చత్తీస్‌గడ్: హర్యాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకోబోదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. చత్తీస్‌గడ్‌లో విలేఖర్ల సమావేశంలో భాగంగా రవిశంకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ(46) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతోంది.
అయితే, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి మద్దతిస్తారని తెలిపారు. మరోవైపు కందా మాత్రం తన కుటుంబానికి రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో విస్తృత సంబంధాలు దృష్యా బీజేపీకి బేషరత్తుగా మద్దతిస్తానని తెలపడం గమనార్హం. కాగా, కందా లైంగిక ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే గోపాల్ కందా మద్దతును బీజేపీ కోరబోదని రవిశంకర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment