న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను మరిన్ని రోజులు పొడిగించాలని కోర్టును కోరారు. హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ నెల 5న కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితురాలు అరుణా చద్దాకు నవంబర్ 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీతో కందా బెయిల్ గడువు ముగిసిపోనుండడంతో మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ కందా కోర్టును ఆశ్రయించాడు.