పట్టా వెనక పిట్ట కథ
ఇప్పటికే పట్టా ఉన్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరుతో తిరిగి మంజూరు
రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కుకల్పిస్తామంటూ గొప్పలు
అభ్యంతరాల పేరుతో పేదల దరఖాస్తుల తిరస్కరణ
అధికార పార్టీ రాజకీయ ప్రచారమే అసలు రహస్యం
గాజువాక : ఏ మాట వెనుక ఏ ప్రయోజనం దాగి ఉంటుందో తెలియనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు.. 20 శాతాబ్దపు మేధావిగా గుర్తింపు పొందిన కార్ల్ మార్‌కస్ చెప్పిన విషయమిది.. వంద చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలంలోని ఇళ్లను ఉచితంగాను, ఆపై విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను కొంత నగదుతోను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విషయం కార్ల్ మార్‌కస్ మాటలకు అతికినట్టు సరిపోతుంది. ఇప్పటికే పట్టాలున్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ పట్టాలు జారీ చేస్తూ.. అదేంటని ప్రశ్నిస్తే పట్టాకు పిట్టకథలు అల్లుతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం ఇస్తున్న పట్టాకు రెండేళ్ల తరువాత అమ్ముకొనే హక్కు వస్తుందట.. ఇప్పటివరకు పట్టాలు లేని ఎన్ని ఇళ్లను క్రబద్ధీకరించారన్న లెక్కను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు.
అసలు కథ ఏమిటంటే..
ప్రభుత్వం మంజూరు చేసిన క్రమబద్ధీకరణ పట్టాల లబ్ధిదారులకు గతంలోనే పట్టాలు, ఎల్పీసీలు ఉన్నారుు. గాజువాక వంటి హౌస్ కమిటీ పరిధిలో ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో నంబర్ 44ద్వారా 2009లోనే క్రమబద్ధీకరించారు. 2004 మందికి ఉచితంగా పట్టాలు కూడా జారీ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ పట్టాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేయ డానికి కారణమేంటన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నారుు. ప్రభుత్వపరంగా ఏ నియోజకవర్గంలోను అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోరుుంది. దీంతో సొంత పార్టీలో సైతం నిరసన గళం పెరుగుతుండటంతో ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు జీవో 296 ప్రకారం మళ్లీ క్రమబద్ధీకరణ చేయాలంటూ కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈ పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పిస్తున్నామంటూ కహానీలు వినిపిస్తున్నారు. ప్రభుతానికి చిత్తశుద్ధి ఉంటే పాత పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పించలేదా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నారుు. ఇప్పటికే పట్టాలున్న అనేకమందిని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి మరీ కొత్తగా దరఖాస్తు చేరుుంచారు.
పేదలకు న్యాయమేదీ..
ఈ జీవోల ప్రకారం పేదలకు సరైన న్యాయం జరగట్లేదని తెలుస్తోంది. గాజువాక తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అండిబోరుున అన్నపూర్ణ ఆవేదన వింటే ఈ విషయం స్పష్టమవుతుంది. స్థానిక గోపాలరెడ్డినగర్‌కు చెందిన అన్నపూర్ణ ఒక లారీ డ్రైవర్ భార్య. 60 గజాల ప్రభుత్వ స్థలంలో పదేళ్ల క్రితం పాక వేసుకొని భర్త, పిల్లలతో నివాసముంటోంది. పాక స్థలానికి పట్టా ఇవ్వాలని, కరెంటు మీటరు మంజూరు చేయాలని, ఇంటికి పన్ను వేయాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. న్యాయం జరగలేదు. రెండేళ్లుగా కాలనీలోని టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. డబ్బులు ఇస్తే తప్ప పని చేయలేమని వారు స్పష్టం చేయడంతో ఏమీ చేయలేకపోరుుంది. నగరంలో ఇలాంటి అన్నపూర్ణలు అనేక మంది ఉన్నారు. వారి గోడును చంద్రబాబు జీవోలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
సగానికిపైగా దరఖాస్తుల తిరస్కరణ
క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తుల్లో సగానికి పైగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. నగర వ్యాప్తంగా మొత్తం 60వేలకు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 32 వేల దరఖాస్తులకు మాత్రమే పట్టాలు మంజూరయ్యారుు. వాటిలో కూడా నో మ్యాన్ ల్యాండ్, గెడ్డ పోరంబోకు వంటి రకరకాల కారణాలను చూపించి అధికారులు పట్టాలు జారీ చేయడం లేదు. గాజువాక నియోజకవర్గంలోని రెండు మండలాల నుంచి 19,300 మంది దరఖాస్తు చేయగా, వారిలో కేవలం 6,500 మందికే పట్టాలు ఇస్తున్నారు. మిగిలినవాటిని చెరువులు, గెడ్డలు, రహదారుల భూములు వంటి కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఈ కారణాలతోనే గతంలో కూడా పట్టాలు పొందలేని పేదలు ఇప్పుడు కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వలేం..
అభ్యంతరకరమైన స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించలేం. ప్రస్తుతం ప్రకటించిన 32వేల పట్టాలతో పాటు 118 జీవో ప్రకారం మరో నాలుగు వేల పట్టాలను ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. వీటి కోసం మళ్లీ ఎవరూ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మాకు అందిన దరఖాస్తుల నుంచే ఈ కొత్త పట్టాలు అందజేస్తాం. - వెంకటేశ్వర్లు, విశాఖ ఆర్డీవో