Autopilot mode
-
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
లోపాన్ని సరిచేసేందుకే దిగ్గజ కంపెనీ కార్ల రీకాల్
డెట్రాయిట్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అమెరికాలో విక్రయించిన దాదాపు అన్ని కార్లను రీకాల్ చేసింది. ఇవి సుమారు 20 లక్షల పైచిలుకు ఉంటాయి. 2012 అక్టోబర్ 5 మొదలు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసిన వై, ఎస్, 3, ఎక్స్ మోడల్స్ వీటిలో ఉన్నాయి. ఆటోపైలట్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు డ్రైవర్ల అప్రమత్తతను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని సరి చేసేందుకు, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. డ్రైవర్లకు జారీ చేసే హెచ్చరికలు, అలర్ట్‌లను సాఫ్ట్వేర్ అప్డేట్ మరింతగా పెంచుతుందని, అలాగే ఆటోపైలట్ బేసిక్ వెర్షన్లు పని చేయగలిగే పరిధిని కూడా నియంత్రిస్తుందని పేర్కొంది. ఆటోపైలట్ పాక్షికంగా వినియోగంలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలపై జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రత ఏజెన్సీ రెండేళ్ల పాటు దర్యాప్తు నిర్వహించిన మీదట టెస్లా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోపైలట్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచేందుకు టెస్లా కార్లలో తీసుకున్న జాగ్రత్త చర్యలు తగినంత స్థాయిలో లేవని దర్యాప్తులో ఏజెన్సీ అభిప్రాయపడింది. పేరుకు ఆటోపైలట్ సిస్టమ్ అయినప్పటికీ ఇది డ్రైవర్‌కు కొంత అసిస్టెంట్‌గా మాత్రమే పని చేయగలదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే (తన లేన్‌లో) వాహనాన్ని నడపడం, యాక్సిలరేట్ చేయడం, బ్రేక్‌లు వేయడం మొదలైన పనులు చేస్తుంది. మిగతా అన్ని సందర్భాల్లో డ్రైవరు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తనే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ఈ జాగ్రత్తలను పక్కన పెట్టి ఆటోపైలట్‌ను ఆన్ చేసి వెనక సీట్లో కూర్చోవడం లేదా తాగేసి కూర్చోవడం వంటివి చేస్తుండటమే ప్రమాదాలకు దారి తీస్తున్నాయనే అభిప్రాయం నెలకొంది. -
టెస్లా గిగా ఫ్యాక్టరీ.. అదిరిపోయే ఫుటేజ్.. ఆటోపైలెట్కి శాంపిల్ పీస్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో చమక్కుమనిపించారు. ఎవ్వరు కాదన్నా.. విమర్శలు ఎన్ని వచ్చినా తాను అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిండంలో దిట్ట ఎలన్ మస్క్. తన కలల ప్రాజెక్టయినా ఆటో పైలెట్‌ను అమల్లోకి పెట్టే ప్రయత్నంలో భాగంగా తాజాగా టెస్లా రిలీజ్ చేసిన వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అవుటాఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయడం వాటిని అమల్లో పెట్టడంతో ఎలన్ మస్క్‌ది డిఫరెంట్ స్టైల్. అంతా పెట్రోలు, డీజిల్ వాహనాల మార్కెట్‌పై దృష్టి పెట్టినప్పుడు తానొక్కడే ఎలక్ట్రిక్ వాహనాల మంత్రం అందుకున్నాడు. ఇప్పుడందరూ ఈవీల పేరు జపిస్తుంటే, తాను మరింత అడ్వాన్స్‌గా ఆలోచించి డ్రైవర్ లేకుండా ఆటోపైలెట్ మోడ్‌లో నడిచే కార్లను తెస్తానంటున్నాడు. తన ఆటో పైలెట్ కాన్సెప్టుకి బలం చేకూర్చే ఓ వీడియోను టెస్లా కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది. గత వారం బెర్లిన్‌లో తొలి గిగాఫ్యాక్టరీని ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఇక్కడ భారీ ఎత్తున మోడల్ 3 కార్లు తయారవుతున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీ ఎంత పెద్దగా ఉంది అక్కడ కార్లు ఎలా తయారవుతున్నాయో తెలియజేస్తూ డ్రోన్‌తో షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో టెస్లా రిలీజ్ చేసింది. డ్రోన్ వీడియో ఫుటేజ్ ప్రపంచానికి కొత్తేం కాదు.. ఇక్కడే ఎలన్ మస్క్ మ్యాజిక్ చేశాడు. గిగా ఫ్యాక్టరీలో మిషన్లు తయారీ పనుల్లో నిమగ్నమై ఉండగా డ్రోన్ షూట్ చేసింది. అంటే పని జరిగేప్పుడు ఏదైనా మిషన్ అడ్డుగా వస్తే ఆగిపోవడం.. పక్కకు తొలగగానే ముందుకు వెళ్లడం. అవసరాన్ని బట్టి కుడి ఎడమ, పైనా కిందకు డైరెక్షన్ మార్చుకుంటూ గిగా ఫ్యాక్టరీని షూట్ చేసింది. డ్రోన్ కెమెరాలో ఆటో పైలెట్ మోడ్ ఫీచర్‌ను ఇన్స్టాల్ చేసినట్టుగానే ఈ వీడియో షూట్ జరిగింది. డ్రైవర్ లేకుండా ఆటోపైలెట్ కార్లను అందుబాటులోకి తేవడం తన లక్ష్యమంటూ ఎలన్ మస్క్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అయితే ఈ ఆటోపైలెట్పై అమెరికా సహా పలు దేశాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. మరోవైపు ఆటోపైలెట్‌లో ఇంకా కొన్ని అడ్వాన్స్మెంట్స్ చేయాల్సి ఉందంటూ ఎలన్ మస్క్ సైతం ఆర్నెళ్ల కిందట ప్రకటించారు. తాజాగా బెర్లిన్ గిగా ఫ్యాక్టరీ డ్రోన్ కెమెరా ఫుటేజ్ వీడియోను పరిశీలిస్తే టెస్లా ఆటోపైలెట్ మోడ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఆటో పైలెట్ మోడ్‌కి సంబంధించి తుది ప్రకటన వెలువడటానికి ముందు ఎలన్ మస్క్ పైలెట్ ప్రాజెక్టుగా ఈ డ్రోన్ వీడియో ఫుటేజ్‌ను రిలీజ్ చేసి ఉంటారని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మీరు ఓసారి ఆ డ్రోన్ వీడియోపై లుక్కేయండి. -
Tesla: టెస్లాను నమ్మొచ్చా?
టెస్లా.. వాహన తయారీలో కొత్త ఒరవడిని సృష్టించిన బ్రాండ్. అమేజింగ్ టెక్నాలజీ, సేఫ్టీ చర్యలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ఎన్నో సంచలనాలతో అమెరికా నుంచి ప్రపంచానికి దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆటోపైలట్ ఫీచర్ ద్వారా వాహనతయారీ రంగంలో ఓ కొత్త ఒరవడి సృష్టించిందనే పేరుంది టెస్లాకి. అలాంటిది వరుస ప్రమాదాలు ఆ బ్రాండ్‌ను దెబ్బకొట్టే అవకాశాలున్నాయా? అనేదానిపై ఇప్పుడు వాహన నిపుణుల నడుమ సమీక్ష జరుగుతోంది. ఓర్లాండోలో ఆగష్టు 28.. ఉదయం ఐదు గంటల సమయంలో ఆటోపైలెట్తో వెళ్తున్న టెస్లా కారు..ఓ పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన పోలీస్ అధికారి.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో పాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన యాక్సిడెంట్లను వీడియోలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. దీంతో టెస్లా సాంకేతికపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Happening now: Orange County. Trooper stopped to help a disabled motorist on I-4. When Tesla driving on “auto” mode struck the patrol car. Trooper was outside of car and extremely lucky to have not been struck. #moveover. WB lanes of I-4 remain block as scene is being cleared. pic.twitter.com/w9N7cE4bAR — FHP Orlando (@FHPOrlando) August 28, 2021 టెస్లా క్లియర్‌గానే.. నిజానికి ఆటోపైలట్ ఫీచర్ విషయంలో టెస్లా మొదటి నుంచి క్లియర్‌గానే ఉంది. డ్రైవర్ సీట్లో ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలని చెబుతోంది. ఆటోపైలెట్ ఫీచర్‌ను ఇప్పటికిప్పుడు డ్రైవర్ లేకుండా ఉపయోగించకూడదని టెస్లా హోం పేజీలో హెచ్చరికను ప్రదర్శిస్తోంది కూడా. కానీ, తాజా యాక్సిడెంట్ వెనుక సీట్లో డ్రైవర్ ఉండగానే జరగడంతో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇక టెస్లా కార్లు గతంలో యాక్సిడెంట్లను పసిగట్టి తప్పించిన సందర్భాలు.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో వాటి ద్వారా అనుమానాల్ని నివృత్తి చేస్తోంది టెస్లా. అయినప్పటికీ నెగెటివిటీ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంపై టెస్లా ఆందోళన చెందుతోంది. భారత వర్తకంపై ప్రభావం? టెస్లా ఆటోపైలెట్ ఫీచర్ మీద ఓవైపు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో.. భారత్‌లో ఎంట్రీలో చర్చ నడుస్తోంది. కానీ, భారత్ వంటి అతి పెద్ద మార్కెట్‌ను వదులకునేందుకు టెస్లా సిద్ధంగా లేదని ఆటో ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక టెస్లా సాంకేతికత.. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతిపై ఎలాంటి ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే నాలుగు మోడల్స్‌కు అప్రూవల్ కూడా దొరికింది. ముందుగా భారత్‌కు ఈవీ కార్ల ఎగుమతి, అటుపైనే ప్రొడక్షన్‌పై ఫోకస్ చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది టెస్లా. ఇప్పటికే సోనా కమ్‌స్టర్ లిమిటెడ్, సంధార్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీలు టెస్లాకు విడిభాగాలు అందిస్తున్న తరుణంలో.. వీటి సహకారంతోనే భారత్‌లోనూ తమ జోరును చూపేందుకు టెస్లా ఉవ్విళ్లూరుతుంది. ఇక కీలకమైన పన్నుల తగ్గింపు విషయంలోనే భారత ప్రభుత్వంతో టెస్లా జరిపే చర్చలు ఓ కొలిక్కి వస్తే.. టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి ముహుర్తం ఖరారు కావడం ఒక్కటే మిగులుతుంది. చదవండి: టెస్లాకు పోటీగా ఓలా? -
Tesla: ఆటోపైలట్ యాక్సిడెంట్లు... మొదలైన విచారణ
డ్రైవర్ లేకుండా కారు తీసుకొస్తామంటూ ఓ వైపు టెస్లా చెబుతుంటే మరోవైపు ఇప్పటికే టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలట్ పనితీరుపై విచారణ మొదలైంది. ఇప్పటి వరకు టెస్లా కార్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎన్ని, జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆటోపైలట్‌పై విచారణ టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ డ్రైవర్ లేకుండా నడిచే కారును తీసుకొస్తామమంటూ తరచుగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దీంతో డ్రైవర్ లెస్ కారు, ఆటోపైటల్ టెక్నాలజీపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ డ్రైవర్ లెస్ కారుపై ఎలన్‌మస్క్ రోజుకో అప్డేట్ బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్లా కార్లలో అందుబాటులో ఉన్న ఆటోపైలట్‌పై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఒకరి మరణం అమెరికాలో 2014 నుంచి ఇప్పటి వరకు టెస్లా అమ్మకాలు జరిపిన 7.65 లక్షల కార్లకు సంబంధించిన డేటాను క్రోడీకరించారు. దీని కోసం 2018 నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మాసాచుసెట్స్, మియామీ, శాన్డియాగోలలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 17 గాయపడగా అందులో ఒకరు మరణించారు. ఇందులో అత్యధిక ప్రమాదాలు రాత్రి వేళలలో