ఈ నెల 11నుంచి 31 వరకు గడువు
ఇందిరమ్మ పథకంలో లేనివారికి మాత్రమే..
కలెక్టర్ ప్రకటన
హన్మకొండ అర్బన్ : జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం కేటాయించే డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో కోరారు. లబ్ధిదారులు మీసేవా, ఈసేవా కేంద్రాల్లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలతో ఎలాంటి పత్రాలూ జతచేయాల్సిన అవసరం లేదని, ఈనెల 11నుంచి 31వరకు దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు.
దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలు, కులము, కుటుంబ సంవత్సర అదాయం, ఆధార్ నెంబర్, రేషన్‌కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, చిరునామా దరఖాస్తులో నమోదు చేస్తే సరిపోతుందని తెలిపారు. దరఖాస్తు చేసి ర సీదు పొందాలని కలెక్టర్ సూచిచారు. అయితే, గతంలో ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైగానీ, బిల్లులు పొందిగానీ ఉండకూడదని, అలాంటివారు అనర్హులని తెలిపారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకోండి
Published Sat, Jan 9 2016 1:42 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement