వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక, విదేశీ విధానాలకు ఉత్తర కొరియా నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అందుకే ఆ దేశం పట్ల జాతీయ అత్యవసర పరిస్థితిని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చారిత్రక సమావేశం ముగిసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ పూర్తయ్యే వరకూ ఉ.కొరియాపై ఒత్తిడి, ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాలో ఉ.కొరియా పట్ల అత్యవసర పరిస్థితిని తొలిసారి 2008లో విధించారు.
Comments
Please login to add a commentAdd a comment