సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది.
వచ్చే అక్టోబర్‌లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్‌చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది.
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
Published Fri, Aug 25 2023 6:29 AM | Last Updated on Fri, Aug 25 2023 6:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment