'సరోజనీ' ఘటనపై విచారణకు ఆదేశం
హైదరాబాద్(మెహిదీపట్నం): మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సరోజిని దేవి కంటి ఆస్పత్రిని సందర్శించారు. 15 మంది చూపు కోల్పోయిన ఘటనపై విచారణకు ఆదేశించారు. సెలైన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది చూపుకోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే తమ తప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది.