సుదీర్ఘకాలం ఇక్కడే ఉండడానికి సిద్ధమయ్యాం
పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నాం
అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు.
బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్‌టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్‌మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్‌మోర్ శుక్రవారం ఐఎస్‌ఎస్ నుంచి ఫోన్‌లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్‌మోర్ అన్నారు.
ఐఎస్‌ఎస్‌లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు.
అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్‌మోర్ ఓటు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్‌మోర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment