ముంబయి: ముంబయి ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రవ్ అట్వాల్(40)ను కోర్టులో హాజరుపరిచారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలను జడ్జి ముందు నిందితుడు ఒప్పుకున్నాడు.
అసలేం జరిగింది..?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ముంబయి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. అంధేరీ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. అయితే.. రెండు రోజుల క్రితం రూపా తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి.
అత్యాచారం ప్లాన్ బెడిసికొట్టడంతో..
రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండేవాడు. అతడు ఆ హౌజింగ్ సొసైటీలో క్లీనింగ్ నిర్వహించే ఏజెన్సీలో ఉద్యోగి. తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు.
రూపా ఇంటికి వెళ్లి మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. విషయం బయటపడుతుందని బయపడిన విక్రమ్.. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాను సన్నిహితులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ కేసులో హౌజింగ్ సొసైటీలో దాదాపు 45 మందిని పోలీసులు విచారించారు.
An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit.
— NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023
She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI
ఇదీ చదవండి: ఢిల్లీ: ఆ ముగ్గురు మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు
Comments
Please login to add a commentAdd a comment