జరిగినవే ఉన్నాయి. అంచనా వేయడంలో పొరపాటు? ప్రమాదాలు జరిగినప ప్రదేశాలను పరిశీలించగా ట్రాఫిక్ బోర్డులు, హైవే సూచికలతో పాటు కోన్లు తదితర రక్షణ ఏర్పాట్లు సరిగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో లైట్ల వెలుతురు కూడా ఎక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో సగానికిపైగా కార్లు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, హెచ్చరిక బోర్డులను అంచనా వేయడంలో ఆటోపైటల్ వ్యవస్థ వందశాతం సమర్థంగా పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సహయకారి ఆటోపైలట్ వ్యవస్థ డ్రైవర్‌కు సహాయకారిగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా డ్రైవర్ లేకుండా కారును సమర్థంగా నడపలేదని తాము ముందు నుంచే చెబుతున్నామంటోంది టెస్లా. ఎదైనా ప్రమాదాలను, హెచ్చరికలను గుర్తించినప్పుడు డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుందే తప్ప స్వంతగా నిర్ణయాలు తీసుకోదని వెల్లడించింది. అదేవిధంగా డ్రైవర్ లెస్ కార్ల తయారీ అనేది ఇంకా కాన్సెప్టు దశలోనే ఉందంటోంది టెస్లా. -
సౌరవిమానయానంలో రికార్డు
-
సో(లో)లార్ రికార్డు
ఏకధాటిగా 120 గంటల ప్రయాణం హవాయి (అమెరికా): కేవలం సౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్2’ విమానం చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని నగోయా నుంచి సోమవారం బయలుదేరిన ఈ సౌర విమానం ఏకబిగిన 120 గంటలు... 7,900 కిలోమీటర్లు ప్రయాణించి శుక్రవారం రాత్రి పదిగంటలకు (భారత కాలమానం ప్రకారం) అమెరికాలోని హవాయి దీవులకు చేరుకుంది. నిరంతరాయం గా సుదీర్ఘసమయం ప్రయాణించిన రికార్డు ఇంతకుమునుపు స్టీవ్ ఫోసెట్ పేరిట ఉంది. ఆయన 2006లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెట్ విమానంలో 76 గంటల 45 నిమిషాలు ప్రయాణించారు. అయితే సొలార్ ఇంపల్స్2 ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించదు. పూర్తిగా సౌరశక్తి పైనే ఆధారపడి నడుస్తుంది. ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయిం గ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది. పగలు సౌరశక్తిని బాగా గ్రహిం చేందుకు 9,000 మీటర్ల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లిన పెలైట్ అండ్రూ బోర్ష్‌బెర్గ్(స్విట్జర్లాండ్) రాత్రిపూట ఇంధనాన్ని ఆదా చేసేం దుకు 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరేవాడు. దీని కాక్‌పిట్‌లో ఒక్కరే పడతారు. పెలైట్ సీటునే టాయిలెట్‌గానూ వాడుకొనేలా డిజైన్ చేశారు. తిండి, నిద్ర అన్నీ ఆ కుర్చీలోనే. నిద్రపోవాలనుకుంటే సీటు కాస్త వెనక్కి వంచుకొని కునుకుతీయాలి. విమానాన్ని ఆటోపెలైట్ మోడ్‌లో పెట్టి... బోర్ష్‌బెర్గ్ 20 నిమిషాల చొప్పున నిద్రపోయేవాడు. ఇలా ఏకబిగిన 120 గంటలు ప్రయాణించాడు. మరో సహసమేమిటంటే... నగోయా నుంచి హవాయికి సొలార్ ఇంపల్స్2 యాత్ర మొత్తం పసిఫిక్ మహాసముద్రం మీదుగానే సాగింది. విమానం లో సాంకేతికలోపమొస్తే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అవకాశం లేదు. పెలైట్ ప్యారాచూట్ సాయంతో సముద్రంలో దిగితే ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చెక్కబల్ల (లైఫ్‌బోట్‌లాగా పనిచేస్తుంది) కాక్‌పిట్‌లో ఉంది. 35,000 కి.మీ. ప్రపంచయాత్రకు బయలుదేరిన ఈ విమానం ఈ ఏడాది మార్చి 10న అహ్మదాబాద్‌కు చేరుకోవడం తెలిసిందే.