గ్రేటర్ ఓర్లాండోలోనాట్స్ ప్రస్థానం | NATS New Chapter launch In Orlando | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం

Published Wed, Nov 27 2024 3:35 PM | Last Updated on Wed, Nov 27 2024 3:39 PM

NATS New Chapter launch In Orlando

అమెరికాలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన శాఖలను విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గ్రేటర్  ఓర్లాండోలో నాట్స్ చాప్టర్‌ని ప్రారంభించింది. గ్రేటర్ ఓర్లాండోలోని మా దుర్గా కన్వెన్షన్ హాల్‌లో నాట్స్ చాప్టర్  ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తెలుగు వారి కోసం గ్రేటర్ ఓర్లాండోలో ప్రారంభమైన ఈ చాప్టర్‌కు కో ఆర్డినేటర్‌గా రావి రవి కుమార్‌కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. 

వేణు మల్ల, శ్రీధర్ గోలీ, శ్రీదేవి మల్ల, మీనా నిమ్మగడ్డ, లక్ష్మి అంగ, శేషు అచంట తదితరులు నాట్స్‌లో పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. నాట్స్ ఉన్నతమైన విలువలు పాటిస్తూ సామాజిక సేవలో వేస్తున్న అడుగులు అందరికి ఆదర్శంగా మారాయని.. గ్రేటర్ ఓర్లాండో నాట్స్ ప్రతినిధులు కూడా ఆ దిశగా కృషి చేసి నాట్స్ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు భాష సంస్కృతి పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి కొత్త జట్టు చురుకుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాట్స్ ఉచిత వైద్య సేవలతో తెలుగు వారికి చేరువైన వైనాన్ని నాట్స్ బోర్డు సభ్యులు టీపీ రావు వివరించారు. నాట్స్‌లో  మహిళా సాధికారత, యువతను నాట్స్‌లో భాగస్వామ్యం లాంటి అంశాలపై నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి గ్రేటర్ ఓర్లాండో నాట్స్ సభ్యులకు దిశా నిర్ధేశంచేశారు. తెలుగు వారంతా ఎక్కడ ఉన్నా ఐక్యతగా ఉండాలని.. అదే మనకు, నాట్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ప్రసాద్ ఆరికట్ల తెలిపారు. గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ బాధ్యతలు తీసుకున్న వారంతా చిత్తశుద్ధితో  పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అన్నారు.

గ్రేటర్ ఒర్లాండో చాప్టర్ జట్టు సభ్యులకు తన అభినందనలు తెలిపారు. తన మీద ఉన్న నమ్మకంతో గ్రేటర్ ఓర్లాండో బాధ్యతలు అప్పగించిన నాట్స్ బోర్డుకు నాట్స్ గ్రేటర్ ఓర్లాండో కో ఆర్డినేటర్ రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. తనపై, తన టీం సభ్యులపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేలా గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ కోసం పనిచేస్తామని రవికుమార్ హామీ ఇచ్చారు.  ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ జాతీయ నాయకత్వంతో పాటు నాట్స్ వివిధ రాష్ట్రాల్లోని ఆయా చాప్టర్ల నాయకులు ఈ ప్రారంభోత్సవ  వేడుకలో పాల్గొన్నారు. 

నాట్స్ సౌత్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామినేని, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ళ తో పాటు నాట్స్ టాంపా బే చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. చాప్టర్ ప్రారంభోత్సవానికి  సహకారం అందించిన దాతలు బావర్చీ, పెర్సిస్, హైదరాబాద్ కేఫ్, నాన్‌స్టాప్, నాటు నాటు, ఇంచిన్స్, శివి కేక్స్, మరియు స్మార్ట్ గ్లోబల్ వంటి సంస్థలకు గ్రేటర్ ఓర్లాండో నాట్స్ టీం  తమ ధన్యవాదాలు తెలిపింది.

(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement