుగుతున్న ఉగ్రవాద ఉన్మాదానికి ఉదాహరణ అని అన్నారు. -
ఆ హంతకుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు
ఓర్లాండో: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తునే ఉన్నాయి. అతడు మంచి బాడీ బిల్డర్ అని, క్రమ శిక్షణ గల సెక్యూరిటీగార్డు అని, పోలీసు అధికారిగా ఉద్యోగం సంపాధించాలని కలలు కూడా కన్నాడని తెలిసింది. నగరంలోని మసీదులకు క్రమం తప్పకుండా ప్రార్ధనలకు కూడా వెళ్లొచ్చేవాడని అతడి తండ్రి సయ్యద్ షఫీక్ రహ్మాన్ చెప్పారు. ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి ఒమర్ మతీన్ కారణమైన విషయం తెలిసిందే. అసలు ఉన్నట్లుండి అతడు ఎందుకు ఇలా చేశాడని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగా అమెరికాలోనే ఓ టాక్ షోను నిర్వహించే అతడి తండ్రి బహిరంగంగా మతీన్‌కు సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. బాహాటంగానే తాలిబన్లకు మద్దతు తెలిపే ఆయన ఇప్పటికే గేలంటే తన కుమారుడికి నచ్చదనే విషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. దాంతోపాటు తాజాగా ఈ విషయాలు ఆయన చెప్పారు. ముఖ్యంగా వారానికి నాలుగుసార్లు సాయంత్రంపూట నగరంలోని మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లేవాడని, తన పని తాను చూసుకొని వచ్చేవాడని, ఏ ఒక్కరితో కూడా మాట్లాడకపోయేవాడని అన్నారు. -
'నేను బాత్రూమ్ లో దాక్కున్నా, వాడు వస్తున్నాడు'
ఆర్లెండో: కొడుకు ఎడీ జస్టిస్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చేటప్పటికి మినా జస్టిస్ గాఢ నిద్రలో ఉంది. తాను వెళ్లిన క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయని, చనిపోవడం ఖాయమని కొడుకు మెసేజ్ పెట్టడంతో ఆమె అమాంతంగా నిద్రలేచింది. ఫ్లోరిడాలోని ఆర్లెండో పల్స్ నైట్ క్లబ్ లో నరమేధం జరిగినప్పుడు అక్కడే ఉన్న 30 ఏళ్ల ఎడీ జస్టిస్ తన తల్లికి మెసేజ్ లు పంపాడు. వారిద్దరి మధ్య పలు మెసేజ్ లు నడిచాయి. తెల్లవారుజామున 2.06 ప్రాంతంలో 'మమ్మీ ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పెట్టి, నైట్ క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలిపాడు. ఆమె ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో నీవు బాగానే ఉన్నావా అంటూ మెసేజ్ పంపింది. మరో నిమిషానికి తాను బాత్రూమ్ లో దాక్కున్నానని సమాధానం వచ్చింది. ఈ క్లబ్ లో ఉన్నావని అడగ్గా 'పల్స్, డౌన్ టౌన్, పోలీసులకు ఫోన్ చేయి' జవాబిచ్చాడు. మరో నిమిషం తర్వాత 'నేను చనిపోతాను' అంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో భయపడిన మినా జస్టిస్ 911కు ఫోన్ చేసింది. 'నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా. నువ్వు అక్కడే ఉన్నావా, ఫోన్ చేయి' అంటూ కొడుక్కి ఆమె మెసేజ్ లు పంపింది. 2.39 గంటలకు అతడి నుంచి సమాధానం వచ్చింది. 'నేను బాత్రూమ్ లోనే ఉన్నా. వాడు ఇటే వస్తున్నాడు. నన్ను చంపేస్తాడు' అంటూ మెసేజ్ చేశాడు. 'నీతో పాటు ఎవరైనా ఉన్నారా, పోలీసులు వచ్చారా' మెసేజ్ పెట్టగా రాలేదని జవాబిచ్చాడు. తీవ్రవాది మాతో పాటే బాత్రూమ్ లో ఉన్నాడని చెప్పాడు. కాల్పులు జరుపుతోంది అతడేనా అని అడగ్గా 'యస్' అని సమాధానమిచ్చాడు. తర్వాత అతడి నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. అయితే తన కొడుకు గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని మినా జస్టిస్ ఆందోళన చెందుతోంది. ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతోంది. తన కొడుకు ప్రాణాలతో ఉండాలని ప్రార్థిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మందికిపైగా మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. -
ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు!
వాషింగ్టన్: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమైన ఒమర్ మతీన్ తనను రోజూ కొట్టేవాడని అతని మాజీ భార్య తెలిపింది. భద్రత కారణాల దృష్ట్యా తన వివరాలను వెల్లడించని ఆమె 'వాషింగ్టన్ పోస్ట్'తో మాట్లాడుతూ.. ఒమర్ మతీన్(29) తనను కారణం లేకుండానే చీటికిమాటికి కొట్టేవాడని, లాండ్రీ పని చేయలేదని కూడా కొట్టిన సందర్భాలున్నాయని తెలిపింది. అతడు బయటకు వెళ్లి ఇంటికిరాగానే కొట్టడం స్టార్ట్ చేసేవాడని వెల్లడించింది. 2009లో ఆప్ఘనిస్తాన్ సంతతికి చెందిన మతీన్‌ను ఆమె న్యూయార్క్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. వివాహం అనంతరం కొంతకాలం ఫ్లోరిడాలో మతీన్‌తో కలిసున్న ఆమె.. అతని ప్రవర్తనతో విసుగుచెంది విడాకులు తీసుకున్నట్లు సమాచారం. కాగా 'గే' కల్చర్‌కు మతీన్ తీవ్ర వ్యతిరేకి అని.. ఇటీవల ఓ ప్రదేశంలో ఇద్దరు మగవారు ముద్దుపెట్టుకుంటుండగా చూసిన మతిన్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడని అతని తండ్రి వెల్లడించాడు. -
నైట్ క్లబ్లో నరమేధం
అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్లో ఉన్మాది కాల్పులు 50 మందికి పైగా మృతి.. 53 మందికి గాయాలు గోడను పేల్చేసి ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. 30 మంది బందీలకు విముక్తి ఉన్మాది అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తింపు ఇది ఉగ్రవాద చర్యే: ఒబామా; మా పనే: ఐసిస్ ఆర్లెండో: అది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్.. సమయం.. ఆదివారం తెల్లవారుజాము 2 గంటలు..! కళ్లు చెదిరే కాంతులు, అదరగొట్టే బీట్ మధ్య క్లబ్లో అంతా ఉర్రూతలూగుతున్నారు.. మరికొద్ది సేపట్లో క్లబ్ మూస్తారనగా ఒక్కసారిగా ధన్.. ధన్.. ధన్..! ఓ ఉన్మాది వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అప్పటిదాకా సందడిగా ఉన్న క్లబ్ రక్తసిక్తమైంది. ఉన్మాది కాల్పుల్లో 50 మందికిపైగా చనిపోయారు. మరో 53 మంది గాయపడ్డారు. కాల్పుల విషయం తెలియగానే క్లబ్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఉన్మాదిని మట్టుబెట్టారు. అతడిని అఫ్గాన్ సంతతికి చెందిన ఒమర్ మతీన్‌గా గుర్తించారు. క్లబ్ నుంచి 30 మంది బందీలను రక్షించారు. ఇది ఉగ్రవాద చర్యేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. కాల్పులు తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించుకుంది. ఉలిక్కిపడ్డ అమెరికా..: ఆర్లెండోలోనే శనివారం జరిగిన కాల్పుల్లో యూట్యూబ్ గాయని క్రిస్టినా గ్రిమ్మీ మరణించింది. ఇది మరవకముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద కాల్పుల దుర్ఘటనగా చెబుతున్నారు. ఉన్మాది ఉన్నట్టుంటి కాల్పులకు తెగబడడంతో అనేక మంది ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కొందరు బాత్రూముల్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాల్పుల్లో మొదట 20 మందే మరణించారని భావించినా.. చివరికి 50 మందికిపైగా చనిపోయినట్టు తేలింది. అయితే వీరంతా ఉన్మాది కాల్పుల్లోనే మరణించారా? లేక పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రమాదవశాత్తూ ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియాల్సి ఉంది. గోడను పేల్చేసి.. ఆపరేషన్ కాల్పుల విషయం తెలియగానే పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టినా.. ఐదు గంటల వరకూ లోపలకు వెళ్లలేకపోయారు. పదుల సంఖ్యలో పోలీసు వాహనాలతో పాటు స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీం) బృందాల్ని రప్పించారు. ఉన్మాదిని మట్టుపెట్టేందుకు ముందుగా క్లబ్ పరిసరాల్ని పూర్తిగా ఖాళీ చేయించారు. బందీల్ని విడిపించేందుకు ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. పేలుడు పదార్థాలతో గోడను పేల్చేసి అత్యాధునిక వాహనం ‘బేర్‌క్యాట్’తో స్వాట్ బృందాలు క్లబ్‌లోకి ప్రవేశించాయి. ఉన్మాదిని మట్టుబెట్టి దాదాపు 30 మందికి విముక్తి కల్పించాయి. గాయపడ్డవారిని ఆర్లెండో రీజినల్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. గస్తీ పోలీసును తప్పించుకొని.. ఆర్లెండో పోలీసు చీఫ్ జాన్ మినా కథనం ప్రకారం... మతీన్ రైఫిల్, హ్యాండ్‌గన్‌తో క్లబ్‌లోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే అక్కడ గస్తీ ఉన్న పోలీసు అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. మతీన్ తప్పించుకొని క్లబ్‌లోకి వెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఒబామా ఉన్నతస్థాయి సమీక్ష కాల్పుల నేపథ్యంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రతా అధికారులతో, ఉగ్రవాద నిరోధక విభాగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనతో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఏదైనా సంబంధముందా అన్న ప్రశ్నకు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి రాన్ హార్పర్ స్పందిస్తూ.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని చెప్పారు. ఉన్మాది ఉగ్రవాద సిద్ధాంతాలతో ప్రభావితం అయ్యాడా అన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. విదేశీ ఉగ్రవాద కోణంతోపాటు, దుండగుడు ఒక్కడేనా.. కాదా? అన్న కోణంలోను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ‘గే ’లపై అసహ్యంతోనే..: మతీన్ తండ్రి ‘గే’లంటే అసహ్యంతో తన కొడుకు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని మతీన్ తండ్రి మిర్ సిద్దిఖీ ఓ న్యూస్ ఛానల్‌కు తెలిపాడు. అంతేకానీ అతడు అవ లంబిస్తున్న ఇస్లాంకు సంబంధం లేదన్నాడు. మయామీలో ఒక గే జంట కౌగిలించుకోవడం చూసిన ఒమర్ ఇటీవల తన సమక్షంలో తీవ్రంగా విమర్శించాడని సిద్దిఖీ తెలిపాడు. ఫేస్బుక్ మెసేజ్‌లతో అప్రమత్తం ఒకవైపు కాల్పులు జరుగుతుండగా క్లబ్‌లోని అందరి ఫోన్లలో ఫేస్బుక్ మెసేజ్‌లు... ‘అందరూ క్లబ్ నుంచి పారిపోండి. పరుగెత్తండి ’ అంటూ పల్స్ క్లబ్ యాజమాన్యం ఫేస్బుక్లో అందరినీ అలర్ట్ చేసింది. ఉదయం ఆరుగంటలకు తీవ్ర విషాదంతో కూడిన మరో పోస్టు.. ‘ఏదైనా సమాచారం ఉంటే ఎప్పటికప్పుడు తెలుపుతాం. ఈ ఘోర దుర్ఘటనను ఎదుర్కొనేందుకు దయచేసి అంద రూ ప్రార్థించండి. మీ ఆలోచనలు, ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ... కొద్ది రోజుల క్రితమే ఆర్లెండొ ఎల్జీబీటీ కమ్యూనిటీ వార్షిక గే సంబరాలు నిర్వహించుకుంది. గేల కోసం అమెరికాలో నిర్వహించే అతిపెద్ద ఉత్సవం ఇదే. క్లబ్ వెనక్కి పరిగెట్టాం: ప్రత్యక్ష సాక్షి రికార్డో ‘కాల్పులు మొదలగానే జనం కింద పడుకున్నారు. సీలింగ్పైకి