failed
-
లాంగ్వేజ్ పరీక్షకు 104 మంది హాజరు.. 99 మంది ఫెయిల్!
ఉత్తరాఖండ్‌లోని ఒక కాలేజీ విద్యార్థులు అందరినీ ఆశ్చర్యపరిచే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయం తెలిసినవారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల పండిట్ శివరామ్ ప్రభుత్వ కళాశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ కళాశాలలో బీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలో 92 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 104 మంది విద్యార్థులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే హిందీ పేపర్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపధ్యంలో జవాబు పత్రాలను మరోమారు మూల్యాంకనం చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఫలితాలతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇటీవల ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో 129 మంది విద్యార్థుల్లో 119 మంది విద్యార్థులు పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 104 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే హిందీలో ఉత్తీర్ణులయ్యారు. 100 మంది విద్యార్థుల్లో 61 మంది విద్యార్థులు పొలిటికల్ సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. హిస్టరీలో 56 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీషులో 28 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సోషియాలజీలో 39 మందికి గాను ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రమేష్ రావత్ మాట్లాడుతూ ఈ విషయమై ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, జవాబు పత్రాలను మరోమారు పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అంజనా శ్రీవాస్తవ మాట్లాడుతూ విద్యార్థులు ప్రశ్నాపత్రాల పునః మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన..
మంచిర్యాల: రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఆ పథకాలతో కొంతమంది లబ్ధి పొందగా, చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు బీసీబంధు, మైనారిటీ బంధు పథకాలు ప్రారంభించి దరఖాస్తులను స్వీకరించారు. మొదటి విడతలో కొందరు లబ్ధి పొందారు. ఇక సొంత ఇంటి కలను తీర్చేందుకు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి దరఖాస్తులను తీసుకున్నా అర్హులకు ఎలాంటి సాయం అందించలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. పథకాలు కొనసాగుతాయా.. కొనసాగినా తమకు వర్తిస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బీసీ, మైనారిటీ బంధు కొందరికే.. జిల్లా వ్యాప్తంగా బీసీబంధు కోసం దరఖాస్తు చేసుకున్న 11,107 మందిలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులుగా 7,734 మందిని గుర్తించారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది చొప్పున మూడు నియోజకవర్గాల నుంచి 900 మందికి రూ. లక్ష సాయం అందించారు. రెండో విడతలో మరో 900 మందిని గుర్తించినా, వారికి అందించాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకానికి బ్రేక్ పడింది. ఇక మైనారిటీలకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 2,709 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 100 మందిని మొదటి విడతలో గుర్తించి, వారికి రూ.లక్ష చొప్పున అందించారు. మిగతావారికి సాయం అందించేందుకు నిధులు విడుదల చేయలేదు. ‘గృహలక్ష్మి’పై సందిగ్ధం.. సొంత ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా 51,764 మంది దరఖాస్తు చేసుకోగా, 40,501 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.3 లక్షల అందించాల్సి ఉంది. నిర్మాణాలకు అనుగుణంగా మూ డు విడతల్లో దీనిని అందించాలని భావించింది. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50, జనరల్ కేటగిరీలకు 20 శాతం రిజర్వు చేశారు. నియోజకవర్గానికి 3 వేల మందికి ఇవ్వాలని భావించినా గుర్తించడంలో జరిగిన ఆలస్యంతో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదు. -
ఎయిర్ హోస్టెస్ రూపా కేసులో వీడిన మిస్టరీ
ముంబయి: ముంబయి ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రవ్ అట్వాల్(40)ను కోర్టులో హాజరుపరిచారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలను జడ్జి ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. అసలేం జరిగింది..? ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ముంబయి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. అంధేరీ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. అయితే.. రెండు రోజుల క్రితం రూపా తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. అత్యాచారం ప్లాన్ బెడిసికొట్టడంతో.. రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండేవాడు. అతడు ఆ హౌజింగ్ సొసైటీలో క్లీనింగ్ నిర్వహించే ఏజెన్సీలో ఉద్యోగి. తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. రూపా ఇంటికి వెళ్లి మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. విషయం బయటపడుతుందని బయపడిన విక్రమ్.. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాను సన్నిహితులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ కేసులో హౌజింగ్ సొసైటీలో దాదాపు 45 మందిని పోలీసులు విచారించారు. An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit. She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI — NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023 ఇదీ చదవండి: ఢిల్లీ: ఆ ముగ్గురు మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్‌లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
ఈ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైనా చార్జీలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మే 1వ తేదీ నుంచి కస్టమర్ల ఖాతాలలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ లావాదేవీకి రూ.10 చొప్పున పెనాల్టీ ఛార్జీని బ్యాంక్ విధంచనుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అలాగే ఛార్జీల గురించి కస్టమర్లకు తెలియజేయడానికి ఎస్సెమ్మెస్‌లు పంపడం ప్రారంభించింది. అయితే ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే ఆ సమస్యను పరిష్కరించడానికి పీఎన్బీ మార్గదర్శకాలను రూపొందించింది. విఫలమైన ఏటీఎం ట్రాన్సాక్షన్ గురించి కస్టమర్లు ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన ఏడు రోజుల్లో బ్యాంక్ ఆ సమస్యను పరిష్కరిస్తుంది. ఒక వేళ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం అందుతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 1800180222 లేదా 18001032222 ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. కాగా మే 1 నుంచి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే రూ.10తోపాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఖాతాదారులకు బ్యాంక్ ఇదివరకే సమాచారం అందించింది. -
చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన కరువు
-
ఎగ్జామ్‌లో ఫెయిలైన చాట్‌జీపీటీ.. అట్లుంటది ఇండియా అంటే!
చాట్‌జీపీటీ పేరు అతి తక్కువ కాలంలోనే ప్రపంచం మొత్తం మారు మోగిపోతోంది. చాట్‌జీపీటీ చేయలేని పనే లేదంటూ మన దగ్గరి నుంచి ఇన్పుట్ తీసుకుని వేగంగా అవుట్‌పుట్ ఇవ్వగల సత్తా దీని సొంతమని అగ్ర రాజ్యాలు సైతం చెబుతున్నాయి. కానీ ఇటీవల ఇండియాలో జరిగిన పరీక్షల్లో మాత్రం చాట్‌జీపీటీ బొక్కబోర్లా పడింది. చాట్‌జీపీటీ ఇప్పటికే ఎన్నో కష్టతరమైన పారీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. అయితే భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేయలేక ఫెయిల్ అయింది. అంతే కాకుండా ఇండియాలో టాప్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ ఆయిన 'జేఈఈ అడ్వాన్స్డ్' లో కూడా చాట్‌జీపీటీ ఫెయిల్ అయినట్లు తెలిసింది. జేఈఈ అనేది భారతదేశంలో ఐఐటీ, ఎన్ఐటీల వంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్లలో చోటు సంపాదించుకోవడం కోసం విద్యార్థులు పెట్టే పరీక్ష. అలాంటి పరీక్షలో చాట్‌జీపీటీ నెగిటివ్ స్కోర్ చేసింది. రెండు పేపర్లలో కలిపి కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే AI సమాధానం ఇచ్చింది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్లో ఏఐ చాట్‌బాట్ 45 శాతం మార్కుల్ని సాధించింది. (ఇదీ చదవండి: నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..) ఈ పరీక్షలు మాత్రమే కాకుండా NEET ఎగ్జామ్‌లో 200 ప్రశ్నలకు గానూ 180 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉండగా చాట్‌జీపీటీ ప్రయత్నం ఇక్కడ కూడా వృధా అయింది. బయాలజీ సెక్షన్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చినట్లు చెబుతున్నారు. CLAT పరీక్షలో కూడా చాట్‌జీపీటీ అంతంతమాత్రంగానే నిలిచింది. ఇందులో కేవలం 50.83 శాతం ప్రశ్నలకు మాత్రమే బదులిచ్చింది. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నల విభాగంలో ఏఐ ఫెయిల్ అయింది. కానీ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్‌లో మాత్రం ఎక్కువ మార్కులు సాధించింది. దీన్ని బట్టి చూస్తే కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలకు చాట్‌జీపీటీ సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోందని తెలుస్తోంది. 2022 నవంబర్‌లో ప్రారంభమైన చాట్‌జీపీటీ అమెరికాలో నిర్వహించిన యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వంటి ఎన్నో పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి, లెవెల్ 3 ఇంజినీర్ల కోసం నిర్వహించే గూగుల్ కోడింగ్ ఇంటర్వ్యూలలో కూడా తనదైన సత్తా చాటుకుంది. (ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!) అమెరికా పరీక్షల్లో పాసై భారతదేశంలో మాత్రం తన సత్తా చాటలేకపోయింది. ఇదిలా ఉండగా చాట్‌జీపీటీ టెక్నాలజీతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. -
విఫలమైన మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్
-
గ్లోబల్ గవర్నెన్స్ ఫెయిల్! ఆ దేశాల గళం వినిపిస్తాం!
ఉక్రెయిన్‌లోని రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా జీ20 విదేశాంగ మంత్రులు సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఈ జీ20 సమావేశాలు భారత అధ్యక్ష హోదాలో ఢిల్లీలోని హరియానాలో గురుగ్రామ్ వేదికగా మార్చి1 నుంచి 4వ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.. "ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయన్నారు. అంతేగాదు ప్రస్తుతం ప్రపంచ స్థాయి సంస్థలు సంక్షోభంలో ఉన్నాయనే దానిని మనందరం గుర్తించాలి. దీనికి ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారీ, ఉగ్రవాదం, యుద్ధాలే నిదర్శనమని, అందువల్లే ప్రపంచ పాలన వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. సంవత్సరాల పురోగతి తర్వాత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల కోసం మనం మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదంలో ఉన్నాం. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో సతమతమవుతున్నాయి. అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారత్ దక్షిణాది గళం వినిపించేందుకే యత్నిస్తోంది. మనమంతా ప్రపంచ విభజన సమయంలో కలుస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలపై సాముహికంగా పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ఈ సమావేశంలో పాల్గొనని వారిపట్ల కూడా మాకు బాధ్యత ఉంది. మన కలిసి చేయగలిగిన వాటిల్లోకి పరిష్కరించలేని సమస్యలను తీసుకురాకూడదు. తమ చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశం లీడర్షిప్ను సాధించలేదు. మనల్ని ఏకం చేస్తున్న వాటిపై దృష్టి సారించాలి గానీ విభజించే వాటిపై కాదని" సదస్సులో ప్రదాని మోదీనొక్కి చెప్పారు. కాగా, రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరుగుతున్న ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దాదాపు 40 మంత్రి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాల తోపాటు బంగ్లాదేశ్, ఈ జిప్ట్, నెదర్లాండ్స, మారిషస్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోసహా తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం. (చదవండి: బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి) -
గన్ షాట్ : కుప్పం డ్రామా ఎందుకు బెడిసికొట్టింది..?
-
బెడిసికొట్టిన చంద్రబాబు పన్నాగం..
-
నేషన్ వాంట్స్ టు నో
అది 1978, జనవరి 14వ తేదీ ఉదయం. ముంబై (అప్పుడు బొంబాయి)లో ఉన్న రిజర్వ్ బ్యాంకు చీఫ్ అకౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం. ఆయన ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు, ఒక ఆర్డినెన్స్ ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లని చలా మణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పిం చిందనీ, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలనీ, ఇదంతా చాలా గోప్యంగా జరగాలనీ రామన్‌ను ఆదేశించారు. అనుకున్న పద్ధతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారు జాము కల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్‌కు ఈ రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ఆయన అభి ప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు. భారతీయ ఆర్థిక విధానాలపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు. ‘పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ నాతో ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబ ట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.’ ‘సాధారణంగా అవినీతి, అక్రమ పద్ధతుల్లో భారీఎత్తున డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను కరెన్సీ రూపంలో ఎక్కువ కాలం దాచిపెట్టుకోరు’ అన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభిప్రాయం. 1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనతా ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్‌కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నేళ్ళ తరు వాత, 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అయిదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలవి కావడం మరో పోలిక. నవంబర్ ఎనిమిది సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసే సమ యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చో బెట్టి ప్రభుత్వ సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియ చేయడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజలనుద్దేశించి రేడియో, దూరదర్శన్లలో ప్రసం గించారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అనీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరనీ తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లలో భాగమే కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారు చేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం. ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే, దాన్ని విన్న ప్రజలందరికీ, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోదీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభి ప్రాయం కలిగింది. ‘కొద్ది రోజులు కటకట పడితే పడదాము, కష్టాలు శాశ్వతంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దు’ అనే భావన సర్వత్రా కనబడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొ కటన్న అభిప్రాయం బలపడసాగింది. బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడక పోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడా లేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల వద్దా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొట మరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. అయితే ప్రజలకు ఉన్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే మంచి రోజుల కోసం ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టారు. దానితో పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజల మద్దతు పూర్తిగా లభించినట్టు అయింది. దేశానికి సంబంధించి తీసుకున్న ఒక కీలక, ప్రధాన నిర్ణయానికి ప్రజల మద్దతు పొందడం మామూలు విషయం కాదు. ఆ మేరకు ప్రధాని మోదీ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. కానీ నల్లధనం రద్దుకు తీసుకున్న ఈ నిర్ణయం వికటించిందా, ఫలించిందా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు అంతకు ముందు లేని ఒక మంచి అలవాటు అలవడింది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా నగదు రహిత చెల్లింపులకు అలవాటు పడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో దేశంలో ద్రవ్య చలామణి 17.97 లక్షల కోట్లు వుండగా ఇప్పుడది 72 శాతం పెరిగి 30.88 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాలు చెబు తున్నాయి. గత ఆరేళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి. ప్రతి చిన్నా, పెద్దా ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు విచ్చల విడిగా డబ్బు వెదజల్లారు. ఇదంతా ప్రజలు కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత కూడా బడా బాబుల దగ్గర ఇంతంత డబ్బు ఎలా పోగుపడింది? పెద్ద నోట్ల రద్దు పెద్దగా ఫలించలేదు అనడానికి ఇది తార్కాణం. కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు వుంది. భండారు శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Attack On Putin: కారు దాడి నుంచి పుతిన్ క్షేమం
మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. పుతిన్ ఇటీవలే అత్యాధునిక లిమోసిన్ కారులో ప్రయాణిస్తుండగా, ముందుభాగంలో ఎడమ వైపు చక్రం పెద్ద శబ్దంతో పేలిందని, వెంటనే పొగ వెలువడిందని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించాయి. భద్రతా లోపాలకు బాధ్యులుగా గుర్తిస్తూ పుతిన్ సెక్యూరిటీ సర్వీసులోని కొందరిని అరెస్టు చేశారని, మరికొందరు అంగరక్షకులను విధుల నుంచి తొలగించారని జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ చానల్ తెలియజేసింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక నిజంగా పుతిన్‌ను అంతం చేయడానికి ఎవరైనా కుట్ర పన్నారా? అనేది నిర్ధారణ కాలేదు. క్రెమ్లిన్ వర్గాలు దీనిని ధృవీకరించాల్సి ఉంది. అలైనా ఎక్కడ? ఇదిలా ఉండగా, పుతిన్‌కు అలైనా కబాయెవా(39) అనే ప్రియురాలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అని సమాచారం. వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, పుతిన్ ఒత్తిడి చేయడంతో అలైనా గర్భస్రావం చేయించుకున్నారని రష్యాలోని అనధికార వర్గాలు వెల్లడించాయి. పుతిన్‌తో ఆమె ఇప్పటికే పలువురు పిల్లలను కన్నట్లు తెలుస్తోంది. అలైనా చివరిసారిగా ఈ ఏడాది జూన్ మొదటివారంలో కనిపించారు. ఆ తర్వాత జాడ లేదు. ఇదీ చదవండి: లాస్ట్ ఫ్లైట్ జర్నీ...విమానంలో క్వీన్ మృతదేహం -
తెలంగాణలో మరోసారి ఫెయిలైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్
-
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్
-
SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. తొలి మూడు దశలు విజయవంతం ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది. అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు. పనిచేయని సెన్సర్లు.. అందని సిగ్నల్స్ రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు. ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఎస్.సోమనాథ్ అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగమంతా సక్సెస్ అయినట్టేనని, ఆఖర్లో ఉపగ్రహాలు చేరుకున్న కక్ష్య దూరంలో తేడా రావడంతో చిన్నపాటి ఇబ్బంది తలెత్తిందని చెప్పారు. వీలైనంత త్వరగానే.. అంటే వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు. ఇప్పుడు చోటుచేసుకున్న ఈ చిన్నపాటి లోపాలను సరిచేసుకుంటామని, మరో ప్రయోగంలో కచ్చితంగా విజయం సా«ధించే దిశగా అడుగులు వేస్తామని అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్లు కె.రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్‌కుమార్, కె.శివన్ తదితరులు విచ్చేసి, ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగాన్ని వీక్షించారు. ఆ ఉపగ్రహాలు ఇక పనిచేయవు నిర్దేశిత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి ప్రవేశించిన మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్ ఉపగ్రహాలు ఇక పనిచేయవని, వాటితో ఉపయోగం లేదని ఇస్రో తేల్చిచెప్పింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రస్తుతం జరిగిన పొరపాటును శాస్త్రవేత్తల కమిటీ విశ్లేషించనుందని పేర్కొంది. ఎస్ఎస్ఎల్వీ–డీ2 ప్రయోగంలో ఇలాంటి అపశ్రుతులు పునరావృతం కాకుండా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని వెల్లడించింది. ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ రెండు శాటిలైట్లను 356 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా, 356 కిలోమీటర్లు x 76 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఇస్రో తెలియజేసింది. -
కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి ఆత్మహత్య
తిరువొత్తియూరు: పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోడ్ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది. వివరాలు.. అంబాపేట సమీపం కల్బావి తొట్టిపాళ్యెంకు చెందిన అప్పుస్వామి (45), సుమతి దంపతులకు సంజయ్ (15), చంద్రు ఇద్దరు కుమారులు ఉన్నారు. మైలంపాడి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంజయ్ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అప్పుస్వామి కుమారుడిని మందలించి ట్యూషన్‌కు పంపించాడు. అయితే సంజయ్ దాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుస్వామి ఆందోళనకు గురయ్యాడు. పురుగుల మందు తాగి స్పృహ తప్పాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని ఈరోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడు. దీనిపై అంబాపేట పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. -
ఆడిషన్స్ ఇచ్చా కానీ.. రెండుసార్లు రెజెక్ట్ చేశారు: ప్రముఖ హీరో
Tiger Shroff Says Hollywood Is His Goal But I Have Failed In Auditions: బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా నటించిన చిత్రం 'హీరోపంతి 2'. 2014లో వచ్చిన రొమాంటిక్-యాక్షన్ మూవీ 'హీరోపంతి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారా సుతారియా హీరోయిన్గా యాక్ట్ చేసింది. సాజిద్ నడియద్వాలా నిర్మించగా, ఇందులో లైలా అనే ప్రతినాయకుడి పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తనదైన యాక్టింగ్ మార్క్ చూపించనున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో 'మీరు హాలీవుడ్‌కు వెళ్లే సమయం వచ్చిందా' అని అడిగిన ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ ఆసక్తిర విషయాలు తెలిపాడు. 'హాలీవుడ్లో యాక్షన్ హీరోలు ఎవరు లేరు. అందులోనూ నా ఏజ్ గ్రూప్ యాక్షన్ హీరోలు అసలే లేరు. 90వ దశకం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ తప్ప పూర్తి తరహాలో యాక్షన్ చిత్రీకరించే నైపుణ్యం ఉన్న వారిని చూసి చాలా కాలం అయింది. అయితే హాలీవుడ్ నుంచి నాకు రెండు సార్లు ఆఫర్ వచ్చింది. కానీ ఆ రెండు సార్లు ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అయినా నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కాబట్టి చూద్దాం. హాలీవుడ్ సినిమాల్లో నటించడమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు టైగర్ ష్రాఫ్. కాగా సైబర్ నేరాలను అరికట్టేందుకు లైలాతో బబ్లూ (టైగర్ ష్రాఫ్) అనే వ్యక్తి ఎలా తలపడ్డాడనేదే 'హీరోపంతి 2' కథ అని తెలుస్తోంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పరీక్షల్లో ఫెయిలవ్వొద్దు అన్నందుకు తండ్రి హత్య! ట్విస్ట్ ఏంటంటే?
Scared of rebuke for failing exams: తల్లిదండ్రులు మందలించారనో లేకు తాము అడిగింది కొనివ్వటం లేదనో కన్న తల్లిదండ్రుల పై కక్ష సాధించే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. అంతెందుకు దురాలవట్లకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాస్త కఠినంగా వ్యవహరించినందుకే తల్లిదండ్రులనే హతమార్చే కిరాతక పిల్లల గురించి విన్నాం. అచ్చం అలానే మధ్యప్రదేశ్‌లోని ఒక బాలుడు దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అతని తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంటి నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్ అయితే కచ్చితంగా ఇంటి నుంచి గెంటేయడం ఖాయం అన్న భయంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ బాలుడు నేరం చేయడమే కాకుండా ఈ హత్య నేరంలో తమ పక్కంటివాళ్లను ఇరికించేందుకు యత్నించాడు. అంతేకాదు తమ పక్కింటివాళ్లే తన తండ్రిని చంపారని, తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఫోరెన్సిక్ విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించడు. ఫైనల్ పరీక్షలు సరిగ్గా చదవలేదని అందువల్ల ఫెయిల్ అవుతానని భయపడ్డానని ఆ బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజీవ్ మిశ్రా ఆ బాలుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. (చదవండి: జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..) -
రుణ రికవరీలకు యూపీఏ ప్రభుత్వ చర్యలు శూన్యం
న్యూఢిల్లీ: రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) మార్చిన వారి నుండి డబ్బును రికవరీ చేయడంలో గత యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో సోమవారం తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో బ్యాంకులు మొదటిసారి డిఫాల్టర్ల నుండి డబ్బును తిరిగి రాబట్టగలుగుతున్నాయని స్పష్టం చేశారు. రుణ ఎగవేతదారులపై ప్రభుత్వ చర్యల గురించి డీఎంకేకు సభ్యుడు టీఆర్ బాలు అడిగిన ప్రశ్న ఆమె ఈ మేరకు సమాధానం చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...వివిధ మోసపూరిత చర్యల ద్వారా చిన్న మొత్తాల పొదుపు డిపాజిటర్లను మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ల నమోదుతో సహా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. యాప్ ఆధారిత ఆర్థిక సంస్థల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రుణాలను ‘‘రైట్ ఆఫ్’’ చేయడం అంటే ‘పూర్తిగా మాఫీ చేయడం‘ కాదు. బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందేందుకు బ్యాంకులు తగిన ప్రతి చర్యనూ తీసుకుంటాయి. ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని, వారి నుంచి రుణ బకాయిల రికవరీకి ప్రభుత్వ రంగ బ్యాంకులు తగిన అన్ని చర్యలూ తీసుకుంటాయి. ఎఫ్ఆర్డీఐ బిల్లుపై ఇలా... ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు, 2017 (ఎఫ్ఆర్డీఐ బిల్లు)ను కేంద్రం 2017 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అటు తర్వాత దానిని సమీక్షించి నివేదిక పంపాలని కోరుతూ పార్లమెంట్ జాయింట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రధాన లక్ష్యం ఎంపిక చేసిన ఆర్థిక రంగ సంస్థల వివాదాలకు ప్రత్యేక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. కాగా, ప్రభుత్వం ఎఫ్ఆర్డీఐ బిల్లును 2018 ఆగస్టులో ఉపసంహరించుకుంది. మరింత సమగ్ర పరిశీలన, అ అంశంపై పునఃపరిశీలన ఈ ఉపసంహరణ ఉద్దేశం. అయితే అటు తర్వాత ఈ అంశానికి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డిపాజిటర్లకు రక్షణ.. డిపాజిట్ల రక్షణకు సంబంధించి ఆమె చేసిన ప్రసంగాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఇన్సూరెన్స్ కింద బ్యాంకుల్లో డిపాజిటర్లకు బీమా కవరేజ్ పరిమితిని లక్ష రూపాయల స్థాయి నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. బ్యాంకుల్లో డిపాజిటర్లకు మరింత రక్షణ కల్పించాలన్నది ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ నిర్ణయం 2020 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దివాలా చర్యల పటిష్టత దివాలా ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరక్కుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటుందని ఆర్థికమంత్రి తెలి పారు. ప్రకటన ప్రకారం, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ ప్రొసీడింగ్స్– అడ్జుడికేటింగ్ అథారిటీకి దరఖాస్తు నిబం« దనలు, 2019ను 2019 నవంబర్ 15న ప్రభుత్వం నోటిఫై చేసింది. బ్యాంకులు కాకుండా ఇతర ప్రొవైడర్లు లిక్విడేషన్ ప్రొసీ డింగ్స్‌లో ఎటువంటి అవరోధాలూ ఎదురుకాకూడదన్నది దీని లక్ష్యం. తదనంతరం రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకూ (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) దివాలా కోడ్, 2016 వర్తించేలా నిబంధనలను 2019 నవంబర్ 18న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
భారత్‌తో పాక్ పోటీ.. చివరకు ఇలా పరువు తీసుకుంది.. వీడియో వైరల్
సాక్షి , న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ ప్రయోగించిన ఓ మిసైల్ విఫలమై సింధ్ జంషోర్ ప్రాంతంలో ఆకాశం నుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి పొరపాటుగా పాక్ భూ భాగంలో పడిపోయింది. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో పాక్ క్షిపణి ప్రయోగానికి రెడీ అయ్యింది. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు క్షిపణి ప్రయోగం చేపట్టాలని ప్లాన్ చేసింది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం ఓ గంట ఆలస్యమైంది. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు క్షిపణి ప్రయోగం జరిగింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన క్షిపణి కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగలు కక్కుతూ కిందకు పడిపోయింది. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ భూభాగంలో భారత క్షిపణి పడిపోవడంతో పాక్ కూడా అదే తరహాలో పోటీపడి ఈ మిసైల్‌ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. కానీ, టార్గెట్‌ను చేరేలోపే ఆ క్షిపణి కిందికి పడిపోవడంతో పాక్ ఇలా పరువు తీసుకుంది. మరోవైపు.. క్షిపణి ప్రయోగం విఫలమైందన్న వార్తలను స్థానిక అధికారిక వర్గాలు ఖండించాయి. అది మిసైల్ కాదని, సైన్యం ప్రయోగించే సాధారణ మోర్టార్ అని తెలిపాయి. #Breaking: An unidentified object or SAM missile fallen from Sky in Jamshoro, Pakistan. #Jamshoro#Pakistan pic.twitter.com/1y5ZhgoUMb — Wᵒˡᵛᵉʳᶤᶰᵉ Uᵖᵈᵃᵗᵉˢ𖤐 (@W0lverineupdate) March 17, 2022 -
ఫెయిలైనట్టు యువతికి తప్పుడు మెసేజ్.. అంతా అయిపోయిందంటూ..
సాధారణంగా పొరపాట్లు జరుగుతుండడం సహజం. అయితే ఆ పొరపాట్లు చిన్నవైనా, లేదా సరిదిద్దుకునేలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వాటి వల్ల ఓ నిండు ప్రాణం బలైన విషాద ఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఓ యువతికి పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు పొరపాటున మెసేజ్ వచ్చింది. దీంతో ఆ బాధను భరించలేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక మీడియా తెలపిన వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్‌లో నార్త్ వేల్స్‌లోని ఏంగ్లెసేకు చెందిన మేరెడ్ ఫౌల్కీ అనే 21 ఏళ్ల అమ్మాయి కార్డిఫ్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం ఫార్మాసూటికల్స్ చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసిన ఫౌల్కీకి కొన్ని రోజుల తరువాత యూనివర్సిటీ నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. అందులో.. తను సెకండ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని, ఈ కారణంగా మూడో సంవత్సరానికి వెళ్లేందుకు వీలు లేదని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఎంతో ఇష్టంగా ఆ కోర్సు చదువుతున్న ఫౌల్కీ ఆ బాధను తట్టుకోలేక బతకడం వ్యర్థంగా భావించింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలోని బ్రిటానియా బ్రిడ్జి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫౌల్కీ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అందులో ఆమె 62 శాతం మార్కులతో పాసైనట్లు తేలింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు తప్పుడు మెసేజ్ ఇచ్చిన యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది. చదవండి: Afghanistan: దేశంలో పరిస్థితి బాలేదు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి: తాలిబన్లు -
PM Kisan Shceme : రైతులకు దక్కాల్సిన రూ.820 కోట్లు ఏమయ్యాయి?
ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వాహణ విషయంలో బ్యాంకులు చేస్తోన్న తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరో ఉదాహరణగా నిలుస్తోంది. కిసాన్ యోజన దేశంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000లను కేంద్రం అందిస్తోంది. ప్రతీసారి రూ. 2,000ల వంతున మూడు విడతలుగా ఈ సాయం చేస్తోంది. ఈ పెట్టుబడి సాయం నేరుగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. వ్యవసాయ శాఖ లెక్కలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద దేశ వ్యాప్తంగా 68.76 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతీ నాలుగు నెలలకు రెండు వేల వంతున జమ చేస్తున్నారు. అయితే రెండేళ్ల కాలానికి సంబంధించి ఎంత మంది రైతులకు సాయం చేశారనే వివరాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ ప్రకటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దాదాపు దేశ వ్యాప్తంగా ఒక శాతం మంది రైతులకు పెట్టుడి సాయం అందలేదు. 41 లక్షల మంది రైతులు రూ. 820 కోట్లు 2019 ఫిబ్రవరి నుంచి 2021 జూన్ 30 వరకు సేకరించిన వివరాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల ఏకంగా 61.04 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కాలేదు. బ్యాంకులు మరోసారి ప్రయత్నించగా విఫలమైన ఖాతాల్లో 34 శాతం మేరకు అంటే 20.88 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా జమ కాలేదు. అంటే దాదాపు రూ.820 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలకు చేరనేలేదు. అక్కడే ఎక్కువ వెనుకబాటుతనం ఎక్కువగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే ఈ తరహా ఫెయిల్డ్ ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ 10.95 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వారు ఫిర్యాదులు చేయగా ఇందులో కేవలం 8 శాతం మందికి అంటే 91 వేల మందికి తిరిగి డబ్బులను బ్యాంకులు జమ చేశాయి. బీహార్ విషయానికి వస్తే 1.38 లక్షల విఫల లావాదేవీలు ఉండగా ఇందులో కేవలం 6.8 శాతం మందికే 9,493 మందికే తిరిగి డబ్బులు జమ అయ్యాయి. నిర్లక్ష్యం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డబ్బు తిరిగి ప్రభుత్వం వద్దకే చేరిందా ? లేక బ్యాంకర్ల దగ్గరే ఆగిపోయిందా అనే అంశంపై స్పష్టత లేదు. కానీ 41 లక్షల మంది రైతులకు అందాల్సిన రూ. 820 కోట్లు దక్కకుండా పోయాయి. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకర్లు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. -
అన్ని రంగాల్లో విఫలమైన కేసీఆర్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎంగా కేసీఆర్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారని ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల, ఆందోళనల, అవినీతి తెలంగాణగా మార్చారని ఆరోపించారు. మంత్రులే తమ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. -
గోకులం.. అంతా కలకలం
సాక్షి, ఆమదాలవలస రూరల్: వ్యవసాయరంగానికి పెద్దపీట అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. పథకాలు, రాయితీలు, సబ్సీడీలు ఇవిగో అంటూ ఒక చేత్తో చూపించి మరో చేత్తో లాగేసుకుంటూ పథకం ప్రకారం పక్కాగా మోసం చేస్తున్నారు. ఇటీవల పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అమలు చేసిన గోకులం పథకమే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 90 శాతం రాయితీతో మొదట ఊరించిన టీడీపీ సర్కారు ఉన్న ఫలంగా రాయితీపై కొర్రీలు వేయడంతో చివరికి పథకాన్ని అటకెక్కించారు. ఈ పథకం గురించి పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా గోకులం గురించి రైతులు తగిన ప్రచారం చేయకపోవడంతో షెడ్లు నిర్మించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన టెక్నికల్ మోనటరింగ్, ఎంపీడీఏలు కేవలం కార్యాలయానికే పరిమితం కావడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బిల్లులు మంజూరుకాకపోయినా సరే నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో నిర్మించిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఊరించిన సర్కార్ .. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో సామాజిక గోకులాలు, మినీ గోకులాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్ రైతులను ఊరించింది. నాలున్నరేళ్లగా రైతులకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మభ్యపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు గోకులం అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో రైతులు ఎగబడ్డారు. ఉపా«ధి హామీ పథకానికి అనుసంధానంతో గోకులం(పశు వసతి గృహం) నిర్మించనున్న లబ్ధిదారులు తమ వాటా కింద 10 శాతం భరిస్తే మిగతా 90 శాతం రాయితీ రూపంలో ఇస్తామని నమ్మబలికారు. పథకం బాగానే ఉందంటూ చాలా మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గోకులాల కేటాయింపులు ఇలా గోకులాల పథకం ప్రవేశపెట్టినప్పుడు మూడు పథకాలు అమల్లో ఉండేది. రెండు పశువులకు గాను షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.10 వేలు, ప్రభుత్వం నుంచి రూ. 90 వేలు కేటాయించారు. నాలుగు పశువులకు షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.15 వేలు, ప్రభుత్వం వాటా రూ.1.35 లక్షలు, ఆరు పశువులకు షెడ్డు నిర్మిస్తే రైతు వాటా రూ.18 వేలు, ప్రభుత్వం వాటా రూ. 1.68 లక్షలు అంటూ చెప్పడంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. నిర్మించినవి ఇవే.. ఆమదాలవలస మండలంలో 426 మంది రైతులు గోకులానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ప్రస్తుతానికి 40 షెడ్లు పూర్తిగా నిర్మాణాలు జరిపారు. గొర్రెల కాపరులు కూడా 30 షెడ్లు నిర్మించారు. ఇందులో 180 షెడ్లు నిర్మాణ దశలో ఉండగా 176 షెడ్లు పునాదుల దశలో ఉన్నాయి. బూర్జ మండలంలో కేవలం 69 షెడ్లు మాత్రమే పనులు జరుగుతున్నవి. అయితే గోకుల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు కాలేదు. బిల్లు రాలేదు గోకులం పథకం పేరుతో గొర్రెల నివాసానికి షెడ్డు నిర్మిస్తున్నాను. గోతులు తీసి పునాదులు కూడా వేశాను. ఇప్పటి వరకు పైసా బిల్లులు కూడా మంజూరు కాలేదు. పునాదుల కోసం అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టాను. బిల్లులు మంజూరు కాకపోతే తీవ్రంగా నష్టపోతాను. –తాన్ని ఎర్రయ్య, లబ్ధిదారుడు, బొబ్బిలిపేట, ఆమదాలవలస మండలం పథకం మంజూరు కాలేదు గోకులం పథకం ద్వారా పశువుల షెడ్డు నిర్మించడానికి డీడీ తీశాను. పథకానికి అర్హత ఉన్నా ఇంతవరకు మంజూరు చేయలేదు. డీడీ తీసుకుని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే తప్ప నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. డీడీ తీసుకుని నష్టపోవడం తప్ప ఉపయోగం లేదు. – గేదెల లక్ష్మణరావు, దూసి, ఆమదాలవలస మండలం బడ్జెట్ విడుదల కాలేదు గోకులం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు కావడం లేదన్న మాట వాస్తవమే. బిల్లులు నివేదికను జిల్లా అధికారులకు అందజేశాం. బడ్జెట్ విడుదల కానందున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు రాకున్నా పనులు నిలుపుదల చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకే పనులు వేగవంతం చేస్తున్నాం. –ఆర్.ఆనందరావు, పశుసంవర్థకశాఖ ఏడీ, ఆమదాలవలస -
రూ.14.23 కోట్లు వృథా
సాక్షి, సింగరాయకొండ: నిధులు మంజూరయ్యాయి.. ఇక తమ కష్టాలు తీరతాయి.. పుష్కలంగా పంటలు పండుతాయనుకున్న రైతన్న ఆశలు నెరవేరలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి అన్నదాతలకు నిరాశే మిగిల్చింది. సింగరాయకొండ ప్రాంత రైతాంగానికి ప్రధాన నీటి వనరు అయిన పీబీ (పాలేరు–బిట్రగుంట) సప్లయ్ చానల్‌కు కాంగ్రెస్ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. కానీ,ఆ ప్రభుత్వ హయాంలో 50 శాతం కూడా పని జరగలేదని, తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్క శాతం కూడా పని చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగం పనులు కూడా జరగ లేదని రైతులంటుండగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మాత్రం 10 శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుండటం విశేషం. పీబీ సప్లయ్ చానల్ ఆయకట్టు.. ఈ చానల్ పరిధిలో సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలోని తొమ్మిది మీడియం ఇరిగేషన్ చెరువులకు పాలేరు పై జిల్లెళ్లమూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ ద్వారా సాగు నీరు సరఫరా అవుతుంది. రిజర్వాయర్ నుంచి సుమారు 30 కిలోమీటర్లు ఉన్న ఈ చానల్ ద్వారా జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట చెరువుకు, సింగరాయకొండ మండల పరిధిలోని కలికవాయ పంచాయితీలో చవిటిచెరువు, మూలగుంటపాడు పంచాయతీలో జువ్వలగుంట చెరువు, పాకల పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు, పాంచ్ చెరువు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని రాజు చెరువు, మర్రిచెరువు, కొండ్రాజుగుంట చెరువు, బింగినపల్లి పంచాయతీలోని బింగినపల్లి చెరువుకు నీరు సరఫరా అవుతుంది. ఈ చెరువుల పరిధిలో సుమారు 7 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 10 వేల ఎకరాలలో అనధికారికంగా సాగవుతోంది. ఈ చానల్ పరిధిలోని చెరువుల కింద ప్రధానంగా రబీలో వరి సాగు చేస్తారు. చెరువులు ఏటా రెండు సార్లు నిండితేనే ఆయకట్టులో పంట పూర్తిగా పండుతుంది. పూడికతో ఉన్న చానల్,రిజర్వాయర్.. రిజర్వాయర్ వద్ద ఇసుక మేట కారణంగా వర్షపునీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లో పూడిక తీయాలని ఆయకట్టు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. రిజర్వాయర్ కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటంతో పాటు రిజర్వాయర్ చుట్లూ చుట్టు పక్కల గ్రామాల రక్షిత మంచినీటి పధకం బోర్లు ఉండటంతో తమ మంచినీటి స్కీములు దెబ్బతినే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు అడ్డుపడటంతో రాజకీయ ప్రాబల్యం కారణంగా పూడికతీయక పోవటంతో చానల్ సక్రమంగా పారక ఆయకట్టు సక్రమంగా పండటం లేదని రైతులు వాపోతున్నారు. నాడు రెండు పంటలు.. పీబీ చానల్లో పూడిక పేరుకు పోయి ఉండటంతో సుమారు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం పై ఆధారపడకుండా ఆయకట్టు రైతులు నడుంబిగించి సొంతంగా చానల్లో పూడిక తొలగించుకుని రెండు పంటలు పండించారు. తరువాత చానల్లో పూడికపేరుకు పోవడం, వర్షాభావ పరిస్థితులు తోడవటంతో ఒక్క పంటే పండిస్తున్నారు. జపాన్ నిధులు మాయం.. చానల్ అభివృద్ధికి 14.23 కోట్ల రూపాయల జపాన్ నిధులు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్ పనులు నాసిరకంగా చేయడంతో పాటు 50 శాతం పనులు కూడా చేయలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరికి నిధుల వినియోగానికి కాలపరిమితి ముగిసే లోపు 90 శాతం పనులు చేసినట్లు అధికా>రులు ప్రకటించడంతో రైతాంగం విస్తుపోయింది. ప్రశ్నార్థకంగా వరిసాగు.. పీబీ చానల్ పరిధిలోని ఆయకట్టు రైతాంగం గత మూడేళ్లగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆయకట్టు రైతులు వరిసాగు కన్నా జామాయిల్ సాగుపై ఆశక్తి చూపుతున్నారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా నిరుడు కేవలం 600 ఎకరాలలో వరిసాగు చేయగా, ఈ సంవత్సరం కేవలం 100 ఎకరాలలో వరి కాకుండా వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఏటా చానల్లో సుమారు 10 నుంచి 15 రోజుల పాటు పారగా నిరుడు 5 రోజులు మాత్రమే నీరు పారింది. ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా పారలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ విజయలక్ష్మి మాట్లాడుతూ రిజర్వాయర్ వద్ద ఆనకట్ట అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇతర పనులకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని చెప్పారు. -
ఢిల్లీలొని నగల దుకాణ యాజమాని సాహసం
-
ఊడిన బస్సు టైరు : తప్పిన ప్రమాదం
జడ్చర్ల టౌన్: ఓ ఆర్టీసీ బస్సుకు ప్రమాదవశాత్తు టైరు ఊడిపోయింది. ఈ సంఘటన జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. టైరు ఊడిన సమయంలో రోడ్డుపై జనసంచారం, వాహన రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ బస్సు ముందు టైర్ ఊడిపోయింది. టైర్ ఊడిపోవడంతో బస్సు రోడ్డుపైనే ముందుకు వెళ్లలేకుండా కూలబడింది. బస్సు వేగం తక్కువగా ఉండటంతో అక్కడే ఆగిపోయింది. ఈ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. వాహనాలు సైతం రాకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు కుదుపునకు గురైనప్పటికీ ఎలాంటి రక్తగాయాలు కాలేదు. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను వేరే బస్సుల్లో హైదరాబాద్‌కు పంపించారు. రాత్రికి మెకానిక్‌లను పిలిచి మరమ్మతు చేయించుకుని బస్సును తిరిగి వనపర్తికి తీసుకెళ్లారు. -
‘ఎన్నికల హామీల అమలులో విఫలం’
రెబ్బెన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఎన్ని కల హామీలను అమలు చేయటంలో పూర్తిగా విఫలం అ య్యాయని సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య ఆ రోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఐ రాష్ట్ర 2వ మహాసభలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గత 90 సంవత్సరాలుగా బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం సీపీఐ ఎన్నో ప్రజా పోరాటాలు చేపట్టిందన్నారు. కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల హక్కుల కో సం ఎన్నో త్యాగాలను చేసిందన్నారు. కాని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రజ లకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని సైతం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తోందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ మి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కేజీటూ పీజీ ఉచిత విద్యపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేకుండా పో యిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 4వ వరకు నిర్వహించబోయే రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. మండలంలోని కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో రెబ్బెన పట్టణ కార్యదర్శి రామడుగుల శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కుందారపు బసవయ్య, నాయకులు సాగర్‌గౌడ్, సంతోష్‌గౌడ్, అంకూస్, జేఏసీ కన్వీనర్ మల్లయ్య పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఆపరేషన్
హుజూరాబాద్: ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ తల్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. చిన్న కూతురికి గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కన్నీరుమున్నీరైంది. ఇరుగుపొరుగు వారి సలహాతో పిల్లలు పుట్టేందుకు రీకనలైషన్ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. బుధవారం ఆపరేషన్ చేయించుకుం ది. అది వికటించి ఆ మహిళ అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం ఘణపూర్‌కు చెందిన ఆవుల రఘుపతికి శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన మల్లీశ్వరి(28)తో ఆరేళ్లక్రితం వివాహమైంది. రఘుపతి హైదరాబాద్‌లో గుమాస్తగా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఐదు నెలల క్రితం చిన్నకూతురు పుట్టిన తరువాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కొద్ది రోజులకు చిన్నకూతురుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి గుండెకు రంధ్రం ఉందని చెప్పడంతో బోరున విలపించారు. ఇంటి చుట్టుపక్కల వారి సలహా మేరకు మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. రీకనలైజేషన్ ఆపరేషన్ కోసం హుజూరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం ఆపరేషన్ జరుగగా అర్ధరాత్రి అది వికటించి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సమస్యల పరిష్కారంలో ఏన్జీవో నేతలు విఫలం
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
మీకోసం – ఎవరికోసం?
పాలకొండ: మీకోసం కార్యక్రమం ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మండల, జిల్లా కేంద్రాల్లో ప్రతినెలా సోమవారం ఇళ్ల బిల్లులు, పింఛన్లు, రేషన్‌కార్డులు, భూ వివాదాలు..ఇలా పలు సమస్యలపై పెట్టుకుంటున్న బాధితుల అర్జీలకు న్యాయం చూపడంలేదు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో పరిష్కారం చూపి మిగిలినవి అధికారులు బుట్టుదాఖలు చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం అంటేనే ప్రజలు ఏవగించుకునేలా దిగజార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిష్కారమేదీ? జిల్లాలో ఇప్పటివరకు మీకోసం కార్యక్రమానికి 3 లక్షల 91,979 అర్జీలు అందాయి. ఇందులో ఇంతవరకు పరిష్కరించినవి 2 లక్షల 11 వేలు మాత్రమే. ఇవి ఆన్లైన్లో నమోదైన అర్జీలు మాత్రమే. వాస్తవంగా ప్రతీ వారం బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను, వినతులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో నమోదైతే కచ్చితంగా దీనిపై బాధితునికి సమాధానం చెప్పాల్సిన అవసరముంది. దీంతో అర్జీలు స్వీకరించినప్పుడే వీటిని ఆన్లైన్లో నమోదు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. దీంతో బాధితునికి అసలు ఈ కార్యక్రమం అంటేనే ఎందుకు పనికిరానిదిగా భావించే పరిస్థితి నెలకొల్పారు. కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమంలో ఇంతవరకు 85,744 అర్జీలు అందితే, అందులో 57,194 పరిష్కరించారంటే మండల కేంద్రాల పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా పాలకొండ డివిజన్ నుంచి లక్షా 14 వేలా 127 అర్జీలు అందగా శ్రీకాకుళం డివిజన్ నుంచి లక్షా 4 వేలా 666, టెక్కలి డివిజన్ నుంచి 87,442 అర్జీలు అందినట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 12 వేల దరఖాస్తులు గడువు దాటిపోయినా పరిష్కారానికి నోచుకోలేదు. మరో 22 వేల దరఖాస్తులు గడువు దాటిపోవడానికి మరో నెల మాత్రమే సమయముంది. దీంతో ఈ సమస్యలపై ఎటువంటి పరిష్కారం దొరకడం లేదని బాధితుల్లో ఆవేదన నెలకొంది. పేరుమార్చినా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని మీకోసంగా పేరు మార్చింది. సీఎం చంద్రబాబునాయుడు దీనిపై ప్రచారం చేస్తూ ప్రతీ సోమవారం మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని, పరిష్కరించకపోతే అందుకుగల కారణాలను బాధితుని ఫోన్‌కు అందిస్తామని ప్రకటించారు. అప్పట్నుంచి ఈ కార్యక్రమంపై ఆశలు పెంచుకున్న బాధితులకు మూడున్నరేళ్లు దాటుతున్నా న్యాయం చేకూరడంలేదు. దీంతో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం మొక్కుబడిగా మారింది. వాస్తవానికి ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల్లో మీకోసం కార్యక్రమం పూర్తిగా కనుమరుగైందని చెప్పవచ్చు. -
ప్రభుత్వ ఉద్యోగమా అదెక్కడ!
-
చైనా రాకెట్ ప్రయోగం విఫలం
బీజింగ్: అత్యంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో సిద్ధం చేసిన ఓ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో చైనా విఫలం చెందింది. షాంగ్సీలోని తయ్యువాన్ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ గాలిలోనే పేలిపోయింది. అయితే దీనిపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. చైనా వ్యోమగాములు నడిపై ఓ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన ఈ వివరాలను ఉంచారు. చైనా చేసే రాకెట్ ప్రయోగాలు విఫలం చెందడం చాలా అరుదు. 2013లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కూడా ఇలానే కక్ష్యలోకి వెళ్లకముందే పేలిపోయింది. లాంగ్ మార్చ్4సీ రాకెట్ ద్వారా గావోఫెన్-10 ఉపగ్రహాన్ని గురువారం చైనా ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపంతో రాకెట్ పేలిపోయింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను షాంగ్సీకు చెందిన వారు సోషల్ మీడియాలో ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లాంచింగ్ వెహికల్ గా లాంగ్ మార్చ్ ను చైనా పేర్కొన్న విషయం తెలిసిందే. లాంగ్ మార్చ్ వెహికల్ ద్వారా చైనా సంవత్సరానికి 20కి పైగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఎర్త్ అబ్జర్వేషన్ కోసం తయారు చేసిన ఈ అత్యాధునిక శాటిలైట్ లను మిలటరీ, పౌర అవసరాలకు చైనా ప్రయోగిస్తోంది. 2020లోగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు చైనా కృషి చేస్తుండగా తాజా ప్రయోగ విఫలం దాన్ని మరికొంచెం ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహ ప్రయోగాలు విజయవంతమైతే భూమి మీద ఉన్న ఏ ప్రాంతాన్నైనా హై డెఫినీషన్ క్వాలిటీతో వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. హ్యాక్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కోసం చైనా క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. -
దళితులపై దాడులను అరికట్టడంలో విఫలం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జేడీ శీలం మండిపాటు అమలాపురం రూరల్ : దళితులపై దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు జేడీ శీలం తీవ్రంగా విమర్శించారు. దళితులపై ఇటీవల దాడులు ఎక్కువయ్యాయని, ఇందులో భాగంగానే సూదాపాలెంలో దళితులపై దాడి జరిగిందని పేర్కొన్నారు. సూదాపాలెం ఘటనలో గాయపడి, అమలాపురం జానికిపేటలో తమ ఇంటి వద్ద కోలుకుంటున్న బాధిత దళితులు మోకాటి ఎలీషా, మోకాటి లాజర్‌ను పీసీసీ నాయకులతో కలిసి జేడీ శీలం ఆదివారం ఉదయం పరామర్శించారు. సమాజంలో సాటి మనుషులను ఇంత అనాగరికంగా, క్రూరంగా దాడి చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సూదాపాలెం ఘటన జరిగి 20 రోజులైనా, ఇంకా కొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ దాడిలో మరికొంత మందిని పోలీసులు విచారణ చేయలేదని, అందువల్ల ఘటనకు పోలీసులను కూడా బాధ్యులను చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు ఆయనకుSవిన్నవించారు. దీంతో శీలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అక్కడి నుంచే బాధితుల సమక్షంలోనే ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సూదాపాలెం దాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పది రోజుల్లోగా ఈ కేసులో ప్రమేయం ఉన్న అందరినీ అరెస్టు చేసి, ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు. పీసీసీ నాయకులు దాసు వెంకట్రావు, కోకేటి రవి, యార్లగడ్డ రవీంద్ర, అయితాబత్తుల సుభాషిణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన దర్యాప్తు చేపట్టిన పోలీసులు టేకులపల్లి : ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు ఓ యువకుడు యత్నించిన సంఘటన మండల కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. ఎస్సై తాటిపాముల సురేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రంలోకి ఓ యువకుడు గురువారం తెల్లవారుజామున ముఖానికి గుడ్డ కట్టుకుని.. రాడ్డు, కటింగ్ ప్లేయర్‌తో ప్రవేశించాడు. లోపల ఉన్న సీసీ కెమెరాను కిందకు వంచాడు. మరో కెమెరాను గమనించకుండానే రాడ్డుతో ఏటీఎం యంత్రం తలుపును ధ్వంసం చేసి.. డబ్బులు ఉన్న బాక్సును తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశాడు. డిజిటల్ లాక్‌ను బలవంతంగా తొలగించి.. దాని వైర్లను కటింగ్ ప్లేయర్‌తో కత్తిరించాడు. ఎంతకూ డబ్బులు బయటకు రాకపోవడంతో విసుగు చెంది వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు ఏటీఎం కేంద్రంలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ సోమయ్య విషయాన్ని గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. మేనేజర్ అమరేశ్, ఎస్సై సురేష్, ఏఎస్సై అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. బోడురోడ్డు సెంటర్, దాసుతండా, రేగులతండా, సింగ్యతండా మీదుగా లచ్చతండా వైపు దొంగ కోసం అన్వేషిస్తున్న క్రమంలో వర్షం కురవడంతో శునకంతో తనిఖీలు నిలిపివేశారు. బ్యాంకు మేనేజర్ సహాయంతో క్లూస్‌టీం, పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. -
ప్రమాదాల నివారణలో ప్రభుత్వ విఫలం
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మధిర : రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జల్లేపల్లి సైదులు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి ఆరోపించారు. మంగళవారం రిక్రియేషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు నెలల క్రితం నాయకన్‌గూడెం వద్ద ఎన్ఎస్పీ కాలువపై జరిగిన బస్సు ప్రమాదంలో ఒక పాప మృతి చెందిందని, అయితే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు చేపట్టకపోవడంతోనే.. తిరిగి అక్కడే జరిగిన మరో ప్రమాదంలో అమాయకులు మృతి చెందారని విమర్శించారు. బ్రిడ్జిపై రైలింగ్ లేకపోవడంతోనే బస్సు ఫల్టీ కొట్టిందన్నారు. 10మంది ప్రయాణికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల బాధ్యత వహిస్తూ ఆర్అండ్బీ, ఎన్ఎస్పీ అధికారులను సమన్వయపర్చి సమస్యను పరిష్కరించక పోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అంతేకాక మంత్రి ఈ రహదారి నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారని, అయినప్పటికీ మంత్రి చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. మృతిచెందిన ప్రయాణికులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5లక్షలు, గాయపడినవారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. డబుల్బెడ్రూం ఇళ్ల ఊసెత్తని ప్రభుత్వం ప్రజలకు గారడీ మాటలు చెబుతోందని విమర్శించారు. అర్హులైనవారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సీపీ క్రియాశీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో నాయకులు షేక్ ఖాసీం సాహెబ్, ముక్కెర వెంకట్రామిరెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, చింతిరాల వెంకటే శ్వరరావు ఉన్నారు. -
వైద్య వికటించి నాలుగు నెలల చిన్నారి..
వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన దేవరకొండ : చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ దేవరకొండలోని ఓ ఆసుపత్రి ముందు ఆదివారం చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల ప్రకారం... దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామపంచాయతీ పాత్లావత్తండాకు చెందిన పాత్లావత్ అనిత, రమేష్‌ల 4 నెలల బాబు శనివారం దేవరకొండలోని చిన్న పిల్లల వైద్యశాల అయిన సిలోయం ఆసుపత్రికి తీసుకొచ్చారు. చిన్నారి జలుబుతో బాధపడుతున్నాడని చెప్పడంతో డాక్టర్ రవి టానిక్‌తోపాటు టాబ్లెట్లు ప్రిస్పిక్షన్గా ఇచ్చాడు. వైద్యం అనంతరం బాబును ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు బాబుకు డాక్టర్ సూచించిన టానిక్‌ను తాగించారు. కొద్దిసేపటికే ఫిట్స్ వచ్చి బాబు మృతి చెందాడు. దీంతో వైద్యం వికటించడం వల్లే బాలుడు మృతి చెందాడని భావించిన తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చివరకు చిన్నారి తల్లిదండ్రులకు, వైద్యుడికి మధ్య రూ.లక్ష బేరం కుదిరింది. ఈ విషయమై సిలోయం ఆసుపత్రి డాక్టర్ రవిని సాక్షి వివరణ కోరగా అనుకోకుండా ఫిట్స్ రావడం వల్లే బాబు మృతి చెందాడని ఇందులో తన నిర్లక్ష్యం ఏమీ లేదని వివరణ ఇచ్చాడు. -
‘ఎంసెట్’లో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని, లీకేజీ బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం మొదట్నుంచీ బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. ఎంసెట్-2 లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం విఫలం
వరంగల్ : రుణమాఫీ హామీ నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకులు ఆరోపించారు. రైతులకు ఏకకాలంగా రుణమాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట టీడీ పీ శ్రేణులు మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇందులో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్‌లోని డీసీసీ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాయిదా పద్ధతిలో మాఫీ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లే దన్నారు. రుణాలు రీషెడ్యూల్ కాక, బీమా ప్రీమియం చెల్లించక పంటబీమాకు నోచుకోలేదన్నారు. విడతల వారీగా ఇస్తున్న మాఫీ రుణా ల వడ్డీకి సరిపోవడం లేదన్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, గట్టు ప్రసాద్‌బాబు, బొట్ల శ్రీ నివాస్, అశోక్‌కుమార్, గన్నోజు శ్రీనివాస్, ఇం దిర , సంతోస్నాయక్, సారంగం, రహీం, బాల రాజు, వెంకటకృష్ణ, సాంబయ్య పాల్గొన్నారు. -
తప్పు ఒప్పుకున్న శాంసంగ్
కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తప్పును ఒప్పుకుంది. తాము ప్రకటించినట్టుగా గెలాక్సీ సిరీస్ లో వస్తున్న ఎస్ 7 ఆక్టీవ్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదని, కొన్ని లోపాలున్నాయని అంగీకరించింది. తాము నిర్వహించిన పరీక్షల్లో గెలాక్సీ 7 యాక్టివ్ స్మార్ట్ ఫోన్లు విఫలమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే దీన్ని సరిచేసే సామర్థ్యం తమ దగ్గరున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి చాలా కొద్ది ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వారంటీ పీరియడ్ లో ఉన్న ఫోన్లకు రిప్లేస్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది సీఎన్ఈటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినపుడు టచ్ స్క్రీన్ పనిచేయలేదని, గ్రీన్ లైన్స్ వచ్చాయని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతోపాటు.. పవర్ బటన్ పనిచేయలేదు. కెమెరా లెన్స్ పై నీళ్లు తదితర సమస్యలు తలెత్తినట్టు శాంసంగ్ వివరించింది. అయితే తాను రిలీస్ చేసిన అన్ని ఫోన్లలో లోపాలు లేవని, చాలా తక్కువ వాటిలో చాలా స్వల్పలోపాలు తలెత్తాయని చెబుతున్న శాంసంగ్ ఎన్ని యూనిట్లలో ఈ లోపాలున్నాయనేది స్పష్టం చేయలేదని ఎన్ గాడ్జెట్ రిపోర్ట్ చేసింది. కాగా ఎస్ 7 ఆక్టివ్ ఫోన్ నీటిలో కూడా పనిచేస్తుందనీ(వాటర్ రెసిస్టెంట్), ఐపీ68 సర్టిఫికేట్ ఉందనీ కంపెనీ ప్రచారం చేసుకుంది. అయితే కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గా లేదని తేలింది. నీటిలో ఉంచినపుడు స్క్రీన్ పై గ్రీన్ షేడ్స్ కనిపించినట్లు, కెమెరాపై బుడగలను గుర్తించినట్టు ఇటీవల నివేదించిన సంగతి తెలిసిందే. -
'సరోజనీ' ఘటనపై విచారణకు ఆదేశం
హైదరాబాద్(మెహిదీపట్నం): మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సరోజిని దేవి కంటి ఆస్పత్రిని సందర్శించారు. 15 మంది చూపు కోల్పోయిన ఘటనపై విచారణకు ఆదేశించారు. సెలైన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది చూపుకోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. -
చూపు కోల్పోయిన 13 మంది
- సరోజినీలో వికటించిన కంటి ఆపరేషన్లు మెహదీపట్నం : కంటి ఆపరేషన్లు వికటించి 13 మందికి చూపు మందగించిన సంఘటన నగరంలోని సరోజిని నాయుడు అసుపత్రిలో జరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. -
'కింగ్ మేకర్' అవుతానని..!
అసోం ఎన్నికల్లో కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తానన్న సెంటు దిగ్గజం మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ భారతీయ జనతా పార్టీ జోరుకు నిలబడలేక పోయారు. అసోంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫండ్ (ఏఐయూడీఎఫ్) సాయం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు. పార్టీని నిలబెట్టడం మాట అటుంచి తానే గెలవలేక చతికిలపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో పార్టీ కేవలం 13 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఏఐయూడీఎఫ్ ఆశలు అడియాసలయ్యాయి. 2005లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తూ వస్తోన్న అజ్మల్ ఈ ఎన్నికల్లో తొలి ఓటమి రుచి చూశారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వాజెద్ అలీ చౌదరి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన అజ్మల్ ప్రజల తీర్పును పాటిస్తామని.. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏఐయూడీఎఫ్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే ముఖ్యకారణమని ఆయన ఆరోపించారు. ఏఐయూడీఎఫ్ సూచించినట్లు మహాకూటమిగా ఏర్పడి ఉంటే గెలిచి తీరేవాళ్లమని అన్నారు. -
ఫేస్ బుక్ ఫెయిలయ్యింది!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఈ ఏడాది చేసిన మార్పుల్లో ఒకటి సాధారణంగా ఇచ్చే లైక్ లకు ఎమోషన్స్ ను యాడ్ చేయడం. ఈ ఆప్షన్లు యూజర్లను పెద్దగా ఆకట్టుకోలేపోయాయని ఈ విషయంలో ఫేస్ బుక్ ఫెయిలయ్యిందని.. సోషల్ మీడియా పరిశోధనా సంస్థ 'క్వింట్లీ' తెలిపింది. ఇప్పటివరకు రియాక్షన్ లైక్ లను వాడిన వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని సంస్థ ప్రకటించింది. ఒక లక్షా ముప్ఫైవేల పోస్టులను పరిశోధించిన క్వింట్లీ.. వినియోగదారులు పోస్టులపై తమ ఒపీనియన్ ను తెలిపెందుకు ఆసక్తి చూపడంలేదని కనుగొంది. పోస్టులను చూసిన వెంటనే లైక్ కొట్టి కిందకు వెళ్లి పోతున్నారని చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్ బుక్ సాడ్, వావ్, యాంగ్రీ, లవ్, హహా, థ్యాంక్ ఫుల్ రియాక్షన్ బటన్లను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొత్తం మీద 97 శాతం పోస్టులకు లైక్ లు, కామెంట్లు, షేర్లు మాత్రమే వచ్చాయని పరిశోధనలో తేలింది. ఫోటోల కన్నా వీడియోలు ఎక్కువగా రియాక్షన్ బటన్ లైక్ లను పొందినట్లు వివరించింది. -
ఇవేం మాటలు చంద్రబాబూ...
-
ఆత్మహత్య చేసుకున్నాక టాపర్ అయ్యాడు
శ్రీనగర్: పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, క్లాస్ టాపర్ అని తేలడం విషాదాన్ని నింపింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో టెక్నికల్ బోర్డు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ తెలివైన విద్యార్థి ఉసురు తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే శ్రీనగర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న మొహమ్మద్ అద్నాన్ (17) చాలా తెలివైన విద్యార్థి. ఫిజిక్స్ అంటే అతనికి ప్రాణం. కానీ తనకెంతో ఇష్టమైన ఫిజిక్స్ పరీక్షలో ఫెయిల్ అయినట్టు, కేవలం 28 మార్కులు మాత్రమే వచ్చినట్టుగా ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో అద్నాన్ అవమాన భారంతో కుంగిపోయాడు. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల తరువాత అతని శవం నదిలో తేలడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన కొడుకు ఫిజిక్స్ పరీక్ష చాలా బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో... తండ్రి హిలాల్ అహ్మద్ గిల్కర్ ఈ వ్యవహారాన్ని అంతటితో వదిలేయలేదు. పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎంతో ప్రతిభావంతుడైన తన కొడుకు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదని, ఎక్కడో తప్పు దొర్లిందని భావించారు. రీవాల్యుయేషన్ కోసం టెక్నికల్ బోర్డుకు లేఖ రాశారు. అయితే ఆ వాల్యుయేషన్‌లో అద్నాన్ పాస్ అవ్వడమే కాదు...48 అత్యధిక మార్కులు సాధించాడు. ఫస్ట్ సెమిస్టర్ లో 70 శాతం మార్కులతో క్లాస్‌లో టాపర్‌గా నిలిచాడు. అయితే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నాలుగు నెలల తరువాత రాష్ట్ర టెక్నికల్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. తప్పయిందంటూ నాలిక్కరచుకుంది. అయితే పొరపాటు జరిగిందంటూనే మరోవైపు యూనివర్శిటీలలో ఇలాంటి తప్పులు జరగడం మామూలే అని బోర్డు వ్యాఖ్యానించడంపై హిలాల్ అహ్మద్ గిల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులే తన కొడుకును హత్య చేశారని అద్నాన్ తండ్రి ఆరోపిస్తూ, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. -
గడువు ముగిసినా.. వీడని చెర
-
పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ వీఐపీ ఘాట్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆది నుంచీ ఆర్భాటాలకు పోయిన చంద్రబాబు ప్రభుత్వం.. చివరకు ఈ మహాపర్వం ఏర్పాట్లలో విఫలమై అప్రతిష్టను మూట కట్టుకుందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. వీఐపీ ఘాట్‌లో శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పుష్కర స్నానమాచరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పుష్కరాల నిర్వహణ తీరు ఉందన్నారు. తొలి రోజు ప్రభుత్వపరమైన తప్పిదం కారణంగా 27 మంది మృతి చెందిన తరువాత.. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ జాగ్రత్తలు ముందుగానే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. పిండప్రదానాలు చేసిన జ్యోతుల తొలుత జ్యోతుల నెహ్రూ తన భార్య మణి, కుమారుడు, జెడ్పీ ప్రతిపక్షనేత నవీన్, కోడలు లక్ష్మీదేవి, కుమార్తె సునీత, అల్లుడు తోట సర్వారాయుడుతోపాటు మనవడు, మనవరాళ్లతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం తన పూర్వీకులకు గోదావరి చెంతన పిండప్రదానం నిర్వహించారు. తొలుత వీఐపీ ఘాట్ ముఖద్వారం వద్ద జ్యోతులను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చందు హనుమంతరావు స్వాగతం పలికారు. నెహ్రూ గోదావరిలో స్నానమాచరించిన సమయంలోనే వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు కూడా పుష్కర స్నానమాచరించారు. -
’ఏపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది’
-
‘పది’ ఫెయిలైన విద్యార్థులకు రేపటి నుంచి శిక్షణ
- డీఈవోలను ఆదేశించిన విద్యాశాఖ - జూన్ 17వరకు తరగతులు హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 27 నుంచి వచ్చే 17 వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవోలకు సూచించారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి జరుగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిషు, సోషల్ తదితర సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, శిక్షణ తరగతుల్లో పాల్గొనే టీచర్లకు గౌరవ వేతనం ఇచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. -
యూజీసీని రద్దు చేయండి
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ని రద్దు చేయాలని మానవవనరుల అభివృద్ధిశాఖ ప్యానెల్ సూచించింది. రద్దు చేయలేకపోతే మరింత మెరుగుపరచాలని కూడా పేర్కింది. ఆచరణకు అనుకూలమైనవే అయినప్పటికీ తన విధులు నిర్వహించడంలో, అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడంలో యూజీసీ విఫలమైందని వెల్లడించింది. వెంటనే జాతీయ ఉన్నత విద్యా సంస్థ ద్వారా యూజీసీని తీసేయాలని సూచించింది. ఒకవేళ అలా రద్దు చేయడం వీలుకాకుంటే అది పనిచేసే విధానాన్ని మరింత మెరుగుపరచాలని సదరు ప్యానెల్ సూచించింది. గత ఆరు నెలల కిందట యూజీసీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించాల్సిందిగా స్మృతి ఇరానీ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధిశాఖ ఒక కమిటీని వేసింది. ఇది యూజీసీ పూర్తిగా విఫలమైందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా యూజీసీ చైర్మన్ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి విశ్వవిద్యాలయాల పనితీరును నేరుగా తెలుసుకోవాలని, కార్యాలయానికి పరిమితం కాకుడదని కూడా సూచించినట్లు సమాచారం. అయితే, ఈ నివేదికను ఇంకా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వద్దకు తీసుకెళ్లలేదు. త్వరలోనే దీనిపై చర్చించనున్నారు. -
తుపానును ఎదుర్కోవడంలో టిడిపి విఫమైంది
-
తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య మిథ్య
ప్రథమం.. అధమం 70 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ఏడాదిలో ఫెయిల్ గడచిన నాలుగేళ్లలో ఇదే పరిస్థితి అధ్యాపకుల కొరత, అనర్హులతో బోధన, నాణ్యతా లోపం, సౌకర్యాల లేమితో సమస్యలు అడ్మిషన్లు ఆలస్యం కావడం, విద్యార్థుల్లో శ్రద్ధ తగ్గిపోవడమూ కారణమే.. భాషా పరమైన సమస్యతోనూ వెనుకంజ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో 7 శాతమే పాస్ సివిల్ ఇంజనీరింగ్‌లో 20 శాతమే ఉత్తీర్ణులు మధ్యలో మానేస్తున్న వారూ ఎక్కువే.. సాక్షి, హైదరాబాద్: ప్రమాణాల లేమి.. అధ్యాపకుల కొరత.. అనర్హులతో బోధన.. ల్యాబ్‌లు, లైబ్రరీల వంటి సౌకర్యాల కొరత.. అడ్మిషన్లు ఆలస్యం కావడం.. చివరికి మౌలిక సౌకర్యాలకూ దిక్కులేని పరిస్థితి.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య మిథ్యగా మారుతోంది. చుట్టూ గట్టి క్రమశిక్షణ మధ్య ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ఒక్కసారిగా బయటికి వచ్చిన విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం వీటన్నింటికీ తోడవుతోంది. ప్రధానంగా తరగతుల ప్రారంభం ఆలస్యం అవుతుండటంతో అప్పటివరకు చదివిన అంశాలపై రివిజన్ చేపట్టి, భవిష్యత్తులో చదువుకోవాల్సిన విధానాలపై సూచనలు అందించే సమయం కూడా లేకపోవడం ప్రథమ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా ఫెయిలవుతున్నారు.. మొత్తంగా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ఉత్తీర్ణత దారుణంగా తగ్గిపోతోంది. భాషా పరమైన సమస్యలు, అప్పటివరకు చదువుకున్న సబ్జెక్టులతో పాటు తమకు తెలియని కొత్త సబ్జెక్టులను అదనంగా చదవాల్సి రావడం కూడా ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కారణం అవుతోంది. ఏటా పెరుగుతోంది..: హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని 283 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2010-11 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో దాదాపు 65 శాతం విద్యార్థులు ఫెయిల్‌కాగా.. 2013-14కు వచ్చే సరికి అది 71.3 శాతానికి పెరిగింది. 2011-12లో తొలి ఏడాది ఫెయిలైన విద్యార్థులు 67.72 శాతం ఉండగా.. 2012-13లో 64.84 శాతం. మొత్తంగా ఏటికేడు ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న విద్యా విధానానికి, ఇంజనీరింగ్‌లో చేరాక చదువుకోవాల్సిన విద్యా విధానానికి మధ్య తేడాలు ఉండటం కూడా ఇందుకు కారణం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో తక్కువ.. ఇటీవల ప్రకటించిన బీటెక్ ప్రథమ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 7.89 శాతం మాత్రమే ఈ కోర్సులో పాస్ అయ్యారు. దీని తర్వాత తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినది.. పెట్రోలియం ఇంజనీరింగ్. కారణాలెన్నో... అర్హులైన బోధన సిబ్బంది లేకపోవడం, అనర్హులతో అరకొర విద్యాబోధనతో కళాశాలలను నెట్టుకొస్తుండటం వంటివి ఫెయిలవుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు వచ్చిన వారికి భాషా పరమైన సమస్యలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియంలో చదువుకున్నా కూడా ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి భాషా సమస్య తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో కొంత బెరుకు, భయం ఉండటమే దీనికి కారణం. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంటర్, ఎంసెట్ ప్రిపరేషన్ సమయాల్లో చూపినంత శ్రద్ధ ఇంజనీరింగ్‌లో చేరాక చూపకపోవడం.. ఉత్తీర్ణత తగ్గిపోవడానికి కారణమవుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటర్లో చదువుకున్న సబ్జెక్టులతో పాటు ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొత్త సబ్జెక్టులు వచ్చి చేరుతాయి. ఇందులో ప్రథమ సంవత్సరంలో 6 థియరీ సబ్జెక్టులు ఉంటే.. 5 సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటికి తోడు మొదటి సంవత్సరంలోనే నాలుగు సార్లు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. దీంతో విద్యార్థులపై కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యం.. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దష్టి సారించాం. మెరుగైన విద్యా బోధన అందించేలా కషి చేస్తున్నాం. అర్హులైన అధ్యాపకులతో విద్యా బోధన చేయించేలా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు, ఫ్యాకల్టీ హాజరుపైనా దష్టి పెట్టాం. ఇందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ తరహాలో ఉండకూడదు. బట్టీ పట్టడం కుదరదు. నేర్చుకోవడంలో చొరవ చూపాలి. తెలియని విషయాలను అడిగి మరీ తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి వార్షిక కేలండర్ ప్రకారం తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. - ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ పట్టుదలతో నేర్చుకోవాలి విద్యార్థి తనను తాను తీర్చి దిద్దుకోవాలి. అర్థం చేసుకొని పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్ తరహాలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయించే వారు ఉండరు. విద్యార్థే పట్టుదలతో చదువుకోవాలి. ఈ విషయాన్ని మొదటి సంవత్సరం విద్యార్థులు గ్రహించకపోవడం కూడా ఫెయిల్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణ ం. విద్యార్థులు కోర్ సబ్జెక్టులు అనగానే ఒక రకమైన భయానికి గురవుతున్నారు. అది అవసరం లేదు. అనవసర భయాలను వీడి తెలియని విషయాలను ఫ్యాకల్టీ వద్ద తెలుసుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు. - రాజేశ్వర్‌రెడ్డి, అనురాగ్ గ్రూపు విద్యా సంస్థల చైర్మన్ త్వరగా తరగతులు ప్రారంభించాలి విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా చూడాలి. త్వరగా తరగతులు ప్రారంభించాలి. అలా చేస్తే గతంలో చదువుకున్నవి రివైజ్ చేసి, ఇంజనీరింగ్‌లో చదవాల్సిన వాటిపై విద్యార్థుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవచ్చు. అది విద్యార్థులకు దిక్సూచిగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. పరీక్షల విధానంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మాదిరిగా ఇంజనీరింగ్‌లో ఒకే పుస్తకం, మెటీరియల్ ఉండదు. ఒక్క సబ్జెక్టుకు మూడు నాలుగు పుస్తకాలు చదవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు నివత్తి చేసుకోవాలి. - ప్రొఫెసర్ నారాయణ, సీఎంఆర్ కాలేజీ -
పకృతి ప్రకోపానికి బలైపోతున్న అన్నదాత
-
తుస్స్స్స్స్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. అనూహ్యంగా రైతులు ఎన్నడూ లేనంతగా నష్టపోయారు. కరువు కాలంలో అయితే.. అన్నదాతలకు కనీసం పెట్టుబడులన్నా మిగిలేవి. కానీ, తుపానుతో అటు పెట్టుబడులు, ఇటు దిగుబడి పోయి రెండు విధాలుగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే పాడై అక్కరకు రాకుండా పోయే సరికి గుండెపగిలి చనిపోతున్నాడు. ఇలాంటి ఆపద సమయంలో బాధిత రైతాంగాన్ని ఓదార్చేం దుకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తిరగాల్సింది పోయి, రాజ కీయంగా లాభపడేందుకు ఆరాటపడుతున్న టీడీపీ తీరు విమర్శల పాలైంది. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని టీడీపీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. అయితే, ధర్నా చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆరోపిస్తూ, రైతుల సమస్యనూ ముడిపెట్టి ఎకాఎకిన జిల్లా బంద్‌కు పిలుపు ఇచ్చింది. కానీ, నిలువెల్లా నిస్తేజం ఆవరించి ఉన్న టీడీపీ శ్రేణులు నాయకుల పిలుపునకు అంతగా స్పందించలేదు. బంద్ ప్రకటనతో స్కూళ్లు ముందే సెలవులు ప్రకటించినా, కాలేజీలు మాత్రం యధావిధిగా పనిచేశాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ బస్ డిపోల ఎదుట బైఠాయించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో జిల్లావ్యాప్తంగా అన్ని బస్సు సర్వీసులు నడిచాయి. ఇక, రాస్తారోకోల పేరుతో అరెస్టు కావడానికి నాయకులు ఎక్కువ ఉత్సాహం చూపించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా బంద్ ఘోరంగా విఫలమైంది. బాధిత రైతులను ఓదార్చాల్సింది పోయి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేతలు అభాసు పాలయ్యారు. చివరకు పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున భువనగిరి, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో ఎక్కడా బంద్ కనిపించలేదు. బంద్ తీరు ఇలా... నల్లగొండలో బంద్ విఫలమైంది. టీడీపీ నాయకులు బంద్ పాటించాలని ఎన్జీ కాలేజీ వద్ద రాస్తారోకో చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ప్రధాన కార్యదర్శి అయిలయ్య, నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేసి టుటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాపార సంస్థలు,రోడ్డు రవాణాను యధావిధిగా నడిచాయి. భువనగిరి నియోజకవర్గంలో బంద్ పూర్తిగా విఫలమైంది. భువనగిరి పట్టణంతో పాటు, మండలం, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో బంద్ ఎక్కడా జరుగలేదు. భువనగిరిలో మూతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మునుగోడులో తమ్ముళ్ల స్పందన కరువైంది. నాయకులెవరూ బంద్ చేయించలేదు. మిగతా మండలాల్లోనూ పాక్షికంగా జరిగింది. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి బంద్ పాటించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసి వేయించారు. దేవరకొండ పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు దుకాణాలను మూసివేయించడంతో పాటు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించారు. పెద్దవూరలో మంత్రి జానారెడ్డి వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డగించగా, హాలియాలో టీడీపీ నాయకులు మూసివేయించిన దుకాణాలను కాంగ్రెస్ నాయకులు తిరిగి తెరిపించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు తెరిచిన దుకాణాలను తిరిగి మూసివేస్తుండగా పోలీసులు టీడీపీ నాయకులకు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ చేయించారు. కోదాడలో టీడీపీ కార్యకర్తలు దుకాణాలను మూసివేయించారు. రంగా థియేటర్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్డు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కళాశాలలు యధావిధిగా నడిచాయి. చిలుకూరులో మాత్రమే బంద్ జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో టీడీపీ బంద్ పాక్షికంగా జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో ఆర్టీసీ బస్సులు నడిచాయి. వాణిజ్య సంస్థలు మధ్యాహ్నం వరకు బంద్ పాటిం చాయి. టీడీపీ నాయకులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. వేములపల్లి, దామరచర్ల మండల కేంద్రాల్లో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తుంగతుర్తిలో బంద్ ప్రశాం తంగా జరిగింది. విద్యా సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేశారు. అర్వపల్లి, నూతనకల్, మోత్కురుల్లో రాస్తారోకో చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాం తంగా జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, దుకాణాలను మూసివేయించారు. మెయిన్ సెంటర్లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. రామన్నపేట మండలంలో బంద్ విఫలమైంది. సూర్యాపేటలో వ్యాపారవర్గాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు బంద్ చేయించారు. బస్సు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. -
సీమాంధ్రలో బాబు బస్సు యాత్ర ఫెయిల్