
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. పాలమూరులో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఆర్డీఎస్‌కు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని తెలిపారు. ఆర్డీఎస్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బాలరాజు తెలిపారు.
కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మంత్రి హరీశ్‌రావు దిగజారి వ్యవహరిస్తున్నారని సంపత్ కుమార్ మంగళవారం విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై మంత్రి నిజాలను దాచి పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.