నేనో పోలీస్‌నయ్యా.. పని మీద వెళ్తున్నానంటే వినవేంటయ్యా.. అంటూ తనను వెంబడించి అడ్డగించిన పైస్థాయి అధికారికి ఆ పోలీస్ అధికారి బదులిచ్చాడు. అయితే ఏంటి? అలా బండి నడుపుతావా? లైసెన్స్ చూపించు అని నిలదీశాడు పైస్థాయి అధికారి. అయితే నిర్లక్ష్య ధోరణి ఉన్న ఆ అధికారి మాత్రం అదే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యింది. కట్ చేస్తే..
రూల్స్ బ్రేక్ చేసిన ఆ అధికారి ఉద్యోగం ఊడింది. నిర్లక్ష్య ధోరణితో బండి నడపడంతో పాటు పలు రకాల కేసుల కింద అతనిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కూడా అయ్యాడు. చేసిన తప్పునకు అతనికి శిక్ష కఠినంగానే ఉండొచ్చని తెలుస్తోంది.
ఫ్లోరిడాలో ఓర్లాండో నగరంలో గంటకు 45 మైళ్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన చోట.. 80 మైళ్ల వేగంతో అధికారిక వాహనంలోనే దూసుకెళ్లిన ఓ పోలీసోడికే పడిన శిక్ష ఇది. అక్కడంతే.. చట్టాలు వెరీ పవర్‌ఫుల్. ఎవరికీ చుట్టంగా వ్యవహరించదు మరి!.
“I am going into work"
— BBC News (World) (@BBCWorld) June 15, 2023
Speeding police officer pulled over by another officer https://t.co/NKV4xszcZq pic.twitter.com/mZtnZXmC4P
Video Credits: BBC News World
ఇదీ చదవండి: బరువు తగ్గాలనుకుంటే.. మనిషే లేకుండా పోయాడు పాపం
Comments
Please login to add a commentAdd a comment