To apply
-
మళ్లీ ఎందుకొచ్చారు?
జన్మభూమిలో నిలదీస్తున్న జనం మొక్కుబడిగా నిర్వహిస్తున్న అధికార గణం విశాఖపట్నం: ’గత మూడు జన్మ భూమి సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం లేదు.. జన్మభూమి సభలు పెట్టినప్పుడల్లా కొత్తగా రేషన్ కార్డులిస్తాం, పెన్షన్లు మంజూరు చేస్తాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం.. అంటూ ఆశలు రేపారు. రెండున్నరేళ్ల నుంచి ఇదే పరిస్థితి. మొక్కుబడిగా ఎందుకు జన్మభూమి కార్యక్ర మాన్ని నిర్వహిస్తారు? ఎన్నాళ్లిలా మోసం చేస్తారు?’ అంటూ రెండో రోజు జన్మభూమి కార్యక్రమంలో పలుచోట్ల ప్రజ లు అధికారులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను నిలదీశారు. వీరికి సమాధానం చెప్పలేక వారు సతమతమయ్యారు. రెండో రోజు జన్మభూమి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించారు. అడ్డగింత.. నిలదీత జిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. పెదబయలులో జన్మభూమి సభ రసాభాస అయింది. గత జన్మభూమిలో దరఖాస్తులకు మోక్షం కల్పించకుండా ఇప్పుడెందుకొచ్చారని నిలదీశారు. ప్రసంగాలే తప్ప పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టులో జరిగిన సభలో గిరిజనులు అధికారులను సమస్యలపై నిలదీయడంలో మధ్యలోనే జన్మభూమి సభను ముగించుకుని వెళ్లిపోయారు. బుచ్చెయ్యపేట మండలం గంటికొర్లాం జన్మభూమి సభను జనం అడ్డుకున్నారు. ఏ సమస్యలూ పరిష్కరించలేదని, మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులను, అధికార పార్టీని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. చీడికాడ మండలం చుక్కపల్లి, కొత్తపల్లిల్లో ఇళ్లు మంజూరు చేయలేదని, మాకు ప్రయోజనం చేకూర్చనప్పుడు ఈ సభలెందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సభకు జనం పలుచగా హాజరయ్యారు. హుకుంపేట మండలం మఠం, కొత్తూరు గ్రామాల మహిళలు మంగళవారం జన్మభూమి సదస్సును అడ్డుకున్నారు. ఐటీడీఏ పీవోకు స్వయంగా రెండుసార్లు వినతులు ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారం కాలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. -
పట్టా వెనక పిట్ట కథ
ఇప్పటికే పట్టా ఉన్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరుతో తిరిగి మంజూరు రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కుకల్పిస్తామంటూ గొప్పలు అభ్యంతరాల పేరుతో పేదల దరఖాస్తుల తిరస్కరణ అధికార పార్టీ రాజకీయ ప్రచారమే అసలు రహస్యం గాజువాక : ఏ మాట వెనుక ఏ ప్రయోజనం దాగి ఉంటుందో తెలియనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు.. 20 శాతాబ్దపు మేధావిగా గుర్తింపు పొందిన కార్ల్ మార్కస్ చెప్పిన విషయమిది.. వంద చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలంలోని ఇళ్లను ఉచితంగాను, ఆపై విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను కొంత నగదుతోను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విషయం కార్ల్ మార్కస్ మాటలకు అతికినట్టు సరిపోతుంది. ఇప్పటికే పట్టాలున్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ పట్టాలు జారీ చేస్తూ.. అదేంటని ప్రశ్నిస్తే పట్టాకు పిట్టకథలు అల్లుతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం ఇస్తున్న పట్టాకు రెండేళ్ల తరువాత అమ్ముకొనే హక్కు వస్తుందట.. ఇప్పటివరకు పట్టాలు లేని ఎన్ని ఇళ్లను క్రబద్ధీకరించారన్న లెక్కను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. అసలు కథ ఏమిటంటే.. ప్రభుత్వం మంజూరు చేసిన క్రమబద్ధీకరణ పట్టాల లబ్ధిదారులకు గతంలోనే పట్టాలు, ఎల్పీసీలు ఉన్నారుు. గాజువాక వంటి హౌస్ కమిటీ పరిధిలో ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో నంబర్ 44ద్వారా 2009లోనే క్రమబద్ధీకరించారు. 2004 మందికి ఉచితంగా పట్టాలు కూడా జారీ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ పట్టాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేయ డానికి కారణమేంటన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నారుు. ప్రభుత్వపరంగా ఏ నియోజకవర్గంలోను అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోరుుంది. దీంతో సొంత పార్టీలో సైతం నిరసన గళం పెరుగుతుండటంతో ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు జీవో 296 ప్రకారం మళ్లీ క్రమబద్ధీకరణ చేయాలంటూ కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈ పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పిస్తున్నామంటూ కహానీలు వినిపిస్తున్నారు. ప్రభుతానికి చిత్తశుద్ధి ఉంటే పాత పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పించలేదా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నారుు. ఇప్పటికే పట్టాలున్న అనేకమందిని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి మరీ కొత్తగా దరఖాస్తు చేరుుంచారు. పేదలకు న్యాయమేదీ.. ఈ జీవోల ప్రకారం పేదలకు సరైన న్యాయం జరగట్లేదని తెలుస్తోంది. గాజువాక తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అండిబోరుున అన్నపూర్ణ ఆవేదన వింటే ఈ విషయం స్పష్టమవుతుంది. స్థానిక గోపాలరెడ్డినగర్‌కు చెందిన అన్నపూర్ణ ఒక లారీ డ్రైవర్ భార్య. 60 గజాల ప్రభుత్వ స్థలంలో పదేళ్ల క్రితం పాక వేసుకొని భర్త, పిల్లలతో నివాసముంటోంది. పాక స్థలానికి పట్టా ఇవ్వాలని, కరెంటు మీటరు మంజూరు చేయాలని, ఇంటికి పన్ను వేయాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. న్యాయం జరగలేదు. రెండేళ్లుగా కాలనీలోని టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. డబ్బులు ఇస్తే తప్ప పని చేయలేమని వారు స్పష్టం చేయడంతో ఏమీ చేయలేకపోరుుంది. నగరంలో ఇలాంటి అన్నపూర్ణలు అనేక మంది ఉన్నారు. వారి గోడును చంద్రబాబు జీవోలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సగానికిపైగా దరఖాస్తుల తిరస్కరణ క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తుల్లో సగానికి పైగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. నగర వ్యాప్తంగా మొత్తం 60వేలకు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 32 వేల దరఖాస్తులకు మాత్రమే పట్టాలు మంజూరయ్యారుు. వాటిలో కూడా నో మ్యాన్ ల్యాండ్, గెడ్డ పోరంబోకు వంటి రకరకాల కారణాలను చూపించి అధికారులు పట్టాలు జారీ చేయడం లేదు. గాజువాక నియోజకవర్గంలోని రెండు మండలాల నుంచి 19,300 మంది దరఖాస్తు చేయగా, వారిలో కేవలం 6,500 మందికే పట్టాలు ఇస్తున్నారు. మిగిలినవాటిని చెరువులు, గెడ్డలు, రహదారుల భూములు వంటి కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఈ కారణాలతోనే గతంలో కూడా పట్టాలు పొందలేని పేదలు ఇప్పుడు కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వలేం.. అభ్యంతరకరమైన స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించలేం. ప్రస్తుతం ప్రకటించిన 32వేల పట్టాలతో పాటు 118 జీవో ప్రకారం మరో నాలుగు వేల పట్టాలను ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. వీటి కోసం మళ్లీ ఎవరూ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మాకు అందిన దరఖాస్తుల నుంచే ఈ కొత్త పట్టాలు అందజేస్తాం. - వెంకటేశ్వర్లు, విశాఖ ఆర్డీవో -
ఇక ఇంటికే సర్టిఫికెట్లు
‘మీ సేవ’లకు షాక్.. అక్రమాలకు బ్రేక్ త్వరలోనే అందుబాటులోకి ‘మీసేవ’ యాప్ మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.. పోస్టులో ఇంటికే రానున్న ధ్రువీకరణ పత్రాలు పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ నుంచే ప్రారంభం సర్టిఫికెట్ల కోసం ఇక మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. నిర్ణీత వ్యవధిలో సర్టిఫికెట్లు మన ఇంటికే చేరతారుు. ఎవరికీ అదనంగా చెల్లింపులు చేయకుండా ధ్రువీకరణ పత్రాలు చేతికందుతారుు. మరీ అత్యవసరమైతే అదనపు రుసుము చెల్లించి ఒక రోజు వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే ‘మీసేవ యాప్’ను అందుబాటులోకి తేనుంది. మన జిల్లాలోనే ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది. ఇందూరు: మీ సేవ కేంద్రాలకు కాలం చెల్లనుంది.. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో వారు ఉపాధి పొందుతున్న కేంద్రాలకే దెబ్బ తెచ్చింది.. మీ సేవ కేంద్రాల్లో బోగస్ సర్టిఫికెట్లు సృష్టించడం, క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తెప్పించి దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రభుత్వం ముకుతాడు వేయనుంది. మీ సేవ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలు స్వతహాగా తమ మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకునేలా ’మీ-సేవ’ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు మన జిల్లా నుంచే ఓ డిప్యూటీ తహసీల్దార్, మరి కొందరు ఉద్యోగులు కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని పనితీరును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు మొన్నటివరకు రెవెన్యూ కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్‌కు వివరించగా, వారు ఓకే చెప్పారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం 230 మీ సేవ కేంద్రాలున్నారుు. వీటి ద్వారా కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు 26 రెవెన్యూ సేవలు పొందే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బోగస్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. సరైన సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తులు చేరుుంచడం, ఎవరి పేరుపై ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇవ్వడం, దరఖాస్తులు చేసుకున్న క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేరుుస్తున్నారు. ఇలా చేరుుంచినందుకు దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారుల దృష్టికి రాగా, అధికారులే మీ సేవ కేంద్రాల ఆపరేటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల మీ సేవ కేంద్రాల ఆపరేటర్లతో జిల్లా కేంద్రంలో సమావేశం జరిపిన ఓ ఉద్యోగి ’మీరు ఏం చేసినా బయటకు తెలియకుండా చేసుకోండి’ అని దర్జాగా చెప్పడం గమనార్హం. సదరు ఉద్యోగికి మీ సేవ కేంద్రాల నుంచి మాముళ్లు అందుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ చెక్ పెట్టేందుకే యాప్.. మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మీ సేవ యాప్ ఏర్పాటుకు పూనుకుంది. జిల్లాకు చెందిన, ఈ- సేవా, మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారి రమణ్రెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మీ సేవ యాప్‌కు శ్రీకారం చుట్టారు. అది పని చేసే విధానాలపై మంత్రి కేటీఆర్‌కు వివరించగా, బాగుందని ప్రశంసించారు. దీనిని రాష్ట్రమంతటా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మీ సేవ యాప్‌కు సంబంధించిన మరికొన్ని సాప్ట్వేర్ అప్లికేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండు, మూడు నెలల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా నిజామాబాద్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ ప్రారంభమైతే మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ప్రజలు మీ సేవ కేంద్రాలకు కాకుండా వారి మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ‘డిజిటల్ కీ’కి మంగళం! ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటే, వీఆర్వో నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలన చేసి, తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అరుుతే, మీ సేవ యాప్‌తో ఈ విధానానికి ఫుల్స్టాప్ పడనుంది. మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోగానే సంబంధింత వీఆర్వో లాగిన్‌లో పరిశీలన చేస్తాడు. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్‌లో పరిశీలన జరిపి, ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే పోస్టులో రానుంది. ఎప్పడు కావాలంటే అప్పుడు కాకుండా నిర్ణీత కాల పరిమితిలోనే అందుతుంది. ఒకవేళ అత్యవసరం అరుుతే రుసుము ఎక్కువ చెల్లిస్తే ఒక్క రోజులో అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అరుుతే సర్టిఫికెట్లను పరిశీలన చేయడానికి ప్రభుత్వం వీఆర్వో, తహసీల్దార్లకు ట్యాబ్‌లను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచింది. అరుుతే సర్టిఫికెట్లు ముద్రించి ఇంటికే పోస్టులో పంపడానికి ప్రత్యేక ప్రింటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాలకు చెందిన డిజిటల్ కీని ఉపయోగించి, మీసేవ ఆపరేటర్లు అడ్డగోలుగా సర్టిపికెట్లు సృష్టిస్తున్నారు. వారి ఆటలకు చెక్ పెట్టేలా డిజిటల్ కీ కాకుండా, వేలిముద్రల కీ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండు నెలల్లో అమలు కావచ్చు.. మీ సేవ యాప్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు నెలల్లో ఇది అమలు కావచ్చు. నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా నుంచే మీ సేవ యాప్‌ను రూపొందించి ఐటీ మంత్రి కేటీఆర్‌కు వివరించాం. ఇది చాలా బాగా పని చేస్తుందని, ప్రజలకు సులభంగా ఉంటుందని ఆయన అన్నారు. యాప్‌తో మీ సేవ ఆపరేటర్ల ఆటలకు ముకుతాడు పడనుంది. - రమణ్‌రెడ్డి, మీ సేవ కేంద్రాల ఏవో -
ఎస్సై పోస్టులకు 2 లక్షల దరఖాస్తులు
♦ ముగిసిన దరఖాస్తు గడువు, ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష ♦ జంబ్లింగ్ పద్ధతిలో హాల్‌టికెట్ నంబర్లు ♦ ఎస్సై కన్నా కానిస్టేబుల్ పోస్టులకే అభ్యర్థుల మొగ్గు ♦ కానిస్టేబుల్ కొలువులకు ఏకంగా 5.36 లక్షల దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఎస్సై పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. వివిధ విభాగాలలోని 539 పోస్టులకు ఆన్లైన్ ద్వారా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పురుషులు 1.75 లక్షలు కాగా, మహిళలు 25 వేల మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అభ్యర్థుల వేలిముద్రలు కూడా తీసుకోనున్నారు. అలాగే హాల్‌టికెట్లను వరుస క్రమంలో కాకుండా జంబ్లింగ్ విధానంలో ఇవ్వనున్నారు. ఎస్సై పోస్టులకు తగ్గిన ఉత్సాహం కానిస్టేబుల్ పోస్టులతో పోలిస్తే ఎస్సై పోస్టుల దరఖాస్తు విషయంలో అభ్యర్థులు అంతగా ఉత్సాహం కనబరచలేదు. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఎస్సై పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. కానిస్టేబుల్ పోస్టులకు మహిళా అభ్యర్థులు 82 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఎస్సై పోస్టులకు 25 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 5.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించిన వారు 2.08 లక్షల మంది ఉన్నారు. కానీ ఎస్సై పోస్టుల విషయానికొస్తే 2.01 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్‌తో పోల్చితే ఎస్సై కొలువు కాస్త ఉన్నత ఉద్యోగమైనప్పటికీ దరఖాస్తులు ఆ స్థాయిలో రాలేదు. ఎస్సై పోస్టులకు దాదాపు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని భావించినా అలా జరగలేదు. అందులోనూ గరిష్ట వయోపరిమితిని మరో ఏడాదిపాటు పెంచడంతో అదనంగా 30 వేల దరఖాస్తులు వచ్చాయి. -
గలగలలాడని గల్లాపెట్టె
⇒ క్రమబద్ధీకరణ ఆదాయం అంతంతే.. ⇒ వస్తాయనుకున్నది రూ.408.99 కోట్లు ⇒ వచ్చింది రూ.153.36 కోట్లే.. ⇒ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత ⇒ నిర్ధేశిత మొత్తం చెల్లింపునకు వెనుకడుగు ⇒ గడువు పెంచే యోచనలో సర్కారు..! సిటీబ్యూరో: సర్కారుకు కాసులు తెచ్చిపెడుతుందని భావించిన క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడి తప్పింది. కోట్లు వచ్చి పడతాయని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనలు ఇందుకు అడ్డుగా నిలిచాయి. ఈ ప్రక్రియ ద్వారా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రూ. 408.99 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.153.36 కోట్లు మాత్రమే జమయ్యాయి. జంట జిల్లాల్లో 59 జీఓ కింద 26,392 దరఖాస్తులు రాగా (వీటిలో 13,607 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలో మారాయి) సగానికి పైగా ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యాయి. 15,500 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించి 13,607 మాత్రమే క్రమబద్ధీకరణకు ఆమోదయోగ్యమైనవిగా తేల్చాయి. అయితే, ఈ దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. దీనికి అధికార యంత్రాంగం ప్రదర్శించిన గంద రగోళమే కారణమని తెలుస్తోంది. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై అనుమానాలు పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వం అంచనా తల్లకిందులైంది. బోలెడు ఆశలు.. ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటి విలువ ఆధారంగా పెద్ద ఎత్తున రాబడి వస్తుందని భావించింది. అయితే, క్రమబద్ధీకరణ చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లతో ముడిపెట్టడంతో యజమానులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నిఘా ఉంటుందని, దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరను నిర్ణయించడం కూడా వెనుకడుగు వేసేందుకు ఓ కారణమైంది. అయినప్పటికీ జంట జిల్లాల్లో రూ.153.36 కోట్లు చెల్లించారు. దీంట్లో 778 మంది ఏక మొత్తంలో నిర్ధేశిత రుసుం చెల్లించారు. వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ. 408.99 కోట్లు వస్తాయని అంచనా వేసింది. విధి విధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడంతో క్రమబద్ధీకరణపై దరఖాస్తుదారులకు అనుమానాలు పెరిగాయి. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) ముగిసింది. మరోసారి గడువు పొడిగింపు? భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వీయెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల క్రమబద్ధీకరణపై ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు.. గడువు పొడిగించే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగానికి సంకేతాలిచ్చిన సర్కారు ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. -
ఇళ్ల దరఖాస్తులతో మహిళల క్యూ...
సిటీబ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి హైదరాబాద్ కలెక్టరేట్‌కు సోమవారం మహిళలు తరలి వచ్చారు. నగరంలోని వివిధ బస్తీల నుంచి మహిళలు ఇళ్ల దరఖాస్తులతో ఉదయం 8.30 గంటలకే కలెక్టరేట్‌కు వచ్చారు. మహిళల తాకి డి ఉదయం 11 గంటల వరకు పెరగటంతో...పరిస్థితిని గమనించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు, పోలీసులు సమాచారం ఇచ్చారు. సిబ్బందిని ప్రధాన గేట్ వద్ద ఉంచి ఇళ్ల దరఖాస్తులు తీసుకోటం లేదని...ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రాగానే బస్తీ ల్లో సభలు నిర్వహించి, అక్కడికే దరఖాస్తులు తీసుకుంటామని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు పోలీసులతో సహా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు మహిళలందరిని కలెక్టరేట్ నుంచి బయటకు పంపించి...ప్రధాన గేట్ మూసి వేశారు. మహిళలు, ప్రజలెవ్వరూ కలెక్టరేట్‌లోకి రాకుండా గట్టి బందోబస్తును నిర్వహించారు. త్వరలో ఇళ్ల దరఖాస్తులను మీ సేవ కేంద్రాల ద్వారా తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘డబుల్’ ఆశ...
దరఖాస్తుల సమర్పణకు భారీ క్యూ జన సంద్రమైన కలెక్టరేట్ ప్రాంగణం లైన్లలో తోపులాట.. పోలీసుల లాఠీచార్జి సొమ్మసిల్లిన నలుగురు... కొందరికి గాయాలు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు జనం పోటెత్తుతున్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. వెంటనే జిల్లా యంత్రాంగం దరఖాస్తులస్వీకరణకు తెర లేపడంతో ఉదయం నుంచే కలెక్టరేట్ జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులు భారీ క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. గురువారం అధిక సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్యూలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. రంగారెడ్డి జిల్లా: గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్ల కోసం వస్తున్న అర్జీదారులతో కలెక్టరేట్ జాతరను తలపిస్తోంది. గురువారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కొందరు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అధికారులు దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసి గేట్లు వేయడంతో జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు కల్పించుకొని... దరఖాస్తులు తీసుకుని కాంపౌండ్ వాల్ లోపలున్న అధికారులకు అందజేశారు. గేటు ఎదుట నిరసన.. మధ్యాహ్నం తర్వాత దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు గందరగోళానికి గురయ్యారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నతాధికారులను కలుస్తామని ముందుకొచ్చిన కొందరిని పోలీసులు అడ్డుకుని బయటకు తోసేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పలువురు గేటు ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అధికారులు మాత్రం స్థానికంగా వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు. -
నేటి నుంచి హడావుడి
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ప్రకటన జారీ చేయడంతో సోమవారం నుంచి జిల్లాలో సందడి నెలకొననుంది. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 4800 ఇళ్లను కేటాయించింది. దీంతో పాటు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకంగా మూడు వేల ఇళ్లు కేటాయించారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గొప్ప విజయాన్ని అందించినందుకు ఈ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మరో 30 వేల ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు రెట్టింపయ్యూరుు. దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా కేటాయిస్తారని భావిస్తున్న లబ్ధిదారులు.. తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌లో వేల సంఖ్యలో దరఖాస్తులు అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నందున అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది. లబ్ధిదారుల ఎంపికను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అప్పగించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. నగరాల్లో డివిజన్ సభలు, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు దరఖాస్తులను ఆన్లైన్ల్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, డబుల్ బెడ్రూంల ఇళ్ల లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో ఈసేవా, నగరంలో ఉన్న వారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించడంతో ఈ కేంద్రాల ముందు జాతర సాగే అవకాశాలు నెలకొన్నాయి. దరఖాస్తుకు ఈ నెల 31 వరకు గడువు పెట్టారు. అరుుతే, గతంలో ఆధార్, రేషన్ కార్డుల కోసం ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దండుకోనున్న దళారులు.. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులకు ధరలు నిర్ణయించక పోవడంతో దళారులు ముందుగానే ఈ కేంద్రాలతో అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిసిం ది. వీరు లబ్ధిదారులు జాబితాలను ముందుగానే తీసుకుని నమోదు చేయించినందుకు వందల రూపాయాలు దండుకునే అవకాశాలున్నాయి. మీ సేవా కేంద్రాలతో పాటు అన్లైన్లో ఎక్కడైనా నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పాటు గడువు పెంచితే హడావుడి తగ్గి దళారుల వసూళ్లకు కూడా బ్రేక్ పడుతుంది. -
డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి
ఈ నెల 11నుంచి 31 వరకు గడువు ఇందిరమ్మ పథకంలో లేనివారికి మాత్రమే.. కలెక్టర్ ప్రకటన హన్మకొండ అర్బన్ : జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం కేటాయించే డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో కోరారు. లబ్ధిదారులు మీసేవా, ఈసేవా కేంద్రాల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలతో ఎలాంటి పత్రాలూ జతచేయాల్సిన అవసరం లేదని, ఈనెల 11నుంచి 31వరకు దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, కులము, కుటుంబ సంవత్సర అదాయం, ఆధార్ నెంబర్, రేషన్‌కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, చిరునామా దరఖాస్తులో నమోదు చేస్తే సరిపోతుందని తెలిపారు. దరఖాస్తు చేసి ర సీదు పొందాలని కలెక్టర్ సూచిచారు. అయితే, గతంలో ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైగానీ, బిల్లులు పొందిగానీ ఉండకూడదని, అలాంటివారు అనర్హులని తెలిపారు. -
డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం క్యూ...
కలెక్టరేట్‌కు తరలివస్తున బస్తీవాసులు మహిళలతో కిటకిలాడుతున్న ‘మీ కోసం’ సర్దిచెప్పలేక అధికారుల తంటాలు సిటీబ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తులతో వచ్చిన మహిళలతో హైదరాబాద్ కలెక్టరేట్ కోలాహలంగా మారింది. త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు నగరంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై హామీలు కురుపిస్తుండటంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఏ ఆసరా లేని నిరుపేద ప్రజలు ఇళ్ల దరఖాస్తులతో కలెక్టరేట్‌కు తరలి వస్తున్నారు. దీంతో మీ కోసం కార్యక్రమం వచ్చిందంటే చాలు అధికారులు భయపడుతున్నారు. వందల సంఖ్యలో వస్తున్న మహిళలు ఇళ్ల కోసం ఎక్కడ గందరగోళం సృష్టిస్తారోనన్న అందోళన వారిని వెంటాడుతున్నది. గతంలో అలాంటి పరిస్థితులు తలెత్తటమే ఇందుకు కారణం. దీనికి తగ్గట్టుగానే నగరంలో ఇటీవల నలుగురు రాష్ట్ర మంత్రులు వివిధ బస్తీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయటం వంటి కార్యక్రమాలు...అనూహ్యంగానే మహిళలను కలెక్టరేట్‌కు రప్పిస్తున్నాయి. సోమవారం ఇళ్ల దరఖాస్తులు సమర్పించుకోవటానికి వచ్చి మహిళలతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. వందలాదిగా మహిళ లు తమ ప్రాంతాల నుంచి వాహనాలు కట్టుకొని తరలివచ్చారు. దీంతో ఏమి చేయా లో తోచని అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి కొంత మేరకు ఇళ్ల దరఖాస్తులను స్వీకరించారు. మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య పెరుగటంతో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తిచెప్పారు. కలెక్టరేట్ నుంచి వారిని సాగనంపారు. ఫలితంగా మహిళలు ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా జేసీ భారతి హోళికేరి మాట్లాడుతూ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేశామని, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు మాత్రమే అందజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా పదే పదే వస్తున్నారని, ఇది సరికాదన్నారు. అర్హత, సీనియారిటీని బట్టి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
మా సేవలు ఓకే నా...?
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు పోలీసు శాఖ ఫోన్లు ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసిన సిటీ కమిషనర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిబ్బందికి కౌన్సెలింగ్ తీవ్ర ఆరోపణలు వచ్చిన ఏడుగురిపై ఎటాచ్మెంట్ వేటు సిటీబ్యూరో: పాస్‌పోర్ట్... ఇది విదేశాలకు వెళ్లేందుకు కావాల్సిన కీలకమైన గుర్తింపు పత్రం. అయినప్పటికీ నగరంలో అనేక మంది దాని అవసరం వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవట్లేదు. అలా దరఖాస్తు చేసిన వారికి ఏదైనా కొర్రీ పడి పాస్‌పోర్ట్ ఆగిపోతుందేమోనన్న ఆందోళన ఉంటుంది. వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్‌బ్రాంచ్ సిబ్బంది ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని... దరఖాస్తుదారులను డబ్బు డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు. వీటికి పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సిటీ కమిషనరేట్‌లోని కాల్సెంటర్లో ఏర్పాట్లు చేశారు. అక్కడి సిబ్బంది దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. కాగా, శాంతి, భద్రతల విభాగం పని తీరుపైనా ఇప్పటికే ఇలాంటి ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్న విషయం తెలిసిందే. నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే... పాస్‌పోర్ట్ జారీకే కాదు.. వెరిఫికేషన్కూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది వీటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పాటించని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు పాస్‌పోర్ట్ దరఖాస్తు రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి చేరిన వెంటనే దరఖాస్తుదారుడికి ఓ సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వస్తుంది. మీ దరఖాస్తును ఫలానా సిబ్బంది వెరిఫై చేస్తారని, దీని కోసం ఆయన నిర్ణీత సమయానికి ముందు మీకు ఫోన్ చేసి పత్రాలు సిద్ధంగా ఉంచకుకోవాలని చెప్తారని ఉంటుంది. దీన్ని పాటించకుండా హఠాత్తుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లడం, ఆ సమయంలో ఇంట్లో లేరనో, మరో కారణంతోనో ఇబ్బందులు పెడుతున్న సిబ్బందినీ అధికారులు ఉపేక్షించట్లేదు. ర్యాండమ్‌గా 10 శాతం చెకింగ్స్... నగర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిత్యం భారీ సంఖ్యలో దరఖాస్తుల్ని వెరిఫై చేసి, నివేదికల్ని పాస్‌పోర్ట్ కార్యాలయానికి పంపుతుంటారు. ఇలా ప్రతి దరఖాస్తుదారుడినీ సంప్రదించి, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కష్టసాధ్యం. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి ర్యాండమ్ చెకింగ్ విధానాన్ని అమలు చేయిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు క్లియర్ చేస్తున్న దరఖాస్తుల వివరాలు ప్రతి రోజూ కమిషనరేట్‌లోని కాల్ సెంటర్‌కు చేరతాయి. వీటి నుంచి ర్యాండమ్‌గా 10 శాతం మంది వివరాలను ఎంపిక చేసే కంప్యూటర్ కాల్‌సెంటర్ ఉద్యోగులకు అందిస్తుంది. వాటిలో ఉన్న నెంబర్ల ఆధారంగా వారికి ఫోన్లు చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. 12 ప్రశ్నలతో ఫ్రొఫార్మా... గ్రేడింగ్... కాల్ సెంటర్ ఉద్యోగులు దరఖాస్తుదారుడిని 12 కేటగిరీలకు చెందిన ప్రశ్నలు అడుగుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిబంధనలు పాటించారా?, వారి ప్రవర్తన, మాట తీరు ఎలా ఉంది? మీ దగ్గర డబ్బు డిమాండ్ చేశారా? వారు అడగకపోయినా మీరు ఇస్తే తీసుకున్నారా?... ఇలా మొత్తం 12 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఆయా సిబ్బందికి గ్రేడింగ్ ఇస్తున్నారు. ఇందులో వెనుకబడిన సిబ్బందికి అవసరమైన అంశాల్లో కౌన్సెలింగ్ ఇచ్చి వారి పనితీరు మెరుగుపరుస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ రకమైన ఆరోపణలు వచ్చిన ఏడుగురిని ఉన్నతాధికారులు సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు. పారదర్శకత కోసమే ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవి నీతిని నిర్మూలించడంతో పాటు పోలీసు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. కాల్‌సెంటర్ ద్వారా అడిగే ప్రశ్నల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచుతూ... ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిబ్బందికీ మెళకువలు నేర్పుతున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నాం’ - వై.నాగిరెడ్డి, అదనపు సీపీ, స్పెషల్ బ్రాంచ్ -
డబుల్ ‘ముబారక్’!
షాదీ ముబారక్ పథకం అమలులో తప్పిదం లబ్దిదారుల ఖాతాలో రెండుసార్లు డబ్బులు జమ పొరపాటుపై మైనార్టీ, {sెజరీ శాఖల్లో ఆరా... సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 142 మంది లబ్దిదారులకు ‘డబుల్’ ముబారక్ లభించింది. అధికారుల తప్పిదం కారణంగా ఒక్కొక్కరిక ఖాతాల్లో రెండు పర్యాయాలు రూ.51 వేల చొప్పున మొత్తం లక్షా 2 వేల రూపాయలు జమ అయ్యాయి. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 142 మంది ముస్లిం యువతుల వివాహాలకు రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు మైనార్టీ శాఖ మంజూరు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా రూ.72.42 లక్షల నిధుల విడుదల కోసం మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి పంపించారు. సంబంధిత ట్రెజరీ అధికారులు వారి సాఫ్ట్వేర్ ఆధారంగా లబ్దిదారులకు నిధులు విడుదల చేసి బ్యాంకులో జమ చేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ-పాస్‌లో లబ్దిదారుల జాబితా అలాగే కనిపించడంతో తిరిగి ట్రెజరీకి రీ సబ్మిట్ చేశారు. అప్పటికే నిధులు విడుదల చేసిన విషయాన్ని మరిచి ట్రెజరీ అధికారులు మరోమారు చెల్లింపులను ఆమోదించారు. వాస్తవంగా సీజీజీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు, ట్రెజరీ పే అండ్ అకౌంట్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ కావడంలో కొంత వ్యత్యాసం ఉండటంతో పొరపాటు జరిగిపోయింది. మైనార్టీ సంక్షేమ శాఖ ఈ-పాస్ ద్వారా బిల్లులు సమర్పిస్తే వాటిని ఆన్లైన్లో కాకుండా రిజక్ట్ ఆప్షన్లో పెట్టి ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసి బ్యాంక్ ఖాతాకు అనుసంధానించారు. అయితే ఆఫ్‌లైన్ చెల్లింపులు గుర్తించని మైనార్టీ సంక్షేమ శాఖ మరోమారు మంజూరుకు బిల్లులు సబ్మిట్ చేయడం గందరగోళానికి దారితీసింది. రికవరీ కోసం తిప్పలు... రెండుసార్లు నిధుల మంజూరును గుర్తించిన సంబంధిత అధికారులు తక్షణమే లబ్దిదారుల ఖాతాల సీజ్‌కు బ్యాంకర్లను ఆదేశించారు. అప్పటికే కొన్ని ఖాతాల నుంచి డబ్బుల చెల్లింపులు జరిగిపోయాయి. కాగా, మూడు బిల్లులకు చెందిన లబ్దిదారుల ఖాతాలు పూర్తి స్థాయిలో సీజ్ కావడంతో అసలు ఆర్థిక చేయూత కూడా డ్రా చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెండుసార్లు డబ్బులు డ్రా చేసుకున్న వారిని ఫోన్ల ద్వారా సంప్రదించి తక్షణమే చెల్లించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలపై మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సంబంధిత అధికారిని మందలించినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్‌ను సంప్రదించగా...రెండుమార్లు ఆర్థిక సహాయం మంజూరైన మాట వాస్తవమేనని, అయితే దీనికి తమ శాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ట్రెజరీ పే అండ్ అకౌంట్ అధికారులను సంప్రదించాలని సూచించారు. -
సివిల్స్‌కు తగ్గిన హాజరు
దరఖాస్తు చేసింది 15,589 33 శాతానికి మించని హాజరు కట్టుదిట్టమైన ఏర్పాట్లు విజయవాడ సెంట్రల్ : సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. నగరంలో 32 కేంద్రాల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. 15,589 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఉదయం 5,201(33.36) శాతం, మధ్యాహ్నం 5,133 (32.93) శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. మూడుసార్లకు మించి పరీక్ష రాసే అవకాశం లేకపోవడంతో అభ్యర్థులు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో హాజరుశాతం తగ్గినట్లు అధికారులు అంచనా కట్టారు. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 24 మంది విద్యార్థులు పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేశారు. హాజరు శాతం తగ్గడంతో 2 నుంచి 10 మంది విద్యార్థులు మాత్రమే కనిపించారు. అభ్యర్థులు లేక కొన్ని గదులు ఖాళీగా కనిపించాయి. శాతవాహన కళాశాల ఆవరణలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం లో 43 మందికిగాను 18 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం హాజ రైన అభ్యర్థుల్లో 68 మంది మధ్యాహ్నం డుమ్మా కొట్టారు. చివరి నిమిషంలో కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు పరుగులు తీయాల్సి వచ్చింది. పకడ్బందీగా ఏర్పాట్లు బిషప్ అజరయ్య స్కూల్, శాతవాహన కళాశాల ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కలెక్టర్ బాబు.ఏ పరిశీలించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు, సలహాలు అందించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జేసీ-2 ఒంగోలు శేషయ్య ఆధ్వర్యంలో పని చేసిన నలుగురు అధికారుల బృం దం ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. సెల్ఫోన్లను తీసుకు వెళ్లకుండా నిరోధించారు. నిరుపయోగంగా పరీక్షలకు చెందిన బుక్‌లెట్స్‌ను కాల్చివేశా రు. ఉపకేంద్రాల నిర్వాహకుల సమస్యల్ని పరిష్కరించేందుకు గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశా రు. ఫిర్యాదుల పరిష్కారం కోసం నలుగురు అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ కళాశాల, గాంధీ, మాంటిస్సోరి, చైతన్య, ఆంధ్రా లయో లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు. -
పాస్‌పోర్ట్ మేడ్ ఈజీ...
నేడు రెండో సేవా కేంద్రం ప్రారంభం మరింతమందికి అవకాశం మర్రిపాలెం (విశాఖ): విశాఖలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి వస్తోంది. మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 మంగళవారం ప్రారంభం కానుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల రద్దీ, తాకిడి దృష్ట్యా మరో సేవా కేంద్రం అవసరమని అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖకు అవసరం తెలియజేశారు. ఇక్కడి కేంద్రంలో వసతులు, కౌంటర్ల విషయాన్ని కేంద్రానికి అందచేశారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సేవలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది జనవరిలో విశాఖ ప్రాంతీయ కేంద్రంగా అవతరించింది. విశాఖకు అనుబంధంగా విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆగస్టు 2011 నుంచి మురళీనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ప్రజలు సేవలు పొందుతున్నారు. ఇక్కడి కేంద్రంలో 18 కౌంటర్లు పనిచేస్తుండగా రోజుకు 975 దరఖాస్తులు పరిశీలించి స్వీకరిస్తున్నారు. ఇకపై అదనంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 పేరుతో మర్రిపాలెం ఉడా లేఅవుట్ దరి పాస్‌పోర్ట్ కార్యాలయ భవనం మొదటి అంతస్తులో సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కార్యాలయంలో ప్రత్యేక వసతులు, అన్ని హంగులు కల్పించారు. 10 కౌంటర్లు ఏర్పాటుచేసి రోజుకు 450 మందికి అవకాశం కల్పిస్తారు. -
టీచర్ల బదిలీలకు 1500 దరఖాస్తులు!
ముగిసిన దరఖాస్తు ప్రక్రియ పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తి సిటీబ్యూరో: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. రెండేళ్ల తర్వాత టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు విధానం పూర్తయింది. వాటిని పరిశీలించిన అనంతరం విద్యాశాఖ ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే దరఖాస్తుల సంఖ్య తేలనుంది. జిల్లాలో మూడు వేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పనిసరి బదిలీ అయ్యే వారితోపాటు ఆశావహులు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూళ్లలో ఉన్న మిగులు ఉపాధ్యాయులు 95 మంది, ఒకే పాఠశాలలో ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న 78 మంది ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్లు ఒకే బడిలో విధులు నిర్వహించిన 100 మంది స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 200 మంది ఎస్జీటీలు తప్పనిసరిగా ద రఖాస్తు చేసుకున్నట్లే. వీరితో దాదాపు 800 మంది రిక్వెస్ట్ కింద, మరికొందరు ఆశావహ దృక్పథంతో దరఖాస్తులను అప్లోడ్ చేశారని సమాచారం. ఇలా అన్ని విభాగాల్లో 1,500 పైబడి బదిలీ కోసం దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని అంచనా. ముగిసిన పాఠశాలల రేషనలైజేషన్ హైదరాబాద్ జిల్లాలో పాఠశాలల హేతుబద్ధీకరణ ప్రక్రియ ముగిసింది. అందుకు సంబంధించిన జాబితాను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సంఖ్యలో ఎంటువంటి మార్పులేదు. ఇప్పటివరకు ఉన్న స్కూళ్లు యథావిధిగా 2015-16 విద్యా సంవత్సరానికి కొనసాగనున్నాయి. అయితే ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్న సక్సెస్ స్కూళ్ల సంఖ్య మాత్రం తగ్గింది. జిల్లాలో 135 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. 20 సక్సెస్ స్కూళ్లలో 50 మంది లోపు విద్యార్థులే నమోదయ్యారు. రేషనలైజేషన్‌లో భాగంగా వీటిని కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇతర సక్సెస్ స్కూళ్లలో విలీనం చేశారు. తద్వారా 15 సక్సెస్ స్కూళ్లు సంఖ్యా పరంగా తగ్గాయని అధికారులు తెలిపారు. ఈ బడుల్లో బోధించే 60 - 70 మంది ఉపాధ్యాయులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల సంఖ్యలో మార్పు చోటుచేసుకుంది. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న రెండు పీఎస్‌లను.. ఒక పీఎస్‌గా మార్చారు. ఇలా పది పీఎస్‌లను ఇతర పీఎస్‌లలో విలీనం చేయడంతో తాజాగా జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య 624కు పడిపోయింది. విలీనమైన బడుల్లోని ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు కే టాయించనున్నారు. -
మరో అవకాశం
41 మద్యం షాపులకు మళ్లీ నోటిఫికేషన్ రేపటి నుంచే తెరుచుకుంటున్న సర్కారు దుకాణాలు విశాఖపట్నం : ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలోని మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులు ప్రభుత్వం నిర్వహించనుంనుండగా మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను రెండు రోజుల క్రితం లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. అయితే 41 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో వాటికి మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాల్సి వచ్చింది. దీంతో ఎక్సైజ్ అధికారులు బుధవారం 41 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీలోగా వ్యాపారులు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడువు పూర్తయిన వెంటనే అంటే 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరించి సాయంత్రం 5గంటలకు లాటరీ తీస్తారు. విశాఖ మురళీనగర్‌లోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తిచేసి షాపులు కేటాయించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రభుత్వం నిర్వహించదలిచిన 39 మద్యం దుకాణాలను ఎప్పుడు తెరవాలనేదానిపై అధికారులు తర్జన భర్జన పడ్డారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌కల్లాం ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం షాపుల కేటాయింపులపై అధికారులతో సమీక్ష జరిపిన ఆయన వెంటనే ప్రభుత్వ దుకాణాలు తెరవాలని ఆదేశించారు. దీంతో గురువారం విశాఖలో కనీసం మూడు షాపులు తెరవనున్నట్లు ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ బుధవారం ‘సాక్షి’ కి వెల్లడించారు. ఈ నెల 5 లేదా 6వ తేదీ కల్లా జిల్లాలో 39 ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ షాపులను కూడా తామే దక్కించుకోవాలని, సింగిల్ టెండర్ల ద్వారా తమ పని జరుపుకోవాలని సిండికేట్లు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. -
ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు 22 వేల దరఖాస్తులు
హైదరాబాద్: 22 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మరో 2 వేల మంది విద్యార్థు లు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రీకౌంటింగ్‌లో మార్కులు సరిగ్గా వేశారా? లేదా? అన్నది చూసి కౌంటింగ్ చేసి ఫలితాలు ఇస్తారని పేర్కొన్నారు. అదే రీ వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు చేసుకున్నవారు ప్రశ్నలకు రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు వేశారా? లేదా? అన్నీ కౌంట్ చేశారా? లేదా? అన్నది పరిశీలించి, అన్ని సరిచేసి తాజా మార్కులతోపాటు మూల్యాంకనం చేసిన జవాబుపత్రం కాపీని అందజేస్తారని వివరించారు. కెమిస్ట్రీలో అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక తరగతులకు స్పందన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకుహాజరు కానున్న విద్యార్థులకు ఇంటర్ విద్యా శాఖ చేపట్టిన ప్రత్యేక శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన లభిస్తోందని ఇంటర్ విద్యా కమిషనర్ డాక్టర్ అశోక్‌కుమార్ వెల్లడించారు. ప్రతి జిల్లాలో 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకొని తరగతులకు హాజరవుతున్నారన్నారు. ఒక్కో కేంద్రంలో 15 నుంచి 20 మంది లెక్చరర్లు బోధిస్తున్నారని తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్, సివిక్స్ వంటి సబ్జెక్టులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలకు ఉచిత భోజన, నివాస వసతిని వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ ఈ నెల 22 వరకు కొనసాగుతుందన్నారు. -
అమరుల కుటుంబాలకు అండ
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 88 మంది కుటుంబాలకు సాయం అందజేత అందని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.. హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ప్ర భుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరి అన్నారు. ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ప్రభుత్వం బుధవారం ఆర్థిక సహాయం అందించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, శంకర్‌నాయక్ పాల్గొని అమరుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మా ట్లాడుతూ ఏ ఆశయం కోసమైతే రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆశయం, లక్ష్యం నెరవేరినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. ప్రత్యేక రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతుందని, సమస్యలు, ఇబ్బందు లు తొలగుతాయని భావించి బలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత అని అన్నా రు. రూ.10లక్షల సహాయంతోపాటు కుటుం బంలోఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. వీరి త్యాగాలు భావితరాలకు తెలిసేలా స్మృతి వనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపిక కాని అమరుల కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎఫ్ఐఆర్, పత్రికలలో వచ్చిన కథనాలతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ పార్టీపరంగా పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. సహాయానికి ఎంపిక కాని అమరుల కుటుంబాలు పెద్ది సుదర్శన్‌రెడ్డికి కూడా వివరాలు అందించవచ్చన్నారు. గిరిజన సంక్షే మ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీ ర చందూలాల్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామన్నారు. బంగారు తెలంగాణలో అమరుల కుటుంబాలు బాధపడొద్దని, వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. కాగా, సమావేశం ప్రారంభం కాగానే జాబితాలో పేర్లు లేని అమరుల కుటుంబ సభ్యులు వేదికపైకి చేరుకొని తమను విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ వాకాటి కరుణ, డీఆర్వో శోభ తదితరులు పాల్గొన్నారు. తొలుత అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జాబితాలో చేర్చాలని వినతి హన్మకొండ అర్బన్: ‘రాష్ట్రం కోసమే మా బిడ్డ లు ప్రాణత్యాగం చేశారు.. జై తెలంగాణ అం టూ వచ్చే రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు ఆర్పిం చారు. వారి త్యాగాల ఫలితంగా రాష్ట్రం వచ్చింది కానీ.. వారి పేర్లు తెలంగాణ అమరవీరుల జాబితాలో చేర్చకపోవడం వారి అవమానించడమే’ అంటూ ఆమరవీరుల కుటుం బ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అమరుల కుటుంబ సభ్యులు బుధవారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రా పోలు ఆనందభాస్కర్‌కు తమ గోడు వెళ్లబోసుకుని వినతిపత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం శ్రీహరి, కలెక్టర్ కరుణకు వినతిపత్రాలు సమర్పించారు. తమ విషయంలో ప్రభుత్వం వెం టనే నిర్ణయం ప్రకటించాలని కోరారు. కలెక్టరేట్‌కు వచ్చిన వారిలో అమరవీరులు సంగ పరమేశ్వర్, శంకర్, వెల్దండి సుమన్, బండ్లోజు శేషువర్మ, పెండ్యాల రాజయ్య, చుక్క రంజిత్, ఆరెల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. -
డీఎస్సీ దరఖాస్తుకు ఆరు రోజులే గడువు
చిత్తూరు(ఎడ్యుకేషన్): డీఎస్సీ పరీక్ష కు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులు (ఆదివారం మినహా) మాత్రమే గడువు మిగిలి ఉంది. ఫిబ్రవరి ఐదో తేదీ ఆఖరు కావడం తో అభ్యర్థులు దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 28,500 దరఖాస్తులు డీఈవో కార్యాలయానికి చేరాయి. గురువారం అధిక సంఖ్య లో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. దరఖాస్తుల రీ వెరిఫికేషన్ ముమ్మరంగా జరుగుతున్నట్లు డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ పురుషోత్తం తెలిపారు. -
కలెక్టరమ్మా పింఛన్!
మూడు నెలల నుంచి అరిగోస పడుతున్నం.. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక పేరిట జాప్యం లక్షలాది మంది వికలాంగులం, వృద్ధులం, వితంతువులం, ఎదురుచూస్తున్నం.. పింఛన్ సమస్య గ్రామాల్లో కంటే పట్టణాల్లో అధికంగా ఉంది. పట్టణవాసులు ప్రతి సోమవారం గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకోవడం.. అవి మున్సిపాలిటీకి పోవడం మినహా పెద్దగా ఫలితం ఉండడం లేదు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తే సమస్యను అధిగమించే అవకాశం ఉంది. ఇదే విధంగా వికలాంగుల కోసం సదరం క్యాంపులు నిర్వహిస్తే సమస్యలను అధిగమించవచ్చు.. - హన్మకొండ అర్బన్ హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఆసరా పింఛన్ల ఎంపిక ప్రక్రియ మొదలై మూ డు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు డబ్బుల కో సం ఎదురుచూస్తున్నారు. పల్లెల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది. సమగ్ర సర్వే సమయం లో అధికారులు చేసిన తప్పులు, డా టా ఎంట్రీలో అవకతవకలు పేదల పా లిట శాపంగా మారారుు. ఈ కారణాలతో కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నా.. ఎ న్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అనర్హులంటూ తిరస్కరణకు గురవుతున్నారుు. ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ల విషయంలో ఆధార్కార్డులులేవని, వయసు తక్కువగా ఉం దని, రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ప్రధానంగా.. రెవెన్యూ అధికారుల నుంచి వయస్సు ధ్రువీకరణ పత్రం పొందడం అంతా సులువు కాదు. విచారణ అధికారులు విజ్ఞతతో ఆలోచించి పింఛన్ మంజూరు చేయూలని ఉన్నతాధికారులు చెపుతున్నా ఆ భారం మోసేం దుకు వారు సిద్ధంగా లేరు. దీంతో సాంకేతిక సమస్యలు, ఇతర చిన్నచిన్న పొరపాట్ల వల్ల పింఛన్ అందడం అగమ్య గోచరంగా మారింది. కలెక్టర్ కరుణ అరుునా దయ ఉంచి పింఛన్ ఇప్పించాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కోరుతున్నారు. జిల్లాలో 3.50 లక్షలు దాటిన పింఛన్లు జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం సుమారు 5.20 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 3,56,713 మందిని అర్హులుగా గుర్తించగా.. పింఛన్ మంజూరు అవుతోంది. వీరికోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.39,65,10,500 విడుదల చేస్తోంది. పిం ఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అధికారులు చెబుతున్నా.. గతంలో రెగ్యులర్‌గా పింఛన్ పొందుతున్నవారికీ ఇప్పుడు పింఛన్ ఆపేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ నాలుగు నెలల డబ్బులు ఒకేసారి ఇప్పించాలని పింఛన్ బాధితులు కోరుతున్నారు. కాగా, జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహించడం లేదు. ఫలితంగా వికలాంగులు వికలాంగ ధ్రువీకరణపత్రాలు పొందలేక పోతున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించాలని కలెక్టరేట్లో గ్రీవెన్స్‌లో వినతిపత్రాలు వస్తున్నారుు. ఈ విషయంలో డీఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకోవాలి. రోజూ పింఛన్‌రాని వారు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. అధికారులను కలిసి వినతులు సమర్పిస్తున్నారు. నేను ఏం పాపం చేశాను.. నా పేరు అంబాల కిరణ్. మాది వరంగల్‌లోని ఎల్లంబజార్. నేను ఏం పాపం చేశాను. ఆ దేవుడు నన్ను ఇట్లా పుట్టిం చాడు. ఈ స్థితిలో ఏం పని చేయను. వంద శాతం వైకల్యం అంటూ వైద్యులు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతంలో నెలనెల పింఛన్ వచ్చేది. మూడు నెలలుగా రావడం లేదు. పింఛన్ నా పేరిట మంజూరైందట. కానీ ఆధార్ కార్డు నంబరు మా అయ్య కార్డు నంబరు పడిందట. మూడు నెలలుగా రోజూగా మునిసిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా. వరుసగా మూడు నెలలు డబ్బులు తీసుకోకపోతే పింఛన్ పోతదట. అధికారులు పింఛన్ ఇవ్వాలి. - వరంగల్ అర్బన్ -
పింఛన్ పోరు
హసన్‌పర్తి/ఖానాపురం/కేసముద్రం/స్టేషన్‌ఘన్‌పూర్ : పింఛన్ల కోసం దరఖాస్తుదారులు రోడ్డెక్కారు. హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులోని సుబ్బయ్యపల్లిలో శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. వివిధ రకాల పెన్షన్ల కోసం సుమారు 124 మంది దరఖాస్తు చేసుకోగా.. 24 మందికి మాత్రమే మంజూరయ్యూరుు. గతంలో తమ అందరికీ పింఛన్లు వచ్చాయని.. ఇప్పుడు తమకు ఇవ్వకుండా కొత్తవారికే ఇచ్చారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఇక్కడికి వచ్చిసమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పుట్ట రవిమాదిగ తహసీల్దార్‌తో ఫోన్లో వాగ్వాదానికి దిగారు. ఇక్కడికి వచ్చి చూస్తే.. నిరాహార దీక్ష చేస్తున్న వారు అర్హులా... కారా... అనేది తెలుస్తోందన్నారు. పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. కాగా, పింఛన్ రాలేదనే బెంగతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఎల్.శంకరయ్య శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో వికలాంగులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్హుల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ నేత దిష్టిబొమ్మను ఎందుకు కాలబెడతారంటూ ఎంపీటీసీ భర్త సూరయ్య తదితరులు కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు, ఒకదశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. కేసీఆర్ దిష్టిబొమ్మను దహం చేయడంపై టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని పల్లగుట్టలో ఆసరా లేకపోవడంతో దరఖాస్తుదారులు గ్రామపంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. -
కబ్జాల కళ్యాణం!
నాలా ఆక్రమణకు కొత్త ఉపాయం ‘ఫండ్ యువర్ సిటీ’ కింద దరఖాస్తు అనుమతి లేకుండానే పనులు మొదలు కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ తీరు కార్పొరేషన్ ఉదాసీనత వరంగల్ : కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త స్కీములు అమలు చేసే కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్.. ఇప్పుడు తమ అవసరాల కోసం పబ్లిక్ నాలాను ఆక్రమించే విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. విపరీతమైన రద్దీ ఉండే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న నాలాను సొంత అవసరాలకు వినియోగించుకునే పని మొదలుపెట్టింది. సామాజిక సేవ పేరుతో ఈ పని చేస్తోంది. ట్రాఫిక్ సమస్య తీవ్రమైనా.. తమ వ్యాపారాలు సాఫీగా సాగితే చాలని పథకం రూపొందించింది. గతంలో కూడా ఇదే నాలాను కబ్జా చేసేందుకు యత్నించిన ‘కళ్యాణ లక్ష్మి’ యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు సామాజిక సేవ పేరుతో మళ్లీ అదే చేస్తోంది. నిబంధన ఉల్లంఘన హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపు కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది. నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్ సెల్లార్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ షాపింగ్ మాల్‌కు వచ్చే వారి వాహనాలను మాల్‌కు ఎదురుగా పార్క్ చేస్తున్నారు. లక్కీడ్రా, బంపర్డ్రాల పేరిట వ్యాపారం చేస్తున్న ఈ షాపింగ్ మాల్ వద్ద రోజూ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉంటున్నాయి. కస్టమర్ల వాహనాలను రోడ్డు వెంబడే నిలిపేయడంతో సాయంత్రం సమయాల్లో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు గంటల తరబడి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకుండా షాపింగ్‌మాల్ యూజమాన్యానికే సహకరిస్తున్నారు. దీనిని అలుసుగా చేసుకున్న కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న నాలానే పార్కింగ్ స్థలంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. సామాజిక సేవ పేరుతో..! కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ ఎదురుగా నాలా ఉంది. వరంగల్ నగరంలో భూగర్భ డ్రెరుునేజీ వ్యవస్థ లేదు. వర్షాలు కురిసినప్పుడు షాపింగ్ మాల్ ముందున్న నాలా పొంగిపొర్లుతుంది. నాలాలో చెత్తచెదారం ఎక్కువగా పేరుకున్నప్పుడు తొలగించకపోతే మురుగునీరు బయటికి వస్తుంది. దీని వల్ల నాలాపై స్లాబ్ వంటి వేయకుండా ఉంటేనే మంచిది. ఇలా ఉంటే తమ షాపింగ్ మాల్‌కు వచ్చే వాహనాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి యాజమాన్యం.. సామాజిక సేవ(ఫండ్ యువర్ సిటీ) పేరిట దీన్ని కబ్జా చేసి పార్కింగ్ స్థలంగా మార్చేందుకు సిద్ధమైంది. నాలా వల్ల రోడ్డుపై వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేట్ సామాజిక సేవలో భాగంగా నాలాపై స్లాబ్ నిర్మిస్తామని కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్ కార్పొరేషన్‌కు ప్రతిపాదించింది. కారణం ఏదైనా కార్పొరేషన్ అనుమతి వచ్చిన తర్వాత నిర్మాణం జరపాలి. ఇవేవి రాకుండానే కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ నాలాపై స్లాబ్ నిర్మాణం మొదలుపెట్టింది. రెండు రోజులు పనులు సాగాయి. స్థానికుల అభ్యంతరంతో కార్పొరేషన్ అధికారులు వచ్చి చూశారు. ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇప్పుడు అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదేతీరు.. కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రారంభమైన కొత్తలోనూ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాలాను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కాంక్రీటు నిర్మాణం చేపట్టారు. వరంగల్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా దీన్ని తీవ్రంగా పరిగణించారు. నాలాను ఆక్రమించిన కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్‌పై చర్యలు తీసుకోవాలాని బల్దియూ కమిషనర్‌ను ఆదేశించారు. నాలాపై పార్కింగ్ వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, ప్రమాదాలు జరుగుతాయని.. అక్రమ నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు. పార్కింగ్ కోసం సెల్లార్ లేదా ఇతర ప్రత్యామ్నయం చూసుకోవాలని కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యానికి సూచించాలని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు నాలాపై నిర్మించిన స్లాబ్‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. కళ్యాణ లక్ష్మి యాజమాన్యం ఇప్పుడు మళ్లీ ఇదే పని చేస్తోంది. -
‘ఆరోగ్యశ్రీ’కి అనారోగ్యం..!
పేరు మార్చి గాలికొదిలేసిన {పభుత్వం జిల్లాలో కుంటుపడ్డ ఆరోగ్యశ్రీ సేవలు శస్త్రచికిత్సలూ అంతంత మాత్రమే రమణమ్మ. వయసు 54 ఏళ్లు. పెద్దమండ్యంలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తోంది. గర్భసంచిలో గడ్డతో ఆరు నెలలుగా బాధపడుతోంది. ఐదు నెలల క్రితం ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్స కోసం దరఖాస్తు చేసుకుంది. జిల్లాలోని ఆరోగ్యమిత్ర ఈ వివరాలు ఇప్పటికే ఆస్పత్రికి పంపించారు. ఇప్పటి వరకు ఆమెకు శస్త్ర చికిత్స చేయలేదు. రసూల్ మూడో తరగతి విద్యార్థి. ఇతనిది సురుటుపల్లె. ఈ కుర్రాడి గుండెలో చిల్లు ఉంది. దీనిని ఆరోగ్యశ్రీ కింద బాగుచేయించాలని ఎనిమిది నెలలుగా జిల్లా కలెక్టర్ నుంచి సిబ్బంది వరకు అందరి వద్దకు తిరిగాడు. ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం మందులిచ్చి, చేతులు దులుపుకుంది. మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చిత్తూరు (అర్బన్): రమణమ్మ, రసూల్ తరహాలోనే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం నిరీక్షిస్తూ చాలా మంది మృత్యువుకు సమీపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంలో చూపించిన శ్రద్ధ వాటిని అమలు చేయడంలో ఏ మాత్రం చూపలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట ఉన్న పథకాన్ని ‘డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా పేరు మార్పు చేశారు. మినహా వైద్య సేవలు అందించడంలో మాత్రం చిత్తశుద్ధి లోపించింది. ఏడేళ్లల్లో రూ.232 కోట్లు ఖర్చు జిల్లాలో 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి నాంది పలికారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1361 మందికి ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయగా వీరి కోసం రాజశేఖరరెడ్డి అప్పట్లో రూ.5.95 కోట్లు ఖర్చుపెట్టారు. 2008-09లో 7565 ఆపరేషన్లు నిర్వహించగా రూ.23.49 కోట్లు, 2009-10లో 10493 మందికి శస్త్ర చికిత్సలు చేయగా రూ.30 కోట్లు, 2010-11లో 13,755 ఆపరేషన్లు చేసి రూ.37.75 కోట్లు, 2011-12లో 15,902 మంది కోసం 42.31 కోట్లు, 2012-13లో 16,870 మందికి శస్త్ర చికిత్సలకు 42.79 కోట్లు, 2013-14లో 18,889 మందికి ఆపరేషన్లు చేసి రూ.50.41 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే గడచిన ఏడేళ్ల కాలంలో ఆరోగ్య కోసం రూ.232 కోట్లు ఖర్చు పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవ్సరంలో ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో 22,846 మందికి ఆపరేషన్లు చేయగా వీరికి రూ.43 కోట్లు ఖర్చు చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాలో కేవలం మూడు వేల మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు జరిగాయి. బాగానే చేస్తున్నాం శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో ఎక్కడా జాప్యం జరగలేదు. గత నెల మాత్రం ఆన్లైన్లో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో పైఅధికారుల నుంచి కొన్ని అనుమతులు ఆలస్యంగా వచ్చాయి. అంతే తప్ప మరే ఇబ్బంది. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. -శివకుమార్, జిల్లా మేనేజర్, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా విభాగం -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు
3 కళాశాలలు రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర, కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయలో ఏర్పాటు చేశారు. వీటిని 2008 సంవత్సరంలో ప్రారంభించారు. ఇవి రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో పని చేస్తాయి. ఈ విద్యా సంవత్సరంలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో రెండు, తెలంగాణ ప్రాంతంలో ఏకైక ట్రిపుల్ఐటీ మిగలనుంది. విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్జీయూకేటీ 3 వేల మంది విద్యార్థుల ప్రవేశాలకు కలిపి ఒకే చోట దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు http:///admissions2014.rgukt.in సైట్ ద్వారా అభ్యర్థి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన దరఖాస్తు పత్రం ప్రింట్ ప్రతిని తీసుకోవాలి. దానిని డీడీ లేదా చలానా లేదా ఏపీ ఆన్లైన్లో చెల్లించిన రూ.150 రశీదు ఒరిజినల్ ప్రతికి అభ్యర్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. వాటినిరిజిస్టార్, ఆర్జేయూకేటీ, వింధ్య సీ-4, గచ్చీబౌలి, హైదరాబాద్-500032 చిరునామాకు రిజిస్టరు పోస్టు గానీ స్పీడ్ పోస్టు ద్వారా గానీ పంపించాలి. 21-05-2014 నుంచి 16-06-2014 వరకు దరఖాస్తులు పంపవచ్చు. ప్రాంగణ నియామకాలు 2008లో నెలకొల్పిన బాసర ట్రిపుల్‌ఐటీలో 2014 చివరి బ్యాచ్‌కు మొదటి ప్రాంగణ నియామకాలు జరిగాయి. కార్పొరేట్ కంపెనీలు ట్రిపుల్‌ఐటీకే చేరుకొని ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని కొలువులు అందించాయి. చదువుపై ఆసక్తి ఉండి ఆరేళ్ల కోర్సు పూర్తి కాగానే యూనివర్సిటీ నేరుగా క్యాంపస్ నియామకాల కోసం కంపెనీలను ఆహ్వానిస్తుంది. కంపెనీలు వచ్చి ప్రతిభ గల విద్యార్థులకు కొలువులు అందిస్తున్నాయి. ఎంపిక ప్రక్రియ గతంలో మూడు ట్రిపుల్ ఐటీలకు కలిపి ఆరువేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేవారు. రెం డేళ్లుగా ఒక్కో కళాశాలలో 1000 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలను రీజియన్లుగా విభజించి ఒక్కో రీజియన్‌కు 42:36:22 నిష్పత్తిలో సీ ట్లు కేటాయిస్తారు. 85 శాతం స్థానాలను సంబంధిత విశ్వవిద్యాలయం రీ జియన్ పరిధిలోని స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం స్థానాలను ఓపెన్ విభాగంలో భర్తీ చేస్తారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌పాయింట్(జీపీఏ)ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రిజర్వేషన్ కేట గిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్ధిష్ట సంఖ్యలో స్థానాలు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచీ పాయింట్లు కలుపరు. జీపీఏ సమానంగా ఉంటే.. ఆ విద్యార్థులకు జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్‌పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపి క చేస్తారు. సమానంగా పాయింట్లు ఉన్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. గణితంలోనూ సమాన జీపీఏ ఉంటే భౌతికశాస్త్రం.. అందులోనూ సమానంగా వస్తే రసాయనశాస్త్రం.. అందులోనూ అదే విధానం కనిపిస్తే ఇంగ్లిష్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇలాంటప్పుడు కూడా ఎక్కువ మంది విద్యార్థులు సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి తొలి ప్రాధాన్యాన్నిస్తూ ప్రవేశం కల్పిస్తారు. బోధన రుసుము తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్‌ఐటీలను నెలకొల్పారు. ట్రిపుల్ ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్ష లోపు ఉన్న వారందరికీ బోధన, వసతికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న అన్ని సామాజిక వర్గాల వారికి ఈ విధానం వర్తిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్న వారంతా రూ.3వేల కాశన్ డిపాజిట్ చెల్లిస్తే ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్షకు పెరిగితే రూ.36 వేల బోధన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశం తర్వాత... ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం తర్వాత విద్యార్థులు ఆరేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు చదవాలి. ఈ కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక ఇతర అవకాశాలు వస్తే విద్యార్థులు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులకు పీయూసీ ఉత్తీర్ణత పత్రాన్ని కళాశాల అధికారులు అందజేస్తారు. పీయూసీ తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం కావడంతో విద్యార్థులంతా ఆరేళ్ల కోర్సు ఇక్కడే పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతారు. కోర్సుల ఎంపిక ఇలా... ట్రిపుల్ ఐటీల్లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్ల పీయూసీ మార్కులే బీటెక్ కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. కళాశాలలో చేరిన విద్యార్థులు మొదటి నుంచే చదువుపై దృష్టిసారించాలి. పాఠశాల స్థాయి దాటాక ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు పరీక్షలు సెమిస్టర్ విధానంలో ఉంటాయి. రెండేళ్ల పీయూసీ శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కోర్సులు చదివే అవకాశం ఉంటుంది. ఇక మూడో సంవత్సరం బీటెక్‌లో విద్యార్థులందరికీ ఒకే కోర్సు ఉంటుంది. రెండేళ్ల పీయూసీ పూర్తయ్యాక మూడో సంవత్సరం బీటెక్ ఆఖరులో కోర్సుల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్ విభాగంలో సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెటలార్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ కోర్సులు మూడు ట్రిపుల్ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆరింటిలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీటు కోసం మార్కులను పరిగణలోకి తీసుకోవాలి. బీటెక్ చదివే విద్యార్థులు తప్పనిసరిగా మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సుతో పాటు మైనర్ సబ్జెక్టు కింద సంగీతం, నృత్యం, హ్యుమానిటీస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటివి ఎంచుకోవాలి. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా విశ్వవిద్యాలయం ఈ మైనర్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.