చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.
‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు.
మరోవైపు.. ‘‘మేము గవర్నర్‌కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్‌తక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.
హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.
ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment