airhostess case
-
ఎయిర్ హోస్టెస్ రూపా కేసులో వీడిన మిస్టరీ
ముంబయి: ముంబయి ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఫ్లాట్‌లో హౌజ్‌కీపింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు విక్రవ్ అట్వాల్(40)ను కోర్టులో హాజరుపరిచారు. దిగ్భ్రాంతి కలిగించే విషయాలను జడ్జి ముందు నిందితుడు ఒప్పుకున్నాడు. అసలేం జరిగింది..? ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ముంబయి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. అంధేరీ హౌజింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. అయితే.. రెండు రోజుల క్రితం రూపా తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె గొంతును కత్తితో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. అత్యాచారం ప్లాన్ బెడిసికొట్టడంతో.. రూపా హత్య కేసులో బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూపా ఫ్లాట్‌లో విక్రమ్ అట్వాల్ క్లీనింగ్ పనులు నిర్వహిస్తుండేవాడు. అతడు ఆ హౌజింగ్ సొసైటీలో క్లీనింగ్ నిర్వహించే ఏజెన్సీలో ఉద్యోగి. తన ఫ్లాట్‌లో విధులు సరిగా నిర్వహించట్లేదని రూపా అతనిని ఇటీవల మందలించింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న విక్రమ్.. పక్కా ప్లాన్ చేసుకుని పదునైన ఆయుధంతో రూపా ఫ్లాట్‌కు వెళ్లాడు. రూపా ఇంటికి వెళ్లి మొదట ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ రూపా విక్రమ్‌ని నెట్టివేసి బయటకు పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. విషయం బయటపడుతుందని బయపడిన విక్రమ్.. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాను సన్నిహితులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఈ కేసులో హౌజింగ్ సొసైటీలో దాదాపు 45 మందిని పోలీసులు విచారించారు. An airhostess - Rupal Ogrey - was found dead at her luxury flat in Mumbai. She was a trainee air hostess. It is reported that her throat has been slit. She had joined the training last April and was residing with her beau and brother. The incident came to light when police paid… pic.twitter.com/CUKzwGksgI — NewsFirst Prime (@NewsFirstprime) September 4, 2023 ఇదీ చదవండి: ఢిల్లీ: ఆ ముగ్గురు మృగోన్మాదులకు మరణశిక్ష ఖరారు -
గదిలో బంధించాడంటూ మెసేజ్..
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఢిల్లీలో ఎయిర్‌హోస్టెస్ అనీసియా బత్రా ఆత్మహత్యకు ఆమె భర్త మయాంక్ చిత్రహింసలే కారణమని మృతురాలి ఫ్రెండ్ వెల్లడించారు. ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేందుకు తన భర్త ప్రవర్తనే కారణమని అనీసియా తనకు మెసేజ్ పంపారని ఆమె చెప్పారు. తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అనీసియా స్నేహితురాలు పలు వివరాలు తెలిపారు. భర్త తనను రూమ్‌లో బంధించాడని, పోలీసులకు కాల్ చేసేందుకు నీ సహకారం కావాలని.. వీలైతే తన వద్దకు రావాలని అనీసియా తనకు వాట్సాప్ మెసేజ్ చేశారని చెప్పారు. మయాంక్ (భర్త) వైఖరితో విసుగెత్తి తాను చనిపోతున్నానని ఆమె చివరిగా మెసేజ్ చేశారని అనీసియా ఫ్రెండ్ తెలిపారు. ఆమె మరణానికి కొన్ని నిమిషాల ముందు తన భర్త తనను గదిలో బంధించి బయట తాళం వేశాడని చివరి మెసేజ్ చేశారని, ఆ పరిస్థితిలో ఆమె ఎంతగా భయకంపితురాలై, అసహాయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని బాధితురాలి తరపు న్యాయవాది ఇష్కరణ్ సింగ్ పేర్కొన్నారు. ఆమె బయటికి వచ్చి పోలీసులకు కాల్ చేసేందుకు ఎవరైనా సహకరిస్తారేమోనని ఆశగా వేచిచూశారని, ఇదే ఆమె మరణ వాంగ్మూలమని సింగ్ చెప్పుకొచ్చారు. జూన్ 27నే ముందస్తుగా బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, అప్పుడే మయాంక్‌పై చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక వేధింపులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాలో లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగి ఫిర్యాదు నేపథ్యంలో దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాలని సీనియర్ అధికారులను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఆదేశించారు. ఈ ఘటనను సత్వరం పరిష్కరించాలని ఎయిర్ఇండియా సీఎండీని కోరారని, అవసరమైతే మరో కమిటీని నియమించాలని ఆదేశించానని సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. లైంగిక వేధింపులపై తాను చేసిన ఫిర్యాదు పట్ల ఎయిర్ఇండియా అంతర్గత కమిటీ విచారణ తీరును సంస్థకు చెందిన మహిళా ఉద్యోగి తప్పుపడుతూ ట్వీట్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు. ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగి తనను ఆరేళ్ల పాటు లైంగికంగా వేధించారని, తన ఫిర్యాదుపై సంస్థ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఎయిర్‌హోస్టెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, ఆ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన పట్ల వివక్ష ప్రదర్శించారని పౌరవిమానయాన మంత్రి సురేష్ ప్రభుకు రాసిన లేఖలో బాధితురాలు ఆరోపించారు. తన కోరికను తీర్చలేదన్న కోపంతో ఆయన తనకు అధికారికంగా దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇతర మహిళా సహోద్యోగులకు సైతం ఇదే అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. అంతర్గత విచారణలో అధికారి తీరుపై తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తన ఫిర్యాదుపై ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ అనుమతించలేదని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడికి రాజకీయ పలుకుబడి ఉందని, అతడిని కఠినంగా శిక్షించేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ చొరవ చూపాలని కోరారు. -
'మధ్యంతర బెయిల్‌ను మరిన్నిరోజులు పొడిగించండి'
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను మరిన్ని రోజులు పొడిగించాలని కోర్టును కోరారు. హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ నెల 5న కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితురాలు అరుణా చద్దాకు నవంబర్ 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీతో కందా బెయిల్ గడువు ముగిసిపోనుండడంతో మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ కందా కోర్టును ఆశ్రయించాడు.