technical issues
-
స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు
పట్నా/చెన్నై: సాంకేతిక లోపాలు తలెత్తడంతో సోమవారం స్పైస్‌జెట్‌కు చెందిన రెండు విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఒకటి ఢిల్లీ–షిల్లాంగ్ సరీ్వసు కాగా, మరోటి చెన్నై–కోచి విమానం. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్‌కు టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అధికారుల సూచనల మేరకు ఉదయం8.52 గంటల సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. అదేవిధంగా, చెన్నై నుంచి కోచికి 117 మంది ప్రయాణికులతో టేకాఫ్ తీసుకున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశామని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. -
ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్య! మీకూ ఎదురైందా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారులు ఇబ్బంది పడినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5:14 గంటల సమయంలో ప్రత్యేక్ష సందేశాలు(డైరెక్ట్ మెసేజ్‌లు) పంపించడంలో సమస్య ఎదుర్కొన్నట్లు నెటిజన్లు తెలిపారు. ఈమేరకు ఇతర సమాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ పోస్ట్‌లు పెట్టారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ పంపించేందుకు వినియోగదారులు కొంత సమయంపాటు ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:14 గంటల సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనిపై దాదాపు రెండువేల కంటే ఎక్కువే ఫిర్యాదులు అందాయి. ఈ సమస్య ఎదురైన యూజర్లు ట్విటర్ వేదికగా ఇంకెవరికైనా ఇలాంటి ఇబ్బంది తలెత్తిందా అని ప్రశ్నించారు. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ సాంకేతిక సమస్యకు కారణాలు తెలియరాలేదు. ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుంచి ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!అమెరికాలో అక్టోబర్ 15న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో వేలాది సంఖ్యలో మెటా యూజర్లు ఇబ్బంది పడినట్లు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఫేస్‌బుక్‌కు సంబంధించి సమస్య ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సమస్యల గురించి 5,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. -
నత్తనడకన ఈ–కేవైసీ
సాక్షి, అమరావతి: దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్‌నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లోనే..ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది. ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ కూడా పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయక పోవడం తదితర సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగింది. కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును సెపె్టంబర్ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు. 7వ తేదీ వరకు ఆధార్ దిద్దుబాటుకు అవకాశంఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్డేటెడ్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. సూపర్ చెక్ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్ఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించనున్నారు. -
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
ఆర్ఎఫ్సీఎల్ షట్‌డౌన్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సీఎల్) కర్మాగారంలో మరమ్మతుల కార ణంగా గురువారం రాత్రి నుంచి యూరి యా ఉత్పత్తి నిలిచిపోయింది. హీటర్ సెక్ష న్ పైపులు మరమ్మతులు చేయడానికి వా రంరోజుల దాకా సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. శుక్ర వారం మరమ్మతులు ప్రారంభించారు. వానాకాలం సీజన్ కావడంతో తెలు గురాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యూరియాకు డిమాండ్ అధికంగా ఉంది. నిత్యం సాంకేతిక సమస్యలు: ఫ్యాక్టరీలో జూన్‌లో కూడా సాంకేతిక సమ స్యలతో 20 రోజులపాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. మరమ్మతుల అనంతరం ప్లాంట్ పునరుద్ధరించినా, రెండు రోజులకే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జూన్ చివరివారంలో ఉత్పత్తి ప్రారంభించారు. సాంకేతిక సమ స్యలతో ఆగస్టులో ఉత్పత్తి కొంత తగ్గింది. మళ్లీ సమస్య తలెత్తడంతో కర్మా గారాన్ని తాత్కాలికంగా వారం పాటు షట్‌డౌన్ చేసి మరమ్మతుల అనంతరం ఉత్పత్తి పునరుద్ధరిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కర్మాగారంలో గడిచిన 4 నెలల్లో 5,01,597.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. 2023– 24లో 12.70 లక్షల మెట్రిక్‌టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్‌లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
ఎర్రర్..టైమ్ అవుట్!
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ సతాయింపులు, సర్వర్ సమస్యలు గురుకుల కొలువుల అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి. వీటిని పరిష్కరించడంలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) విఫలమైంది. దీంతో వేలాది మంది దరఖాస్తుకు దూరం కావాల్సిన పరిస్థితి దాపురించింది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ (స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్స్) కొలువులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగిసింది. కానీ గడువు ముగిసే చివరి నిమిషంవరకు సాంకేతిక సమస్యలు వెంటాడాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. బోర్డు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని పరిష్కరించని అధికారులు, గడువు తేదీ పొడిగింపుపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరో రెండ్రోజుల్లో మ్యూజిక్ టీచర్, టీజీటీ దరఖాస్తు ప్రక్రియ సైతం ముగియనుంది. అప్పటివరకు ఇవే సమస్యలు పునరావృతమైతే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఎదురుకానుంది. తొలిరోజు నుంచీ ఇదే తీరు... టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తొలిరోజు నుంచే కొనసాగుతూ వచ్చాయి. రాష్ట్ర గురుకుల సొసైటీల పరిధిలోని 9,231 ఉద్యోగాల భర్తీకి గత నెల 5వ తేదీన బోర్డు ఏకకాలంలో 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెల 17వ తేదీ నుంచి గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించింది. నెల రోజుల పాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటీఆర్ నమోదు, ఆ తర్వాత దరఖాస్తుల సమర్పణకు ఉపక్రమించిన అభ్యర్థులకు గురుకుల వెబ్సైట్ చుక్కలు చూపించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్ సతాయింపుతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నెల 17వ తేదీతో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగియగా.. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. తాజాగా గురుకుల పాఠశాలల్లో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియగా.. సాంకేతిక సమస్యలు కొనసాగడంతో దీనికీ మెజారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొందరైతే ఫీజులు చెల్లించినప్పటికీ దరఖాస్తును సబ్మిట్ చేసే అవకాశం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. వివరాలు ఎంట్రీ చేశాక ఎర్రర్! గురుకుల వెబ్సైట్లో ప్రధానంగా రెండు దశల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఓటీఆర్ నమోదుకు సంబంధించి ఆధార్ వివరాలు ఎంట్రీ చేసిన వెంటనే వివరాల పేజీ తెరుచుకోవాల్సి ఉంటుంది. కానీ ఎర్రర్ అంటూ డిస్ప్లే అవుతుండటంతో తిరిగి వెబ్‌పేజీని తెరవాల్సివస్తోంది. ఇలా పలుమార్లు ప్రయతి్నస్తేనే ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయగలిగినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. కొందరైతే ఓటీఆర్ నమోదుకే రోజుల తరబడి ప్రయత్నించినట్లు తెలిపారు. ఓటీఆర్ నమోదు తర్వాత ఫీజు వివరాలను నమోదు చేయా ల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులో వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే సమయంలో సర్వర్ ఎర్రర్, రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటూ వస్తోంది. మెజారిటీ అభ్యర్థులకు ఇదే అనుభవం ఎదురవుతుండడంతో గురుకుల బోర్డు హెల్ప్ డెస్‌్కకు ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు అందిస్తున్నారు. కానీ హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదులు, వినతులతో ఉపయోగం లేదని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్కు చెందిన పీజీటీ అభ్యర్థి ఎస్.పాండురంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు గడువు పెంపు లేనట్టే..! కాలేజీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు గడువును గురుకుల బోర్డు పెంచలేదు. దీంతో పీజీటీ, ఆర్ట్ టీచర్ తదితర పోస్టులకు దరఖాస్తు విషయంలోనూ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు బోర్డు అధికారులు నిరాకరిస్తున్నారు. -
గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’! హెల్ప్‌డెస్క్ ఉంది.. కానీ, సాయం అందదు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల దరఖా స్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. నోటిఫికేషన్లు జారీచేసి నెలైనా సాంకేతిక సమస్యలు తీరకపోవ డంతో ఆభ్యర్థులు సతమతమవుతున్నారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భా వించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు గత నెల 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి. ‘దరఖాస్తు’కే చుక్కెదురు.. సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను తెరవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్‌నంబర్, ఈ–మెయిల్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం పట్టింది గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది. – డి.నర్సింగ్‌రావు, కొడంగల్, వికారాబాద్ జిల్లా ఓటీఆర్ నమోదు కాక దరఖాస్తుకు దూరమయ్యాను ఓటీఆర్ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి. – చీపురు ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా -
అధిక పెన్షన్ ఆప్షన్‌కు ఆఖరు మే 3.. కానీ పాస్‌బుక్ ఎర్రర్! ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్ గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తోంది. కానీ ఇప్పటికీ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలు తీరలేదు. అధిక పెన్షన్ అర్హత అవకాశాలు, అధిక పెన్షన్ లెక్కింపు సూత్రం తేలలేదు. కొత్త పాస్‌బుక్ డౌన్‌లోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ అంశాలను ఈపీఎఫ్ఓ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. చాలా మంది చందాదారులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు సైతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆప్షన్ ఇచ్చేందుకు మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది. పాస్‌బుక్.. ఎర్రర్.. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ సరికొత్త పాస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగి సర్వీసులో చేరిన తేదీ, నాటి బేసిక్, డీఏ ఆధారంగా పీఎఫ్ చెల్లింపులు, సర్విసు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పలు అంశాలను జోడిస్తూ ఈ పాస్‌బుక్‌ను అప్డేట్ చేసింది. దాదాపు నెలన్నర నుంచి కొత్త పాస్‌బుక్‌లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి.. కొత్త పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ చాలామంది చందాదారులకు లాగిన్ అయ్యాక పాస్‌బుక్ డౌన్లోడ్ అప్షన్ ఎంచుకుంటే వెబ్‌పేజీ ఎర్రర్ వస్తోంది. చాలాసార్లు ప్రయత్నించినా డౌన్లోడ్ కావడం లేదు. అధిక పెన్షన్‌లో కీలకమైంది ఈపీఎస్ (ఎంప్లాయి పెన్షన్ స్కీం) చెల్లింపునకు సంబంధించిన సమాచారమే. ఉద్యోగి పొందుతున్న పూర్తిస్థాయి వేతనానికి అనుగుణంగా ఈపీఎస్ చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ చెల్లింపుల్లో తేడాలుంటే అందుకు సంబంధిత కంపెనీ బాధ్యత వహించి చెల్లింపులు సర్దుబాటు చేయాలి. కొత్త పాస్‌బుక్‌లు డౌన్లోడ్ కాకపోవడంతో.. చాలామంది అధికపెన్షన్ దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు మరోవైపు పేరా 26(6) ఆప్షన్ ఫారం (ఉద్యోగంలో చేరినప్పుడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక పత్రం)ను ఇప్పుడు అధిక పెన్షన్ దరఖాస్తుకు తప్పకుండా జోడించాలని నిబంధన పెట్టారు. ఉద్యోగంలో చేరి చాలా ఏళ్లు గడిచిన వారికి ఈ ఫారం అందుబాటులో లేక దరఖాస్తు చేసుకోలేదు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలోనూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ఓ అధికారులకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తులకు మరింత సమయం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈపీఎఫ్ఓ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లోనే కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎస్‌ఏలోనే ఉన్నారు. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో కొచ్చి వెళ్లకుండా ఆగిపోయారు.. దీంతో అమిత్ షా ప్రయాణం వాయిదా పడింది. మరో విమానం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. కాగా హకీంపేటలోని ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు, సీఐఎస్ఎఫ్కి కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. -
జేమ్స్ వెబ్‌కు సాంకేతిక సమస్య
వాషింగ్టన్: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేటరీ అయిన జేమ్స్ వెబ్‌లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న జేమ్స్ వెబ్‌లో ఇలాంటి సమస్య రావడం ఇది రెండోసారి. అందులోని అత్యంత కీలకమైన నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్, స్లిట్‌లెస్ స్పెక్ట్రోగ్రాఫ్ పరికరాల్లో సమాచార అంతరాయం నెలకొంది. దాంతో సంబంధిత సాఫ్ట్వేర్ మొరాయించింది. అయితే హార్డ్‌వేర్‌లో ఎలాంటి సమస్యలూ తెలెత్తిన సూచనలు లేకపోవడం ఊరటనిచ్చే విషయమని నాసా పేర్కొంది. ఇన్ఫ్రారెడ్ ఇమేజర్ మాత్రం ప్రస్తుతానికి పని చేయడం లేదని ధ్రువీకరించింది. సమస్యను కనిపెట్టి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో తయారు చేసిన జేమ్స్ వెబ్ గత ఆగస్టులో కూడా ఇలాగే మొరాయించింది. దాని మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. బహుశా ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్దవైన అంతరిక్ష పదార్థాలు కెమెరా లెన్స్‌ను గుద్దుకోవడమే రెండోసార్లూ సమస్యకు కారణమైందని నాసా భావిస్తోంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్‌పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
వాట్సాప్ సేవలకు అంతరాయం
-
మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లను మరోసారి రీకాల్ చేసింది. ఏడబ్యుడీ వేరియంట్లలో ఈసారి రీకాల్ ప్రధాన భాగం భర్తీ కోసంవాహనాలను వెనక్కి తీసుకుంటోంది. నెలరోజుల్లోలనే వాహనాలను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ప్రొపెల్లర్ షాఫ్ట్ సమస్య కారణంగా మహీంద్ర ఎక్స్ యూవీ 700 కార్లను ఇటీవల రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. రియర్ వీల్ కాయిల్ స్ప్రింగ్‌ల ప్రస్తుత ప్లేస్మెంట్లో ఉన్న సమస్యల కారణంగా మహీంద్ర ఈ రీకాల్ చేసినట్లు తెలుస్తోంది. XUV700 AWDలోని వెనుక చక్రాల కాయిల్ స్ప్రింగ్‌లు ప్రతి స్ప్రింగ్‌లో 9 రౌండ్ కాయిల్స్ ఉండేలా మార్పులు చేసింది. అయితే 9 కి బదులుగా 8 రౌండ్ కాయిల్స్ ఉంటే, ఆ కార్లను కొత్త స్ప్రింగ్‌లతో భర్తీ చేసేందుకు సమీపంలోని సర్వీస్ సెంటర్లో సంప్రదించాలని మహీంద్ర కోరినట్టు తెలుస్తోంది. అయితే ప్రభావిత వాహనాల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. కాగా మహీంద్రా ఎక్స్‌యూవీ700 2021లో లాంచ్ అయిన పాపులన్ మోడల్. కొన్ని వేరియంట్ల నిరీక్షణ సమయం ఒక సంవత్సరం అంటే దీన్ని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 70వేల ఎక్స్‌యూవీ700 కార్ల డెలివరీలు పెండింగ్‌లో ఉన్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజుకర్ ఇటీవల వెల్లడించారు. 5 సీట్లు , 7 సీట్ల ఎంపికలతో లభిస్తున్న ఈ కారు ధర 13.18 లక్షలు,(ఎక్స్-షోరూమ్) ప్రారంభం. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
సాంకేతిక సాయం చేయండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ పరిస్థితులు లేదా విద్రోహ చర్యల వల్ల తలెత్తబోయే ప్రమాదాలను రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంలో నెలకొన్న సాంకేతిక సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న రైల్వే.. ఇప్పుడు ఈ విషయంలో స్టార్టప్ కంపెనీల సాయం కోరుతోంది. ఈ మేరకు రూ. 3 కోట్ల వరకు ఆర్థికసాయం, మేధోహక్కుల కల్పన వంటి అంశాలతో కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై దక్షిణమధ్య రైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు బృందంతో చర్చించింది. తొలుత 11 రకాల సమస్యలను స్టార్టప్‌ల ముందుంచింది. దీనికి టీ–హబ్ సానుకూలంగా స్పందించింది. 11 సమస్యలు ఇవే.. 1. విరిగిన పట్టాను గుర్తించే సాంకేతికత కావాలి. 2. పట్టాలపై ధ్వంసమయ్యేంత ఒత్తిడి ఉంటే ముందుగానే గుర్తించగలగాలి. 3. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంపు సమస్యను అధిగమించే ఏర్పాటు కావాలి. 4.రైల్వే ట్రాక్ తనిఖీలో కచ్చితత్వం ఉండే వ్యవస్థతోపాటు అన్ని లోపాలను సులభంగా గుర్తించే సాంకేతికత కావాలి. 5. అధిక బరువు వల్ల వ్యాగన్ల చక్రాలు దెబ్బతినే పరిస్థితి ఉంటే దాన్ని ముందే గుర్తించే వ్యవస్థ కావాలి. 6. ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌కు సంబంధించి 3 ఫేజ్ కరెంటును వాడే వాటిల్లో సమస్యలు ఆన్లైన్లో గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేయాలి. 7. గూడ్సు రైళ్లలో ఎక్కువ సరుకు పట్టేలా వ్యాగన్లను ఎలా మార్చాలి. 8.ట్రాక్‌ను మెరుగ్గా శుభ్రం చేసే సులభ విధానం కావాలి. 9. సిబ్బందికి పునఃశ్చరణ కోర్సులకు సంబంధించి యాప్‌లు రూపొందించాలి. 10.వంతెనల తనిఖీ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ ద్వారా జరిగేలా సాంకేతికత రూపొందించాలి. 11. ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం డిజిటల్ వ్యవస్థ కావాలి. -
ట్విటర్ వేదికగా ఫ్లిప్‌కార్ట్‌పై యూజర్ల ఆగ్రహం..?
నిన్న(జనవరి 3) మధ్యాహ్నం సమయంలో ప్రముఖ ఈ-కామర్స్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసిన చాలా మంది వినియోగదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టెక్నికల్ సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. కొందరు వినియోగదారులకు "దయచేసి మళ్లీ ప్రయత్నించండి" అనే పాప్-అప్ ఫ్లిప్‌కార్ట్ హోమ్ పేజీలో కనిపించింది. ఇంకా చాలా మంది వినియోగదారులు ఆర్డర్లకు సంబంధించిన లావాదేవీ చరిత్రను యాక్సెస్ చేసుకోలేకపోయారు. downdetector.in ప్రకారం, 59 శాతం మంది వెబ్సైట్ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటే, 24 శాతం మంది యాప్ వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సైట్ హీట్ మ్యాప్ ప్రకారం.. ఢిల్లీ, లక్నో, చండీగఢ్, జైపూర్, పాట్నా, కోల్ కతా, కటక్, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, మదురై, ముంబై, నాసిక్, అహ్మదాబాద్, సూరత్ నగరాలకు చెందిన వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌ను యాక్సెస్ చేసుకోవడంలో ఎక్కువగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ సమస్య గురుంచి ట్విటర్ వేదికగా నివేదిస్తూ చాలా మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2022 ఇదే మొదటి సర్వర్ డౌన్ సమస్య అని కార్తీక్ పటేల్ కామెంట్ పెడితే, మరొక యూజర్ Something Went Wrong! అని పోస్టు చేశాడు. ఇంకొక యూజర్ ఈ సమస్యకు సంబంధించిన వీడియో పోస్టు చేశాడు. It's first service down in 2022 , That's technical issue in @Flipkart , i hope that's not only in my phone, any one else suffering for this ?? #Flipkart #flipkartdown #FLIPKARTDOWN pic.twitter.com/1LEcJZE4b0 — Kartik Patel (@kartikpatel5797) January 3, 2022 Something Went Wrong! 🥲 *to wallmart #FlipkartDown pic.twitter.com/sstsWyRPYT — Oyprice (@OyPrice) September 14, 2021 @Flipkart I'm not able to search anything in Flipkart Shopping App, It always showing "Something went wrong, content not found". Also tried tapping on "retry button". pic.twitter.com/4I53FBM2bq — Debadri Saha (@debadri95) January 3, 2022 -
Telangana: ధరణి.. దారికెన్నడో?
ఈ రైతు పేరు గంగుల శ్రీనివాస్. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గుమ్ముడూరుకు చెందిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి (సర్వే నంబర్ 287/110లో ఒకటిన్నర ఎకరం, 287/133లో అర ఎకరం)ని అసైన్ చేసింది. దానికి పాస్‌బుక్‌లు కూడా ఉన్నాయి. మొదట్లో శ్రీనివాస్ తాత, తర్వాత తండ్రి, పినతండ్రి, ఇప్పుడు శ్రీనివాస్ ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవలి భూరికార్డుల ప్రక్షాళన తర్వాత శ్రీనివాస్‌కు కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. అధికారుల ఆదేశాల మేరకు ఈ సర్వే నంబర్లో భూమిని మరోసారి సర్వే చేశారు కూడా. పాస్‌బుక్ కోసం కలెక్టర్, తహసీల్దార్ల వద్దకు వెళితే.. సమస్య సీసీఎల్ఏలో పెండింగ్‌లో ఉందని, ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తేగానీ పరిష్కారం కాదని అంటున్నారు. ఈ చిత్రంలోని రైతు అనాసి శ్రీనివాస్‌కు పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లలోని సర్వే నంబర్ 68లో ఎకరం భూమి ఉంది. తాతల కాలం నుంచి కాస్తులో ఉండి ఆ భూమిని సాగుచేసుకుంటున్నారు. పాత పాస్‌బుక్ కూడా ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చే సమయంలో ఆ భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేశారు. భూమి విస్తీర్ణం కూడా తగ్గించారు. న్యాయం చేయాలంటూ తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. భూమిని తక్కువగా వేసి.. ఈ రైతు పేరు వీరబోయిన రాజం. ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామానికి చెందిన ఈయనకు నాంసానిపల్లి రెవెన్యూ పరిధిలోని 337, 515 సర్వే నంబర్లలో కొంత భూమి ఉంది. కొత్త పాస్‌బుక్కులు ఇచ్చేటప్పుడు.. 337లో 10 గుంటలు, 515లో 6 గుంటల భూమిని తక్కువగా నమోదు చేశారు. తన మొత్తం భూమి వివరాలను పాస్‌బుక్‌లో చేర్చాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ధరణిలో నమోదు కాలేదంటున్నరు మా అమ్మ పేరు మీద రెండెకరాల భూమి ఉంది. భూప్రక్షాళన కంటే ముందు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. కొత్త పాస్‌బుక్కులు ఇవ్వలేదు. ఇదేమంటే ధరణిలో నమోదు కాలేదని, మిస్సింగ్ ఖాతా కింద కంప్యూటరీకరణ ఆగిపోయిందని చెప్తున్నారు. మాకు రైతు బీమా, రైతుబంధు రావడం లేదు. అవసరానికి భూమిని అమ్ముకునే వీల్లేకుండా పోయింది. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం. – దెంది రమణారెడ్డి, పుల్జాల, నాగర్‌కర్నూల్ జిల్లా పట్టా భూమిని.. లావణి భూమి అంటున్నరు మా గ్రామంలోని 485 సర్వే నంబర్లో 7.05 ఎకరాల భూమిని కొని, నా భార్య యమున పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ధరణి రికార్డుల్లో భూమి నమోదు కాలేదు. ఇదేమని అడిగితే అది లావణి భూమి అంటున్నారు. పట్టా భూమి అని, కావాలంటే సర్వే చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చాను – కిష్టయ్య, ఇసన్నపల్లి గ్రామం, భిక్కనూరు మండలం, కామారెడ్డి జిల్లా .. ఇదీ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పడుతున్న బాధ. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా.. వ్యవసాయ భూ ముల లావాదేవీల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన ధరణి పోర్టల్ ఈ సమస్యలకు కారణమవుతోంది. పోర్టల్‌లో.. తాతల కాలం నుంచీ అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల వివరాలు కూడా మారిపోవడం, వేరేవారి పేర్ల మీద నమోదుకావడం, అసలు జాడే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతులు ముప్పుతిప్పలు పడు తున్నారు. అత్యవసరానికి భూమిని అమ్ముకోవాలనుకున్నా.. నాలుగు డబ్బులు వెనకేసి కొంత భూమి కొనుక్కో వాలనుకున్నా.. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమ స్యలు, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) వర్గాల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ధరణి’ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వడం, అది సరిగా పనిచేయకపోవడం, తప్పు ఎక్కడ ఉందో కూడా గుర్తించలేని దుస్థితి తలెత్తడం గమనార్హం. కలెక్టర్లకు ఫిర్యాదుల్లో ‘ధరణి’పైనే అధికం.. ధరణిలో నమోదైన తప్పులను సవరించాలంటూ రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మీసేవ కేం ద్రాల్లో దరఖాస్తు సమర్పించడం మొదలు.. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణల దాకా నానా ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్లకు ప్రతివారం గ్రీవెన్స్లలో వచ్చే ఫిర్యాదుల్లో.. ధరణి ఫిర్యాదులే 65–70 శాతం వరకు ఉంటున్న పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్ల లాగిన్లలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నిచోట్ల 2 నెలల నుంచి పది నెలల వరకు ఫైళ్లు ఆగిపోయాయని అధికారవర్గాలే చెప్తున్నాయి. తిరిగి తిరిగి రైతుల కాళ్లు అరుగుతున్నాయే తప్ప.. ధరణి సమస్యలు పరిష్కారం కావడం లేదని, తమ వద్దకు వచ్చే రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని తహసీల్దార్లు అంటున్నారు. కీలక సమస్యలను గుర్తించినా.. ధరణి సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించిన ప్రభుత్వం.. 18 కీలక సమస్యలను రెండు నెలల క్రితమే గుర్తించింది. భూముల విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూముల వర్గీకరణలో తప్పులు, భూమి స్వభావం (పట్టా/అసైన్డ్) రెవెన్యూ రికార్డులకు, ధరణి వివరాలకు సరిపోలకపోవడం, భూమి ఎలా సంక్రమించిందనే వివరాల్లో తప్పులు, పట్టాదారుల పేర్లలో తప్పులు, సర్వే నంబర్ల మిస్సింగ్, ఇనాం భూముల విషయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి ఆప్షన్ లేకపోవడం, పట్టాభూములనూ నిషేధిత జాబితాలో చేర్చడం, సర్వే నంబర్ల వారీగా ఈసీలు చూసుకునే వీలు లేకపోవడం, ఈసీతోపాటు మార్కెట్ విలువ సర్టిఫికెట్లు ఇచ్చే ఆప్షన్ లేకపోవడం, డబుల్ ఖాతాల విలీనం వంటివి ఇబ్బందికరంగా మారాయని తేల్చింది. కానీ వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ట్రెసా) బృందం.. సదరు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కలెక్టర్లకు పనిభారంతో.. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కారించే అధికారాలను కలెక్టర్లకే అప్పగించారు. ధరణి ద్వారా ఏ సమస్య పరిష్కారానికైనా మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులన్నీ కలెక్టర్ లాగిన్‌కు చేరతాయి. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్‌కు పంపుతారు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి గడువు లేకపోవడంతో.. కలెక్టర్లు 15–20 రోజులకోసారి తహసీల్దార్లకు పంపుతున్నారు. తహసీల్దార్లు వాటిని పరిశీలించి ఆన్‌లైన్‌తోపాటు మ్యాన్యువల్ రికార్డుల ను తయారు చేసి ఆర్డీవోలకు పంపాలి. సదరు ఆన్లైన్, మ్యాన్యువల్ రికార్డుతోపాటు ఆర్డీవో నోట్‌ఫైల్ తయారు చేసి మళ్లీ ఆన్లైన్ దరఖాస్తును కలెక్టర్ లాగిన్‌కు పంపాలి. మ్యాన్యువల్ రికార్డును డీఆర్వో ఆఫీస్‌లో సమర్పించాలి. తహసీల్దార్, ఆర్డీవోలు చేసే సిఫార్సును బట్టి.. సదరు దరఖాస్తును ఆమోదించడానికి, తిరస్కరించడానికి కలెక్టర్‌కు అధికారం ఉంటుంది. ఇదంతా జరగడానికి చాలా కాలం పడుతోందని రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ -
నిర్వహణలో లోపాలతోనే ఫేస్బుక్ డౌన్
లండన్: ఫేస్బుక్ దానికి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు కొన్ని గంటలు పని చెయ్యకపోవడానికి నిర్వహణ సమస్యలే కారణమని ఆ సంస్థ వెల్లడించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ పని చెయ్యకపోవడానికి కారణం సంస్థలో జరిగే తప్పిదాలేనని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంతోష్ జనార్ధన్ తన బ్లాగ్ స్పాట్లో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌కి చెందిన కంప్యూటర్లు, రౌటర్లు, డేటా సెంటర్లు, కనెక్టింగ్ కేబుల్స్‌ని ఇంజనీర్లు ప్రతి నిత్యం పర్యవేక్షిస్తుంటారని ఆ సమయంలో జరిగిన తప్పిదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల సేపు సేవలు నిలిచిపోయాయని వెల్లడించారు. ‘‘ప్రతీ రోజూ ఇంజనీర్లు చేసే నిర్వహణలో భాగంగానే ఒక కమాండ్ ఇచ్చారు. అయితే ఎవరూ ఊహిం చని విధంగా దాని వల్ల నెట్వర్క్ మొత్తం డౌన్ అయింది’’ అని ఆయన తెలిపారు. -
ఐటీ రిటర్నుల దాఖలుకు మరింత వ్యవధి
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును (వ్యక్తులు) డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉంది. వాస్తవానికి పన్ను రిటర్నుల దాఖలుకు జూలై 31 చివరి తేదీ. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్కారు గత ఏడాదికి మాదిరే.. ఈ ఏడాదీ అదనపు వ్యవధిని ఇస్తూ నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆదాయపన్ను నూతన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎన్నో సాంకేతిక సమస్యలు నెలకొనడం కూడా ఈ ఏడాది గడువు పెంచేందుకు గల కారణాల్లో ఒకటి. ‘అసెస్మెంట్ సంవత్సరం 2021–22 సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు విషయంలో ఎన్నో ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు, భాగస్వాములు మా దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గడువు తేదీలను పొడిగిస్తూ నిర్ణయించింది’ అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. కంపెనీలు ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువును నవంబర్ 30 నుంచి 2022 ఫిబ్రవరి 15కు సీబీడీటీ పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సరి్టఫికెట్లకు జనవరి 15, జనవరి 31 వరకు గడువు ఇచి్చంది. ఆలస్యపు రిటర్నుల దాఖలుకు గడువును వచ్చే మార్చి వరకు ఇచి్చంది. -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్‌లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్‌పేయర్లు పోర్టల్‌లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్‌లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
ఇన్ఫీకి సెప్టెంబర్ 15 డెడ్‌లైన్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయ పన్ను) పోర్టల్‌లో లోపాలన్నింటినీ సెప్టెంబర్ 15లోగా సరిదిద్దాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెడ్‌లైన్ విధించారు. పోర్టల్ సమస్యలపై ఇన్ఫీ సీఈవో సలిల్ పరేఖ్, ఆయన బృందంతో మంత్రి సోమవారం భేటీ అయ్యారు. వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి రెండున్నర నెలలు అవుతున్నా సాంకేతిక సమస్యలు వెన్నాడుతుండటంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలను పరిష్కరించలేకపోతుండటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పోర్టల్ విషయంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను సెప్టెంబర్ 15లోగా పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు‘ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై 750 మంది పైగా సిబ్బంది పనిచేస్తున్నారని, సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నిర్మలా సీతారామన్‌కు పరేఖ్ వివరించారు. ఈ అంశంపై ఇన్ఫీ అధికారులతో నిర్మలా సీతారామన్ సమావేశం కావడం ఇది రెండోసారి. గతంలో జూన్ 22న పరేఖ్, ఇన్ఫీ సీవోవో ప్రవీణ్ రావులతో ఆమె భేటీ అయ్యారు. రిటర్నుల ప్రాసెసింగ్ వ్యవధిని 63 రోజుల నుంచి ఒక్క రోజుకి తగ్గించేందుకు, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త పోర్టల్ రూపొందించే కాంట్రాక్టును 2019లో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దక్కించుకుంది. ఈ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచ్చింది. అయితే, అప్పట్నుంచీ సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా రెండు రోజులపాటు నిర్వహణ పనుల కోసమంటూ సైట్‌ను ఇన్ఫీ నిలిపివేసింది. -
కొత్త ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు.
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘ కాలం పట్టేస్తుండటంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్‌ను ప్రారంభించినప్పట్నుంచీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. పన్ను చెల్లింపుదారులు తాము గతంలో ఈ–ఫైలింగ్ చేసిన రిటర్నులను చూసుకోవడానికి కుదరడం లేదని, ఇంకా చాలామటుకు ఫీచర్లకు ’కమింగ్ సూన్ (త్వరలో అందుబాటులోకి వస్తాయి)’ అంటూ పోర్టల్ చూపిస్తోందని వారు పేర్కొన్నారు. లాగిన్ మొదలుకుని ఈ–ప్రొసీడింగ్స్ వంటి కీలకమైన ఫీచర్ల దాకా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొనాల్సి వస్తోందని నాంగియా అండ్ కో పార్ట్నర్ శైలేష్ కుమార్ చెప్పారు. దీంతో నిబంధనల ఉల్లంఘన నోటీసులు అందుకుంటున్న వారు వివరణ ఇచ్చేందుకు తగినంత వ్యవధి దొరక్క ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ‘పన్ను చెల్లింపుదారులు తమ నియంత్రణలో లేని అంశాల కారణంగా పెనాల్టీ పరిణామాలను ఎదుర్కొనాల్సి వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఫారం 15సీఏ/సీబీ లేకపోవడం వల్ల విదేశాలకు నిధులు పంపించే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు‘ అని కుమార్ తెలిపారు. మరోవైపు, ఇటు ట్యాక్స్‌పేయర్లు అటు ట్యాక్స్ నిపుణులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో కొత్త పోర్టల్‌ను సత్వరం సరిచేయాల్సిన అవసరం ఉందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. కొత్త పోర్టల్‌పై అంతా భారీ అంచనాలు పెట్టుకోగా.. చాలా మందకొడిగా పనిచేస్తోందని, యూజ ర్లు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి తెలిపారు. మ్యాన్యువల్‌గా రెమిటెన్స్ ఫారంల ఫైలింగ్.. పోర్టల్‌లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మ్యాన్యువల్‌గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. విదేశీ రెమిటెన్సులకు అవసరమైన ఫారం 15సీఏ/సీబీని జూన్ 30 దాకా బ్యాంకులకు మాన్యువల్‌గా సమర్పించవచ్చని తెలిపింది. వీటిని తర్వాత ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని ఐటీ విభాగం వివరించింది. -
చుక్ చుక్ రైలు.. 35 కి.మీ. వెనక్కి
నైనిటాల్ : ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్‌కి వెళుతున్న పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ హఠాత్తుగా వెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. డ్రైవర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగకుండా 35 కి.మీ. వెనక్కి ప్రయాణించింది. చివరకు ఖాతిమా స్టేషన్లో ఆగడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ నుంచి బుధవారం బయల్దేరిన రైలు తానక్‌పూర్ చేరుతుందనగా రైల్వే ట్రాక్‌పైనున్న జంతువుని ఢీకొట్టింది. దీంతో రైలు నియంత్రణ కోల్పోవడమే కాకుండా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెనక్కి మళ్లింది. డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే అవి ఫెయిల్ అయ్యాయి. రైల్వే బోగీల మధ్యనున్న ప్రెజర్ పైపులు లీక్ కావడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యాయని భావిస్తున్నారు. తానక్‌పూర్ కొండల మధ్య ఉండడంతో రైలు వెనక్కి పరుగులు తీసిందని చెప్పారు. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్‌ను డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్‌లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్‌లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్‌లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
కరోనా టీకా: యాప్‌లో కనిపించని పేర్లు..!
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా కార్యక్రమం ఎంత సజావుగా నిర్వహించాలని భావిస్తున్నా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కోవిన్ (కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్) యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని భావించారు. అయితే ఆ యాప్ కాస్తా మొరాయిస్తుండటంతో కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. లబ్ధిదారులు నిర్దేశిత టీకా కేంద్రానికి వెళ్లి చూస్తే, యాప్‌లో కొందరివి పేర్లు కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మెసేజ్‌లు వచ్చిన కేంద్రంలో కాకుండా ఇతర కేంద్రాల్లో కొందరి పేర్లు ఉంటున్నాయి. అంతేకాదు ఇంకొందరివైతే ఎక్కడా పేర్లు కనిపించట్లేదు. మరికొందరివి వేరే జిల్లాల్లో ఉంటున్నాయి. అయితే ఏ కేంద్రంలో లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో గుర్తించే అవకాశం ఈ యాప్‌లో లేకపోవడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. లబ్ధిదారులకు మెసేజ్‌లు పంపిస్తే కొందరికి వారి మొబైల్ ఫోన్లకు వెళ్లట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిపేర్లు తప్పు రావడం, అడ్రస్‌లు వేరుగా ఉండటం, గుర్తింపు కార్డులో ఉన్న వివరాలకు, యాప్ లోని వివరాలకు పొంతన కుదరకపోవడం, వయసు తప్పుగా ఉండటం, హోదాలు మారిపోతుండటం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది. కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. డ్రై రన్ సందర్భంగానే ఈ యాప్‌లో సమస్యలున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నెల 16 నుంచి యాప్‌తో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో 50 శాతం కార్యక్రమం యాప్‌తో నడుస్తుంటే, మిగిలిన 50 శాతం మాన్యువల్ పద్ధతిలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పద్ధతి వద్దని, యాప్‌నే వినియోగించాలని ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేయడంతో కింది స్థాయిలో వ్యాక్సిన్ వేసే సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారుల సహనానికి పరీక్ష.. టీకాలు పక్కదారి పట్టకుండా, అర్హులైన లబ్ధిదారులు అందరికీ చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకే కోవిన్ యాప్ తయారు చేశారు. లబ్ధిదారులు టీకా కేంద్రానికి వచ్చాక వారి ఆధారాలను ధ్రువీకరించాలి. దీన్ని కోవిన్ యాప్‌లోని డేటాతో సరిపోల్చాలి. ఏమైనా దుష్ప్రభావాలు వచ్చినా, వ్యాక్సిన్లు మిగిలినా, వృథా అయినా ఆ వివరాలను కూడా తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాలి. లబ్ధిదారుడికి ఏ కేంద్రంలో టీకా వేస్తారో కూడా కోవిన్ యాప్ ద్వారా వారి ఫోన్లకు మెసేజ్‌లు వెళ్తాయి. ఎలక్ట్రానిక్ టీకా ధ్రువీకరణ పత్రాలు కూడా యాప్ ద్వారానే లబ్ధిదారులకు ఇవ్వాలి. యాప్ ద్వారా రోజుకు దేశవ్యాప్తంగా 50 లక్షల మంది లబ్ధిదారులకు టీకా వేసేలా తీర్చిదిద్దారని చెబుతున్నా.. ఆచరణలో అది కన్పించట్లేదన్న విమర్శలు ఉన్నాయి. 2జీ ఇంటర్నెట్ సామర్థ్యంలోనూ పని చేయగలదని చెబుతున్నా, 4జీకి కూడా స్పందించట్లేదని పేర్కొంటున్నారు. ఇలా యాప్ సక్రమంగా పనిచేయక పోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వెనుదిరుగుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యల వల్ల టీకా కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సరి చూసుకునే క్రమంలో తలెత్తే ఇలాంటి సమస్యలతో మరింత ఆలస్యం అవుతోంది. గంటలకొద్దీ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు వైద్య సిబ్బంది అసహనంతో వెనుదిరుగుతున్నారు. టీకా వేసేది, తీసుకునేది వైద్య సిబ్బందే కాబట్టి కొన్నిచోట్ల మాన్యువల్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు. ఆ జిల్లాలో 300 మంది పేర్లు గల్లంతు.. మహబూబ్‌నగర్ జిల్లాలో టీకా కోసం మొదట దరఖాస్తు చేసిన వారిలో 300 మందికి పైగా పేర్లు యాప్‌లో కన్పించట్లేదు. పేర్లు లేని వారికి ఆఫ్‌లైన్‌లో టీకాలు వేస్తున్నారు. జడ్చర్లలో కోవిన్ యాప్ ఓపెన్ కాకపోవడంతో సమస్యలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదు చేసే క్రమంలో ఉద్యోగి కోడ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు నంబర్లకు సంబంధించి కొన్ని తప్పులు దొర్లాయి. మెదక్ జిల్లాలో సర్వర్‌డౌన్ సమస్యతో యాప్ ఓపెన్ కావట్లేదు.