కూడా కాల్పులు జరపడంతో లైట్లన్నీ ధ్వంసమయ్యాయి. ఒక్క నిముషమే కాల్పులు జరిగినా చాలా సేపు కొనసాగినట్లు అనిపించింది. మధ్యలో కొద్ది సేపు ఆగడంతో క్లబ్ వెనక్కి పరుగెట్టాం’ అంటూ మరో ప్రత్యక్ష సాక్షి రికార్డో నెగ్రాన్ వెల్లడించాడు. తప్పించుకున్న అక్కాచెల్లెళ్లు కెన్యా మిచెల్స్.. ప్యూర్టోరికోకు చెందిన డ్రాగ్ క్వీన్(గే క్లబ్‌ల్లో ప్రత్యేక నృత్యం చేసేవారు). తన సోదరి జాస్మిన్‌తో కలిసి స్టేజ్‌పైన ప్రదర్శనలిస్తోంది. ఇంతలో ఒక్కసారిగా కాల్పులు.. అదృష్టవశాత్తూ అక్కాచెల్లెళ్లిద్దరు కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఎవరీ మతీన్..? క్లబ్లో కాల్పులకు తెగబడ్డ ఒమర్ మతీన్‌ను అఫ్గాన్ సంతతికి చెందిన వాడిగా గుర్తించారు. అమెరికాలో స్థిరపడిన అఫ్గాన్ దంపతులకు 1986లో జన్మించిన ఇతడు.. ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో నివసిస్తున్నాడు. ఈ ప్రాంతం ఆర్లెండోకు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఒమర్‌కు ఇంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదని సీబీఎస్ న్యూస్ ఛానల్ పేర్కొంది. ఇతడికి ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒమర్ మతీన్‌పై గతంలోనే అమెరికా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయని ద డైలీ బీస్ట్ పత్రిక పేర్కొంది. 2013, 2014లో ఇతడి కదలికలపై ఎఫ్ఐబీ దృష్టిసారించింది. ఒక దశలో మతీన్‌పై విచారణ ప్రారంభించిన ఎఫ్‌బీఐ.. తదుపరి విచారణ కోసం ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ కేసును మూసివేయాల్సి వచ్చింది. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నా ప్రత్యక్ష సాక్షి హన్సన్ ‘అందరూ కాక్టైల్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో స్టేజ్ పైకి డాలర్లు విసురుతున్నారు. కేరింతలు, కేక పుట్టించే మ్యూజిక్‌తో క్లబ్ సందడిగా మారింది. ఇంతలో రివాల్వర్ కాల్పుల శబ్దం. డ్రమ్ బీట్ శబ్దం అనుకున్నాం... ఆగకుండా వినిపించే వరకూ అవి రివాల్వర్ శబ్దాలని తెలియలేదు. ఇంతలో మా వైపుకు కాల్పులు జరగడంతో పరుగులు పెట్టాను’ అంటూ ప్రత్యక్ష సాక్షి క్రిస్టోపర్ హన్సన్ సీఎన్ఎన్కు తెలిపారు. లాస్ ఏంజెల్స్ కౌంటీలోనూ కాల్పుల కలకలం లాస్ ఏంజెల్స్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో 24 గంటల వ్యవధిలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కార్సన్ ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు శాన్ గేబ్రియల్ వ్యాలీ వరకూ కొనసాగాయి. లాస్ ఏజెంల్స్ టైమ్స్ కథనం ప్రకారం... శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దుండుగుడు కాల్పులు జరపగా... తీవ్ర గాయాలతో అతను మరణించాడు. ఆరు గంటల అనంతరం బైక్ వచ్చిన దుండగులు మరో ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఇద్దరిలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున కారుకు మరమ్మతులు చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపారు. లాస్ఏంజెల్స్ కౌంటీలో జరిగిన మరో మూడు కాల్పుల ఘటనల్లో నలుగురు మరణించారు. ఈ కాల్పుల ఘటనలకు ఒకదానికొకటి సంబంధంలేదని పోలీసులు వెల్లడించారు. -
మగవాళ్లు ముద్దుపెట్టుకోవడం నచ్చకే!
అమెరికాలోని గే నైట్ క్లబ్బులో నరమేథం సృష్టించిన సాయుధుడి గురించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఫ్లోరిడా ఓర్లాండోలోని నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50మందిని పొట్టనబెట్టుకున్న సాయుధుడిని ఒమర్ మతీన్ (29)గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు విధేతయ ప్రకటిస్తూ అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. దారుణానికి ముందు అతడు 911 నంబర్‌కు ఫోన్ చేసి.. ఐఎస్ఐఎస్ మద్దతుగానే కాల్పుల తెగబడబోతున్నట్టు చెప్పాడని ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ నిఘా హౌస్ సెలెక్ట్ కమిటీ డెమొక్రాట్ సభ్యుడు యాడం షిఫ్ తెలిపారు. అఫ్ఘాన్ దంపతులకు జన్మించిన ఒమర్ ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని, గతంలో అతడికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఒమర్‌కు హోమోఫొబియా (స్వలింగ సంపర్క వ్యతిరేకత) ఉందని, అందువల్లే రంజాన్ నెలలో గే నైట్ క్లబ్బు లక్ష్యంగా అతడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఒమర్ తండ్రి మిర్ సిద్ధిఖీ ఎన్బీసీ చానెల్‌తో మాట్లాడుతూ తన కొడుకు గత నెలలో మియామిలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకుంటుంటే చూసి చాలా ఆగ్రహానికి గురయ్యాడని, అతడి వ్యతిరేకత మత సంబంధమైనది కాదని చెప్పారు. అతడు పాల్పడిన చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంత పరిచిందని, అతడు ఇంతటి దారుణానికి పాల్పడుతాడని తాము ఊహించలేదని, ఇందుకు తాము క్షమాపణలు చెప్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా పేరొందిన ఈ ఘటన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రేరేపితమేనని ప్రాథమిక దర్యాప్తులో అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. -
అమెరికా గే నైట్‌క్లబ్‌లో నరమేధం
అమెరికా చరిత్రలో మరో పాశవిక నరమేధం. ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లోకి చొరబడ్డ సాయుధుడు 50 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పల్స్ నైట్ క్లబ్ లోకి మారణాయుధాలతో ఓ సాయుధుడు చొరబడ్డాడని, పలువురిపై కాల్పులు జరిపి, ఇంకొందరిని బందీలుగా పట్టుకున్నాడని ఓర్లాండో పోలీసులు తెలిపారు. నాలుగు గంటల ఉత్కంఠత అనంతరం పోలీసులు దుండగుణ్ని మట్టుపెట్టారు. రెండు రోజుల కిందట పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీని కాల్చిచంపిన ఓర్లాండో సిటీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్‌పై కాల్పులు) గే నైట్ క్లబ్ లో కాల్పులపై స్థానిక మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా పారిపోండంటూ క్లబ్ నిర్వాహకులు కస్టమర్లకు మెసేజ్ లు పెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన తీవ్రత దృష్ట్యా క్లబ్ వద్దకు భారీగా చేకున్న పోలీసులు.. 4 గంటల తర్వాత దుండగుణ్ని అంతం చేశారు. నిందితుడు ఏ కారణంతో కాల్పులకు పాల్పడింది తెలియాల్సి ఉంది. (చదవండి: పిచ్చి అభిమానంతోనే చంపేశాడా!) -
హాలీవుడ్ హీరోకు ఢిల్లీలో చేదు అనుభవం
ఢిల్లీ: హాలీవుడ్ హీరో ఒర్లాండో బ్లూమ్కు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చుక్కలు చూపించారు. సరైన వీసా లేకుండా వచ్చిన ఈ బ్రిటీష్ యాక్టర్‌ను తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కించారు. దీంతో బ్లూమ్ 24 గంటల వ్యవధిలో లండన్, ఢిల్లీల మధ్య రెండు సార్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికి ఉద్దేశపూర్వకంగానే బ్లూమ్‌ను ఇబ్బంది పెట్టినట్లు ఇమిగ్రేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బ్లూమ్ కు ఈ చేదు అనుభవం ఎదురవడం గమనార్హం. చివరికి ఈ వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకొని ఒర్లాండోకు తాత్కాలిక వీసాను మంజూరు చేయాలని ఆదేశించడంతో ఎట్టకేలకు బ్లూమ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. -
ఓ చల్లని అగ్నిపర్వతం...
చిత్ర విచిత్ర కాన్సెప్ట్‌లతో రూపొందిన ఎన్నెన్నో థీమ్ పార్కులను చూసేశాం. ఇది సరికొత్తది. ఉష్ణమండల ద్వీపాలతోపాటు ఏకంగా భారీ అగ్నిపర్వతాన్ని తలపించేలా అత్యాధునిక వాటర్ థీమ్ పార్కుకు శ్రీకారం చుట్టారు అమెరికాలో. అగ్నిపర్వతం బద్ధలైతే లావా ఎలా ఎగజిమ్ముతుందో అలాగే నీటిని చిమ్మేలా పార్కును డిజైన్ చేస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండో నగరంలో యూనివర్సల్ స్టూడియోస్, ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ సంస్థలు సంయుక్తంగా యూనివర్సల్ ఓర్లాండో రిసార్ట్‌లో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 2017కల్లా వాటర్పార్కును పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని రిసార్ట్ యాజమాన్యం ప్రకటించింది. ఈ కొత్త రిసార్ట్ పేరు ‘వల్కనో బే’. -
ఒర్లాండో హొట్లో దెయ్యం...?