కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్‌లో దిగుతుంది.
బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్‌లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుబడిపోయారు.
పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్‌ఎస్‌కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్‌లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్‌లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్‌ఎస్‌లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment