డీఎస్సీ పరీక్ష కు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులు (ఆదివారం మినహా) మాత్రమే గడువు మిగిలి ఉంది.
చిత్తూరు(ఎడ్యుకేషన్): డీఎస్సీ పరీక్ష కు దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులు (ఆదివారం మినహా) మాత్రమే గడువు మిగిలి ఉంది. ఫిబ్రవరి ఐదో తేదీ ఆఖరు కావడం తో అభ్యర్థులు దరఖాస్తు స్వీకరణ కౌంటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 28,500 దరఖాస్తులు డీఈవో కార్యాలయానికి చేరాయి.
గురువారం అధిక సంఖ్య లో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. దరఖాస్తుల రీ వెరిఫికేషన్ ముమ్మరంగా జరుగుతున్నట్లు డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ పురుషోత్తం తెలిపారు.