ఇక ఇంటికే సర్టిఫికెట్లు | The homes Certificates | Sakshi
Sakshi News home page

ఇక ఇంటికే సర్టిఫికెట్లు

Published Tue, Nov 29 2016 3:27 AM | Last Updated on Mon, Oct 8 2018 7:48 PM

ఇక ఇంటికే సర్టిఫికెట్లు - Sakshi

ఇక ఇంటికే సర్టిఫికెట్లు

‘మీ సేవ’లకు షాక్.. అక్రమాలకు బ్రేక్
త్వరలోనే అందుబాటులోకి ‘మీసేవ’ యాప్
మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..
పోస్టులో ఇంటికే రానున్న ధ్రువీకరణ పత్రాలు
పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ నుంచే ప్రారంభం

సర్టిఫికెట్ల కోసం ఇక మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోనక్కర్లేదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. నిర్ణీత వ్యవధిలో సర్టిఫికెట్లు మన ఇంటికే చేరతారుు. ఎవరికీ అదనంగా చెల్లింపులు చేయకుండా ధ్రువీకరణ పత్రాలు చేతికందుతారుు. మరీ అత్యవసరమైతే అదనపు రుసుము చెల్లించి ఒక రోజు వ్యవధిలో ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం త్వరలోనే ‘మీసేవ యాప్’ను అందుబాటులోకి తేనుంది. మన జిల్లాలోనే ఈ యాప్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది.

ఇందూరు: మీ సేవ కేంద్రాలకు కాలం చెల్లనుంది.. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతుండడంతో వారు ఉపాధి పొందుతున్న కేంద్రాలకే దెబ్బ  తెచ్చింది.. మీ సేవ కేంద్రాల్లో బోగస్ సర్టిఫికెట్లు సృష్టించడం, క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తెప్పించి దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రభుత్వం ముకుతాడు వేయనుంది. మీ సేవ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా, ప్రజలు స్వతహాగా తమ మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకునేలా ’మీ-సేవ’ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు మన జిల్లా నుంచే ఓ డిప్యూటీ తహసీల్దార్, మరి కొందరు ఉద్యోగులు కలిసి ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీని పనితీరును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు మొన్నటివరకు రెవెన్యూ కమిషనర్‌గా పని చేసిన రేమండ్ పీటర్‌కు వివరించగా, వారు ఓకే చెప్పారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

జిల్లాలో మొత్తం 230 మీ సేవ కేంద్రాలున్నారుు. వీటి ద్వారా కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు 26 రెవెన్యూ సేవలు పొందే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బోగస్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. సరైన సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తులు చేరుుంచడం, ఎవరి పేరుపై ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇవ్వడం, దరఖాస్తులు చేసుకున్న క్షణాల్లోనే తహసీల్దార్ కార్యాలయాల నుంచి సర్టిఫికెట్లు మంజూరు చేరుుస్తున్నారు. ఇలా చేరుుంచినందుకు దరఖాస్తుదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారుల దృష్టికి రాగా, అధికారులే మీ సేవ కేంద్రాల ఆపరేటర్లకు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల మీ సేవ కేంద్రాల ఆపరేటర్లతో జిల్లా కేంద్రంలో సమావేశం జరిపిన ఓ ఉద్యోగి ’మీరు ఏం చేసినా బయటకు తెలియకుండా చేసుకోండి’ అని దర్జాగా చెప్పడం గమనార్హం. సదరు ఉద్యోగికి మీ సేవ కేంద్రాల నుంచి మాముళ్లు అందుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అన్నింటికీ చెక్ పెట్టేందుకే యాప్..
మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మీ సేవ యాప్ ఏర్పాటుకు పూనుకుంది. జిల్లాకు చెందిన, ఈ- సేవా, మీ సేవ కేంద్రాల పరిపాలన అధికారి రమణ్‌రెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మీ సేవ యాప్‌కు శ్రీకారం చుట్టారు. అది పని చేసే విధానాలపై మంత్రి కేటీఆర్‌కు వివరించగా, బాగుందని ప్రశంసించారు. దీనిని రాష్ట్రమంతటా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మీ సేవ యాప్‌కు సంబంధించిన మరికొన్ని సాప్ట్‌వేర్ అప్లికేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెండు, మూడు నెలల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా నిజామాబాద్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ యాప్ ప్రారంభమైతే మీ సేవ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ప్రజలు మీ సేవ కేంద్రాలకు కాకుండా వారి మొబైల్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

‘డిజిటల్ కీ’కి మంగళం!
ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటే, వీఆర్వో నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలన చేసి, తహసీల్దార్ డిజిటల్ సంతకం చేస్తే మీ సేవ కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అరుుతే, మీ సేవ యాప్‌తో ఈ విధానానికి ఫుల్‌స్టాప్ పడనుంది. మొబైల్ నుంచి దరఖాస్తు చేసుకోగానే సంబంధింత వీఆర్వో లాగిన్‌లో పరిశీలన చేస్తాడు. అక్కడి నుంచి తహసీల్దార్ లాగిన్‌లో పరిశీలన జరిపి, ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా దరఖాస్తుదారుడి ఇంటికే పోస్టులో రానుంది. ఎప్పడు కావాలంటే అప్పుడు కాకుండా నిర్ణీత కాల పరిమితిలోనే అందుతుంది. ఒకవేళ అత్యవసరం అరుుతే రుసుము ఎక్కువ చెల్లిస్తే ఒక్క రోజులో అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అరుుతే సర్టిఫికెట్‌లను పరిశీలన చేయడానికి ప్రభుత్వం వీఆర్వో, తహసీల్దార్లకు ట్యాబ్‌లను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచింది. అరుుతే సర్టిఫికెట్లు ముద్రించి ఇంటికే పోస్టులో పంపడానికి ప్రత్యేక ప్రింటింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయాలకు చెందిన డిజిటల్ కీని ఉపయోగించి, మీసేవ ఆపరేటర్లు అడ్డగోలుగా సర్టిపికెట్లు సృష్టిస్తున్నారు. వారి ఆటలకు చెక్ పెట్టేలా డిజిటల్ కీ కాకుండా, వేలిముద్రల కీ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

రెండు నెలల్లో అమలు కావచ్చు..
మీ సేవ యాప్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండు, మూడు నెలల్లో ఇది అమలు కావచ్చు. నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జిల్లా నుంచే మీ సేవ యాప్‌ను రూపొందించి ఐటీ మంత్రి కేటీఆర్‌కు వివరించాం. ఇది చాలా బాగా పని చేస్తుందని, ప్రజలకు సులభంగా ఉంటుందని ఆయన అన్నారు. యాప్‌తో మీ సేవ ఆపరేటర్ల ఆటలకు ముకుతాడు పడనుంది. - రమణ్‌రెడ్డి, మీ సేవ కేంద్రాల ఏవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement