బాణాల లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి
జహీరాబాద్: బీజేపీ కేంద్ర అధిష్టానవర్గం విడుదల చేసిన రెండో జాబితాలో జహీరాబాద్ లోకసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి ఉత్కంఠకు తెరదించారు. ఎల్లారెడ్డికి చెందిన బాణాల లక్ష్మారెడ్డి పేరును శనివారం సాయంత్రం అధిష్టానవర్గం అధికారికంగా ప్రకటిం చింది. బీజేపీ మొదటి జాబితాలో దేశంలోని 184 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో తెలంగాణకు సంబంధించి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో జహీరాబాద్‌కు చోటు లభించలేదు. శనివారం విడుదల చేసిన జాబితా లో జహీరాబాద్‌కు చోటు కల్పించారు. ఈమేరకు బాణాల లక్ష్మారెడ్డికి టికెట్‌ను ఖరారు చేశారు. లక్ష్మారెడ్డి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
సోమాయప్పకు దక్కని అవకాశం
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గాను బీజేపీ టికెట్ కోసం సోమాయప్ప తీవ్రంగా కృషి చేశారు. మొదట్లో అధిష్టానవర్గం సోమాయప్పకే టికెట్‌ను ఖరారు చేసే విషయాన్ని పరిశీలించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ పేరు ఖరారు కావడంతో బీజేపీ అధిష్టానవర్గం సోమా యప్ప అభ్యర్థిత్వం పట్ల ఆసక్తి చూపలేదని తెలి సింది. పాటిల్, సోమాయప్పలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే. దీంతో ఒకే ప్రాంతం, ఒకే సామాజిక వర్గం వారు కావ డంతో టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసినట్లు తెలిసింది. పాటిల్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తికి టికెట్ ఇస్తే అంతగా ఫలితం ఉండదని భావించిన అధిష్టాన వర్గం చివరి నిమిషంలో బాణాల లక్ష్మారెడ్డి వైపు మొగ్గుచూపిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పేరు : బాణాల లక్ష్మారెడ్డి
తండ్రిపేరు : భీంరెడ్డి
తల్లి : సాయమ్మ
భార్య : సావిత్రి
కుమార్తెలు : రాగిణి, మోగన
గ్రామం : ఎండ్రియాల్
మండలం : తాడ్వాయి
నియోజకవర్గం: ఎల్లారెడ్డి
జిల్లా : కామారెడ్డి
విద్యార్హత : బీకాం
రాజకీయ ప్రవేశం : 1993, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి
బీజేపీలో చేరిక : 2010, నియోజకవర్గం ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి 32 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment