కలెక్టరమ్మా పింఛన్!
మూడు నెలల నుంచి అరిగోస పడుతున్నం..
అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పేరిట జాప్యం
లక్షలాది మంది వికలాంగులం, వృద్ధులం, వితంతువులం, ఎదురుచూస్తున్నం..
పింఛన్ సమస్య గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధికంగా ఉంది. పట్టణవాసులు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోవడం.. అవి మున్సిపాలిటీకి పోవడం మినహా పెద్దగా ఫలితం ఉండడం లేదు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తే సమస్యను
అధిగమించే అవకాశం ఉంది. ఇదే విధంగా వికలాంగుల కోసం సదరం క్యాంపులు నిర్వహిస్తే సమస్యలను అధిగమించవచ్చు..
- హన్మకొండ అర్బన్
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఆసరా పింఛన్ల ఎంపిక ప్రక్రియ మొదలై మూ డు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు డబ్బుల కో సం ఎదురుచూస్తున్నారు. పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సమగ్ర సర్వే సమయం లో అధికారులు చేసిన తప్పులు, డా టా ఎంట్రీలో అవకతవకలు పేదల పా లిట శాపంగా మారారుు. ఈ కారణాలతో కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నా.. ఎ న్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అనర్హులంటూ తిరస్కరణకు గురవుతున్నారుు. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ల విషయంలో ఆధార్‌కార్డులులేవని, వయసు తక్కువగా ఉం దని, రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ప్రధానంగా.. రెవెన్యూ అధికారుల నుంచి వయస్సు ధ్రువీకరణ పత్రం పొందడం అంతా సులువు కాదు. విచారణ అధికారులు విజ్ఞతతో ఆలోచించి పింఛన్ మంజూరు చేయూలని ఉన్నతాధికారులు చెపుతున్నా ఆ భారం మోసేం దుకు వారు సిద్ధంగా లేరు. దీంతో సాంకేతిక సమస్యలు, ఇతర చిన్నచిన్న పొరపాట్ల వల్ల పింఛన్ అందడం అగమ్య గోచరంగా మారింది. కలెక్టర్ కరుణ అరుునా దయ ఉంచి పింఛన్ ఇప్పించాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కోరుతున్నారు.
జిల్లాలో 3.50 లక్షలు దాటిన పింఛన్లు
జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం సుమారు 5.20 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 3,56,713 మందిని అర్హులుగా గుర్తించగా.. పింఛన్ మంజూరు అవుతోంది. వీరికోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.39,65,10,500 విడుదల చేస్తోంది. పిం ఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అధికారులు చెబుతున్నా.. గతంలో రెగ్యులర్‌గా పింఛన్ పొందుతున్నవారికీ ఇప్పుడు పింఛన్ ఆపేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల డబ్బులు ఒకేసారి ఇప్పించాలని పింఛన్ బాధితులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహించడం లేదు. ఫలితంగా వికలాంగులు వికలాంగ ధ్రువీకరణపత్రాలు పొందలేక పోతున్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించాలని కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు వస్తున్నారుు. ఈ విషయంలో డీఆర్‌డీఏ అధికారులు నిర్ణయం తీసుకోవాలి. రోజూ పింఛన్‌రాని వారు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అధికారులను కలిసి వినతులు సమర్పిస్తున్నారు.
నేను ఏం పాపం చేశాను..
నా పేరు అంబాల కిరణ్. మాది వరంగల్‌లోని ఎల్లంబజార్. నేను ఏం పాపం చేశాను. ఆ దేవుడు నన్ను ఇట్లా పుట్టిం చాడు. ఈ స్థితిలో ఏం పని చేయను. వంద శాతం వైకల్యం అంటూ వైద్యులు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో నెలనెల పింఛన్ వచ్చేది. మూడు నెలలుగా రావడం లేదు. పింఛన్ నా పేరిట మంజూరైందట. కానీ ఆధార్ కార్డు నంబరు మా అయ్య కార్డు నంబరు పడిందట. మూడు నెలలుగా రోజూగా మునిసిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా. వరుసగా మూడు నెలలు డబ్బులు తీసుకోకపోతే పింఛన్ పోతదట. అధికారులు పింఛన్ ఇవ్వాలి. - వరంగల్ అర్బన్