laxmareddy
-
‘ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి’
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ) : ఖాళీ అయిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో హాసాకొత్తూర్‌కు చెందిన ముత్యాల లక్ష్మారెడ్డి అలియాస్ కొత్తూర్ లక్ష్మారెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న లక్ష్మారెడ్డి తనకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో కలిసిన లక్ష్మారెడ్డి తన ప్రతిపాదనను సీఎం ముందు ఉంచారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. హాసాకొత్తూర్‌కు చెందిన లక్ష్మారెడ్డికి, కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులను పొందారు. మొదట్లో బాల్కొండ ఎమ్మెల్యే టికెట్‌ను లక్ష్మారెడ్డి కోరారు. రాజకీయ సమీకరణాలతో ఆయనకు అవకాశం లభించలేదు. అయినా ఆయన పార్టీ కి సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న లక్ష్మారెడ్డి సీఎంను కలిసి విన్నవించగా కేసీఆర్ నుంచి సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆశలు చిగురించేనా..
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆశలు చిగురించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు మంత్రి వర్గాన్ని విస్తరించిన సీఎం కేసీఆర్ నేడు మళ్లీ మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి అనుమతి తీసుకున్నారు. ఇదీలా ఉంటే ఎంత మందితో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు? కొత్తగా ఎవరెవరికీ అవకాశం కల్పించనున్నారు?అనేదానిపై అధినేత స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆదివారం జరగనున్న మంత్రి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొలుత అతి స్వల్ప కాలం వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఆ పదవి నుంచి తప్పించి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. స్వతహాగా వైద్యుడిగా ఉన్న లక్ష్మారెడ్డి సుమారు నాలుగున్నరేళ్ల పాటు వైద్యారోగ్యశాఖకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత లక్ష్మారెడ్డికి మళ్లీ పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆయనకు మంత్రి పదవి చేజారింది. నెలరోజుల క్రితం మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. అందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపించింది. తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాస్త ఆలస్యమైంది. చివరకు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హరీశ్‌రావు, కేటీఆర్, ఓ మహిళ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు బెర్త్ ఖరారైందనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే శనివారం రాత్రి వరకు మంత్రుల జాబితా ప్రకటించకపోవడంతో లక్ష్మారెడ్డికి మంత్రిపదవి దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇదీలా ఉంటే సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్న పది రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకూ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తనతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు విప్ పదవులు మరోవైపు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిని శాసనమండలి విప్‌గా శనివారం ప్రకటించారు. అలాగే అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ప్రభుత్వ విప్‌గా నియమించారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. -
జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి
జహీరాబాద్: బీజేపీ కేంద్ర అధిష్టానవర్గం విడుదల చేసిన రెండో జాబితాలో జహీరాబాద్ లోకసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. ఎల్లారెడ్డికి చెందిన బాణాల లక్ష్మారెడ్డి పేరును శనివారం సాయంత్రం అధిష్టానవర్గం అధికారికంగా ప్రకటిం చింది. బీజేపీ మొదటి జాబితాలో దేశంలోని 184 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణకు సంబంధించి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్‌కు చోటు లభించలేదు. శనివారం విడుదల చేసిన జాబితా లో జహీరాబాద్‌కు చోటు కల్పించారు. ఈమేరకు బాణాల లక్ష్మారెడ్డికి టికెట్‌ను ఖరారు చేశారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సోమాయప్పకు దక్కని అవకాశం జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గాను బీజేపీ టికెట్ కోసం సోమాయప్ప తీవ్రంగా కృషి చేశారు. మొదట్లో అధిష్టానవర్గం సోమాయప్పకే టికెట్‌ను ఖరారు చేసే విషయాన్ని పరిశీలించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పేరు ఖరారు కావడంతో బీజేపీ అధిష్టానవర్గం సోమా యప్ప అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి చూపలేదని తెలి సింది. పాటిల్, సోమాయప్పలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. దీంతో ఒకే ప్రాంతం, ఒకే సామాజిక వర్గం వారు కావ డంతో టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసినట్లు తెలిసింది. పాటిల్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే అంతగా ఫలితం ఉండదని భావించిన అధిష్టాన వర్గం చివరి నిమిషంలో బాణాల లక్ష్మారెడ్డి వైపు మొగ్గుచూపిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పేరు : బాణాల లక్ష్మారెడ్డి తండ్రిపేరు : భీంరెడ్డి తల్లి : సాయమ్మ భార్య : సావిత్రి కుమార్తెలు : రాగిణి, మోగన గ్రామం : ఎండ్రియాల్ మండలం : తాడ్వాయి నియోజకవర్గం: ఎల్లారెడ్డి జిల్లా : కామారెడ్డి విద్యార్హత : బీకాం రాజకీయ ప్రవేశం : 1993, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి బీజేపీలో చేరిక : 2010, నియోజకవర్గం ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి 32 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. -
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి,బాలానగర్ (జడ్చర్ల): టీఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఐకరాజ్య సమితి గుర్తించిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం బాలానగర్‌తోపాటు పరిధిలోని కేతిరెడ్డిపల్లి, గాలిగూడ, పెద్దాయపల్లి, చెన్నంగులగడ్డతండా, ఎక్వాయపల్లి, రాజ్యతండా, ఈదమ్మగడ్డతండా, ఉడిత్యాల, కుర్వగడ్డతండా, మేడిగడ్డతండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నుంచి ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, వలసలను నివారించడానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపడితే తమకు భవిష్యత్ ఉండదని గ్రహించిన నక్కజిత్తుల కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసు వేసి పనులు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రాజెక్టులను అడ్డుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం మహాకూటమి పేరుతో వస్తున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపిన కేసీఆర్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కోదండరాంరెడ్డి, శంకర్, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, మైపాల్‌రెడ్డి, మోహన్‌నాయక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
జడ్చర్లలో రికార్డు సత్యం..!
జడ్చర్ల టౌన్: జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14సారు ఎన్నికలు జర్గగా ఎర్ర సత్యం అలియాస్ మరాఠి సత్యనారాయణ అత్యధిక మెజారిటీ సాదించి రికార్డు నెలకొల్పారు. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై 53,779ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏ అభ్యర్థి కూడా ఈ రికార్డును చేరుకోలేకపోయారు. ఇక 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి 1,056 ఓట్ల తేడాతో విజయం సాదించారు. ఆయన సమీప టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఇక మెజారిటీ విషయానికి వస్తే ఎర్ర శేఖర్ అలియాస్ ఎం.చంద్రశేఖర్ పేరిట రెండో రికార్డు నమోదైంది. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో 47,735 ఓట్ల మెజారిటీతో ఆయన సమీప అభ్యర్థి సుధాకర్‌రెడ్డిపై గెలుపొందారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు పోలైన రికార్డు కూడా ఎర్ర శేఖర్ పేరిటే ఉంది. 1996లో ఆయనకు ఏకంగా 72వేల ఓట్లు పోలయ్యాయి. ఒక అభ్యర్థికి ఇన్ని ఓట్లు రావడం జడ్చర్లలో ఇప్పటి వరకు ఇదే రికార్డు. రికార్డులపై లక్ష్మారెడ్డి దృష్టి జడ్చర్ల నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఎర్ర శేఖర్‌కు దక్కింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి పలు రికార్డులపై దృష్టిసారించారు. మూడో పర్యాయం గెలవడం ద్వారా శేఖర్ రికార్డును సమం చేయటంతో పాటు ఎర్ర సత్యంకు దక్కిన మెజారిటీ దాటేందుకు కృషి చేస్తున్నారు. అలాగే, అత్యధికంగా ఓట్లు సాధించే రికార్డుపై ఆయన దృష్టి సారించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
మొహం ఉన్నదా?!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రాంతానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం తలపెట్టారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణపై విషం చిమ్మే టీడీపీ ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పోటీ చేస్తదని నిలదీశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తొమ్మిదేళ్లు సీఎంగా చంద్రబాబు పాలమూరు ప్రాంతాన్ని దత్తత తీసుకొని వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం పచ్చబడకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఢిల్లీకి లేఖలు రాసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు.. అయినా రైతుల సంక్షేమం కోరి అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నం.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీల నేతలు కూటమిగా జట్టుకట్టి వస్తున్నరు.. అసలు ప్రజలను ఓట్లు అడిగేందుకు ఆ నేతలకు మొహం ఉన్నదా? ఏం చెప్పి మళ్లీ ఓట్లు అడుగుతరు? ఇప్పటికే నేనోసారి బాబును తరిమికొడితే పారిపోయిండు.. ఈసారి మాత్రం ఆ పనిచేయాల్సింది ప్రజలే!జిల్లాలో రెండు చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... తొమ్మిదేళ్లు దత్తత తీసుకున్నన్నా.. ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో.. ఏ ముఖం పెట్టుకొని పోటీ చేస్తున్నరు? ఇదే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు సీఎంగా ఉం డి... మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొన్న అని మాట్లాడిండు. అభివృద్ధి చేయడానికి తొమ్మిదేళ్లు సరిపోవా? ఇయాల మనం నాలుగేళ్లలో కల్వకుర్తిని పూర్తి చేయలేదా? భీమా, నెట్టెంపాడు పూర్తి చేసి 8.5లక్షల ఎకరాలకు నీరు తీసుకోలేదా? కోయిల్‌సాగర్ లిఫ్టు పూర్తి చేసి చెరువులు నింపుకోలేదా? కొత్త ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని చకచక పనులు చేసుకుంటలేమా? కర్వెన రిజర్వాయర్ కళ్ల ముందే ఉన్నది, వట్టెం, నార్లాపూర్ రిజర్వాయర్ల పనులు జరుగుతున్నయి. షాద్‌నగర్‌లో లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం జరగబోతున్నది. ఎంత త్వరగా.. నాలుగేళ్లలో కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి ఒక్క పాలమూరు జిల్లాలోనే ఇన్ని రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయగలిగామంటే.. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా. గట్టి జవాబు చెబుదామా? పాలమూరు జిల్లా ప్రజలారా.. మీ వేలితోనే మీ కన్ను పొడిచేస్తా. మిమ్మల్ని అమాయకులను చేసో.. నాలుగు డబ్బులిచ్చో.. టక్కుటమార విద్యలతో మీ పాలమూరును మీతోనే బంద్ చేయిస్తా. దయాకర్‌రెడ్డిని మక్తల్‌లో గెలిపించి చూపిస్తా అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే మక్తల్‌లో టీడీపీని గెలిపిద్దామా.. లేదంటే చంద్రబాబుకు గట్టి జవాబు చెప్పాల్నా అనేది పాలమూరు ప్రజలు గట్టి నిర్ణయం చేయాలి. పాలమూరు జర్నలిస్టులు ఇక్కడి బిడ్డలుగా.. నేను చెప్పే మాటలు నిజమా కాదా? నిజమే అయితే మీరు మంచి విశ్లేషణలు చేసి జిల్లా ప్రజలకు చైతన్యం చేయాలి. లేకుంటే మనం ఇబ్బందుల పాలైతం. జర్నలిస్టు మిత్రులకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. పాలమూరు గోస ఇప్పుడిప్పుడే తీరే పరిస్థితి వస్తున్నది. ఇయాల మహాకూటమి పేరు మీద చంద్రబాబు మళ్లీ తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకి వచ్చి కొట్టి పోతా అంటున్నడు. చంద్రబాబుకు ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపుకుందామా, లేదు డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెబుదామా.. అనేది పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. బాబు ఏ విధంగా సిగ్గు లేకుండా భుజాల మీద మోస్తున్నరని కాంగ్రెస్ నాయకులను కూడా అడగాలని కోరుతున్నా. కాంగ్రెస్సోళ్లు కూడా కేసులే ఏసిండ్రు.. కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా నిలుచున్నరు. ఒకాయన పవన్‌కుమార్‌రెడ్డి దేవరకద్రలో, మరొకరు హర్షవర్ధన్‌రెడ్డి కొల్లాపూర్‌లో నిలబడుతున్నరు. ఇంకొకడు నాగం జనార్ధన్‌రెడ్డి అని నాగర్‌కర్నూల్‌లో ఉన్నడు. వీళ్లు ముగ్గురు కలిసి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 35 కేసులు వేసిండ్రు పుణ్యాత్ములు. భూములను ఖరీదు చేద్దామంటే.. ఈ ముగ్గురు కూడా ఎకరానికి రూ.50లక్షలు, రూ.30లక్షలు కావాలంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇదేనా వీళ్లు పనిచేసే పద్ధతి. కరువుతో సతమతమయ్యే జిల్లా. ఊరుకొకటి బొంబై బస్సులున్నయి. జిల్లా దుఖం పోవాలనా, లేదా? భారతదేశం మొత్తం మీద పాలమూరుకు దండం పెట్టి చెబుతున్నా.. నేను మీ బిడ్డను. నా పోరాటానికి భుజం తట్టాలి. పోరాటం ఆగలేదు. ఇంకా దుర్మార్గులు ఉడుములాగా చొరబడి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నరు. 20లక్షల ఎకరాలకు సాగునీరు.. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఈ నాలుగేళ్లలోనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పాలమూరు జిల్లాలో దాదాపు పూర్తి చేసుకున్నాం. ఇంకా కేవలం పది శాతం పనులు మాత్రమే మిగిలినయి. ఉమ్మడి జిల్లాలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు పారించుకోగలుగుతున్నాం. వలసలు మాయమైపోయి.. బొంబై బస్సులు బంద్ అయితున్నయి. హైదరాబాద్‌లో ఉంటున్న ఇదే జిల్లాలోని వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాల ప్రజలు రేషన్‌కార్డులు మాకు ఊళ్లో ఇవ్వండి అని చెప్పి తిరిగొచ్చి గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఖచ్చితంగా పాలమూరు కరువు తీరాలే. పాత జిల్లా మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే 1.50లక్షల ఎకరాల పైచిలుకు సాగులోకి రావాలని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఉదండాపూర్ వద్ద పట్టుబట్టి రిజర్వాయర్ పనులు చేయిస్తున్నారు. అవి అయిపోగానే కల్వకుర్తి, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతది. సిగ్గులేకుండా లేఖలు రాసిండు.. చంద్రబాబు పాలనలో పాలమూరులో వేసిన పునాది రాళ్లు తీసుకుపోయి కృష్ణా నదిలో అడ్డం వేస్తే అదే పెద్ద డ్యామ్ అయితది. తద్వారా మనకు నీళ్లు వస్తయని ఇది వరకే ఒకసారి చెప్పిన. పాలమూరును తొమ్మిదేళ్లు దత్తత తీసుకొని వలస జిల్లాగా మార్చిన చంద్రబాబు.. ఇయాల పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దని ఢిల్లీకి లేఖలు రాసిండు. అలాంటి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతడు? దయచేసి పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి. మీతో కోరేదొక్కటే.. ఎన్నికల్లో కన్ప్యూజ్ కావొద్దు, ఆలోచన చేయాలి. మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న వ్యక్తికి ఓట్లేయడానికి మనేమేమైన ఎడ్డొళ్లమా, అంత అమాయకులమా? దయచేసి పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి. ప్రతీ కార్యకర్త లక్ష్మారెడ్డి అనుకుని పనిచేయాలి జడ్చర్ల టౌన్: సీఎం కేసీఆర్ సభకు వచ్చిన ప్రతీ కార్యకర్త, మహిళ లక్ష్మారెడ్డిగా భావించుకుని 15 రోజులు కష్టపడి అత్యధిక మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత పిలుపునిచ్చారు. జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ వెళ్లాక ఆమె హాజరైన ప్రజలు, కార్యకర్తలు, మహిళలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. సభ నుంచి సీఎం కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా వెళ్లారని, ఆయన ఉత్సాహం మరింత రెట్టింపు చేసేందుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు. రానున్న 15రోజులు అత్యంత కీలకమని, ఇన్నాళ్లు పార్టీకోసం పాటుపడిన వారంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన భర్త అహర్నిశలు పాటుపడుతున్నారని, అదే స్ఫూర్తి కొనసాగించాలంటే ప్రజలు, కార్యకర్తలు కూడా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. -
కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకచకా..
సాక్షి, జడ్చర్ల : టీఆర్ఎస్ రథసారథి, సీఎం కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించి జడ్చర్లలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కల్వకుర్తి రోడ్డులో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సభా ఏర్పాట్లు యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21న ఉదయం 11 గంటలకు జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థిడాక్టర్ సి.లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుండి హెలీక్యాప్టర్‌లో కేసీఆర్ జడ్చర్లకు చేరుకుంటారని తెలిపారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి దాదాపు 40 వేల నుండి 50వేల మంది వరకు సభకు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఏర్పాట్లను మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్‌గౌడ్, జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ యాదవ్ తదితరులు కూడా పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, మార్కెట్ చైర్మెన్ పిట్టల మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్యతో పాటు నాయకులు ఉమాశంకర్‌గౌడ్, రమణారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ గూటికి ‘బండారి’!
కాప్రా/ఉప్పల్: టీడీపీ– కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం దాదాపుగా టీడీపీకి కేటాయించనున్నట్లు వార్తలు గుప్పుమనడంతో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆశించిన బండారి లక్ష్మారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం కార్యకర్తలు, ముఖ్య నాయకులతో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బండారి లక్ష్మారెడ్డి సైనిక్‌పురిలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో ఎట్టకేలకు పార్టీ వీడటానికి నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బండారి లక్ష్మారెడ్డి.. ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం ఎంతో ఆశతో వేచి చూసినా.. దాదాపు నిరాశే æఎదురవుతుందన్న సమాచారం మేరకు ఎట్టకేలకు పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ మంతనాలు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 12న ముహూర్తం ఖరారు.. ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన బండారి లక్ష్మారెడ్డి కార్యకర్తలు, అభిమానుల సూచనల మేరకు ఈ నెల 12న గులాబీ గూటికి చేరేందుకు మూహూర్తం ఖరారు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆయనకు సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్లో కూడా ప్రకటించిన లిసు ్టలో అభ్యర్థులకు బీ ఫారాలు వచ్చే వరకు నమ్మకం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థుల జాబితా తారుమారు కావచ్చనే అనుమానాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఉప్ప ల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి బండారు లక్ష్మారెడ్డి పోటీకి దిగే అవకాశం లేకపోలేదు. ఉప్పల్‌లో వేడెక్కిన రాజకీయం.. ఉప్పల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా రాజకీయాలు వేడెక్కాయి. ఓ పక్క టీఆర్ఎస్ టిక్కెట్‌ను ఇప్పటికే ఖరారు చేయడం మరోపక్క టీడీపీ, కాంగ్రెస్ పొత్తు, టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు ప్రెస్మీట్లలో తమ ఆవేదనను వ్యక్తపరచడం, ఆందోళనలు నిర్వహించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం వరకు టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తులు దాదాపు ఖరారు కావడంతో ఉప్పల్ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఆవేదన చెందిన కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. గ్రేటర్ పరిధిలో రెండు కార్పొరేటర్ టిక్కెట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నాచారం కార్పొరేటర్ కూడా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఒక్కసారిగా ఉప్పల్ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీతో పొత్తు దారుణం: బండారి కాంగ్రెస్ పతనం చేయడానికి స్థాపించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం దారుణమని బండారు లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ కోసం పని చేసిన తన కు ఉప్పల్ టికెట్ ఇవ్వకపోవడం దారుణమన్నా రు. తనతోపాటు నియోజకవర్గంలో పలువురు నేతలు పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. వీరు కూడా కారెక్కుతారా..? కాప్రా సర్కిల్ అధ్యక్షుడు బీఏ రాంచందర్‌గౌడ్, ఉప్పల్ సర్కిల్ అధ్యక్షుడు మూషం శ్రీనివాస్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, 10 డివిజన్ల అధ్యక్షులు, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఇంద్రయ్య, మైనార్టీ అధ్యక్షుడు సర్వర్, ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు టిల్లు యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ యూత్ నాయకులు అభిషేక్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సందీప్‌రెడ్డి, 9 డివిజన్ల కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘం కమిటీల సభ్యులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘మెడికల్ కాలేజీలకు వేగంగా భూసేకరణ’
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేటలలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కాలేజీలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి అధి కారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్ల గొండ, సూర్యాపేటల్లో ప్రస్తుతం నడుస్తున్న వైద్యశాలల పరిధిలో ఉన్న భూమి సరిపోదని, ఒక్కో మెడికల్ కాలేజీకి కనీసం 20 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలని చెప్పారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణాలు, వైద్యశాలల నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు. జూలై 7లోపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతుల కోసం అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. -
కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ కొత్తగా 27 పీజీ వైద్య సీట్లు పెరిగాయి. సీట్ల పెంపుపై ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వైద్య విద్య సంచాలకుడికి లేఖ రాసింది. గాంధీ వైద్య కళాశాల ఛాతీ విభాగంలో 1, అనస్తీషియా విభాగంలో 2, కాకతీయ వైద్య కళాశాల చర్మ వ్యాధుల విభాగం లో 1, స్త్రీ వ్యాధుల చికిత్స విభాగంలో 5, రేడియాలజీలో 3, ఈఎన్టీలో 1, కంటి విభాగంలో 1, ఉస్మానియా వైద్య కళాశాల స్త్రీ వ్యాధుల విభాగంలో 4, ఈఎన్టీ విభాగంలో 3, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అనస్తీషియా విభాగంలో 6 సీట్ల చొప్పున పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో్ల పెంచిన సదుపాయాలతోనే 27 సీట్లు పెరిగాయని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్‌కు అధికారం కల్ల: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జడ్చర్లలో జనగర్జన పేరిట జరిగిన కాంగ్రెస్ సమావేశం.. ‘కొండంత రాగం తీసి, ఏదో పాట పాడినట్టు’ గా ఉందని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సభకు జాతీయ నాయకులు హాజరైనా ప్రజలు పట్టించుకోలేదని, తెలంగాణకు కాంగ్రెస్ పీడ విరగడైందని జనం భావిస్తున్నారని, కాంగ్రెస్‌కు అధికారం దక్కడం కల్ల అని వ్యాఖ్యానించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో దొంగల్లా తప్పించుకు తిరిగిన కాంగ్రెస్ నేతలు, ఇపుడు తెలంగాణ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఓ జోకర్లా మారాడాని లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ‘రేవంత్ ఓ పిట్టల దొర, పెద్ద దొంగ, నేను బాజాప్తా రియల్ ఎస్టేట్ వ్యాపారినే. మా కుటుంబానికి మా ప్రాంతంలో ఓ చరిత్ర ఉంది. గోడల మీద రంగులేసుకుని బతికిన రేవంత్‌కు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి’ అని ప్రశ్నిం చారు. జడ్చర్లలో కాంగ్రెస్ నేతలు వ్యక్తి గత విమర్శలకు దిగటం వారి దౌర్భాగ్యానికి నిదర్శనమని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్‌కూ పడుతుందని జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఈజేహెచ్ఎస్ బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం: ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సేవల పథకంపై ఎలాంటి అపోహలు వద్దని, వైద్య సేవలు కొనసాగుతాయని మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. నగదు రహిత వైద్య సేవల బకాయిలను త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. -
రంగులేసుకుని బతికిన రేవంత్‌కు వేల కోట్లా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే ఖబడ్దార్ అని టీఆర్ఎస్ నేతలు సి. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డిలు హెచ్చరించారు. వారిక్కడ గురువారం మాట్లాడుతూ జడ్చర్లలో జనగర్జన పేరిట కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తే 3 వేల మంది కూడా హాజరు కాలేదన్నారు. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి జోకర్ గా మారారని ఎద్దేవా చేశారు. గోడల మీద రంగులు వేసి బతికిన రేవంత్‌కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. కాగా, జడ్చర్లలో బుధవారం జరిగిన సభలో మంత్రి సి. లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్.. మున్నాభాయ్, ఆర్ఎంపీ డాక్టర్ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
‘నేను ఎస్సైని.. నాకు నువ్వు భార్యగా వద్దు’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): ‘నేను ఎస్సైని.. నాకు నువ్వు భార్యగా వద్దు, నువ్వు వీడాకులు ఇస్తే కోటీశ్వరుల కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అంటూ సంగారెడ్డి టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న తన భర్త పి.లక్ష్మారెడ్డి విడాకులు ఇవ్వాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని భార్య జ్యోతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. రెండున్నరేళ్ల బాబును కూడా పట్టించుకోకుండా తన భర్త, అత్త, మామలు బెదిరింపులకు పాల్పడుతున్నారని కన్నీరుమున్నీరయింది. తన బిడ్డకు, తనకు న్యాయం చేయాలంటూ సోమవారం ఆమె బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి సమయంలో రూ.15లక్షలు, 40 తులాల బంగారం పెట్టామని, కానీ, ఏడాది నుంచి తాను వెళ్లిపోతే కోట్లు ఉన్న అమ్మాయి తమకు కోడలుగా వస్తుందని అత్త, మామ అంటున్నారని పేర్కొంది. తన భర్త రోజుకో అమ్మాయితో మాట్లాడుతూ, తిరుగుతూ వాళ్లంతా తన గర్ల్‌ఫ్రెండ్స్ అని అంటూ వారిలో ఒకర్ని చేసుకుంటానని అంటున్నాడని, విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలల హక్కులసంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ ఈ విషయంపై మల్కాజగిరి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ అయినా ఎస్సై లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణం ఎస్సైపై చర్యలు తీసుకుని బిడ్డకు, భార్యకు న్యాయం చేయాలని కోరారు. -
అంతిమ యాత్ర వాహనాలు ప్రారంభం
హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో పేదలు చనిపోతే వారి భౌతిక కాయాలను శ్మశానానికి తరలించేందుకు నగరంలో అంతిమ యాత్ర(పరమ పద) వాహనాలను మంత్రులు లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం ప్రారంభించారు. ఈ వాహనాల్లో భౌతిక కాయాలను తీసుకెళ్లేందుకు ఎలాంటి అవినీతికి పాల్పడవద్దని వాహన చోదకులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి తలసాని అసహనం వ్యక్తంచేశారు. బెడ్షీట్లు మార్చడం లేదని, లిఫ్టులు సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఎక్కడికక్కడ వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు త్వరలో ‘అమ్మ ఒడి’ 102 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. -
ప్రాజెక్టులకు ప్రతిపక్షాల అడ్డంకులు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతుల దగ్గర భూములు లాక్కున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిజం కావన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి విపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే ముంపు తప్పనిసరని, ఇళ్లు, భూములు పోతాయని అన్నారు. -
ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల : సమాజంలో ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కృSషిచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాదేపల్లిలో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ భవనం నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే భవననిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తామన్నారు. అర్హులయిన ఫొటోగ్రాఫర్స్‌కు డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో కెమెరాలులేని వారికి సహకరిస్తామన్నారు. అంతకుముందు ఫొటోగ్రఫీ పితామహుడు లూయూస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన ఫొటోగ్రాఫర్ జైపాల్‌గౌడ్ కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం మంత్రి అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలం, వైస్ ఎంపీపీ రాములు, కోఆప్షన్ ఇమ్ము, నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు శ్రీకాంత్, కొండల్, తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
– మంత్రి లక్ష్మారెడ్డి – ఆయకట్టుకు కోయిల్‌సాగర్ నీటి విడుదల కోయిల్‌సాగర్ (దేవరకద్ర రూరల్): సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి నీటి బొట్టు వథా కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయకట్టు రైతులపై ఉందన్నారు. దేవరకద్ర మండలంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కోయిల్‌సాగర్ నీటిని గురువారం దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డిలతో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి ఆయకట్టుకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ఎంతో శ్రమకోర్చి జూరాల నుంచి లిఫ్టు ద్వారా కోయిల్‌సాగర్‌కు కష్ణా జలాలను తరలించామన్నారు. నీటిని వథా చేయకుండా ఆయకట్టు రైతులు సేద్యానికి ఉపయోగించుకొని లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిలాల్, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, ఎంపీపీ గోపాల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, దేవరకద్ర వ్యవసాయ కమిటీ ఛైర్మన్ జెట్టి నర్సింహ్మారెడ్డి, ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డి, నాయకులు దేవరి మల్లప్ప, కొండా శ్రీనివాస్‌రెడ్డి, రఘువర్మ, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కర్ణంరాజు, దొబ్బలి ఆంజనేయులు, అంజన్‌కుమార్, ఇరిగేషన్ అధికారులతో పాటు దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బాలానగర్ : ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెన్నవెల్లిలో మొక్కలునాటారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 33 శాతం ఉండాల్సిన అడవులు 16 శాతమే ఉన్నాయని వనాల మూలంగానే వర్షాలు సమద్ధిగా కురుస్తాయని దానికోసం సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకున్నారని అన్నారు. చెన్నవెల్లి గ్రామానికి ఇచ్చిన 40వేల మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని అన్నారు. అంతేకాకుండా ఈగలు దోమలు ఉండవని అన్నారు. ఇళ్ల నుంచి నీటిని బయటికి వదలడంతో ఎక్కడపడితే అక్కడనీరు చేరి వాటిపై దోమలు చేరి రోగాలబారిన పడాల్సి వస్తోందని వేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్‌చారి, మహిపాల్‌రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, చెన్నయ్య, పెంటయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ విద్య అందించడమే లక్ష్యం
–రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల : రాష్ట్రంలో ఉత్తమ విద్యను అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో జరిగిన నియోజకవర్గ స్థాయి విద్యా సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తుందని, కేజీ నుంచి పీజీ వరకు అమలు చేసే ఉచిత విద్య విధానంపై చర్చిస్తుందన్నారు. నేటి పరిస్థితులకు అనుగునంగా, ఉపాధి కల్పించే విధంగా వృత్తి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొన్ని విద్యాసంస్థలు దుర్వినియోగం చేసి అవకతవకలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అదనపు గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు,తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎస్ఆర్ ఫండ్ ద్వారా 50 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. కంప్యూటర్ వలంటీర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. వైద్య శాఖ ఆద్వర్యంలో ఆర్బీఎస్కే కింద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కళాశాల, జెడ్పీహెచ్ఎస్ స్థాయిలో బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ అందజేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అభివృద్ధికి రూ. 2కోట్లు కేటాయింపు జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇటీవల జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తాము సమీక్షించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే రూ.కోటి కేటాయిస్తే ఇందుకు ప్రభుత్వం రూ. 3కోట్లు కేటాయించడంతో పాటు మరో కోటి నిధులను కంట్రిబ్యూషన్ కింద జమచేస్తుందని తెలిపారు. మొత్తం రూ. 5కోట్లతో నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుందన్నారు. అందులో భాగంగా తాము రూ. 2కోట్లు కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్వీఎం పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓ పాపయ్య, జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, ఆర్వీఎం డీఈఈ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'సరోజినిదేవి' వైద్యులపై చర్యలు
-
'సరోజినిదేవి' వైద్యులపై చర్యలు : మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దుష్ప్రచారంతో పేద రోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అవిభక్త కవలలు వీణా-వాణీలను స్టేట్ హోమ్‌కు తరలించాలని చూస్తున్నామని మంత్రి వెల్లడించారు. కలరా, ఇతర విష జ్వరాలపై భయపడాల్సిన పనిలేదని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. సరోజినిదేవి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని కొందరు అంధులుగా మారిన విషయం తెలిసిందే. -
'సరోజనీ' ఘటనపై విచారణకు ఆదేశం
హైదరాబాద్(మెహిదీపట్నం): మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సరోజిని దేవి కంటి ఆస్పత్రిని సందర్శించారు. 15 మంది చూపు కోల్పోయిన ఘటనపై విచారణకు ఆదేశించారు. సెలైన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 మంది చూపుకోల్పోయారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే తమ తప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం అంటోంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని డాక్టర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. -
'ఆరోగ్య శ్రీ' పై తొలగిన ప్రతిష్టంబన
హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు తిరిగి కొనసాగనున్నాయి. ప్రభుత్వంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు. మంత్రి లక్ష్మా రెడ్డి హామీతో సమ్మె విరమించామని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు వెల్లడించారు. ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం రూ.100 కోట్లు విడుదల చేసి, నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లిస్తామన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే సేవలు పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమిస్తున్నామని చెప్పారు. నెలాఖరులోగా మిగతా బకాయిలు చెల్లించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. -
2,118 ‘వైద్య’ పోస్టులకు ఓకే
భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు త్వరలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ‘సాక్షి’తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో 2,118 మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఉత్తర్వుల జారీ అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయనుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 2,400 పోస్టులను భర్తీ చేయాలని గతంలో కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఖాళీలపై కసరత్తు చేసిన అధికారులు భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను 2,118గా లెక్కగట్టారు. వాస్తవానికి 6 వేల వరకు ఖాళీలు ఉన్నా 2,118 పోస్టులనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. చాలా చోట్ల ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నందున అక్కడ వారి సేవలనే తీసుకోనుంది. నాలుగో తర గతి ఉద్యోగులను, ఎన్‌ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోల భర్తీ చేసే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు డీఎంఈ పరిధిలో 1,482 ఖాళీలుంటే అందులో 665 ఖాళీలు నాలుగో తరగతి ఉద్యోగాలే ఉండటం గమనార్హం. అయితే నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీ ఉండబోదని వైద్య వర్గాలు తెలిపాయి. డీఎంఈ పరిధిలో 206 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండగా నేరుగా భర్తీ చేయడానికి అవకాశం ఉన్న 124 పోస్టులనే భర్తీ చేయనున్నారు. అలాగే 279 స్టాఫ్ నర్సు పోస్టులు, 121 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 121 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు, కుటుంబ సంక్షేమం, ప్రజారోగ్య విభాగంలో 328 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఈ విభాగంలోని 772 స్టాఫ్ నర్సు పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 150 వైద్య పోస్టులన్నీ నేరుగా భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నవే. ఆ ప్రకారమే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. -
సినీ కార్మికులకు అండగా ఉంటాం: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సినీ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.శనివారం మధ్యాహ్నం ఆయన గచ్చిబౌలి చిత్రపురి కాలనీలో నిర్మించతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ) నిర్మాణానాకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి చిత్రపురి సొసైటీ సభ్యులతో చర్చించారు.కాలనీ వాసులకు వైద్య సేవలందించేలా పీహెచ్సీలో ఏర్పాట్లు చేస్తామని, సినీ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. -
'టాయిలెట్ విధానం వల్లే కీళ్ల అరుగుదల'
హైదరాబాద్: కాల్షియం లోపంతో పాటు ఇండియన్ టాయిలెట్ విధానంలో తరచూ కింద కూర్చొని లేవడం వల్ల అనేక మందిలో చిన్న వయసులోనే మోకాలి కీళ్లు అరుగుతున్నాయని ప్రముఖ మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ అఖిల్‌దాడీ చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మ్యారీగోల్డ్‌లో జరిగిన 'శ్రీకర' ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన ఫోర్త్ జాయింట్ రీప్లేస్మెంట్ లైవ్ సర్జరీ వర్క్‌షాప్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది ఆర్థోపెడిక్ నిపుణులు హాజరయ్యారు. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు తుంటి, ఒక పాడైపోయిన జాయింట్‌తో పాటు మరో నాలుగు మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి లైవ్ ద్వారా వర్క్‌షాప్‌కు హాజరైన వారికి చూపించారు. అనంతరం డాక్టర్ అఖిల్ దాడీ మాట్లాడుతూ... సంప్రదాయం పేరుతో ఇప్పటికీ చాలా మంది మహిళలు నేలపై కూర్చుంటున్నారని, ఇలా కూర్చొని లేవడం వల్ల మోకాళ్లు అరుగుతున్నాయని చెప్పారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి శస్త్రచికిత్స అవసరం లేదన్నారు. లక్ష మంది బాధితుల్లో కేవలం రెండు వేల మందికి మాత్రమే మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉంటుందన్నారు. మిగిలిన వారికి మందులతోనే నయం అవుతుందని చెప్పారు. -
ఉదయం 6గంటలకు ఎంసెట్ 'కోడ్' విడుదల
హైదరాబాద్: ఎంసెట్ - 2016 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి మెడిసిన్ పరీక్ష జరగనుంది. ఈమేరకు పరీక్షా పత్రాల సెట్ కోడ్ లను మంత్రులు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ సెట్ కోడ్ ను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని జేఎన్ టీయూహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్ ప్రశ్నాపత్నం కోడ్ ను వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉదయం 9:30 గంటలకు వెల్లడిస్తారు. (చదవండి: రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష) -
నిమ్స్‌లో క్యాష్‌లెస్ ఓపీ సేవలు షురూ
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం...అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు - వైద్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు నిమ్స్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల కన్నా మరింత మెరుగైన వైద్యసేవలు అందించి, వాటి గుత్తాధిపత్యానికి గుణపాఠం చెబుతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారుల కోసం ప్రభుత్వం రాజధానిలోని ‘నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ (నిమ్స్)లో ఏర్పాటు చేసిన ‘క్యాష్‌లెస్ అవుట్ పేషంట్’ సేవల విభాగాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌తో పాటు కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ విభాగాలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, రుమటాలజీ, డెర్మటాలజీ, వాస్క్యూలర్ సర్జరీ ఓపీలను రోగులకు అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దార్లకు ఓపీ, ఐపీ సేవలన్నీ ఉచితంగా అందించేందుకు ఇప్పటికే 200కు పైగా ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. మిగతా 12 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను కూడా ఈ పథకం కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4-6 గంటల వరకు... ఉస్మానియా, గాంధీ సహా అన్ని జిల్లా, బోధనాసుపత్రుల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈహెచ్ఎస్ అమలుపై ప్రతి నెలా సమీక్ష నిర్వహించి లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసి, రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం’ అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ఈహెచ్ఎస్ పథకంలో భాగంగా ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రుల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా, ఆరోగ్యశ్రీ సీఈఓ చంద్రశేఖర్, డీఎంఈ రమణి, నిమ్స్ డెరైక్టర్ కె.మనోహర్, టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
'తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలి'
కరీంనగర్(సుల్తానాబాద్): తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలనికోరుతూ మంగళవారం రాత్రి ఎంపీలతో కలిసి తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కలిసి విన్నవించారు. ఎయిమ్స్ ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి వైద్య రంగంలో ప్రాధాన్యత ఇచ్చిన వారవుతారని అన్నారు. కేంద్ర మంత్రి తమ వినతిపై సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా ఉన్నారు. -
'వాళ్లు టీడీపీలో ఇంకా కొనసాగడం విచారకరం'
జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) : పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను టీడీపీ అడ్డుకుంటున్నా.. నాయకులు, కార్యకర్తలు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగడం విచారకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం జడ్చర్ల లోని ఏఎస్ఆర్ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా రైతాంగానికి సాగు నీరందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని కనబరిచి జిల్లా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. జిల్లాకు సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న బాబును ఆ పార్టీ నాయకులు ప్రశ్నించకపోగా తమపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. టీడీపీని వీడి చంద్రబాబుకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాబు వైఖరిని నిరసిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు జడ్చర్లలో నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
రాజకీయాలను అవినీతిమయం చేసిందే బాబు
సాక్షి, హైదరాబాద్: ఏ కేసులో అయినా బెయిల్ రావడం సహజమని కానీ, పట్టపగలు దొరికిన దొంగకు బొట్టుపెట్టి చంద్రబాబు స్వాగతం పలుకుతున్నాడని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నిత్యం అవినీతి గురించి మాట్లాడే చంద్రబాబు రేవంత్‌రెడ్డిని పార్టీ నుంచి ఎందుకు వెలివేయలేదని ప్రశ్నించారు. మరో మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలసి ఆయన గురువారం టీఆర్ఎస్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథ కానికి అడ్డం పడుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖరాసిన సంగతి మరిచి రేవంత్‌రెడ్డి డబ్బు సంచుల కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. రాజకీయాలను అవినీతిమయం చేసింది చంద్రబాబు అని మంత్రి ల క్ష్మారెడ్డి ఆరోపించారు. -
30 శాతం పడకలు అత్యవసర సేవలకే
- ప్రతి ఆస్పత్రిలోనూ కేటాయించాలి: లక్ష్మారెడ్డి - ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో 30 శాతం పడకలను అత్యవసర సేవా విభాగానికే (ఐసీయూ) కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్యా సంచాలకులు, ఐపీఎం డెరైక్టర్, నిమ్స్ తదితర అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయి అత్యవసర సేవలను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం కావాల్సిన పరికరాలు, మానవ వనరులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు. నిమ్స్‌లో ‘ఎమర్జెన్సీ మెడిసిన్’ పీజీ కోర్సును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కల్తీపై తడాఖా చూపించండి కల్తీ ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మ్యాగీలో ప్రమాదకర పదార్థాలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ చర్యలకు ఉపక్రమించారు. మామిడికాయలను కృత్రిమంగా మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారని పేర్కొన్నారు. పాలల్లో కల్తీ జరుగుతోందని, చిన్న పిల్లలు తాగే పాలల్లో కల్తీ జరిగితే ఉపేక్షించకూడదన్నారు. -
108 సిబ్బందితో మంత్రి చర్చలు
రంగారెడ్డి: తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న108 సిబ్బందితో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది తమ డిమాండ్లని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 'కనీస వేతనంగా రూ.20వేలు అందించాలి. 2014 సమ్మె సందర్భంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. 108లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలి. రోజు వారీగా 8గంటల పని దినాలు మాత్రమే ఉండాలి' అనే డిమాండ్లను 108 ఉద్యోగులు మంత్రి ముందుంచారు.