టెస్లా.. వాహన తయారీలో కొత్త ఒరవడిని సృష్టించిన బ్రాండ్. అమేజింగ్ టెక్నాలజీ, సేఫ్టీ చర్యలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎన్నో సంచలనాలతో అమెరికా నుంచి ప్రపంచానికి దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆటోపైలట్ ఫీచర్ ద్వారా వాహనతయారీ రంగంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిందనే పేరుంది టెస్లాకి. అలాంటిది వరుస ప్రమాదాలు ఆ బ్రాండ్‌ను దెబ్బకొట్టే అవకాశాలున్నాయా? అనేదానిపై ఇప్పుడు వాహన నిపుణుల నడుమ సమీక్ష జరుగుతోంది.
ఓర్లాండోలో ఆగష్టు 28.. ఉదయం ఐదు గంటల సమయంలో ఆటోపైలెట్‌తో వెళ్తున్న టెస్లా కారు..ఓ పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన పోలీస్ అధికారి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో పాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన యాక్సిడెంట్‌లను వీడియోలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. దీంతో టెస్లా సాంకేతికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Happening now: Orange County. Trooper stopped to help a disabled motorist on I-4. When Tesla driving on “auto” mode struck the patrol car. Trooper was outside of car and extremely lucky to have not been struck. #moveover. WB lanes of I-4 remain block as scene is being cleared. pic.twitter.com/w9N7cE4bAR
— FHP Orlando (@FHPOrlando) August 28, 2021
టెస్లా క్లియర్‌గానే..
నిజానికి ఆటోపైలట్ ఫీచర్ విషయంలో టెస్లా మొదటి నుంచి క్లియర్‌గానే ఉంది. డ్రైవర్ సీట్‌లో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలని చెబుతోంది. ఆటోపైలెట్ ఫీచర్‌ను ఇప్పటికిప్పుడు డ్రైవర్ లేకుండా ఉపయోగించకూడదని టెస్లా హోం పేజీలో హెచ్చరికను ప్రదర్శిస్తోంది కూడా. కానీ, తాజా యాక్సిడెంట్ వెనుక సీట్‌లో డ్రైవర్ ఉండగానే జరగడంతో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇక టెస్లా కార్లు గతంలో యాక్సిడెంట్‌లను పసిగట్టి తప్పించిన సందర్భాలు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో వాటి ద్వారా అనుమానాల్ని నివృత్తి చేస్తోంది టెస్లా. అయినప్పటికీ నెగెటివిటీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంపై టెస్లా ఆందోళన చెందుతోంది.
భారత వర్తకంపై ప్రభావం?
టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మీద ఓవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. భారత్‌లో ఎంట్రీలో చర్చ నడుస్తోంది. కానీ, భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక టెస్లా సాంకేతికత.. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిపై ఎలాంటి ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే నాలుగు మోడల్స్‌కు అప్రూవల్ కూడా దొరికింది.
ముందుగా భారత్‌కు ఈవీ కార్ల ఎగుమతి, అటుపైనే ప్రొడక్షన్‌పై ఫోకస్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది టెస్లా. ఇప్పటికే సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు టెస్లాకు విడిభాగాలు అందిస్తున్న తరుణంలో.. వీటి సహకారంతోనే భారత్‌లోనూ తమ జోరును చూపేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతుంది. ఇక కీలకమైన పన్నుల తగ్గింపు విషయంలోనే భారత ప్రభుత్వంతో టెస్లా జరిపే చర్చలు ఓ కొలిక్కి వస్తే.. టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి ముహుర్తం ఖరారు కావడం ఒక్కటే మిగులుతుంది.
చదవండి: టెస్లాకు పోటీగా ఓలా?
Comments
Please login to add a commentAdd a comment