Gopal Kanda
-
ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్ ప్రసాద్
చత్తీస్గడ్: హర్యాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకోబోదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చత్తీస్‌గడ్‌లో విలేఖర్ల సమావేశంలో భాగంగా రవిశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ(46) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతోంది. అయితే, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి మద్దతిస్తారని తెలిపారు. మరోవైపు కందా మాత్రం తన కుటుంబానికి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో విస్తృత సంబంధాలు దృష్యా బీజేపీకి బేషరత్తుగా మద్దతిస్తానని తెలపడం గమనార్హం. కాగా, కందా లైంగిక ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే గోపాల్ కందా మద్దతును బీజేపీ కోరబోదని రవిశంకర్ పేర్కొన్నారు. -
'మధ్యంతర బెయిల్‌ను మరిన్నిరోజులు పొడిగించండి'
న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను మరిన్ని రోజులు పొడిగించాలని కోర్టును కోరారు. హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కందా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ నెల 5న కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితురాలు అరుణా చద్దాకు నవంబర్ 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీతో కందా బెయిల్ గడువు ముగిసిపోనుండడంతో మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతూ కందా కోర్టును ఆశ్రయించాడు. -
గీతికా శర్మ ఆత్మహత్య; మాజీ మంత్రికి బెయిల్
ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శాసనసభ సమావేశాలను హాజరయ్యేందుకు వీలుగా ఆయనకు అక్టోబర్ 4 వరకు బెయిలిచ్చింది. 14 నెలలుగా కస్టడీలో ఉన్న కందాకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో తాత్కాలికంగా విముక్తి లభించనుంది. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తూ గీతికా శర్మ(23) గత ఏడాది ఆగస్టు 5న వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ రెసిడెన్సీలో ఆత్మహత్యకు పాల్పడింది. గోపాల్ కందా తనను తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్లో గీతిక పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విచారణ ప్రారంభమయిన దగ్గర్నుంచి కందా నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో గీతిక తల్లి కూడా తర్వాత ఆత్మహత్య చేసుకుంది. దీంతో కందా మెడకు మరింత ఉచ్చు బిగిసింది.