
ప్రాజెక్టులకు ప్రతిపక్షాల అడ్డంకులు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతుల దగ్గర భూములు లాక్కున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిజం కావన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి విపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే ముంపు తప్పనిసరని, ఇళ్లు, భూములు పోతాయని అన్నారు.