projects
-
రెండు నెలల్లో ట్రిపుల్ ఆర్ ఆమోదం!
సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) క్లియరెన్స్‌లన్నీ త్వరలో పూర్తికానున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తుందని చెప్పారు. ఈప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి మంగళవారం ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనలతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు.ట్రిపుల్ ఆర్, హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రోడ్డు, 12 ఆర్వోబీలు తదితర అంశాలపై గడ్కరీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు విమానాశ్రయాల గురించి పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కొత్తగూడెం, రామగుండం, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 95 శాతం భూసేకరణ చేశాం 2018–19లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రకటించగా.. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కోమటి రెడ్డి విమర్శించారు. తాము అధికారం చేపట్టిన నాటి నుంచి కేంద్రంతో టచ్‌లో ఉంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జంగారెడ్డి–భువనగిరి–చౌటుప్పల్ వరకు టెండర్లు పిలిచామన్నారు. 95 శాతం భూసేకరణను క్లియర్ చేశామని, కేంద్రం నుంచి ఆమోదం వచ్చాక వారికి పరిహారమిస్తామని తెలిపారు.‘హైదరాబాద్–విజయవాడ ఆరులేన్ల రహదారిని మచిలీపట్నం వరకు పొడిగిస్తున్నామని, ఇందుకు కన్సల్టెంట్‌ను పిలిచినట్లు గడ్కరీ తెలిపారు. అయితే, హైదరాబాద్–విజయవాడ వరకు ఇప్పటికే భూసేకరణ పూర్తయినందున త్వరగా టెండర్లు పిలవాలని కోరాను. రెండు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది.మొదటి ప్యాకేజీలో మల్కాపూర్–విజయవాడ, రెండో ప్యాకేజీలో విజయవాడ–మచిలీపట్నం వరకు నిర్మాణం జరిపేందుకు గడ్కరీ ఒప్పుకున్నారు. పర్వతమాల పథకం కింద యాదగిరిగుట్ట, భువనగిరి కోటకు, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా నాగార్జున కొండను కలుపుతూ, మంథనిలోని రామగిరి కోట ప్రాంతాల్లో రోప్‌వేలు అడిగాను. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు’అని కోమటిరెడ్డి చెప్పారు.అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక లేనట్లేనని, ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తానని కేసీఆర్ అంటున్నారు, ఒకవేళ కేసీఆర్ ఒక అంశాన్ని ఎత్తి చూపితే పది అంశాలను సభ ముందు పెడతాం. దళిత సీఎం నుంచి జర్నలిస్ట్‌ల వరకు కేసీఆర్ చేసిన మోసాలను ఎండగడతాం’అని అన్నారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలిపారు. సీఎం మార్పు జరుగుతుందని వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనంటూ కొట్టిపడేశారు. -
యాదాద్రి ఎంఎంటీఎస్‌కు కిషన్‌రెడ్డి అడ్డంకి
శంషాబాద్: ‘నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేకమార్లు రైల్వేమంత్రికి చేసిన విన్నపంతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ మంజూరైంది. కానీ ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్రెడ్డియే. ప్రతి ఆదివారం యాదాద్రికి లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో కలసి రైల్వే ప్రాజెక్టులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎయిర్‌పోర్టు మంజూరు కోసం జీఎంఆర్ సంస్థ అభ్యంతరాన్ని పరిష్కరించి.. వారిని ఒప్పించింది తామేనన్నారు.ఇప్పటికే భూసేకరణ కోసం రూ. 2 వేల కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో మూడు నెలల్లో కొత్తగూడెం విమానాశ్రయం కూడా మంజూరవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. వరంగల్‌లో రీజినల్ రింగురోడ్డుకు రైల్వేరింగు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకునేందుకు రైల్వేమంత్రి అంగీకరించారన్నారు. సానుకూలంగా స్పందించారు..తాము చేసిన అన్ని వినతులకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ అభివృద్ధి ఉత్తి మాటలకే పరిమితమైందని మంత్రి సీతక్క విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
తెలంగాణకు ‘హిమాచల్’ విద్యుత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ (జలవిద్యుత్) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
అంతా బాబు షో!.. పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రకటిస్తుంటే.. అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ, దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలూదుతోంది. వాస్తవం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ అధికారికంగా కేంద్రం లెటర్ (31026/62/22)ను 2022లోనే పంపింది. అటువంటి బల్క్ డ్రగ్ పార్క్‌నకు ఇప్పుడు కొత్తగా ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు, రైల్వే జోన్‌కు భూ కేటాయింపు ఇలా ఒకటేమిటి.. ప్రధాని నేడు శంకుస్థాపన చేయబోయే మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే కావడం గమనార్హం.మెజార్టీ ప్రాజెక్టులదీ అదే తీరు » కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అయితే ఏడాది, రెండేళ్ల క్రితం ప్రకటించి.. భూ కేటాయింపులు, లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహా ప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. » వాస్తవానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు.. ఇందుకు ఏపీఐఐసీతో 1,200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎన్జీఈఎల్) సంతకం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా రూ.1.85 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2020లో ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. » రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్‌ను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు ఈ పార్కులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ అండర్ సెక్రటరీ అధికారికంగా లేఖ (31026/62/2022) పంపారు. మొత్తం రూ.1,876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద రూ.223 కోట్లను మార్చి 2023లో విడుదల చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమైంది. » రైల్వే జోన్‌కు ముడసర్లోవలో అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే.. అసలు భూమి కేటాయించలేదని, అక్కడ భూమి నిర్మాణాలకు అనువైనది కాదంటూ తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తున్నారు.» ఇవేకాకుండా.. దువ్వాడ–సింహాచలం, విశాఖపట్నం–గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ పనులకు కూడా గతంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్టు జాబితాలో చేర్చారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి–పెండేకల్లు డబ్లింగ్ పనులు.. ఇలా ఒకటేమిటి మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. -
ప్రాజెక్టుల పేరుతో భూముల్ని సేకరిస్తే సహించం
తాడికొండ: రాజధాని ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరిస్తుండటంపై మంత్రి పి.నారాయణను కలిసి సమస్య వివరిస్తే.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ముచ్చట్లు చెబుతున్నారని రాజధాని భూసేకరణ బాధిత రైతుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు యెడ్డూరి వీరహనుమంతరావు, కంచర్ల శివరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో రైల్వే ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు ఆధునికీకరణ, ఇతర కనెక్టివిటీ రోడ్ల పేరుతో భూములు సేకరించేందుకు ముందుకెళుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదు గ్రామాల రైతులు సమావేశమయ్యారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం, న్యాయపోరాటానికి సిద్ధమని వెల్లడించడం విశేషం. పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా భూముల సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూస్తామని హెచ్చరించారు. ఓ పద్ధతి లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తే సహించేది లేదని, సమీకరణ ద్వారా తీసుకుంటే భూములిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదించగా సానుకూలంగా స్పందించలేదని, మంత్రి నారాయణ కూడా స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భూములను కోల్పోకుండా ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి కోర్టులో న్యాయపోరాటానికి దిగనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పంట పొలాలను తొక్కించుకుంటూ అధికారులు పెగ్ మార్క్ సర్వే చేస్తుంటే.. తాము అడ్డుకొని రాళ్లు తొలగించామని, కొప్పురావూరు, ఇతర గ్రామాలకు చెందిన రైతులు కూడా రాళ్లు తొలగించాలని సూచించారు.పూలింగ్ ప్యాకేజీ వర్తింపజేయాలిరాజధానిలో రైతుల భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకూ వర్తింపజేయాలని, 1,250 చదరపు గజాల భూమిని అమరావతిలో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని ప్రభుత్వమే తీసుకుని రైతులకు మాత్రం పూలింగ్ ప్యాకేజీ ఇస్తే తప్ప రూ.కోట్ల విలువ చేసే భూములకు తగిన న్యాయం జరగదన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ టీడీపీకి చెందిన నాయకులే కమిటీ సభ్యులుగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాడతామనిప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ముందుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు. -
ఆదివాసీ సమాజాన్ని ఆరాధిస్తున్నాం
పాట్నా: దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది గిరిజన యోధులు పోరాటం సాగించారని, క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఒక కుటుంబం కొట్టేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్షేపించారు. గిరిజన నాయకుల పోరాటాలు, త్యాగాలను కాంగ్రెస్ చిన్నచూపు చూసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కుట్రల వల్ల అడవి బిడ్డలకు పేరు ప్రతిష్టలు దక్కలేదని, వారు అనామకులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా శుక్రవారం బిహార్‌లోని జమూయిలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గిరిజన సంక్షేమానికి సంబంధించి రూ.6,640 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. ‘పీఎం జన్ మన్ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆదివాసీ సమాజాన్ని తాము ఆరాధిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా గిరిజన జాతికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సంకలి్పంచామని తెలిపారు. ఇందులో భాగంగా బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రకటించి, వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... నిజం సమాధికి కుట్రలు ‘‘శతాబ్దాలుగా దేశ సాంస్కృతిక చరిత్ర, ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంలో గిరిజనుల పాత్ర వెలకట్టలేనిది. శ్రీరాముడు ఒక రాజకుమారుడి నుంచి భగవంతుడిగా మారడానికి గిరిపుత్రులు సహకరించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ఈ నిజాన్ని సమాధి చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నంచాయి. కొందరి కుట్రల కారణంగా స్వాతంత్య్ర ఉద్యమ క్రెడిట్ మొత్తం ఒక పార్టీకి, ఒక కుటుంబానికి(నెహ్రూ) దక్కింది. దీనివల్ల బిర్సా ముండా, తిల్కా మాంజీ(18వ శతాబ్దపు సంథాల్ నాయకుడు) పేర్లు మరుగునపడ్డాయి. కొందరు ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఒక్క కుటుంబం పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వస్తే మరి బిర్సా ముండా ఎందుకోసం పోరాటం చేసినట్లు?’’ అని మోదీ ప్రశ్నించారు.రూ.24,000 కోట్లతో జన్ మన్ యోజన ఈరోజు ‘పీఎం జన్ మన్ యోజన’ ప్రారంభించుకుంటున్నాం. గిరిజనుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాల సంక్షేమం కోసం రూ.24,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. పథకం అమల్లోకి రావడం వెనుక రాష్ట్రపతి ముర్ము చొరవ ఉంది. ఈ క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. గిరిజనుల జీవన విధానం ప్రకృతికి దగ్గరగా, పర్యావరణ హితంగా ఉంటుంది. ఆధునిక యుగంలో వారి జీవన విధానం అందరికీ అనుసరణీయం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
అధికారులు ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.డీఎఫ్ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు. -
ద.మ. రైల్వే ప్రాజెక్టులకు మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జె ట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది. బైపాస్ లైన్లకు నిదుల పెంపు.. జంక్షన్ స్టేషన్ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్లో నిధులు పెంచింది.దక్షిణమధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు పెరిగిన నిధులు దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది. మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం. బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు. ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత.. పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్‌లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది. -
ఈ టర్మ్‌లోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దశాబ్దాల తరబడి కరువు, వలసల జిల్లాగా ఖ్యాతికెక్కిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తాం. ఇదే శాసనసభ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తిచేసి సాగు నీరందిస్తాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డితోపాటు పలు ప్రాజెక్టులను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నాగర్‌కర్నూల్‌లోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పెద్ద మనిషి ఇటీవల పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ సాగు నీరివ్వలేక పోయారన్నారు. ఈ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా చిత్తశుద్ధితో ముందుకెళుతున్నామని చెప్పారు. రెండు నెలలకోసారి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.కృష్ణా నీటిని ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం..: జూపల్లికృష్ణా నీటి కేటాయింపులున్నా, వాటిని ఇప్పటికీ వినియోగించుకోలేక పోతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 18 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు వస్తే.. తమకు అవకాశం ఇవ్వలేదంటూ ఉదండాపూర్ నిర్వాసితులతోపాటు కానాయపల్లి నిర్వాసితులు మంత్రులు వెళ్లిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. -
ఒక అపార్ట్మెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు..
-
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
-
వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో సాగుతోంది. చురుకైన ఆర్థికాభివృద్ధితోపాటు సాంస్కృతిక భిన్నత్వం, పటిష్టమైన ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, జీసీసీ, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల్లో దూసుకుపోతోంది. దీనికితోడు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), మూసీ రివర్‌ఫ్రంట్ తదితర మౌలిక వసతుల ప్రాజెక్టులు పట్టలెక్కనుండటంతో కొత్త అవకాశాలు విస్తృతం కానున్నాయి. గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) రంగాల్లో రియల్ ఎస్టేట్, ప్రొవిషనల్ సరీ్వసెస్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు తదితరాలు సింహభాగం అయ్యాయి.అక్షరాస్యత 67 శాతంగా ఉండటంతోపాటు 1.6 కోట్ల మంది (రాష్ట్ర జనాభాలో 66 శాతం) 15–59 ఏళ్ల మధ్య వర్కింగ్ ఏజ్‌లో ఉండటం తెలంగాణకు కలిసొచ్చే అంశం. దీంతో ప్రస్తుతమున్న 176 బిలియŒన్ డాలర్ల ఎకానమీ నుంచి 2036 కల్లా ఒక ట్రిలియŒన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెట్టొచ్చని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా కూడా ‘ద మెగా మాస్టర్‌ప్లాన్ 2050’ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. తాజాగా డబ్ల్యూటీసీ శంషాబాద్, జీనోమ్ వ్యాలీ ఆధ్వర్యంలో ‘తెలంగాణాస్ గ్రోథ్ స్టోరీ–ద రోడ్ టు డాలర్స్ 1 ట్రిలియన్ ఎకానమీ’ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. దేశంలోనే ‘యంగెస్ట్ స్టేట్’గా తెలంగాణ ఇప్పటికే పలు రంగాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు సాగుతోంది. భారత్ అభివృద్ధి, ముందంజలో తన వంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ పురోగతి బాటలో నడుస్తోంది. నూతన ఆవిష్కరణలు, సాంకేతికలపై ప్రత్యేక దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం హైదరాబాద్ మహానగరం, ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త అవకాశాలు అందిపుచ్చుకొనేలా చర్యల ద్వారా ప్రాంతీయంగా వ్యాపార, వాణిజ్యాల వృద్ధికి చర్యలు చేపడుతోంది.నివేదిక ముఖ్యాంశాలు ⇒ 2024 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ (కరెంట్) యూఎస్ డాలర్లు 176 బిలియన్లు ⇒ 2024లో తలసరి ఆదాయం 4,160 డాలర్లు ⇒ 2021 జనాభా లెక్కల ప్రకారం 3.8 కోట్ల మంది జనాభా ⇒ 2011 లెక్కల ప్రకారం 39 శాతం పట్టణ జనాభా ⇒ 2011 లెక్కల ప్రకారం స్త్రీ పురుష లింగ నిష్పత్తి 988 ⇒ రాష్ట్ర జనాభాలో 66% పనిచేసే వయసు (15 నుంచి 59 ఏళ్ల లోపు) ఉన్న 1.6 కోట్ల మంది ⇒ 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత 67 శాతం ⇒ దేశ భూభాగంలో 3.4 శాతమున్న తెలంగాణ: 1,12,077 చ.కి.మీ.లలో విస్తరణతలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్... ⇒ రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 9.52 లక్షలు ⇒ హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ. 4.96 లక్షలు ⇒ సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 3.24 లక్షలు ⇒ మేడ్చల్–మల్కాజిగిరి తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు గ్రాస్ డి్రస్టిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–జీడీడీపీ ( బిలియన్ డాలర్లలో) రంగారెడ్డి జిల్లా టాప్.. ⇒ రంగారెడ్డి జిల్లా 33.94 బిలియన్ డాలర్లు ⇒ హైదరాబాద్ జిల్లా 27.38 బిలియన్ డాలర్లు ⇒ మేడ్చల్–మల్కాజిగిరిజిల్లా 10.64 బిలియన్ డాలర్లు ⇒ సంగారెడ్డి జిల్లా 7.23 బిలియన్ డాలర్లు -
ఆ 19 ప్రాజెక్టులు.. ఇక స్పీడ్‌గా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తు న్న 19 ప్రాజెక్టులను నిరీ్ణత కాలవ్యవధిలో పూర్తి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సీఎం రేవంత్ ఇకపై ప్రతీనెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ‘స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ’(స్పీడ్) పేరుతో సరికొత్త కార్యాచరణను చేపట్టినట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. స్పీడ్ కార్యాచరణలో భాగంగా ఆ 19 ప్రాజెక్టులపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం నెలకోసారి సమావేశమవుతారు. ప్రాజె క్టుల పనుల్లో భాగంగా వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు ‘స్పీడ్’ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. పనుల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి స్థాయిలోనే అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ‘స్పీడ్’ దోహదపడుతుందని భావిస్తున్నారు. అన్ని చోట్లా ’స్పీడ్’ పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై ‘స్పీడ్’దృష్టి కేంద్రీకరిస్తుంది. ‘స్పీడ్’కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతు న్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిరీ్ణత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను అందులో ప్రస్తావిస్తారు. ’స్పీడ్’ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్‌ను నిర్వహించనుంది, ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తారు. ఆ 19 ప్రాజెక్టులు ఏవంటే.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రోరైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీ కరణ, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివే టెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీ లో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళాశక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు, అమ్మ ఆదర్శ పా ఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐల్లో అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం, మత్తుమందుల నిరోధక విధానం అమలు. -
ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం.. వైఎస్ జగన్ మండిపాటు
సాక్షి, తాడేపల్లి: ప్రాజెక్టుల మీద సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్‌ను వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు,కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టన్నెల్–1, జనవరి 2024లో టన్నెల్–2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పారు. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్సార్ కలలను సాకారం చేశామని జగన్ పేర్కొన్నారు. ఇంకా ఆర్ అండ్ ఆర్ (రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ సీజన్లోనే దానికి కావాల్సిన సుమారు రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాము కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆర్ అండ్ ఆర్‌పై ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు.‘గతంలోనూ, 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న యావ, నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడూ కనిపించలేదు.గండికోటకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి, నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు రూ.1000 కోట్లు చెల్లించి, పూర్తిస్థాయిలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం.అలాగే చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్ అండ్ ఆర్ కింద రూ.250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. బ్రహ్మసాగర్‌కు కూడా రూ.60 కోట్ల ఖర్చుతో డయాఫ్రం వాల్ పూర్తి చేసి, శ్రీశైలం నుంచి తెలుగు గంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి, 17వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగాం.తద్వారా 17 టీఎంసీల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగాం. ఎప్పుడో పూర్తైన పులిచింతల ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్‌ను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదు. దాని కోసం కూడా రూ.140 కోట్లను మా వైయస్సార్సీపీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తిస్థాయి సామర్థ్యం 46 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. ప్రస్తుతం కరవు నేలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ మీదుగా కడలిపాలు అవుతున్న నేపథ్యంలో వెలిగొండ ఆర్ అండ్ ఆర్ అంశంపై దృష్టి పెట్టాలని, వెంటనే ఈ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లోనే నీటిని నింపి సాగు, తాగునీటిని అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాను’ వైఎస్ జగన్ పేర్కొన్నారు.కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై @ncbn ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్‌ను వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2024 -
‘సాగరమాల’ కింద ఏపీలో 13 ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2,483 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులను చేపట్టినట్లు కేంద్ర నౌకాయాన, ఓడరేవుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ లోక్‌సభలో వెల్లడించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ మొత్తం ఏడు ప్రాజెక్టుల్లో ఇప్పటికే రూ.1,114 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల పనులు పూర్తయినట్లు తెలిపారు. పూర్తయిన పనుల్లో రూ.85.83 కోట్లతో కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునికీకరణ, విశాఖ పోర్టులో రూ.43 కోట్లతో కోస్టల్ బెర్త్ నిర్మాణం, రూ.46.34 కోట్లతో విశాఖ పోర్టును అనుసంధానం చేసే రహదారి నిర్మాణం, రెండో దశలో రూ.77 కోట్లతో రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరణ, రూ.574 కోట్లతో మారిటైమ్ షిప్‌బిల్డింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు, రూ.288 కోట్లతో నెల్లూరు వద్ద జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇందులో ముఖ్యమైనవి రూ.386 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, రూ.364 కోట్లతో కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్, రూ.387 కోట్లతో పూడిమడక వద్ద ఫిషింగ్ హార్బర్, రూ.152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, రూ.73 కోట్లతో బియ్యపు తిప్ప వద్ద కోస్టల్ బెర్త్ నిర్మాణం తదితర ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. మూడేళ్లలో రాష్ట్రంలోని నాన్ మేజర్ పోర్టులు(విశాఖ పోర్టు కాకుండా మిగిలిన పోర్టులు) ద్వారా వాణిజ్య ఎగుమతులు 88 మిలియన్ టన్నుల నుంచి 118 మిలియన్ టన్నులకు పెరిగాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కాకినాడ గేట్‌వే పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి 2021–22లో 88 మిలియన్ టన్నుల సరుకులు ఎగుమతి కాగా, అది 2023–24 ఆర్థిక సంవత్సరానికి 118 మిలియన్ టన్నులకు పెరిగిందని, ఇదే సమయంలో మేజర్ పోర్టు విశాఖ నుంచి ఎగుమతులు 69 మిలియన్ టన్నుల నుంచి 81 మిలియన్ టన్నులకు పెరిగినట్లు ఆయన వివరించారు. -
వచ్చే మార్చిలోగా 6 ప్రాజెక్టులు రెడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయని రేవంత్‌రెడ్డి సర్కారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చివరి దశలో ఉన్న పాత ప్రాజెక్టులను, ప్రధానంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని సత్వరంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆయన నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. గోదావరి పరీవాహకంలోని నీల్వాయి, పింప్రి, పాలెంవాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ– 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చని నీటిపారుదల శాఖ ప్రతిపాదించగా, ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి దాదాపు రూ.241 కోట్లు ఖర్చవుతుందని, 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. రూ.18.47 కోట్లు ఖర్చు పెడితే నీల్వాయి ద్వారా మంచిర్యాల జిల్లాలో 2,632 ఎకరాలకు సాగునీరు అందనుంది.రూ.17.02 కోట్లతో పాలెంవాగు ప్రాజెక్టు ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,632 ఎకరాలకు నీరు అందనుంది. పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజీ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వంద శాతం పనులు పూర్తి చేయాలని గడువు నిర్దేశించుకున్నారు. కాల్వలు, డి్రస్టిబ్యూటరీలపై దృష్టి కృష్ణా, గోదావరి బేసిన్లలో ఆగి పోయిన ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి తెప్పించుకుని పరిశీలించారు. ప్రాజెక్టుల హెడ్‌వర్క్స్ నిర్మాణంపైనే కాకుండా ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డి్రస్టిబ్యూటరీ వ్యవస్థలపై సైతం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌసులకే పరిమితమైన ట్టు విమర్శలున్నాయి. అప్పులు తెచ్చి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా హెడ్‌వర్క్స్ మాత్రమే పూర్తి కాగా, ఆయకట్టుకు నీటిని అందించే మెయిన్ కాల్వలు, డి్రస్టిబ్యూటరీల నిర్మాణాన్ని ప్రారంభించనే లేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షిత కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. దీంతో ఇకపై కాల్వ లు, డిస్ట్రిబ్యూటరీలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో, ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్ రంగ ప్రగతి ► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. ► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. ► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను కొనసాగించడం కోసం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్ధ్యం పెరిగింది. ► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. ► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ► 2023 మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది. ► గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్ సరీ్వస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. -
నేను డిఫరెంట్
ఆజంగఢ్: తాను భిన్నమైన వ్యక్తినని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సాధారణంగా రాజకీయ నాయకులు హామీలిచి్చ, వాటిని అమలు చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. నేను మాత్రం అలా కాదు’’ అని స్పష్టం చేశారు. ‘మోదీ భిన్నమైన (డిఫరెంట్) మట్టితో రూపొందాడు’ అన్నారు. గతంలో అధికారం చెలాయించిన ప్రభుత్వాలు ఎన్నో హామీలిచ్చాయని, కానీ వాటిని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పథకాలను ప్రకటించి, వాటిని అమలు చేయకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టాయన్నారు. 30–35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలను తాను సమీక్షించానని, అవి పెద్దగా అమల్లోకి రాలేదని తేలిందని వెల్లడించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల తర్వాత హామీలిచి్చన నాయకులు, ఆ శిలాఫలకాలు కనిపించకుండాపోవడం గతంలో ఒక తంతుగా ఉండేదన్నారు. ఈ విషయంలో తాను విభిన్నమైన వ్యక్తినని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గఢ్‌లో పర్యటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి రూ.42,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ, కడప, హుబ్బళ్లి, బెలగావి, కొల్హాపూర్ తదితర విమానాశ్రయాల్లో కొత్త టెరి్మనల్ భవనాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి విషయంలో యూపీ కొత్త శిఖరాలకు చేరుకుంటోందని, దాంతో విషం లాంటి బుజ్జగింపు రాజకీయాలు బలహీనపడుతున్నాయని చెప్పారు. బుజ్జగింపు, బంధుప్రీతి రాజకీయాల్లో చాలా ప్రమాదకరమన్నారు. ప్రాజెక్టులకు ఎన్నికలతో సంబంధం లేదు తాను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు రానున్న లోక్‌సభ ఎన్నికలతో సంబంధముందని ఎవరూ భావించొద్దని మోదీ అన్నారు. 2019 ఎన్నికల వేళ తానెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని, అవి చాలావరకు పూర్తయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అవినీతిని పరమావధిగా భావించే కుటుంబ పారీ్టలు అధికారంలో ఉంటే అభివృద్ధి జరిగేది కాదన్నారు. ఈఎఫ్టీఏ ఒప్పందంపై హర్షం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో వాణిజ్య ఒప్పందంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అసోసియేషన్‌లో సభ్యదేశాలైన ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టీన్ నార్వే, స్విట్జర్లాండ్‌తో భారత్ కలిసి పని చేస్తుందని ప్రధాని అన్నారు. లోక్‌పాల్ ప్రమాణస్వీకారం లోక్‌పాల్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖని్వల్కర్ (66) ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం రేవంత్
-
నేడు ప్రాజెక్టులపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల, నీటిపారుదల రంగంపై ప్రజెంటేషన్ శనివారానికి వాయిదా పడ్డాయి. వీటిపై శాసనసభలో శుక్రవారమే చర్చ జరగాల్సి ఉన్నా ఇతర అంశాలపై చర్చతో జాప్యమవడం, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ సభ్యు ల నిరసనతో చాలా సేపు గందరగోళం నెలకొంది. నీటిపారుదల అంశం చాలా కీలకం కావడంతో.. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనేందుకు వీ లుగా వాయిదా వేయాలని అధికార పక్షం కోరడం.. దీనికి ఎంఐఎం, సీపీఐ మద్దతివ్వడంతో స్పీకర్ శ నివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కి.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభలో కులగణనపై తీర్మానం ఆమోదం పొందాక స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తేనీటి విరామం ప్రకటించారు. తిరిగి సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమైంది. తొలుత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య లేచి.. శ్వేతపత్రంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీనితో వాయిదా వద్దని, వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు లేచి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు హెలికాప్టర్లో వెళతారు. ఐదు నిమిషాల్లో రాగల సభకు రాకపోవడం ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. వాయిదాపై చర్చ తర్వాత బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్వేతపత్రంపై చర్చించడానికి గంటల తరబడి వేచి ఉన్నాం. రాత్రి 11 గంటల వరకు కూర్చోవడానికి సిద్ధం. శనివారం పార్టీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. మీరు ఎజెండాలో పెట్టి ఎందుకు చర్చ చేపట్టడం లేదు. వెంటనే చర్చ మొదలుపెట్టండి..’’ అని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుంటూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. సభ వాయిదాకు అభ్యంతరం లేదని ఎంఐఎం, సీపీఐ సభ్యులు తెలిపారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులపై స్పల్పకాలిక చర్చ శుక్రవారం ఉంటుందని, సమావేశాలు అదేరోజు ముగుస్తాయని బీఏసీలో నిర్ణయించారు. మధ్యాహ్నం కలసినప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు కూడా స్పల్పకాలిక చర్చ ఉంటుందన్నారు. కానీ ఇలా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా చర్చ లేకుండా వాయిదా వేస్తామనడం సరికాదు. ఎంతరాత్రయినా చర్చకు మేం సిద్ధం. ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తాం. ఇష్టానుసారం నిర్వహిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీఏసీలో నిర్ణయించని ఇతర అంశాలను స్పీకర్ అనుమతితో చర్చిద్దామనుకున్నామని చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమని, అన్ని పారీ్టల ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనేందుకు వీలుగా శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహిద్దామని, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాగా.. కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. మీరంటే.. మీరు.. క్షమాపణల కోసం డిమాండ్ సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుని.. శ్వేతపత్రంపై స్పల్పకాలిక చర్చకు సంబంధించి అన్నిపక్షాల సలహాలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అవకాశం ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేత గురించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘నల్లగొండ సభలో ప్రతిపక్ష నేత సీఎంను, నన్ను దున్నపోతులంటూ వ్యాఖ్యానించారు. ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ప్రతిస్పందిస్తూ.. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కాల్చేయాలి, ఉరితీయాలి అని మాట్లాడలేదా? బాధ్యతయుత పదవిలో ఉన్నందున సభలో అలా మాట్లాడవద్దు’’ అని కౌంటర్ ఇచ్చారు. -
ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే.. బీఆర్ఎస్ చేసిందేమిటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ఏపీ తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే సహకరించిందని, కేంద్రం వద్ద ఈ దిశగా సానుకూలంగా సంతకాలు చేసింది కేసీఆర్ సర్కారే అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ 12.5 టీఎంసీల నీళ్ళు వాడుకునేందుకు వీలుగా ప్రాజెక్టులు కడితే, తెలంగాణలో కనీసం రెండు టీఎంసీలు వాడుకునే ప్రాజెక్టులు కూడా లేవని విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చకు రేవంత్ బదులిచ్చారు. కాళేశ్వరంపై నివేదికలు సభలో పెడతాం ‘కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే, కృష్ణా ప్రాజెక్టులు అప్పగించారంటున్నారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ లక్షా 47 వేల కోట్ల మేరకు అంచనాలు వచ్చాయని, రూ.97,500 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇంకో రూ.10 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంతాచేసి కాళేశ్వరం కింద 90 వేల ఎకరాలకు కూడా నీళ్ళు అందలేదన్నది వాస్తవం కాదా? దీనిపై విజిలెన్స్ నివేదికలు సభలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే ‘కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ కేంద్రానికి అప్పగించిందనే వాదనలో అర్థం లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును 2014 పునరి్వభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. 2014 నుంచి 2023 వరకు బోర్డు సమావేశాలకు వెళ్ళింది వాళ్ళే. ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ఏపీ పోలీసు లు ఏకే 47 తుపాకులతో నాగార్జున సాగర్ డ్యాంపైకి ఎలా వచ్చారు? వాళ్ళ పులుసు తిని అలుసు ఇచ్చింది బీఆర్ఎస్. రాయలసీమకు వెళ్ళి మంత్రి రోజా పెట్టిన రాగి సంగటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది మీరు కాదా? మీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి కట్టింది. మీ కళ్ళ ముందే కదా వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డి పాడును 44 వేల క్యూసెక్కులకు పెంచింది. జీవో నంబర్ 203కు నీ ఇంట్లోనే కదా పునాది వేసింది. 8 టీఎంసీలు తరలించేందుకు అనుమతించింది బీఆర్ఎస్సే. ఇప్పుడు 12 టీఎంసీలు వెళ్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ 796 ఎఫ్ఆర్ఎల్ వద్ద కట్టారు. ఏపీ ఒక పక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే, వీళ్ళు చేసిందేమిటి? రాజీవ్ గాంధీ టన్నెల్ ప్రాజెక్టులో ఒక్క కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదు. కల్వక్తురి లిఫ్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ పరిస్థితీ ఇదే. కృష్ణా జలాలపై మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ సర్కారే. కృష్ణా జలాలు 2015లో కేంద్రానికి అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, 512 టీఎంసీలు ఏపీకి ఇవ్వడానికి అధికారికంగా సంతకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. తెలంగాణ రైతుల హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు..’అని సీఎం ఆరోపించారు. -
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయమై శుక్రవారం ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు ఎక్కడి నుంచో మినట్స్ తెచ్చి సమాధానం చెప్పాల్సిందిగా మమ్మల్ని అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ‘కృష్ణా నదిలో వాటా వదులుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.కృష్ణా నీటిని ఏపీకి తరలించే ఒప్పందం ప్రగతిభవన్లోనే జరిగిందా లేదా కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు. ఇదీ చదవండి.. గ్రూప్ 1 పై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన -
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
నీటి వాటా..ఆపరేషనల్ ప్రొటోకాల్ తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వాటా తేలేదాకా...50:50 నిష్పత్తితో నీటిని పంచాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు అయితేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ స్పష్టం చేసినట్టు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది. ఈనెల 1వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సంబంధించిన మినట్స్‌ను బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మినట్స్‌లో ఏముందంటే... ► రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తేనే జలవిద్యుత్ కేంద్రాలు అప్పగించగలమని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపినట్టు బోర్డు పేర్కొంది. ► జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన ఓ లేఖను ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ అందజేశారు. ఆ లేఖను మినట్స్‌లో బోర్డు జతచేసింది. ► నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతోపాటు వాటి పరిధిలోని 15 కాంపోనెంట్లు అప్పగించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ) కోరింది. వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం. ఆ నిధులను నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి. నాగార్జునసాగర్ డ్యామ్ పై మొహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు ఇరు రాష్ట్రాల అధికారులను ప్రాజెక్టుపై అనుమతిస్తాయి. ప్రాజెక్టుపై ఏ పనులు చేయాలన్నా... ఉద్యోగులను నియమించుకోవాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► త్రీమెంబర్ కమిటీ(కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండే) తీసుకునే నిర్ణయాలు/ వాటర్ రిలీజ్ ఆర్డర్ కచి్చతంగా ఆయా కాంపోనెంట్లను అమలు చేయాలి. కమిటీ నిర్ణయాలు అమలు చేయాలి. ► ఒకవేళ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు బోర్డుకు అప్పగిస్తే... ఆ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాల నుంచి సమాన స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఏ మేరకు ఉద్యోగులు కావాలో, ఆ వివరాలన్నీ వారం రోజుల్లోపు బోర్డుకు అందించాలి. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలో ఉంటాయి. అయితే నిరంతర, అత్యవసర నిర్వహణ పనుల ను సంబంధిత రాష్ట్రాలు, ఇదివరకు ఉన్న పద్ధ తిని (శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ) పాటించాల్సి ఉంటుంది. సాగర్, శ్రీశైలం పరిధిలో ఉన్న కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ ఈఎన్సీ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే మా ప్రాజెక్టులు తీసుకోవాలన్నారు. రాహుల్‌బొజ్జా లేఖలోని ముఖ్యాంశాలు జనవరి 17వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం తాలూకు మినట్స్‌కు సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. అందులో ఏముందంటే....‘నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. ట్రిబ్యునల్ కృష్ణా జలాలను పంచేదాకా 50:50 నిష్పత్తితో నీటిని పంచాలి. శ్రీశైలం జలాశయం కట్టిందే జలవిద్యుత్ ఉత్పాదన కోసం...నాగార్జునసాగర్ కింద ఉన్న నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీనిని కట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 830 అడుగులుగా ఉండాలి. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్ తేలేదాకా వాటిని అప్పగించలేం. ఇక జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ప్రాజెక్టుల అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టులు బోర్డుకు ఇవ్వలేం. ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పకపోయినా, మినట్స్‌లో రికార్డు అయ్యింది: రాహుల్ బొజ్జా ‘‘జనవరి 17వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పినట్టు మినట్స్‌లో రికార్డు అయ్యింది. అయితే తాము చెప్పిన అంశాలేవీ ఇందులో నమోదు కాలేదు. ఆ మినట్స్‌లో సవరణలు చేయాలని కోరుతూ జనవరి 27వ తేదీన కేంద్రానికి లేఖ రాశాం’అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. శుక్రవారం ఆయన ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి శుక్రవారం జలసౌధలో విలేకరులతో మాట్లాడారు. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయం గతంలోనే తీసుకున్నారని తెలిపారు. 2023–24 బడ్జెట్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించనున్నామని, ఇందు కోసం సీడ్ మనీ కింద రూ.200 కోట్లు ఇవ్వనున్నామని ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర: ఈఎన్సీ సి.మురళీధర్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర మాత్రమేనని ఈఎన్సీ (జనరల్) మురళీధర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటే నీటిని ఏ ప్రాతిపదికన పంచుకోవాలి అనే అంశాలతో ముడిపడిన ఆపరేషనల్ ప్రొటోకాల్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని గుర్తు చేశారు. త్రీమెంబర్ కమిటీ (కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ/ కన్వినర్, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు) నిర్ణయం ఆధారంగానే నీటి విడుదల, పంపిణీ, పర్యవేక్షణ ఉంటుందన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆయా రాష్ట్రాల భూభాగంలో ఉన్నాయన్నారు. సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని, గతనవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కేంద్ర జలశక్తి శాఖను కూడా కోరామని, కేంద్రం ఆదేశించినా పోలీసు బలగాలను వెనక్కితీసుకోవడం లేదన్నారు. -
కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. అనంతరం మీడియాతో ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్ ఐదు టీఎంసీ లు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 హౌట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారు’’ అని మురళీధర్ వివరించారు. -
సీఎం సారూ.. సమస్యలివీ! ప్రజల వినతి..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/నిర్మల్: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న ఎనుముల రేవంత్‌రెడ్డిపై ఇక్కడి ప్రజలు ఎ న్నో ఆశలు పెట్టుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు సంబంధించి అధికారులు, అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటన సందర్భంగా ఇక్కడి అభివృద్ధి కోసం నిధుల ప్రకటన, కొత్త పనుల కోసం హామీలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు.. ఉమ్మడి జిల్లాలో సరైన సాగునీటి ప్రాజెక్టులు లేక ఇంకా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి వనరులున్నా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రాజెక్టులైన కడెం, సరస్వతి కాలువ(ఎస్సారెస్పీ) ఆధునీకరించాల్సి ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లో స్వర్ణ, వట్టివాగు, సాత్నాల, ఎన్టీఆర్, పీపీ రావు ప్రాజెక్టు, గడ్డెన్నవాగు, సదర్మాట్ ఉన్నాయి. కుమురంభీం జిల్లా పరిధిలో కుమురంభీం ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. తాంసిలో మత్తడివాగు, పెన్‌గంగా ప్రాజెక్టు, హాజీపూర్ మండలం ముల్కల్లలోని ర్యాలీవాగు, వేమనపల్లి మండలం నీల్వాయి, భీమారంలో గొల్లవాగు ప్రాజెక్టులు ఉన్నాయి. గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై ఉన్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో ఈ ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు పెరిగాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత రైతుల పంటలు ఏటా నీట మునుగుతున్నాయి. వీటి కోసం శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు వరదలు వచ్చి ముంపునకు గురవుతున్నాయి. గిరిజనుల గోస.. ఉమ్మడి జిల్లా ఏజెన్సీ పరిధిలో గిరిజనులకు ఇప్పటికీ అటవీ సమీప గ్రామాలకు సౌకర్యాల్లేవు. చాలా చోట్ల విద్య, వైద్యం, తాగునీరు, అన్ని కాలాల్లో రవాణాకు రోడ్లు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఇంద్రవెల్లి, నార్నూర్, జైపూర్, లింగాపూర్ మండలాల్లో వానాకాలాల్లో ఇప్పటికీ మట్టిరోడ్లే దిక్కవుతున్నాయి. పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అటవీ అనుమతులు రాక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు, సామాజిక ఆస్పత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది లేక అరకొర వైద్యం అందుతోంది. ఏజెన్సీలో సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉంది. జిల్లా కేంద్రాల్లో ప్రధాన ఆస్పత్రులతోపాటు ఆదిలా బాద్ రిమ్స్‌లోనూ సిబ్బంది ఖాళీలతో వైద్యంపై ప్రభావం పడుతోంది. ఉట్నూరు ఐటీడీఏను సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. నాలుగు జిల్లాల విస్తరణతో పరిపాలనలో సమస్యలు వస్తున్నాయి. ఆసిఫాబాద్‌లో మినీ ఐటీడీఏ ఏర్పాటు కార్యాచరణ దాల్చలేదు. గిరిజనేతరులకు.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఉద్యోగ, ఉపాధి, విద్యాసంస్థల్లో అవకాశాలు తక్కువగా ఉన్నా యి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు మాత్రమే పోడు పత్రాలు ఇవ్వడంతో గిరిజనేతరులకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోడు హక్కు పత్రాలు తమకు కూడా ఇవ్వాలని వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. సింగరేణి ప్రాంతంలో కార్మికులకు.. సింగరేణి ప్రాంతంలో కొత్త గనుల ప్రారంభం, ఓపెన్ కాస్టుల స్థానంలో భూగర్భ గనులు ప్రారంభించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెరుగుతున్నారు. మున్సిపాలిటీల్లో.. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆది లాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, లక్సెట్టిపేట, నస్పూర్, చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రి, బె ల్లంపల్లి పట్టణాలున్నాయి. వీటి పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. పట్టణ వాసులకు తాగునీరు, రోడ్లు, మౌలిక వసతులు అరకొరగా అందుతున్నా యి. ఇక ఉట్నూరు, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలు గా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ ఇంకా గ్రామ పంచాయతీ లుగానే కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంగా ఉన్న ఆసిఫాబాద్‌కు మున్సిపాలిటీ హోదా దక్కలేదు. ఇక మందమర్రి పట్టణంలో ఏజెన్సీ వివాదంతో ఎన్నికలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి చొర వ చూపాలని కోరుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంది. ఇవి చదవండి: ఇష్టంతో ఉమ్మడి జిల్లాకు వచ్చా! : మంత్రి సీతక్క -
అయోధ్య పర్యటనలో మోదీ.. ప్రధానికి సాదర స్వాగతం (ఫొటోలు)
-
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
భారత్, బంగ్లా సంయుక్తంగా.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం
ఢాకా/అగర్తలా: భారత్, బంగ్లాదేశ్ ప్రధానులు నరేంద్ర మోదీ, షేక్ హసీనాలు బుధవారం సంయుక్తంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రిపురలోని నిశి్చంతపూర్, గంగాసాగర్‌ను బంగ్లాదేశ్‌తో కలుపుతూ 65 కిలోమీటర్ల ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లైన్, బంగ్లాలోని రామ్‌పూర్‌లో ఉన్న మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులను నేతలు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అగర్తలా నుంచి బంగ్లాలోని అఖౌరా వరకు నిర్మించిన రైలు మార్గం ఇరుదేశాల వాణిజ్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నారు. రైలులో అగర్తలా నుంచి ఢాకా మీదుగా కోల్‌కతా వెళ్లే వారికి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ‘ఈశాన్య భారతం, బంగ్లాల మధ్య తొలి రైలు మార్గం అగర్తలా–అఖౌరా క్రాస్‌బోర్డర్ రైల్వేలింక్ను ప్రారంభించడం చరిత్రాత్మకం’ అని ప్రారం¿ోత్సవం సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. 12.24 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు 5.46 కి.మీ.లు త్రిపురలో మిగతా 6.78 కిలోమీటర్లు బంగ్లాదేశ్‌లో ప్రయాణిస్తుంది. ‘రెండు దేశాల పరస్పర సహకార విజయాన్ని సంబరంగా జరుపుకునేందుకు మళ్లీ కలిశాం. గత దశాబ్దాల్లో రెండు దేశాల్లో జరగని అభివృద్ధిని ఈ 9 ఏళ్లలో సాధించాం. మన దేశాల పటిష్ట మైత్రీ బంధానికి ఈ ప్రాజెక్టులే సంకేతం’ అని హసీనాతో వీడియో కాన్ఫెరెన్స్ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అగర్తలా–అఖౌరా రైలు మార్గం నిర్మాణం కోసం బంగ్లాకు భారత్ రూ.392.52 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, అనుసంధానత ఊపందుకోనుంది. ఢాకా మీదుగా ఈ రైలు మార్గంలో అగర్తలా నుంచి కోల్‌కతాకు చాలా త్వరగా చేరుకోవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న 1,600 కిలోమీటర్ల దూరం ఏకంగా 500 కి.మీ.లకు తగ్గతోందని కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చెప్పారు. -
మరిన్ని పెట్టుబడులు
సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీటన్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జీఐఎస్ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి.. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు. ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో స్మైల్ (సబ్‌స్ట్రేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్ (రిలయెన్స్ పవర్) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్ఐపీబీ ఆమోదం. థర్మల్ పవర్ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు. విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్‌కు ఎస్ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి. -
ఆ మేరకే సీఆర్ జెడ్ నుంచి అనుమతులు
-
భారత్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
జోధ్‌పూర్: భారతదేశం గళాన్ని నేడు ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇది చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో భారత్‌ను వ్యతిరేకించడం ప్రారంభించిందని విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌లో మోదీ గురువారం పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోధ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కాంగ్రెస్ పారీ్టకి రైతుల పట్ల గానీ, సైనికుల పట్ల గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని మోదీ ఆరోపించారు. ఆ పారీ్టకి అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. సొంత ఓటు బ్యాంకును ప్రేమించడం తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాల్లో మన ప్రభావం విస్తరిస్తోందని, విదేశాల్లో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదంతా నచ్చడం లేదని అన్నారు. భారత్ త్వరలో ప్రపచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో తెలిసిందేనని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచి్చన తర్వాత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ‘ద వ్యాక్సిన్ వార్’పై మోదీ ప్రశంసలు బాలీవుడ్ చలనచిత్రం ‘ద వ్యాక్సిన్ వార్’పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని అన్నారు. వివేక్ అగి్నహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమా సెపె్టంబర్ 28న విడుదలైంది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన సైంటిస్టులు అహోరాత్రులు శ్రమించారని, వారి శ్రమను ఈ చిత్రంలో చక్కగా చూపించారని మోదీ కొనియాడారు. మన సైంటిస్టుల అంకితభావాన్ని తెరకెక్కించిన చిత్ర దర్శకుడు, నిర్మాతలను ప్రశంసించారు. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
వ్యవసాయదారులకు అండగా సాగునీటి ప్రాజెక్టులు
-
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
అపర భగీరథుడు
సాక్షి, అమరావతి: దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్‌తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు. -
నవ చరిత్ర : చెప్పాడంటే. చేస్తాడంతే
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో వందేళ్లుగా సాధ్యం కాని భూముల సర్వే లాంటి బృహత్తర కార్యక్రమాలను సైతం నాలుగేళ్లలోనే సాకారం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా గత 50 నెలల్లో డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. పలు రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ గత నాలుగేళ్లలో ఆరు ప్రధాన రంగాల్లో తెచ్చిన మార్పులను వివరించారు. వ్యవసాయం.. రాష్ట్రంలో 52 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఆర్బీకే స్ధాయిలో ఈ క్రాప్, ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. పంట నష్టపోతే సీజన్ ముగిసేలోగానే రైతులకు పరిహారం అందిస్తున్నాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్‌తోపాటు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం. పాలవెల్లువ ద్వారా అదనంగా ఆదాయాన్ని సమకూర్చాం. మూతపడిన చిత్తూరు డెయిరీ సహా సహకార సంఘాలకు జీవం పోశాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టి భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నాం. అసైన్డ్ భూములపై సాగుదారులకు పూర్తి హక్కులు కల్పించాం. వీరిలో ఎస్సీ, బీసీ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. 1.54 లక్షల మంది ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డీకేటీ, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలుగా ఇచ్చాం. చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించాం. షరతులు గల పట్టాలు కలిగిన మరో 22 వేల మంది రైతులకు 33 వేల ఎకరాలపై పూర్తి హక్కులు కల్పించాం. వడివడిగా ప్రాజెక్టులు.. గత ప్రభుత్వంలో మాదిరిగా ఫలితాలు లేకుండా, ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టకుండా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్ పూర్తి చేశాం. పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నింపగలుగుతున్నాం. కాలువల సామర్థ్యం పెంచటంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వెలిగొండలో మొదటి టన్నెల్‌ను మనమే పూర్తి చేయగా రెండో టన్నెల్ పనులు మరో రెండు నెలల్లో పూర్తికానుంది. ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్–2, వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులను పూర్తి చేసి డిసెంబర్ కల్లా ప్రారంభించనున్నాం. తోటపల్లి, తారకరామ తీర్థ సాగర్ పనులు 2024కి పూర్తి చేయనున్నాం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి వడివడిగా పనులు చేపట్టాం. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ఏటా దాదాపు 83 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేలా ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్ పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా ఇచ్చాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం. రోజుకో మెనూతో గోరుముద్ద రుచికరంగా అందిస్తున్నాం. రూ. 20 వేల వర కు వసతి దీవెన ఇస్తున్నాం. ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపు 330 కాలేజీల్లో, 21 ఫ్యాకలీ్టల్లో సీటు తెచ్చుకున్న పిల్లలకు రూ.1.25 కోట్ల వరకూ విదేశీ విద్యా దీవెన ఇస్తున్నాం. డిగ్రీ కరిక్యులమ్‌ను జాబ్ ఓరియంటెడ్‌గా మార్పు చేశాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులను తీసుకొచ్చాం. 10 నెలల ఇంటర్న్‌షిప్ విధానాన్ని తెచ్చాం. వర్సిటీలు, ట్రిపుల్ఐటీల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 3,295 టీచింగ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాల్టీ, ఆగ్మెంటెడ్ రియాల్టీ సహా ప్రతి మార్పును విద్యారంగంతో అనుసంధానిస్తూ ప్రపంచంతో పాటు అడుగులు వేస్తున్నాం. అందరికీ వైద్యం, ఆరోగ్యం వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ 50 నెలల్లోనే ఏకంగా 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 108, 104 సేవల కోసం మరో 1,514 వాహనాలను కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌తో కలిపి ఏకంగా 2,204 వాహనాలను నడుపుతున్న ఏకైక రాష్ట్రం మనది మాత్రమే. రికార్డు స్ధాయిలో 53,126 వైద్య సిబ్బంది నియామకాలు జరిపాం. స్పెషలిస్టు డాక్టర్లు దొరక్క జాతీయ స్థాయిలో 61 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్రంలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల ద్వారా 96.04 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేశాం. జాతీయ స్థాయిలో 27 శాతం నర్సులు, 33 శాతం ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయకుండా వదిలేస్తే మన రాష్ట్రంలో 100 శాతం పోస్టుల్ని భర్తీ చేశాం. గతంలో ప్రమాణాలు లేని 292 రకాల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటే ఈ రోజు ఏకంగా 562 రకాల డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తెచ్చాం. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు గ్రామస్థాయిలోనే అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. ప్రివెంటివ్ కేర్‌లో ఇది నూతన అధ్యాయం. 95 శాతం జనాభాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడంతోపాటు ప్రొసీజర్లను 3255కి విస్తరించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.5 వేల వరకూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్నాం. సామాజిక మార్పులు మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చాం. శాసన సభ స్పీకర్‌గా బీసీకి, మండలి చైర్మన్‌గా ఎస్సీకి,మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించాం. నామినేటెడ్ పోస్టుల్లో ౖచైర్మన్లుగా, డైరెక్టర్లుగా 50 శా తం పదవులను చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాం. నామినేషన్ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీల కు దక్కేలా చట్టం చేశాం. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశాం. గత 50 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను పారదర్శకంగా అందించగా, అందులో ఏకంగా 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే లబ్ధి చేకూరింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. వీరిలో 80 శాతం ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. మూడేళ్లుగా మనమే నంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో నంబర్ వన్ స్ధానంలో ఉంది. రాష్ట్ర విభజన నాటికి కేవలం నాలుగు చోట్ల మాత్రమే పోర్టులు ఉండగా ఈ నాలుగేళ్లలోనే మరో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మరో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నాం. విశాఖలో ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభించాం. కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. కడప విమానాశ్రయాన్ని విస్తరించాం. దేశంలో నిర్మిస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో మూడు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. గతంలో ఏనాడూ మన రాష్ట్రానికి రాని పారిశ్రామిక దిగ్గజాలు ఈ నాలుగేళ్లలోనే వచ్చారు. 2019 జూ న్ నుంచి నేటి వరకు రాష్ట్రంలో నెలకొల్పిన భారీ పరిశ్రమలు 127. వచ్చిన పెట్టుబడులు రూ.67, 196 కోట్లు. ప్రత్యక్ష ఉద్యోగాలు 84,607. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఏకంగా రూ.13.42 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదిరాయి. తద్వారా రానున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 6 లక్షలు. కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 2,00,995. ఉద్యోగాలు, ఉపాధి పొందినవారు 12.61 లక్షలు. కో విడ్ విసిరిన పెను సవాళ్లను తట్టుకుని మన రాష్ట్ర పారిశ్రామిక ర్యాంకును, ముఖ్యంగా ఎంఎస్ఎంఈని రక్షించుకోగలిగాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని స్థానికులే ఆహ్వానించేలా, తద్వారా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించింది మన ప్రభుత్వమే. -
బాబు ప్రాజెక్టుల సందర్శన విడ్డూరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూలేరని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టుల్లో ఒక్కటైనా చంద్రబాబు పూర్తిచేసి ప్రారంభించిన దాఖలాల్లేవన్నారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ప్రాజెక్టులను సందర్శించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారాలు అందించి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు వంశధార ఫేజ్–2, స్టేజ్–2ని, ఆఫ్‌షోర్ వంటి పనులను ప్రారంభించింది వైఎస్సార్ అని, వాటిని పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ నిధులు కేటాయించారు. హిరమండలం రిజర్వాయర్‌లో 19 టీఎంసీల నీరు చేరేలా లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతులిచ్చారు. అలాగే, నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించేందుకు ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు జగనన్నే స్వయంగా వెళ్లారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు అన్ని పనులు చేస్తున్నాం. జిల్లాలోని అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్‌లు ఏనాడైనా జిల్లాలో ప్రాజెక్టులపై దృష్టిపెట్టారా? నిర్వాసితుల పరిహారాలను తెలుగు తమ్ముళ్లు మింగేయలేదా? ఇక వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు శరవేగంగా చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వైఎస్సార్ హయాంలో ప్రారంభిస్తే ఇద్దరు సీఎంలు మారినా ఏ ఒక్కరూ పట్టించుకోకుండా గాలికొదిలేశారు. బాబు, పవన్‌లకు ఎందుకంత కోపం.. విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తున్నామనే అక్కసుతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌లు రాద్ధాంతం చేస్తున్న తీరుచూస్తే ఉత్తరాంధ్ర ప్రజలపై ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. విశాఖలో పవన్, శ్రీకాకుళం జిల్లాలో బాబు ఒకేరోజు సందర్శించి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం జగన్ అని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రం విభజనకు చంద్రబాబే సహకరించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక విద్యుత్, గ్యాస్, పెట్రోలు, నిత్యావసర ధరల పెంపు దేశవ్యాప్తంగా ఉన్నాయా ఒక్క ఏపీలోనే ఉన్నాయా అనేది ప్రజలందరూ గమనించాలి. -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
చంద్రబాబుకు కావాల్సిందే మారణహోమం
కడప కార్పొరేషన్: ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఆద్యంతం హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా విమర్శించారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో బరితెగించిన చంద్రబాబు మాటలు, ఉచ్ఛ నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు, గలాటాలు, అల్లర్లు రేపి విధ్వంసం సృష్టించాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై, ఆయన కుటుంబంపై కొన్ని రోజులుగా సంస్కారహీనంగా, బజారు మనిషిలాగా బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెచ్చగొడుతూ చేసిన కామెంట్లతోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఎంత చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకుండా కేకలు వేస్తూ, తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడటం దారుణమన్నారు. వాహనాలను తగులబెట్టి పోలీసులను గాయపరచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అంతిమంగా చంద్రబాబుకు కావాల్సింది మారణ హోమమేనని, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత రాక్షసత్వానికి పాల్పడటం దారుణమని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంజద్‌బాషా డిమాండ్ చేశారు. -
కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ ఫుల్..!
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. టెన్షన్ పెడుతున్న మున్నేరు, పాలేరు
సాక్షి, ఖమ్మం: గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లు తెగిపోయాయి. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు తీవ్రరూపం దాల్చింది. వివరాల ప్రకారం.. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుతం మున్నేరు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 18 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్. దీంతో, బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఇదే సమయంలో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాయబజార్ కాలేజీ, స్కూల్‌తో పాటు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలోని పాలేరు పూర్తి స్థాయిలో నిండిపోయింది. పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో 23 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 23.25గా ఉన్నట్టు తెలుస్తోంది. పాలేరుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 12,438 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 10, 614 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు.. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 60 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 23 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 23.5 బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం : 16 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 16.1 పెదవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 19 అడుగులు ప్రస్తుత నీటిమట్టం : 11 కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 407 అడుగులు (8.4 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం : 402.2 అడుగులు (7.85 టీఎంసీలు) తాలిపేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 74 మీటర్లు ప్రస్తుత నీటిమట్టం : 72.11 మీటర్లు -
హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. అప్రమత్తమైన బల్దియా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీరామ్‌సాగర్, నిజాం సాగర్, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుంది. హిమాయత్‌సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఏ క్షణమైనా గండిపేట జలాశయం గేట్లు తెరిచే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.45 మీటర్లు కాగా, పూర్తి సామర్థ్యం 515 మీటర్లు. లోతట్టు ప్రాంతాల ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది. చదవండి: హైదరాబాద్‌లో బయటపడ్డ మరో ఉగ్ర కోణం.. ఇదంతా అందుకేనా? జంట జలాశయాల నిండు కుండలా మారాయి. గండిపేట, హిమాయత్ సాగర్‌కు వరద ప్రవాహం భారీగా చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాద్‌నగర్, షాబాద్ నుంచి వరద భారీగా చేరుతుంది. -
వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో 1.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 14,000 కోట్లు) పెట్టుబడులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. వివిధ బిజినెస్‌ల సామర్థ్య విస్తరణకు నిధులు వినియోగించనున్నట్లు గతేడాది(2022–23)కి విడుదల చేసిన వార్షిక నివేదికలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా గతేడాది ఆస్తులు, ఉత్పత్తిపై 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచి్చంచినట్లు తెలియజేశారు. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలోనూ వృద్ధికి వీలుగా 1.7 బిలియన్ డాలర్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అల్యూమినియం, జింక్ ఉత్పత్తి సామర్థ్యాల విస్తరణను చేపట్టినట్లు ప్రస్తావించారు. (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) చమురు, గ్యాస్‌పై ప్రస్తుతం దేశీ ఉత్పత్తిలో నాలుగో వంతు ఆక్రమిస్తున్న చమురు, గ్యాస్ కార్యకలాపాల వాటాను 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలు వేసినట్లు అనిల్ తెలియజేశారు. ఈ బాటలో నిల్వలు(రిజర్వులు), వనరుల(రిసోర్సెస్) పోర్ట్‌ఫోలియోను వివిధీకరిస్తున్నట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గతేడాది క్లిష్టమైన, అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణంలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగినట్లు తెలియజేశారు. భౌగోళిక, రాజకీయ వివాదాలు, వీటితో తలెత్తిన ఇంధన సంక్షోభం, కేంద్ర బ్యాంకులు అవలంబించిన కఠిన పరపతి విధానాలు సవాళ్లు విసిరినట్లు వివరించారు. అయినప్పటికీ కంపెనీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినట్లు ప్రస్తావించారు. ఆదాయం రూ. 1,45,404 కోట్లను తాకగా.. రూ. 35,241 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు పేర్కొన్నారు. రూ. 18,077 కోట్ల నికర ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు తెలియజేశారు. (ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్ హీరోయిన్ అయితే కాదు!) ‘మెయిటీ- నాస్కామ్ సీవోఈ’తో వేదాంత గ్రూప్ జట్టు అంకుర సంస్థలు అభివృద్ధి చేసే కొత్త డిజిటల్ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపై వేదాంత గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్పార్క్ ప్రోగ్రాం కింద కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ)- పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)/ వర్చువల్ రియాలిటీ (వీఆర్) మొదలైన టెక్నాలజీల ఆధారిత ఆవిష్కరణలను వేదాంత గ్రూప్ సంస్థల్లో వినియోగించే అవకాశాలను పరిశీలిస్తారు. దీర్ఘకాలికంగా పర్యావరణ, సామాజిక, ఆరి్థక స్థిరత్వానికి దోహదపడే పరిష్కార మార్గాలను కనుగొనాలన్నది తమ లక్ష్యంగా వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్ హెబ్బర్ తెలిపారు. వేదాంత స్పార్క్ ప్రోగ్రాం కింద 80 పైచిలుకు స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్ పవన, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు. ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు -
చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
హైదరాబాద్ మియాపూర్ లో భారీ మోసం
-
వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ.. సక్సెస్ మంత్రంగా బీచ్ ఐటీ కాన్సెప్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఓవైపు కడలి కెరటాలు.. మరోవైపు పెట్టుబడులు పోటెత్తాయి. బెస్త గ్రామం నుంచి మహానగరంగా మారిన విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్). పరిపాలన రాజధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ నగరానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సదస్సు విజయవంతం అయిన తర్వాత ‘దేశానికి ఆర్థికకోట విశాఖ..’ అని అందరి నోటా ఒకే మాట. జీఐఎస్–2023తో పెట్టుబడుల స్వర్గధామంగా సరికొత్త ఇమేజ్‌కు నాంది పలికిన వైజాగ్.. ఇదే స్ఫూర్తితో జీ–20 సదస్సుకు సిద్ధమవుతోంది. రాజదానులెన్నింటికో రాదారిగా ఉన్న విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సిద్ధించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. చోదకశక్తి కేంద్రాలుగా మారుతున్న ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల జాబితాలో అగ్రభాగంలో ఉన్న విశాఖపట్నంలో రెండురోజులు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు ఈ సమ్మిట్ నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో మూడుమార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా రాని ఇమేజ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన జీఐఎస్‌తో వైజాగ్ పేరు ఖండాంతరాలు దాటింది. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిర్వహించిన సమ్మిట్‌కు దేశవిదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరై విశాఖ నగర వైభవానికి వావ్ అన్నారు. కొత్త ఇమేజ్ తీసుకొచ్చారు ఇన్నాళ్లు.. విశాఖపట్నం అంటే అలల సవ్వడులతో.. అందాల నగరంగా.. పర్యాటక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన తర్వాత నగరానికి సరికొత్త ఇమేజ్ వచ్చింది. ఎవరు వచ్చినా ఆహ్వానించదగ్గ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న విశాఖ నగరంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్న ఆలోచనల్ని పారిశ్రామికవేత్తలు స్వయంగా చూసిన తర్వాత మరింత బలపరుచుకున్నారు. నివాసయోగ నగరాల్లో టైర్–1 సిటీలతో పోటీపడుతున్న విశాఖపట్నం పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. హైదరాబాద్‌ని మించి అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ.. గత పాలకులు విశాఖని ఒక నగరంగానే గుర్తించి విస్మరించడంతో అనుకున్న మేర అభివృద్ధి చెందలేదు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే పెట్టుబడుల సదస్సుతో ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. ఉంటే వైజాగ్‌లోనే ఉండాలి.. చేస్తే విశాఖలోనే వ్యాపారం చేయాలి..’ అనే స్థాయికి తీసుకెళ్లారు. బహుళ ప్రాజెక్టులతో ఆకర్షణ మంత్రం సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. తాజాగా విప్రో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు విశాఖనే ఎంపిక చేసుకుంది. ఇలా ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా సీఎం వైఎస్ జగన్ విశాఖని విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. అందుకే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా వైజాగ్ టెక్‌పార్క్ కూడా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీలను రూ.21,844 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసి 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, టర్బో ఏవియేçÙన్.. ఇలా విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపడానికి కారణం వైజాగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సీఎం వైఎస్ జగన్ అన్నది జగమెరిగిన సత్యం. జీఐఎస్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరో అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూస్తున్నారు. జీఐఎస్ విజయవంతం కావడంతో అంతర్జాతీయ ప్రముఖులకు సైతం వైజాగ్ అంటే ఇష్టం పెరిగింది. మళ్లీమళ్లీ నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన జీ–20 సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ స్ఫూర్తితో జీ–20 సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మరోవైపు త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించడంతో ప్రజల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జీ–20 సదస్సును విజయవంతం చేయడంలో తాము కూడా భాగస్వాములవుతామని నగరవాసులు చెప్పకనే చెబుతుండటం విశేషం. -
Fact Check: ‘ప్రాజెక్టుకు పైసల్లేవ్’ పేరుతో అసత్య కథనం.. వాస్తవాలివిగో
సాక్షి, అమరావతి: పచ్చ మీడియా మరోసారి విష ప్రచారానికి దిగింది. ‘ప్రాజెక్టుకు పైసల్లేవ్’ పేరుతో అసత్య కథనాన్ని వండి వార్చింది. పచ్చ పార్టీ నాయకుడు చంద్రబాబుకు మేలుచేసేలా అబద్దపు రాతలతో ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజీలో అచ్చొత్తింది.. వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై నిజాలను తొక్కిపెట్టి ప్రజల కళ్లకు కంతలు కట్టేందుకు నిసిగ్గుగా ప్రయత్నిస్తోంది ఎల్లో మీడియా. ‘ఈనాడు’ అబద్దాలకు ఇదిగో సమాధానం.. ఆరోపణ : గతంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో జరిగితే, నేడు పూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ రూ.68,293 కోట్లు ఖర్చు పెట్టింది - 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది - 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించడం జరిగింది. ►ఈనాడుకు వాస్తవాలు వక్రీకరించడం వెన్నతో పెట్టిన విద్య. రకరకాల పథకాలు అంటే ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి వాటి క్రింద పెట్టిన ఖర్చు కూడా ప్రాజెక్టుల క్రింద చూపించారు. 2015-19 సంవత్సరాలలో జరిగిన ఖర్చు రూ. 55393 కోట్లు. ఇచ్చిన ఆయకట్టు 2,13,623 ఎకరాలు మాత్రమే. ►దీనిలో పోలవరం ఖర్చు రూ. 10584 కోట్లలో దాదాపు రూ 10,000 కోట్లు కేంద్రం నిధులే. ►దీనిలో ఎన్నో వృధా ఖర్చులు, పట్టిసీమ రూ.1615 కోట్లు, పురుషోత్తపట్నం రూ. 1578 కోట్లు లిప్ట్ స్కీం లకు పెట్టినవి ఉన్నాయి. ►పోలవరం 2018 లో పూర్తి చేస్తామని శపథాలు చేసి 2017 లో పురుషోత్తపట్నం మీద రూ 1578 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలనుకోవడం ఎంత అవివేకం. ఈ పథకాలు జేబులు నింపుకోవడానికే చేపట్టినట్లుగా తేటతెల్లం అవుతుంది. ►పైగా పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ పథకాల వలన ఇప్పటి ప్రభుత్వాలకు గుది బండగా మారాయి. ►ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కోర్టు దాదాపు రూ.250 కోట్ల రూపాయలు పర్యావరణ రుసుము క్రింద పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి మరియు పోలవరం ప్రాజెక్టు లకు కలిపి కట్టమని తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు లో మేము పోరాడవలసి వస్తుంది. ►ఇలాంటివే ఎక్కువ భాగం. ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. ►ఇంకా నీరు చెట్టు క్రింద పెట్టిన ఖర్చు దాదాపు 10 వేల కోట్ల రూపాయల లో జరిగిన అవినీతి సంగతి అందరికీ తెలిసిందే. అవి వారి కార్యకర్తల కోసం చేపట్టినవి అని, మన బిల్స్ పూర్తిగా చంద్రబాబు చెల్లించకుండా కార్యకర్తల్ని మోసం చేశారు అని వారి నాయకులే చెప్పుకుంటున్నారు. ►ఈ భారం ఈ ప్రభుత్వం మోస్తున్నది. జరగని పనులకు బిల్లులు చెల్లించలేక, కోర్టుల చుట్టూ అధికారులు తిరగలేక సతమవుతున్నారు. ►ఇన్ని డబ్బులు ఖర్చు చేసి గత ప్రభుత్వంలో పూర్తిచేసిన ప్రాజెక్టులు రెండే రెండు. అవి రెండు కూడా పైన చెప్పిన రెండు తాత్కాలిక పథకాలు. ►ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా (12 /22) 23,289 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కోవిడ్ మహమ్మారి వలన దాదాపు 18 నెలలు పనులు జరగక పోవడం, రాష్ట్ర ఆర్థిక వనరులు కుంటు పడటం వలన ఖర్చు తక్కువ అవడానికి ప్రధాన కారణం. ►ఉన్న పరిమిత వనరులను, మంచి ప్రణాళికలో తక్కువ ఖర్చుతో సత్వరం పూర్తి అయ్యే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. ►ఈ ప్రభుత్వము లో ఇచ్చిన ఆయకట్టు 1,03,692 ఎకరాలు. విస్తీరీకరణ కింద 4,84,500 ఎకరాలు ఇవ్వడము జరిగినది. దాని వలనే దశాబ్దకాలం నుండి పెండింగ్ లో ఉన్న నెల్లూరు బ్యారేజి , సంగం బ్యారేజి పనులు పూర్తి చేయగలిగాము. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెలు పూర్తి చేశాము. రెండవ టన్నెలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి, 2024 జూన్ లోపు నల్లమల సాగర్ నింపి ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరుగుతుంది. రివర్స్ టెండరింగ్: రివర్స్ టెండరింగ్ ఈ ప్రభుత్వం టెండరింగ్ విధానంలో తెచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు. దీని వలన ఎంతో ప్రజాధనం ఆదా అయింది. ఒక్క పోలవరం లోనే 865 కోట్లు ఆదా అయింది. అన్ని ప్రాజెక్టులు కలిపి దాదాపు 2090 కోట్ల ప్రజాధనం ఆదా చేయగలిగాము. ఇంత మంచి ఉద్దేశాన్ని కూడా విమర్శించడం దిగజారుడుతనం అవుతుంది. ►దివంగత నేత వైఎస్సార్ దూర దృష్టితో రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పట్టిన జలయజ్ఞంను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ధనయజ్ఞంగా మార్చుకోవడంలో టిడిపి వారు సిద్ద హస్తులమని నిరూపించుకున్నారు. G.O No.22 & 63 లు ఇచ్చి ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఇవి ఇచ్చిన ఉద్దేశ్యం మాత్రం నెరవేరలేదు, పట్టిసీమ, పురుషోత్తపట్నం లాంటి తాత్కాలిక, స్వార్ధపూరిత పథకాలని ప్రోత్సహించారు, నీరు చెట్టు లో జరిగిన అవినీతితో సాగునీటి రంగం గత ప్రభుత్వంలోనే భ్రష్టు పట్టించారు. ఈ ప్రభుత్వానికి దానిని గాడి లో పెట్టడం పెద్ద టాస్క్ అయిపోయింది. బిల్లులు చెల్లించక నానా ఆగచాట్లు: ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేనాటికే దాదాపు 20,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో వున్నవి. అవన్నీ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరుపుకుంటూ వస్తున్న క్రమం లో కోవిడ్ మహమ్మారి వలన రాబడి తగ్గిపోయి, ప్రజల కనీస అవసరాలకు నిధులు సింహ భాగం కేటాయించడం వలన , బిల్లులు చెల్లింపులలో 2020-21, 2021-22 లో కొంత జాప్యము జరిగిన మాట వాస్తవమే. పోలవరం: ఈనాడు / టీడీపీ వారు పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. పోలవరంలో టీడీపీ వారు చేసిన ఘోర తప్పిదాల వలన ఈ రోజు పొలవరo మెయిన్ Earth Cum Rock Fill డ్యామ్ కట్టడం లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతునాయి. ఎగువ కాఫర్ డ్యామ్ లో 2018-19 లో వదిలిన ఇరుకు గ్యాప్ ల వలన 2019,2020 ల లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, డ్యామ్ ఏరియా లో ఇసుక washout అయిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇంత వరకు వీటికి సరిచేసే విధానాలను CWC, NHPC, IIT లో ని Technocrats నిమగ్నం అయి ఉన్నారు. పోలవరం మీద పెట్టిన ఖర్చును కేంద్రం నుండి రాబట్టు కోవటం లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి కారణం గత ప్రభుత్వం 2013-14 అంచనాలతో కేంద్ర కేబినెట్ లో పెట్టినపుడు చూపిన నిర్లక్ష్యం కారణం. ఇంకా గోదావరి నదికి ఎన్నడూలేని విధంగా జులై నెలలో అత్యధిక వరదలు రావడం కొంత ప్రణాళిక ను దెబ్బతీసింది. అందువలనే దిగువ కాఫర్ డామ్ పనులు కొంత ఆలస్యము అయినవి. ఇప్పుడు దిగువ కాఫర్ డామ్ పనులు వేగంగా జరుగుతున్నవి. CWC వారు డీజయన్లు ఇవ్వగానే, ప్రాజెక్టు ను పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు: గత ప్రభుత్వ కాలములో దుర్భిక్ష ప్రాంతమైన ప్రకాశం జిల్లా అవసరాలను కూడా గుర్తించక వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం జరిగినది. ఆ ప్రాజెక్టులో భాగమైన పునరావాస కార్యక్రమాలలను పూర్తిగా విస్మరించడం జరిగినది. టన్నెల్ పనులను తమ గుత్తేదారులకు ఇప్పించుకొనుటకు గాను అప్పటి గుత్తేదారులను సాగనంపి అధిక ధరలకు అస్మదీయ గుత్తేదారులకు కట్టబెట్టం జరిగింది మరియు సదరు గుత్తేదారులు చిన్న చిన్న సాకులు చూపి పనులు నత్త నడకన చేసినను త్వరితగతిన పూర్తి చేయుటకు అప్పటి ప్రభుత్వము ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వము చిత్త శుద్ధితో ప్రణాళిక బద్ధముగా పై పనులను పూర్తి చేయుటకు సంకల్పించింది. అందులో భాగముగా వెలిగొండ టన్నెల్- 1 పూర్తి చేయడం జరిగినది. అదే విధముగా టన్నెల్-2 కూడా జూన్ 2023 నాటికి పూర్తి చేసి, ఆ ఖరీఫ్ పంట కాలములో పూర్తి స్థాయిలో నీటి విడుదలకు ప్రణాళికాబద్ధముగా పనులు జరుగుతున్నవి. వంశధార రెండవ దశ , మహేంద్రతనయ పూర్తిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం ప్రాంతాలలో రాష్ట్రములోని అత్యధిక వర్షపాతము నమోదు అయినప్పటికీ నీటి పారుదల సౌకర్యము అందుబాటులో లేకపోవడముతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు, గత ప్రభుత్వము పూర్తి నిర్లక్ష్య దృక్పథముతో ఆ ప్రాంత అవసరాలను విస్మరించి ఏ ప్రాజెక్టును కానీ పూర్తి చేయుటకు సంకల్పించలేదు. ప్రస్తుత ప్రభుత్వము ఆ ప్రాంతములోని వంశధార - నాగావళి నదుల అనుసంధానము మరియు వంశధార రెండో దశ పనులను ప్రాధాన్యతగా గుర్తించి ఈ ఖరీఫ్ సీజన్లో పూర్తి చేసి సాగు నీటిని అందించుటకు ప్రణాళిక బద్ధముగా ముందుకు సాగడం జరుగుతున్నది, అందుకు అవసరమైన అన్ని బిల్లులు చెల్లించి గుత్తేదారులను పనులు పూర్తి చేయుటకు ఆదేశించడమైనది. ఉత్తరాంధ్ర ప్రాంతములో మిగిలిన ప్రాజెక్టులైన తారకరామా తీర్థ, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ జలాశయం, తోటపల్లి, గజపతినగరం పనులను కూడా ప్రాధాన్యత క్రమములో త్వరితగతిన పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవడమైనది. గాలేరు నగరి, హంద్రీనీవా ప్రొజెక్టులు : అవుకు కుడి సొరంగ మార్గము నందు 160 మి. fault zone పనిని చేపట్టకుండా గత ప్రభుత్వము విస్మరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వము అందులో 90 మి. fault zone సొరంగమూ పూర్తి చేసి మిగిలిన 70 మి. కూడా ఏప్రిల్ నాటికి పూర్తి చేసి 10 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా అవుకు జలాశయమునకు మరియు రాయలసీమ లోని ఇతర ప్రాంతాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీటి లభ్యత చేకూర్చుటకు ప్రణాళికలు, ప్రణాళిక బద్ధముగా పనులు చేపట్టడం జరిగినది. గండికోట మరియు చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయములలో ప్రభుత్వము విస్మరించిన పునరావాస పనులు పూర్తి చేసి 27 టి.ఎం.సి మరియు 10 టి.ఎం.సి. ల పూర్తి సామర్థ్యంతో నింపడం జరిగినది. అలాగే బ్రహ్మంసాగర్ జలాశయములోని లీకేజి సమస్యను గత ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యము చేయగా ప్రస్తుత ప్రభుత్వము అతి తక్కువ ఖర్చుతో రూ.60 కోట్లు వెచ్చించి ఆ సమస్యను పరిష్కరించి జలాశయం నందు 17 టి.ఎం.సి. ల పూర్తి సామర్థ్యం వరకు ఈ సంవత్సరం నింపడం జరిగినది. గత ప్రభుత్వము హంద్రీ నీవా ఫేస్ - 2 లో భాగముగా కుప్పము బ్రాంచ్ కెనాలు ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు నీటిని అందించుటకు అట్టహాసముగా కుప్పము బ్రాంచు కెనాలును రూ.477 కోట్లతో ప్రారంభించి పనులను అస్మదీ యులకు ఇప్పించి, పని విలువను రూ. 622 కోట్లకు పెంచి అందులో లాభ దాయక పనులు మాత్రము చేసి బిల్లులు తీసుకొని అసంపూర్తిగా విడిచి పెట్టడం జరిగినది. ఇప్పుడు ఆ పనులను కూడా ప్రాధాన్యతగా చేపట్టి అనతి కాలములోనే కుప్పము నియోజకవర్గానికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమము చేపట్టడం జరిగినది. అలాగే రామలింగేశ్వర నగర్ వరద రక్షణ గోడ నిర్మించి విజయవాడ నగరంలోని దాదాపు 50,000 మంది నివసించే ముంపు ప్రాంతాలకు పూర్తి వరద రక్షణ కల్పించింది కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలకు నీటి సరఫరా : 10,130 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు 9 మండలాల్లోని 68 చెరువులకు నీరు అందించేందుకు, HNSS మెయిన్ కెనాల్ 90 వ కిలో మీటర్ వద్ద ఎడమవైపు నుంచి 1.238 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ద్వారా కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలకు నీటి సరఫరాను అందించడం మరియు జిల్లా పశ్చిమ ప్రాంతాలలో ప్రజలు & పశువులకు గృహ, పారిశ్రామిక తాగునీటి అవసరాలు తీర్చబడటానికి, 180.67 కోట్ల విలువైన ఈ పనులు దాదాపు పూర్తిచేయబడి, పత్తికొండ మరియు డోన్ నియోజకవర్గాల్లో నీటి సరఫరా చేయుటకు సిద్ధంగా ఉంది. సారాంశము : గత ప్రభుత్వము అసంబద్ధముగా పక్కా ప్రణాళిక లేకుండా రూ.55894 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు, కానీ ప్రజలకు చేకూరిన లబ్ది ఏ మాత్రము లేదు. వారి అస్మదీయ గుత్తేదారులకు పనులు కట్టబెట్టి వారికి మరియు వారిద్వారా ప్రభుత్వము లోని పెద్దలకు లబ్ది పొందే కార్యక్రమాలు మాత్రమే చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వము అనవసర ఆర్భాటాలకు పోకుండా ప్రజాధనాన్ని ప్రజలకు సత్వర లబ్ది చేకూరే విధముగా ప్రాజెక్టులపై అవసరం మేరకే ఖర్చు పెట్టడం జరుగుతున్నది. గత రెండు సంవత్సరాలలో రాష్ట్రములోని అన్ని ప్రాంతాలలోను ఎక్కడ రైతులు సాగునీటికి కానీ ప్రజలు త్రాగు నీటికి కానీ ఇబ్బంది పడకుండా నీటిని అందించడం జరిగినది. గత రెండు సంవత్సరాలలో ఖరీఫ్ నందు 114 లక్షల ఎకరాలకు మరియు రబీ నందు 31.10 లక్షల ఎకరాలకు నీరు అందించడమైనది. ఈ సంవత్సరం ఖరీఫ్ లో 50.96 లక్షల ఎకరాలకు మేజర్ మరియు మీడియం ప్రాజెక్టుల కింద , 12.12 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద, 4.95 లక్షల ఎకరాల కు APSIDC కింద మరియు 9.92 లక్షల ఎకరాలకు భూగర్భ జలాల కింద మొత్తము ఆయకట్టు 77.95 లక్షల ఎకరాలకు రికార్డు స్తాయి లో సాగునీరు అందించబడినది. -
ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలోగా పూర్తికావాలి: సీఎం జగన్
-
నిండుకుండలా మారిన ప్రాజెక్టులు
-
ఎడతెరపిలేని వర్షాలకు భారీగా వచ్చిచేరుతున్న వరద నీరు
-
ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ
-
కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాజెక్టులపై ఈ నెలలో నిర్వహించే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వివాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి శుక్రవారం ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పనులకూ అనుమతులు తీసుకోవాలని లేఖలో తెలంగాణకు తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి... రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని ఏపీకి సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని కోరినా స్పందించలేదని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖల్లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎజెండాను పంపలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం సహా ఏడు ప్రాజెక్టులు ఆపేయండి గోదావరిపై అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. ‘అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కాళ్వేరం, గోదావరి ఎత్తిపోతల పథకం మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, లోయర్ పెన్‌గంగపై బ్యారేజీలు, రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు మళ్లింపు పథకాలు చేపట్టిందని, వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని మే 14న గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ జూన్ 2018లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది. కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలిస్తున్నారని, వాటికి ఆమోదం లేదనే అంశాన్ని తెలంగాణ సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. కొత్త పనులకు కేంద్ర అనుమతులు తీసుకోవాలి’అని షెకావత్ సూచించారు. ‘విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపట్టిన ఏడు ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశిస్తూ మే 30న గోదావరి బోర్డు లేఖ రాసింది. జూన్ 5న నిర్వహించిన గోదావరి బోర్డు 9వ సమావేశంలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా అందజేయాలని.. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని స్పష్టం చేసింది. డీపీఆర్‌లు పంపాలని జూన్ 10న మరోసారి గోదావరి బోర్డు గుర్తుచేసింది. కానీ ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు’అని షెకావత్ పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోకుండా, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టుల పనులను చేపట్టవద్దంటూ తెలంగాణ సర్కార్‌ను షెకావత్ ఆదేశించారు. ‘రాయలసీమ’టెండర్లు ఆపండి.. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి రోజుకు 6–8 టీఎంసీలను తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, వాటి టెండర్లను ఆపాలని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో ఆదేశించారు. ‘రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తయితే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ మే 12న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణా బోర్డు... రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఇతర పనుల విషయంలో ముందుకెళ్లొద్దంటూ ఏపీ ప్రభుత్వానికి మే 20న లేఖ రాసింది. జూన్ 4న నిర్వహించిన బోర్డు సమావేశంలో కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను వారంలోగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. వాటిని సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని సూచించింది. కానీ ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా డీపీఆర్‌లు ఇవ్వలేదు’అని షెకావత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ టెండర్‌పై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా ప్రాజెక్టుల పనులు చేపట్టొద్దన్నారు. ఇతర పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, వాటిని అప్పగించడం చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
ప్రొద్దుటూరు జలగలు
-
గల గలా గోదావరి..!
-
గోదావరికి పెరుగుతున్న నీటి ప్రవాహం
-
తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు
-
రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు
-
కాంట్రాక్టర్లు మాత్రం మారలేదు: జి.కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రభుత్వం మారింది. పాలకులు మారారు. అధికారులు మారారు. ప్రాజెక్టులు మారాయి. ప్రాజెక్టుల ఖర్చు అంచనా లు మారాయి. అంచనాల కంటే టెండర్లు పెరిగాయి. ఇన్ని మార్పులు జరిగినా కాంట్రాక్టర్లు మాత్రం మారలేదు’అని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల సమయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం జరగడంలేదు. కాంట్రాక్టర్ల లాభం కోసమే కొన్ని పనులు జరుగుతున్నాయి. నీటి ప్రవాహ రీతిని పట్టించుకోకుండా ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కోటి ఎకరాల సాగు ఆచరణకు తగినట్లుగా పనులు జరగడంలేదు’ అని విమర్శించారు. -
బడా నిర్మాణ సంస్థలకేమైంది?
బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సక్సెస్ అయిన ఓ నిర్మాణ సంస్థ.. ఎర్రగడ్డలో ఓ ప్రీమియం ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ ప్రాంతానికి తగ్గ ప్రాజెక్ట్ కాదది. అంటే స్థానిక ధరకి, నిర్మాణ సంస్థ ధరకి చాలా తేడా. ప్రాజెక్ట్ ప్రీమియమే కావచ్చు. కానీ, స్థానిక కొనుగోలుదారుల అవసరాలూ ముఖ్యమే కదా! దీంతోఅమ్మకాల్లేక.. నిర్మాణ పనులకు బ్రేకిచ్చింది సదరు సంస్థ. .. పై అనుభవం ఒక్క ముంబైకి చెందిన నిర్మాణ సంస్థది మాత్రమే కాదండోయ్.. పుప్పాలగూడ, కవాడిగూడ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు చేస్తున్న కోల్‌కతా, బెంగళూరులకు చెందిన నిర్మాణ సంస్థలదీనూ! వీటి సారాంశమేంటంటే.. సంస్థ బ్రాండ్, సక్సెస్ మీద కాదు.. స్థానిక, కొనుగోలుదారుల అవసరాలే ప్రాజెక్ట్ సక్సెస్‌కు కారణమని! సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తర్వాత స్థిరాస్తి కొనుగోలుదారులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలోలాగా ప్రీలాంచ్లో కొనడం లేదని ఓ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. కస్టమర్ ప్రాపర్టీని కొనుగోలు చేయాలంటే ముందుగా నచ్చాల్సింది ప్రాంతం. ఆ తర్వాతే ప్రాజెక్ట్ విజిట్. ధర, వసతుల కంటే ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడుగుతున్నాడని.. 3–4 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్‌ల్లో ప్రాపర్టీ కొనుగోలుకే ప్రాధాన్యమిస్తున్నారని ఆయన వివరించారు. చ.అ.కు 100–200 ఎక్కువైన సరే వీటిల్లో కొనేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోళ్లలో కొత్త కస్టమర్లు.. ఇంతకాలం హైదరాబాద్ స్థిరాస్తి రంగం సింహభాగం ఐటీ, ఫార్మా రంగాల మీదే ఆధారపడి ఉంది. కానీ, గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. స్టార్టప్స్, ఈ–కామర్స్, లాజిస్టిక్, కో–వర్కింగ్ స్పేస్ వంటి రంగాలకు చెందిన ఉద్యోగుల కొనుగోళ్లూ పెరిగాయి. వీటికితోడు స్థానిక కస్టమర్లు కొంటున్నారు. ఇతర నగరాల్లో కంటే నగరంలో ధరలు అందుబాటులో ఉండడంతో కొత్త కొనుగోలుదారులు మరీముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ అన్నారు. ముందు ప్లాట్.. తర్వాతే ఫ్లాట్.. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహంతో వాణిజ్య, కార్యాలయాల లావాదేవీలు పెరుగుతున్నాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిల్లో భారీ ఉద్యోగ అవకాశాలొచ్చే అవకాశాలున్నాయి. అయితే వాణిజ్య లావాదేవీలు జరిగితే ఆయా ప్రాంతాల్లోని 10 కి.మీ. పరిధి వరకూ లే అవుట్లకు గిరాకీ పెరుగుతుంది. ప్రాపర్టీ కొనుగోలుదారులు ముందు జేబులోని సొమ్మునే పెట్టుబడిగా పెడతారు. ఈ సొమ్ము సుమారు 5–8 లక్షల కంటే ఎక్కువుండదు. అందుకే ముందుగా కమర్షియల్ ప్రాపర్టీలకు దగ్గర్లోని లే–అవుట్లు, స్థలాలను కొనుగోలు చేస్తారు. అంటే కమర్షియల్ రంగానికి గిరాకీ పెరిగితే ముందుగా డిమాండ్ పెరిగేది లే–అవుట్లకే. ఆఫీసులు ప్రారంభమై, ఉద్యోగుల రాకపోకలు మొదలయ్యాకే నివాస సముదాయాలకు గిరాకీ పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లే అవుట్ల డిమాండ్ దశలో ఉందని.. రెండో త్రైమాసికం నుంచి నివాస రంగం దశ మొదలవుతుందని, 30–40 శాతం ధరలు పెరిగే అవకాశముందని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ ప్రారంభంలో హంగామాలొద్దు.. ప్రీమియం ప్రాంతాల్లోని ఫాట్లు్ల చ.అ. ధర కంటే అందులోని వసతులు, నిర్వహణ రుసుములే ఎక్కువగా ఉంటాయి. అందుకే అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి. అయితే ఆయా ప్రాజెక్ట్‌ల్లో అమ్మకాలు మొదట్లో కాస్త నెమ్మదించినా తర్వాతర్వాత పుంజుకుంటాయని పంజగుట్టకు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. అప్పటివరకు చ.అ.కు రూ.3,000 కూడా మించి లేని ప్రాంతాల్లో ఒక్కసారిగా రూ.5,000లకు పైగా అంటే కస్టమర్లు సందిగ్ధంలో పడతారని పేర్కొన్నారు. అంతేకాదండోయ్.. ప్రాజెక్ట్ ఆరంభంలో ఎక్కువ హంగామా చేసినా కూడా కొనుగోలుదారులు ఇందులో ఎక్కువ రేట్లు ఉంటాయనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. కొంపల్లి ఎందుకు సక్సెస్ కాలేదు? కస్టమర్ల అవసరాలు, అభిరుచుల మేరకే బిల్డర్లు ప్రాజెక్ట్‌లు కట్టాలి. అంతే తప్ప సంస్థ బ్రాండ్ ఇమేజ్, అవసరాల రీత్యా ప్రాజెక్ట్‌లు కడితే విఫలమవుతాయి. కస్టమర్లు కూడా ఆఫీసులు, పని ప్రాంతాలకు దగ్గర్లో ఇల్లుండాలని కోరుతున్నారని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్ చెప్పారు. వర్క్ ప్లేస్‌లకు కేంద్రంగా లేదు కాబట్టే కొంపల్లి మార్గం రియల్టీ రంగంలో అంతగా అభివృద్ధి చెందలేదని ఆయన ఉదహరించారు. రూ.30–40 వేల మధ్య వేతన జీవులుండే ప్రాంతాల్లో కోటి రూపాయల ప్రాజెక్ట్ చేపడితే విఫలవుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో అభివృద్ధి ఉంటే సరిపోదు. అ ప్రాంతం మౌలికంగా, సామాజికంగానూ అభివృద్ధి చెందాలి. అంటే రోడ్లు, నీళ్లు, విద్యుత్, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలుండాలి. ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు బెటరంటే? దక్షిణంలో లగ్జరీ.. గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్‌రాంగూడ వంటి దక్షిణాది ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లు చేస్తుంటే.. ధర కాసింత ఎక్కువైన పర్వాలేదు. కానీ, వసతులు మాత్రం లగ్జరీగా ఉండాల్సిందే. ఇక్కడ 80% అమ్మకాలు రెండో ప్రాపర్టీ కొనుగోలుదారులే ఉంటారు. పన్ను మినహాయింపుల కోసం ప్రాపర్టీ కొంటుంటారు. ఇక్కడి విస్తీర్ణాలు కనీసం 1,500 చ.అ. నుంచి, ధర రూ.2,700 నుంచి మొదలవ్వాలి. ప్రాజెక్ట్‌లో స్క్వాష్ వంటి వినూత్న ఆటలకు ప్రాధాన్యత మివ్వాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ జోన్లు వంటివి ఉండాలి. సెక్యూరిటీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. సెంట్రల్లో సూపర్ రిచ్.. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హిమాయత్‌నగర్ వంటి సెంట్రల్ ప్రాంతాల్లో బిజినెస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనీసం 1,800 చ.అ. విస్తీర్ణం నుంచి మొదలవ్వాలి. ధర చ.అ.కు రూ.3,500–4,500 మధ్య ఉండాలి. సెంట్రల్ ప్రాంతాల్లో స్థలం పెద్దగా అందుబాటులో ఉండదు. కానీ, ఉన్న స్థలంలోనే లగ్జరీ అపార్ట్మెంట్స్ కట్టడం మేలు. ఔట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా వంటి వసతులకు స్థలం కేటాయించాలి. షాపింగ్, ఎంటర్టైన్మెంట్ల వంటివి సమీప దూరంలోనే ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్‌లో వీటికి స్థల కేటాయింపులు చేయకపోయినా ఫర్వాలేదు. తూర్పులో గేటెడ్.. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి తూర్పు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు మేలు. ధర రూ.45 లక్షల లోపు ఉంటే అమ్మకాలు బాగుంటాయి. ఇతర జిల్లాల్లోని కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వసతుల కంటే ముఖ్యంగా నాణ్యమైన నిర్మాణం, అందుబాటు ధర, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి అంశాల మీద దృష్టిపెడితే బెటర్. అంతర్జాతీయ వసతుల జోలికి వెళ్లకుండా స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటివి ఉండేలా చూసుకోవాలి. -
'రాజీనామా చేసి తప్పుకుంటా..'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ గురువారం మాట్లాడుతూ కాంగ్రెస్ పోరాటంతోనే పునర్విభజన చట్టంలో 53 శాతం విద్యుత్ వాటాను కేటాయించారన్నారు. 24 గంటలు విద్యుత్ రావడంలో కేసీఆర్ ప్రమేయం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ పథకం తెచ్చినా అవినీతే అని ఆయన మండిపడ్డారు. విద్యుత్ పేరు చెప్పి కేసీఆర్ దోచుకుంటున్నారన్నారు. కేవలం రూ.105 కోట్లు కరెంటు కోసమే యాడ్ ఇచ్చారని తెలిపారు. అధికారులు వద్దని చెప్పినా చత్తీస్ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని.. నిజాయితీ గా ఉన్న అధికారులను సీఎం బదిలీ చేస్తన్నారని ఆరోపించారు. ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు రూ. 4000 కోట్ల భారం పడుతుందన్నారు. మరో వైపు భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల విషయంలో పారదదర్శకంగా లేదని కేంద్ర విద్యుత శాఖ మంత్రే చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి వచ్చే కమీషన్ కోసమే యాదాద్రి, భద్రాద్రి ప్రాజెక్టులన్నారు. బీహెచ్ఈఎల్ కి ఇచ్చిన కాంట్రాక్టు, సోలార్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిరూపిస్తానని.. ఒకవేళ నిరూపించక పోతే రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అని కోమటి రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే సవాల్ కు సిద్ధం కావాలని.. అవినీతి జరగలేదని నిరూపించుకోవాలన్నారు. అసెంబ్లీలోనైనా, ప్రగతిభవన్ అయినా తాము చర్చకు సిద్దమన్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో పెట్టిన మోటార్స్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినవే అని కోమటిరెడ్డి తెలిపారు. -
'కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. పాలమూరులో నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఆర్డీఎస్కు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని తెలిపారు. ఆర్డీఎస్‌పై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎ.సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు బాలరాజు తెలిపారు. కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మంత్రి హరీశ్‌రావు దిగజారి వ్యవహరిస్తున్నారని సంపత్ కుమార్ మంగళవారం విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై మంత్రి నిజాలను దాచి పెట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -
బీసీల్లో కులానికో పథకం
-
బీసీల్లో కులానికో పథకం
► వెనుకబడిన తరగతుల్లో అన్ని కుటుంబాలకు సాయం అందించడమే లక్ష్యం ► స్కీంలు, కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ► వచ్చే నెల నుంచే అమలు చేయాలని స్పష్టీకరణ ► బ్యాంకులతో లింకు లేకుండానే లోన్లు ► రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం ► ఏటా 60 వేల నుంచి 70 వేల కుటుంబాలకు లబ్ధి ► 25 వేల సెలూన్లకు తోడ్పాటు ► బీసీ కులాల అభ్యున్నతిపై ముఖ్యమంత్రి సమీక్ష సాక్షి, హైదరాబాద్: బీసీ కులాల్లోని అన్ని కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందించే కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను రూపొందించి వచ్చే నెల నుంచే అమలు చేయాలని స్పష్టం చేశారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి జరగాలన్నారు. ‘‘బీసీలలో ప్రతీ కులానికి ఓ ప్రత్యేక పని, ప్రత్యేక జీవనం ఉన్నాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాల రూపకల్పనలో కూడా వైవిధ్యం ఉండాలి’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీ కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రభుత్వాలు పేరుకు కొన్ని పథకాలు ప్రవేశపెట్టాయని, అవేవీ బీసీల జీవితాల్లో మార్పు తేలేకపోయాయని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, బీసీల జీవితంలో నిజమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల కోసం బ్యాంకులతో లింకు లేకుండానే ఒక్కొక్కరికి లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సూచించారు. వివిధ వృత్తి కులాల ప్రతినిధులతో త్వరలో స్వయంగా తాను కూడా సమావేశాలు నిర్వహించి, ఆయా వర్గాల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతకు రానున్నట్లు వెల్లడించారు. మభ్యపెట్టే పథకాలొద్దు.. ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా.. మభ్య పెట్టే పథకాలు లేకుండా.. వెనుకబడిన తరగతుల కులాల వారి జీవితాల్లో నిజమైన వెలుగు కోసం ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో కొన్ని బీసీ కులాల అభ్యున్నతికి పథకాలు అమలవుతున్నాయి. ఇదేవిధంగా అన్ని బీసీ కులాల వారికి వారి కుల వృత్తుల ప్రాతిపదికన చేయూత అందించే కార్యక్రమాలు చేపట్టాలి. కుల వృత్తులు లేని వారికి, కుల వృత్తులు మానేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న వారికి తగిన ప్రోత్సాహం అందించాలి. అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాం. వీటితో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి’’అని సూచించారు. వారు సమాజం కోసం పని చేస్తున్నారు ‘‘బీసీ కులాలు ప్రధానంగా వృత్తిపరమైనవి. వారు చేసే పని మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. వారు లేకుంటే సమాజం ఈ పరిస్థితిలో ఉండదు. రజకులు బట్టలు ఉతకకపోతే పరిశుభ్రంగా ఉండడం సాధ్యం కాదు. నాయీ బ్రాహ్మణులు క్షవరం చేయకుంటే మనుషులు గుడ్డేలుగుల్లా ఉంటారు. మేదరులు అల్లిన వస్తువులు ప్రతీ ఇంట్లో వాడతారు. మేరలు కుట్టిన బట్టలు తొడుక్కుంటాం. కంసాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి.. ఇలా ప్రతీ కుల వృత్తిదారులు సమాజం కోసమే పనిచేస్తున్నారు. ఆయా పనులు చేయడం వల్ల వారు ఉపాధి పొందుతుండవచ్చు. కానీ వారి కృషి వల్ల మానవ సమాజం ఉన్నతంగా బతుకుతున్నది. కాబట్టి యావత్ సమాజం కులవృత్తుల వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది’’అని సీఎం పేర్కొన్నారు. ‘‘గొల్ల, కుర్మల కోసం రూ.4 వేల కోట్ల వ్యయంతో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అది దిగ్విజయంగా అమలవుతోంది. రూ.వెయ్యి కోట్లతో చేపల పెంపకం కార్యక్రమం చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటున్నాం. రూ.1,200 కోట్ల వ్యయంతో నేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుమ్మరులు, పంచకర్మల కోసం ప్రత్యేకంగా పథకాలు రూపొందించాం. సంచార జాతులు, ఇతర వెనుకబడిన కులాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్పొరేషన్ ద్వారా అత్యంత వెనుకబడిన కులాల్లోని కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు కార్యక్రమాల రూపకల్పన జరగాలి. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రతీ ఏటా 60 నుంచి 70 వేల కుటుంబాలను ఆదుకోవాలి’’అని సూచించారు. ఎంబీలకు ఏటా రూ.వెయ్యి కోట్లు ‘‘విశ్వ బ్రాహ్మణుల్లో ప్రధానంగా పంచకర్మలున్నాయి. వారంతా కుల వృత్తులను ఆధారం చేసుకుని బతుకుతున్నారు. వారికి అవసరమైన పనిముట్లు, ఆర్థిక సహకారం అందించాలి’’అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని రజకులకు వారి వారి అవసరాలను, పని విధానాన్ని బట్టి కార్యక్రమాలు రూపొందించాలి. దోబీ ఘాట్ల నిర్మాణం, డయింగ్ మిషన్ల పంపిణీ, ఇంకా అవసరమైన పెట్టుబడి తదితరాలు సమకూర్చాలి. నాయీ బ్రాహ్మణులకు నవీన క్షౌ రశాలలు ఏర్పాటు చేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నాయీ బ్రాహ్మణుల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి తగినట్లు ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల సెలూన్లకు అవసరమైన సాయం అందించాలి. అనేక సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలున్నాయి. అందులో కొందరు ఇంకా సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటున్నారు. కొన్ని కులాలు అంతరించాయి. వారు ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహకారం అందించాలి. ప్రతీ ఏటా బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయించుకుంటాం. ఈ ఏడాది వెయ్యి కోట్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది ఇంకా పెంచుతాం’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు జోగు రామన్న, టి.హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వి.లక్ష్మికాంతరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు సోనాకు గడ్డుకాలం
- సాగునీరు లేక కాలువలన్నీ వెలవెల - కర్నూలు సోనా సాగుకు దాటిన అదను -ఇప్పుడు నీళ్లొచ్చినా పంట వేయలేని దుస్థితి -స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలని శాస్త్రవేత్తల సూచన కర్నూలు (అగ్రికల్చర్): జిల్లాలో ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. మరీ ముఖ్యంగా ‘కర్నూలు సోనా’కు గడ్డుకాలం వచ్చింది. బీపీటీ 5204 రకం కర్నూలు సోనా బ్రాండ్ నేమ్‌తో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఈ సారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పంట సాగుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ రకాన్ని నేడు వివిధ జిల్లాల్లోనూ పండిస్తున్నప్పటికీ కర్నూలు జిల్లాలో పండిన పంటకే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ ఉంది. అటువంటి పంట ప్రస్తుతం ప్రమాదంలో పడడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో మూడు నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు వర్షాలు సమృద్ధిగా కురవలేదు. ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. కాలువలకు చుక్క నీరు రావడం లేదు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఆశాజనకంగానే కురిసినా ఎగువనున్న కర్ణాటకలో మాత్రం పడలేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మొదలు కాలేదు. జిల్లాలోని కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ తదితర కాలువల మనుగడ శ్రీశైలం నీటి మట్టంపైనే ఆధారపడి ఉంది. డ్యాంలో నీళ్లు అడుగంటడంతో ఈ కాలువల కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్ఎల్సీకి నీళ్లు విడుదలయ్యే అవకాశమున్నా వరి సాగుకు సరిపోవని, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 11,246 హెక్టార్లకే పరిమితమైన వరి గతంలో జిల్లా వ్యాప్తంగా ఏటా లక్ష హెక్టార్లకు పైగా వరి సాగయ్యేది. రానురాను సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రాజెక్టులకు సకాలంలో నీళ్లు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,474 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 11,246 హెక్టార్లకే పరిమితమైంది. ఇది కూడా బావులు, బోర్ల కింద సాగైంది. జిల్లాలో ప్రధానంగా బీపీటీ 5204 రకం( కర్నూలు సోనా) సాగు చేస్తారు. ఆగస్టు చివరిలోగా నాట్లు పడితేనే ఈ రకం దిగుబడి బాగా వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం, కాలువలు ఖాళీగా ఉండటంతో కర్నూలు సోనానే కాదు..ఇతర రకాల సాగు కూడా సాధ్యపడలేదు. ఒకవేళ ఇప్పుడు నీళ్లొచ్చినా అదను దాటినందున కర్నూలు సోనా సాగు చేయొద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ సాగు చేస్తే అగ్గి తెగులు తదితర చీడపీడల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదముంది. దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతుంది. ఇదే తరుణంలో దిగుబడులు కూడా తగ్గే అవకాశముంది. కాలువలకు నీళ్లు వస్తే ఈ నెల 15 వరకు వరిలో స్వల్ప కాలిక రకాలు సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే..కాలువలకు నీళ్లొచ్చే అవకాశాలు అతి తక్కువగానే ఉన్నాయి. వరి సాగు తగ్గితే «బియ్యం ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ఇప్పటికే క్వింటాల్ రూ.4,500లకు పైనే పలుకుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం కర్నూలు సోనా సాగుకు అదను దాటడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ వరి వేసుకోవాలనుకుంటే స్వల్పకాలిక రకాలైన ఎన్‌డీఎల్‌ఆర్–7, 8 రకాలు, ఆర్ఎన్ఆర్–15048, ప్రద్యుమ్న రకాలు ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రద్యుమ్న, ఆర్ఎన్ఆర్–15048 రకాలను గొర్రుతో కూడా విత్తకోవచ్చు. అన్నింటికీ మించి మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, వాము, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు వేసుకుంటే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరసింహుడు, సుజాతమ్మ తెలిపారు. -
ఇంకా 515 టీఎంసీల లోటు
ఎన్ని వానలు కురుస్తున్నా నిండని ప్రాజెక్టులు - ఎగువ ప్రాజెక్టులనుంచి రాని నీరు - ఇక ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో నీరులేక వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో అడపా దడపా భారీ వర్షాలు కురుస్తున్నా..వాటితో భారీ సాగునీటి ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనిపించడంలేదు. గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర ప్రవాహాలు రావడం లేదు. దానికితోడు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి ఆశించినమేర నీరు రావడంలేదు. ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ఒకట్రెండు ప్రాజెక్టులు మినహా ఎక్కడా పెద్దగా ప్రవాహాలు వచ్చి చేరలేదు. దీంతో ప్రాజెక్టులన్నీ వట్టిపోయే కనిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలై మూడు నెలలు కావస్తున్నా ఇంకా కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో 515 టీఎంసీల మేర నీటి లోటు కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాలే దిక్కు.. రాష్ట్రంలో ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు కరువైన నేపథ్యంలో ఆ పరిస్థితి లేదు. జూన్ మొదట్లో, అలాగే ఈ నెలలో కురిసిన వర్షాలతో కొద్దిమేర గోదావరి బేసిన్లో నీరొచ్చింది. నీటి ప్రవాహాలు సైతం ఒకట్రెండు ప్రాజెక్టులకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో గోదావరి బేసిన్‌లోకి మొత్తంగా 35 టీఎంసీల నీరు వచ్చి చేరగా, అందులో 18 టీఎంసీల మేర ఎస్సారెస్పీలోకిరాగా, 6.5 టీఎంసీల మేర కడెం, మరో 6 టీఎంసీల మేర ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. మిగతా నీరు చిన్నా, చితక జలాశయాల్లోకి చేరింది. ఇక కృష్ణా బేసిన్లో అయితే కేవలం 21 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు వచ్చింది. ఇందులో ఒక్క జూరాలకే 16 టీఎంసీల మేర నీళ్లొచ్చాయి. అది మినహా ఎక్కడా పెద్దగా ప్రవాహాలు లేకపోవడంతో రెండు బేసిన్ల పరిధిలో ఇంకా 515 టీఎంసీల నీటి లోటు ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా, స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు నిండేందుకే సరిపోతోంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14,134 క్యూసెక్కుల మేర గరిష్ట ప్రవాహాలు వస్తుండగా, సింగూరుకు 8,380, కడెం ప్రాజెక్టుకు 4,227 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఇది మినహా ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రవాహాలు లేకపోవడంతో ప్రాజెక్టులు ఇప్పట్లో నిండేలా లేవు. నైరుతి రుతుపవనాల ప్రభావం పూర్తిగా సన్నగిల్లుతున్న నేపథ్యంలో తర్వాతి ఆశలన్నీ ఈశాన్య రుతుపవనాలపై ఉన్నాయి. కానీ వీటి ప్రభావం ఏపీలోని నెల్లూరు, అనంతపురం, తెలంగాణలో ఖమ్మం, మెదక్ జిల్లాలో మాత్రమే అధికంగా ఉంటుంది. 2009లో ఈశాన్య రుతుపవనాల కారణంగానే విస్తృతంగా వర్షాలు కురవడంతో వేదవతి, తుంగభద్రలకు విపరీతమైన వరద రావడం, అక్కడినుంచి దిగువకు నీరు చేరడంతో శ్రీశైలం నిండి వరద ఉధృత రూపం దాల్చింది. ఆ సమయంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగడంతో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు కూడా సెప్టెంబర్‌లో ప్రవేశించే ఈశాన్య రుతుపవనాలపై భారం వేయాల్సి వస్తోంది. -
'ఎవరు వచ్చినా నేను రెడీ'
హైదరాబాద్: కేసీఆర్ వస్తారో.. ! హరీశ్ వస్తారో..! ఎవరు వచ్చినా ప్రాజెక్టులపై చర్చకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలన్నారు. కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ టీఆర్ఎస్ నేతల బహిరంగ సభలాగా మారిందని విమర్శించారు. పోలీసులతో లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సభల్లో ప్రశ్నించిన లబ్ధిదారులను బయటికి నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫాంహౌస్, ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న నేతలతో సీఎం డబ్బా కొట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేతనైతే సర్కారు న్యాయస్థానాలు మొట్టికాయలు వేయకుండా జీవోలు ఇవ్వాలని సవాల్ విసిరారు. తెలంగాణలో నిరంకుశ, ఆటవిక పాలన సాగుతోందని ఆరోపించారు. గడీల పాలన చేస్తున్నారన్నారు. 2015 నవంబర్ వరకు ప్రాణహితకు జాతీయ హోదా అడిగిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రాజెక్టు డిజైన్‌ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు, ప్రజలు, కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. ప్రజలను ముంచి ప్రాజెక్టులు ఇష్టానుసారం కడితే ఊర్కోబోమని హెచ్చరించారు. నిర్బంధంగా ప్రాజెక్టులు కడతామంటే ప్రజలు తిరుగ బడతారన్నారు. -
'ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలి'
విజయవాడ: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు కిందకు తీసుకురావాలని ఏపీ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, నాగార్జునసాగర్ కుడి, ఎడమ ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు భుజంగరాయలు, వై. పుల్లయ్య చౌదరిలు కోరారు. విజయవాడ గేట్ వే హోటల్లో జరుగుతున్న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశానికి విచ్చేసిన బోర్డు చైర్మన్ శ్రీవాస్తవను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సిన నీటిని సకాలంలో విడుదల చేయించాలని కూడా విజ్ఞప్తి చేశారు. సాగర్ కుడి కాలువ ప్రధాన రెగ్యులేటర్ గుంటూరులో ఉన్నందున దాని నిర్వహణను ఏపీకి అప్పగించాలని కోరారు. ఏపీలో తొలిసారిగా చైర్మన్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపకాలపై చర్చ జరుగుతోంది. సమావేశంలో ఏపీ, తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవను కలిశారు. -
నదుల అనుసంధానంలో మూడు ప్రాజెక్టులు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నదుల అనుసంధానానికి సంబంధించి స్వల్పకాలంలోనే మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించినట్లు ఇన్ఫ్రా దిగ్గజం ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) వెల్లడించింది. 2014లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని నర్మదా – క్షిపర – సింహస్థ (ఎన్‌కేఎస్) ప్రాజెక్టును పూర్తి చేశామని, తర్వాత పట్టిసీమ ప్రాజెక్టును, తాజాగా గోదావరి–ఏలేరు నదుల అనుసంధానంతో పురుషోత్తపట్నం ప్రాజెక్టును పూర్తి చేశామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ. 1,638 కోట్ల విలువైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది జనవరి 5న శంకుస్థాపన జరగ్గా.. ఆరు నెలల్లోనే అడ్డంకులను అధిగమించి ప్రధానమైన పనులన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ విధంగా మూడేళ్ల వ్యవధిలోనే మూడు ప్రాజెక్టులు విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని ఎంఈఐఎల్ వివరించింది. ఆగస్టు 15న పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ఎంఈఐఎల్ చైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య, సీజీఎం రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు. -
మే 1, 2016 తర్వాతి ప్రాజెక్ట్‌లు, లే అవుట్లే రెరా పరిధిలోకి!
అంతకంటే ముందు వాటికి రెరాలో నమోదు నుంచి మినహాయింపు ►రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకే బ్యాంకు రుణాలు ► సుమారు పదివేల ఫ్లాట్లు రెరా పరిధిలోకి సాక్షి, హైదరాబాద్: మే 1, 2016లో కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)ను తీసుకొచ్చింది. ఈ తేదీ తర్వాతి నుంచి ప్రారంభమైన నివాస, వాణిజ్య సముదాయాలు, లే అవుట్లు అన్ని కూడా రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. అంతకంటే ముందు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లు, వెంచర్లు మాత్రం రెరా పరిధిలోకి రావు. నిర్మాణం పూర్తయి.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాని ప్రాజెక్ట్‌లకూ రెరాలో నమోదు నుంచి మినహాయింపు ఉంది. దేశంలో రెరా ప్రకటన కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి మోకాలడ్డింది. రెరా నిబంధనలెలా ఉంటాయో? కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? వంటి రకరకాల కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభానికి డెవలపర్లు ఆలోచనలో పడ్డారు. రెరా ప్రకటన నాటి నుంచి 2017 తొలి త్రైమాసికం వరకూ దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 16 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక చెబుతోంది. హైదరాబాద్ గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మధ్య 10,125 యూనిట్లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 2016– మార్చి 2017లో మాత్రం 9,775 యూనిట్లు ప్రారంభమయ్యాయి. అంటే 3 శాతం తగ్గాయన్నమాట. లగ్జరీ, అందుబాటు ఇళ్లలో 30 శాతం వృద్ధి.. అందుబాటు గృహాలు, లగ్జరీ ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2017 మధ్య కాలంలో అందుబాటు గృహాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16 ఇదే సమయంలో 25 శాతంగా ఉంది. లగ్జరీ, హైఎండ్ యూనిట్ల ప్రారంభాలు మాత్రం ఇదే సమయంలో 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగాయి. అయితే ఆయా విభాగాల్లో అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని నివేదిక పేర్కొంది. రెరాలో నమోదైతేనే రుణాలు.. సాధారణంగా డెవలపర్లు ప్రాజెక్ట్ పేరుతో సమీకరించిన నిధుల్లో కొంత మొత్తాన్ని ఇతర ప్రాజెక్ట్‌లకు, ఇతరత్రా అవసరాలకూ వినియోగిస్తుంటారు. దీంతో కొన్ని సమయాల్లో నిధుల కొరత కారణంగా నిర్మాణాలు ఆలస్యమవుతుంటాయి. అయితే రెరాతో నిధుల మళ్లింపునకు చెక్ పడుతుంది. కొనుగోలుదారుల నుంచి సమీకరించిన నిధుల్లో 70 శాతం ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అలా జమ చేసిన నిధులను ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమి ఖర్చులు, నిర్మాణ ఖర్చుల కోసమే వినియోగించాలి. ⇒ ఇదిలా ఉంటే రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లకు మాత్రమే రుణాలను మంజూరు చేయాలని కొన్ని బ్యాంకులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎస్క్రో ఖాతాలో ఎలా జమ చేయాలనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఓ బ్యాంకు అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ ఇంజనీరు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆర్కిటెక్ట్ ధ్రువీకరణ ప్రకారం ప్రతి 6 నెలలకొకసారి ఈ ఖాతా నుంచి డెవలపర్లకు నిధులు విడుదల అవుతుంటాయి. -
జేబులు నింపుకోవడానికే పథకాలు
–వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం –పైప్‌లైన్ పైకి లేవడంపై ఎద్దేవా –సీఎం వస్తున్నారని వీధిన పడిన నిరుపేదలు సీతానగరం (రాజానగరం): అధికార పార్టీ జేబులు నింపుకోవడానికే ఈ ఎత్తిపోతల పథకాలని, వేలాది కోట్లు కేటాయించి అనుయాయులకు అప్పగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. బుధవారం పురుషోత్తపట్నంలో సీఎం చంద్రబాబు వస్తున్నారని నిరుపేదల ఇళ్లను తొలగించడంపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెబుతున్న చంద్రబాబుకు ఈ ఎత్తిపోతల పథకాలు ఎందుకని ప్రశ్నించారు. వచ్చే నెలలో ప«థకం నుంచి నీటిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అయితే మరోపక్క వేసిన పైప్లైన్లు నీటితో పైకి లేచి పోతున్నాయని ఎద్దేవా చేశారు. నాణ్యతా లోపంతో చేస్తున్న పనుల కారణంగానే ఈ విధంగా జరిగిందని ఆరోపించారు. రైతులను నష్టపర్చుతారా... తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ నుంచి ఈ నెల 18న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాగునీరు విడుదల చేసి, ఒక్క గంటలో నీటి విడుదల ఆపివేశారని విరుచుకుపడ్డారు. టీపీ స్కీమ్‌లో మండలంలో 13,500 ఎకరాల సాగు అవుతుందని, రైతులకు వరినాట్లు వేసే సమయంలో నీటిని నిలిపివేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు, జిల్లా కమిటి కార్యదర్శి వలవల వెంకట్రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొంచ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
దిష్టిబొమ్మలా ప్రాజెక్టులు
- నీరులేని ముచ్చుకోట, చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లు - రూ. వందల కోట్ల ప్రభుత్వ సొమ్ము వృథా - నీరిచ్చి ఆదుకోవాలంటున్న ప్రజలు, రైతులు పెద్దపప్పూరు : మండలంలోని మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లున్నా ఎలాంటి ప్రయోజనం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. నాయకుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో వందలకోట్ల వ్యయంతో నిర్మించిన మూడు తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లు నీరులేక నిరుపయోగంగా మారాయి. ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే పెద్దపప్పూరు మండలంలోని ప్రతి ఎకరా పంట పొలాలతో సస్యశ్యామలం అవుతుంది. 2005లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను చేపట్టారు. ఇందులో చాగల్లు ప్రాజెక్ట్ పనులు పూర్తవడంతో రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. దాదాపు రూ. 244 కోట్ల వ్యయంతో 1.5 టీఎంసీ కెపాసిటీతో ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్‌ను నీటితో నింపితే దాదాపు 10 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరతాయి. ప్రాజెక్ట్ కింద దాదాపు 6 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇప్పటి వరకు 1 ఎకరా ఆయకట్టుకు నీటిని అందించలేని దుస్థితి. రెండోది పెండేకల్లు ప్రాజెక్ట్. మండలంలోని కుమ్మెత వద్ద దీని నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. దాదాపు రూ.109 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం జరిగింది. ప్రాజెక్ట్ పూర్తయితే పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాలకు తాగు, సాగునీటికి ఉపయోగం. తాడిపత్రి మండలంలో భూసేకరణ పనుల్లో జాప్యం జరగడంతో ప్రధాన కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడోది ముచ్చుకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి దాదాపు 33 సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో దాదాపు రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు నీటి కేటాయింపులు లేకపోవడంతో రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది. రిజర్వాయర్‌కు నీరు చేరితే మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, నామనాంకపల్లి, చిక్కేపల్లితో పాటు పుట్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి అనుకూలం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయింపులు లేకపోవడంతో మూడు ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. అధికారులు, నాయకులు ప్రాజెక్ట్‌లను నీటితో నింపితే మండలంలోని అన్ని గ్రామాలు పాడిపంటలతో సస్యశ్యామలమవుతాయి. ప్రాజెక్ట్‌లను నింపాలి మండలంలోని చాగల్లు, పెండేకల్లు ప్రాజెక్ట్‌లతో పాటు ముచ్చుకోట రిజర్వాయర్‌ను నీటితో నింపాలి. ప్రాజెక్ట్‌లలో నీరు చేరితే అన్ని గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. నీరు లేక వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్‌లు నిరుపయోగంగా మారాయి. నాయకులు, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొవాలి. - రఘునాథరెడ్డి, రైతు, పెద్దపప్పూరు -
ఉల్లంఘనలన్నీ ఆంధ్రప్రదేశ్వే!
►అక్రమంగా నిర్మాణాలు చేస్తూ అభాండాలు వేస్తున్నారు.. ►కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై బోర్డుకు వివరణ ఇచ్చిన తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో తాము చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కొత్తవేనని, వాటికి కేంద్ర జల సంఘం, బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతుల్లేవంటూ ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ మరోమారు స్పందించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో ఉల్లం ఘనలకు పాల్పడుతున్నది ఏపీనే అని, తెలంగాణ ఎక్క డా ఉల్లంఘనలు చేయడం లేదని స్పష్టం చేసిం ది. ఇప్పటికే పాలమూరు –రంగారెడ్డి, డిండి, భక్త రామదాస, కల్వకుర్తి విస్తరణ, మిషన్ భగీరథలపై ఫిర్యాదు చేసిన ఏపీ, తాజాగా తుమ్మిళ్ల ఎత్తిపోతలపై ఫిర్యాదు చేయడం తెలంగాణ ఆగ్రహానికి కారణమైంది. తుమ్మిళ్ల ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు ఇటీవల రాష్ట్ర వివ రణ కోరిన నేపథ్యంలో స్పందిస్తూ అసలు వాస్తవాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. పాల మూరు, డిండి ఇతర ప్రాజెక్టులు కొత్తవి కావని ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు తెలిపామని, దానికి అపెక్స్ సైతం అంగీకరించి, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని ధ్రువీకరించినట్లు వివరించింది. ఏపీనే అదనపు మార్గాలు వెతుకుతూ పెద్ద మొత్తంలో కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకునే యత్నాలు చేస్తోందని ఆరోపించింది. ముచ్చుమర్రి, మున్నేరు బ్యారేజీ, శివభాష్యం సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలించే ఎత్తుగడలు వేస్తోందని తెలిపింది. మున్నేరు బ్యారేజీకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ముంపు ఉంటున్నా, వాటిని పట్టించుకోకుండా, ఆర్అండ్ఆర్ సమస్యలను పరిష్కరించకుండా, బ్యాక్ వాటర్ తీవ్రతను గణించకుండానే ఏపీ ఇష్టారీతిన చేపడుతోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ఉల్లంఘనలన్ని ఏపీ చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులపై అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడింది. తుమ్మిళ్ల కొత్తది కాదు.. రాష్ట్రం చేపడుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, ఆర్డీఎస్కు ఉన్న నీటి వాటాలను వినియోగించుకునేందుకు దీన్ని చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులను 1940ల్లోనే చేశారని, దీని కింద 87,500 ఎకరాల ఆయకట్టును నిర్ణయిం చారని వివరించింది. అయితే దశాబ్దాలుగా ఆర్డీఎస్ కింద సరాసరి వినియోగం 6 టీఎంసీ లను దాటలేదని, 30 వేల ఎకరాలకు మించి సాగవ్వడం లేదని దృష్టికి తెచ్చింది. ఈ దృష్ట్యానే నీరందని 55,600 ఎకరాలకు సాగు నీరు, దారిలోని గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో సుంకేశుల బ్యాక్ వాటర్ ఫోర్ షోర్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని తెలిపింది. ఇది కేవలం సప్టిమెం టేషన్ పథకమే తప్ప కొత్త ప్రాజెక్టు కాదని వివరణ ఇచ్చింది. -
‘దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది’
హైదరాబాద్: ప్రభుత్వ తీరు వల్ల సాగునీటి ప్రాజక్టుల్లో దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోనుందని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి వల్ల నల్గొండ, పాలమూరు జిల్లాల మద్య గొడవ జరగవచ్చునని అధికార పార్టీ ఎమ్మేల్యేలు అంటున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లే.. ప్రాజెక్టుల్లో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. డిండి, పాలమూరు ఒకే సోర్స్ ద్వారా నిర్మిస్తే దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి, కల్వకుర్తికి నీరు ఇవ్వకపోతే యుద్దం చేస్తామని హెచ్చరించారు. -
‘ఎత్తిపోతల’ పేరుతో దోపిడీ
- వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా - కోర్టును ఆశ్రయించి, న్యాయం పొందిన రైతులు అభినందనీయులు - ప్రభుత్వం కళ్ళు తెరవాలని హితవు సీతానగరం (రాజానగరం) : ఎత్తిపోతల పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో శుక్రవారం పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రభుత్వ పెద్దలు అందినకాడికి వేలాది కోట్లు దోచుకున్నారన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో తిరిగి దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందంటూనే మరోపక్క ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జేబులు నింపుకోవడానికే ఈ పథకాలని ఆరోపించారు. పోలవరం పూర్తయితే ఎత్తిపోతల పథకాలు దేనికని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకం పైపులైన్ మార్గంలో భూములు కోల్పొయే రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు భయాందోళనలకు గురి చేసి సంతకాలు చేయించారని విమర్శించారు. కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించి, న్యాయం పొందారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, తద్వారా రైతులు విజయం సాధించారని కొనియాడారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, ఆ చట్టం ప్రకారం వర్తించాల్సిన అంశాలను అమలు చేయాలని రాజా కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి వలవల రాజా, చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అంబటి రాజు తదతరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్
-
చంద్రబాబు చేసింది కరెక్టేనా?: వైఎస్ జగన్
అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభలో తాను మాట్లాడకూడదనే అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారని ఆయన మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. 80 శాతం ప్రాజెక్టుల పనులు చంద్రబాబు రాకముందే పూర్తయ్యాయని, మిగతా 20శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు. గండికోట, చిత్రావతి, పోతిరెడ్డిపాడు సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. మూడేళ్లయినా చంద్రబాబుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ధ్యాసే లేదన్నారు. శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమకు నీళ్లివ్వలేదని, అలాంటి మనిషి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికే పూర్తయిందని, ఇప్పటివరకూ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు. జల దినోత్సవం అంటూ సభలో చంద్రబాబు అరగంటసేపు ప్రకటన చేశారని, ఆ ప్రకటన రెచ్చగొట్టేలా ఉందని, కావాలనే పాత అంశాలను ప్రస్తావనకు తెచ్చారన్నారు. ఆ ప్రకటన ఆత్మస్తుతి, పరనిందలా ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, ప్రకటన సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌కు అవకాశం లేదని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అడిగితే సమయం ఇవ్వరా? మరి చంద్రబాబు చేసింది సరైనదేనా?అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక తాము సభలోకి వెళ్లామని, అప్పుడు కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రతిజ్ఞ చేయనివారు నీటిని సంరక్షించరా? అని అన్నారు. ఇక అనంతపురం పట్టభద్రుల స్థానం సహా నాలుగుచోట్ల తాము గెలిచామని, చదువుకున్న వారంతా తమకే ఓటు వేశారన్నారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఫలితాలు అని వైఎస్ జగన్ అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు పాల్పడ్డారని, కోట్లు వెచ్చించి ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. చంద్రబాబువి భారతంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాలే అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
ప్రాజెక్టులకు ప్రాధాన్యం..
► ప్రాణహిత, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు సింహభాగం ► కడెంకు అనూహ్యంగా రూ.207.72 కోట్లు ► లోయర్ పెన్‌గంగకు రూ.360కోట్లు ► కుమురం భీంకు రూ.150 కోట్లు ► కులాల వారీగా కేటాయింపుపై ఆయా వర్గాల్లో హర్షం ► వైద్య, విద్య సదుపాయాలకు కొత్త జిల్లాల వారీగా రూపొందని బడ్జెట్ ► రాష్ట్ర స్థాయి కేటాయింపులే కొత్త జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆధారం సాక్షి, మంచిర్యాల : రాష్ట్రంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతాంగంలో కొత్త ఆశలు నింపింది. జిల్లాలోని ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే చిన్న తరహా ప్రాజెక్టులకు సైతం ప్రభుత్వం గత బడ్జెట్ కన్నా అధిక మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రధానమైన ప్రాజెక్టులకు రూ.1804.13 కోట్లు కేటాయింపులు జరిపినట్లు బడ్జెట్ లెక్కలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాణహితకు రూ.775.44 కోట్లు, ఎల్లంపల్లికి రూ.397.97 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సాగునీటిని అందిస్తున్న కడెం ప్రాజెక్టుకు అనూహ్యంగా రూ.207.72 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన నిధులు కేవలం రూ.9.37 కోట్లు మాత్రమే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పనులు పూర్తయినప్పటికీ, భూసేకరణ, ఆర్అండ్ఆర్ కాలనీల అభివృద్ధి, ఇంటి అడుగు స్థలాలకు నష్టపరిహారం వంటి వాటి కోసం ఈ మొత్తాన్ని కేటాయించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కీలకమైన లోయర్ పెన్‌గంగ (కొరట, చణాకా) ప్రాజెక్టుకు సైతం అధిక నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు గతేడాది బడ్జెట్లో రూ.124.69 కోట్లు దక్కగా, ఈసారి బడ్జెట్లో ఏకంగా రూ.360 కోట్లు కేటాయించడం విశేషం. అలాగే కుమురం భీం జిల్లాకు సాగునీటి అవసరాలు తీర్చే కుమురం భీం ప్రాజెక్టుకు గత సంవత్సరం రూ.60 కోట్లు కేటాయించగా, దాన్ని ఈసారి రూ.150 కోట్లకు పెంచడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నిధులు లేక సగంలో ఆగిపోయిన నీల్వాయి ప్రాపెక్టుకు సైతం ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రూ.70 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించింది. ఇవి కాకుండా స్వర్ణ, సుద్దవాగు, మత్తడివాగు, ఎన్టీఆర్ సాగర్, జగన్నాథపూర్ పెద్దవాగు, ర్యాలివాగులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్లో రాష్ట్రంలోనే అధికంగా రూ.6,681.87 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లా పరిధిలో నిర్మాణం జరుగుతున్నప్పటికీ, దీనికోసం నిర్మించే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల గోదావరిలో నీటి నిల్వలు పెరిగి రైతాంగానికి ఉపయోగపడుతుందని మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల వల్ల మంచిర్యాల జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం అంతా సాగునీటికి ఢోకా ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. గత సంవత్సరం ప్రాణహిత, ఎల్లంపల్లి, కడెం వంటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయడం జరిగింది. ఈసారి కూడా అదే రీతిలో కేటాయించిన నిధులను విడుదల చేసి, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా... వెనుకబడిన కులాలు, ఇతర వర్గాలకు ఈ బడ్జెట్లో జరిపిన కేటాయింపుల పట్ల్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యుత్, రహదారుల అభివృద్ధి రంగాలకు మెరుగైన కేటాయింపులు జరపడంతో పరోక్షంగా ఉమ్మడి జిల్లాకు కూడా ఉపయోగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.6వేల కోట్ల వరకు కేటాయింపులు చేసింది. హైదరాబాద్, కరీంనగర్‌లలో సూపర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు జరిపిన సర్కార్ ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాలకు వైద్యపరంగా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కొంత నిరాశను కలిగించింది. గర్భిణులకు ఆర్థిక సహాయం, శిశువులకు అవసరమైన 16 వస్తువులతో కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ల వర్తింపు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను రూ.10,500కు పెంచడం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, ఎస్సీ, ఎస్టీలు, ఎంబీసీలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం వంటి అంశాలు సామాన్యులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. -
కేటాయింపు ఎంతో!
జిల్లాలోని మెట్టప్రాంత సాగునీటి పథకాలు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నాయి. డెల్టా ఆధునికీకరణ పనులు ముందుకుసాగడం లేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. అయినా సర్కారు శ్రద్ధ కనబరచడం లేదు. ప్రతిఏటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం 2017–18 బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సారైనా పూర్తిగా నిధులు కేటాయిస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కొవ్వూరు : జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో 15 సీట్లూ తమ పార్టీకి కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని, జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని పదేపదే వల్లెవేశారు. కానీ ఈ మూడేళ్లలో ఆయన జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గత బడ్జెట్లలో జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం శూన్యం. ఇంకా రెండేళ్లే సమయం ఉన్నందున ఈ సారైనా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారా అని ప్రజలు నిరీక్షిస్తున్నారు. జిల్లా రైతులపై శీతకన్ను పొరుగు జిల్లాకు నీటిని తరలించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,340 కోట్లతో ఆగమేఘాలపై పూర్తిచేసిన ప్రభుత్వం జిల్లా రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. మెట్ట ప్రాంత పథకాలపై శీతకన్ను వేసింది. దీంతో రైతుల నుంచి సర్కారు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘తాడిపూడి’ వ్యయం రెట్టింపు తాడిపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచింది. నిర్మాణ వ్యయంపై రూ.526.27 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు పెరిగింది. అధికారులు ఇటీవల కొత్త అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇప్పటి వరకు రూ.488.11 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.554 కోట్ల మేర నిధులు అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. 2015 బడ్జెట్లో రూ.70కోట్లు కేటాయించారు. వినియోగం కూడా అంతంతమాత్రంగానే జరిగింది. దీంతో గత ఏడాది రూ.55 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో కొత్త అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఏమేర ని««ధులు కేటాయిస్తుందో వేచిచూడాలి. డెల్టా ఆధునికీకరణపైనా చిన్నచూపు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణకు భారీ ఎత్తున నిధులు సమకూర్చారు. జిల్లాకు రూ.1,383.96 కోట్లు కేటాయించగా.. వీటిలో రూ.660 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయి. 2015–16 బడ్జెట్లో రూ.15కోట్లు, గత ఏడాది బడ్జెట్లో రూ.42.50 కోట్లు మాత్రమే జిల్లాకు కేటాయించారు. ఇంకా సుమారు రూ.720కోట్లకు పైగా పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. జిల్లాలో అత్యవసరంగా చేపట్టాలి్సన 188 పనులకు ప్రభుత్వం 92 జీవో జారీ చేసింది. దీనిలో 83 కాలువ పనులు, 105 డ్రెయిన్లుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటిలో 95 పనులకు గతంలో టెండర్లు పిలిస్తే కేవలం 32 పనులు పూర్తి చేశారు. ఇంకా 29 పనులు ప్రారంభం కాలేదు. ఎర్రకాలువ ఆ«ధునికీకరణదీ అదే దుస్థితి ఎర్రకాలువ ఆధునికీకరణ పనులకు రూ.104 కోట్లు కేటాయించారు. దీనిలో రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. దీనికి 2015లో రూ.150 కోట్లు కేటాయించగా, గత ఏడాది రూ.2.60 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవడంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలోనూ కోత కొత్త వ్యవయసాయ కనెక్షన్లలోనూ జిల్లాపై ప్రభుత్వం పక్షపాతం ప్రదర్శిస్తోంది. గత ఏడాది జిల్లాకు 1,800 కనెక్షన్ల మంజూరు మాత్రమే లక్ష్యంగా ఇచ్చారు. దీంతో ఆరునెలల నుంచి కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులులో ఉందని ప్రభుత్వం చెబుతున్నా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ బడ్జెట్లోనైనా అవసరమైన వారందరికీ కనెక్షన్లు కేటాయిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. డెల్టాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపు ఎలా ఉటుందోననే అంశంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చింతలపూడిపై ఏదీ కనికరం జిల్లాలోని మెట్టప్రాంత మండలాలకు సాగునీరు అందించే చింతలపూడి పథకం నిర్మాణ పనులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రూ.1,701 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి భూసేకరణతో కలిపి కేవలం రూ. 719.4 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా సుమారు రూ.982 కోట్లు అవసరం. 2015 బడ్జెట్లో రూ.22.03 కోట్లు, గత ఏడాది రూ.83 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. అదనంగా మరో 2.8 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రుపొందించిన రెండోదశకు ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,701 నుంచి రూ.4,909.80 కోట్లకు పెరిగింది. దీనికి సంబంధించి పరిపాలనా ఆమోదం లభించి ఏడు నెలులు కావస్తోంది. ఏడాది ఈ రెండో దశకు నిధులిస్తామని ఊరిస్తున్నా.. ఇప్పటివరకూ కేటాయించలేదు. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
అందుబాటుకే ఆదరణ
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సదుపాయాలు లేకపోయినా ఫర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. ధర అందుబాటులో ఉంటే చాలు. ఇంటి విస్తీర్ణం తక్కువైనా.. నిర్మాణం నాణ్యంగా ఉంటే కొనడానికి సిద్ధంగా ఉన్నామని కొనుగోలుదారులు అంటున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కోరుతున్నారు. ⇒ మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బడా డెవలపర్లు పునరాలోచనలో పడ్డారు. దిగ్గజాలైన నిర్మాణ సంస్థలు ఆర్థిక మాంద్యం దెబ్బతో నీరసపడ్డాయి. ప్రవాస భారతీయులు, ఐటీ నిపుణులు అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు జరపకపోవటమే ఇందుకు కారణం. దీంతో తక్కువ విస్తీర్ణం ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. ⇒ ఇప్పటిదాకా భారత స్థిరాస్తి సంస్థలు బ్యాంకులకు కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. కొంతమంది వద్ద యాభై శాతం ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. అమ్మకాల్లేక కుంగిపోవటం కంటే అందుబాటు ఇళ్లను నిర్మిస్తే నగదు లభ్యతకు ఇబ్బంది ఉండదనేవారు లేకపోలేదు. ఇందుకోసం పలు సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ⇒ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. విస్తీర్ణం తక్కువ గల ఫ్లాట్లను నిర్మించడానికి ప్రజయ్, జనప్రియ సంస్థలు ముందుకొచ్చాయి. కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.25 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువ. ⇒ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ నిపుణుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. మాంద్యం కనుమరుగు కావటంతో ఐటీ నిపుణులు అధికంగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. వీరికి స్థానిక అంశంతో సంబంధం లేదు. పైగా పుణె, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
ప్రాజెక్టుల పేరుతో అక్రమదందా!
-
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబే: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీ: "రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చంద్రబాబే చెప్పారు..అనుకూలంగా లేఖ కూడా ఇచ్చారు.ఇప్పుడెందుకు మళ్లీ నాటకాలు" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర విభజన విషయంపై ప్రజల మనోభావాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిల్లులు ఆమోదం పొందే సమయంలో తలుపులు మూయడం పార్లమెంట్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. దేవాదాయ చట్టానికి భిన్నంగా కేసీఆర్ మొక్కులు చెల్లించారని విమర్శించారు. ఏపీ స్పెషల్ స్టేటస్ కు టీఆర్ఎస్ మద్ధతు తెలపడం వారి ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా? అని ప్రశ్నించారు. "టీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టిందెక్కడ...కాంగ్రెస్ అడ్డుకున్నదెక్కడ?" అని ప్రశ్నించారు. ఉరితీయాల్సి వస్తే అది టీఆర్ఎస్నే తీయాల్సి ఉంటుందన్నారు. నిర్వాసితులకు అండగా నిలవడం ప్రాజెక్టులను అడ్డుకోవడమా? అదే నిజమైతే మిడ్ మానేరు నిర్వాసితులకు గతంలో కేసీఆర్ ఎలా అండగా నిలబడ్డారు? అని నిలదీశారు. -
'నీటి ప్రాజెక్టులు వైఎస్సార్ చలువే'
నిజామాబాద్: ఆంధ్రా, తెలంగాణలోని భారీ, మధ్య, చిన్న నీటి ప్రాజెక్టులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనని శాసనసభ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి చెప్పారు. సురేష్ రెడ్డి గురువారం ఉదయం భీమ్ గల్ మండలంలో నిర్మాణంలో ఉన్న వేముగంటి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో 50 శాతం నిధులు ప్రాజెక్టులకు కేటాయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. -
అపరభగీరథుడు వైఎస్సారే
- ప్రజల హృదయాల్లో ఆయనకు చెరగని స్థానం - ప్రాజెక్టుల గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయాలని బాబు ఆరాటం - విలేకరుల సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే నెహ్రూనగర్(పగిడ్యాల): దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం పథకం కింద 86 ప్రాజెక్ట్‌లను చేపట్టి అందులో 60 ప్రాజెక్ట్‌లకు పైగా పూర్తి చేసి అపరభగీరథుడిగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని ఎమ్మెల్యే వై. ఐజయ్య పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని నెహ్రూనగర్ మూర్వకొండ ఘాట్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. సింగోటం జాతరకు వెళ్లే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రాయలసీమకు జీవనాడీగా భావించే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వైఎస్ స్వప్నం అన్నారు. ఆయన హయాంలోనే పథకానికి శంకుస్థాపన చేసి సుమారు రూ. 120 కోట్ల పనులు పూర్తి చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. పనులు పూర్తి చేయకుండానే రెండుపంపులతో హడావుడిగా జనవరి 2న ముచ్చుమర్రిని జాతికి అంకితం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు ప్రస్తుతం కుల రాజకీయాలకు తెర లేపారని, అందుకు అనంతపురం ఎంపీ జేసీని పావుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన చేయని బాబు అపరభగీరథుడు ఎలా అవుతాడని విమర్శించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నందికొట్కూరు నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రబీ పంటలకు సాగునీరు ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు. రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టిరెడ్డి, పి. మధు, వాసు, బాషా, పక్కీరయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు
ఈ రైల్వే బడ్జెట్లోనూ జిల్లాకు ప్రాధాన్యం ఎంపీ తోట నరసింహం కరప: కాకినాడలో మూడు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు ఎంపీ తోట నరసింహం తెలిపారు. సోమవారం సాయంత్రం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలను కాకినాడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ » బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఈ ఏడాది సాధారణ, రైల్వే బడ్జెట్లు కలిపి పెట్టనున్నట్టు తెలిపారు. రైల్వే బడ్జెట్లో గత ఏడాది పిఠాపురం మెయి¯ŒSలైన్, కాకినాడ–నరసాపురం లై¯ŒSకు కేటాయించిన రూ.200 కోట్లతో పనులకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైల్వేమంత్రి సురేష్‌ప్రభును ఆంధ్రా మంత్రులు, ఎంపీలు కల్సి ఈ ఏడాదికూడా రైల్వేబడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై చర్చించామన్నారు. గత ఏడాది కేటాయించిన దానికి తగ్గకుండా నిధులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, దానికి ప్రజలు కూడా సహకరించారని చెప్పారు. తాను దత్తత తీసుకున్న బూరుగుపూడి రోల్‌మోడల్‌గా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలోని అన్నిప్రాంతాలవారినీ అక్కడకు పంపి, అలాచేసుకోవాలని సూచిస్తున్నారని చెప్పారు. కరప మండలంలోని దత్తత గ్రామమైన గొర్రిపూడిని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తానన్నారు. ఉపాధి అనుసంధానంతో ఇప్పటికే రూ.70 లక్షలు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, మండల టీడీపీ అధ్యక్షుడు దేవు మధువీరేష్, జిల్లా క్రికెట్ అసోషియేష¯ŒS ఉపాధ్యక్షుడు దేవు మధువీరేస్ తదితరులు ఎంపీ వెంట ఉన్నారు. -
కరువు.. చంద్రబాబు అవిభక్త కవలలు
నందిగామ రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం కంచికచర్ల మండల పరిధిలోని పలు గ్రామాలలో నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోందని, నాటి నుంచి రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలంటూ నానా హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తి అసమర్థ పాలన సాగుతోందని చెప్పారు. దివంగత వైఎస్సార్ 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని తన గొప్పగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఇక్కడి సమస్యలు పరిష్కరించడం చేతకాని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పులివెందులకు నీరిస్తానని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. -
కరువుకు ఫ్యాంటు, షర్టు వేస్తే అది చంద్రబాబే!
-
కోట్లు దండుకుంటున్నారు: రోజా
హైదరాబాద్: మహానేత వైఎస్ఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించి.. చంద్రబాబు ఫోటోలకు ఫోజులిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిస్తే, దేవినేని ఉమ వదినకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. -
పైడిపాలెం ప్రాజెక్టు వైఎస్ఆర్ పుణ్యమే
-
ఆ ప్రాజెక్టుల ఘనత వైఎస్సార్‌దే
-
జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపిక
– రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు ఎంపిక – జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపిక కర్నూలు సిటీ: విజయవాడలో ఈనెల 3,4 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని, ఇందులో జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. నగరంలోని ఇండస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఉమ్మెసల్మా, సిస్టర్స్టాన్సిలా పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సౌమ్య ప్రదర్శించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆ విద్యార్థినులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా అభినందించాయి. -
సాగు లక్ష్యాలపై ‘జల’ మథనం!
సాగునీటి ప్రాజెక్టు అధికారులతో రేపు నీటిపారుదల శాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయడం, నీటి వినియోగ సామర్థ్యం మెరుగపర్చడం, ఆయకట్టు లక్ష్యాలను అనుకున్న సమయానికి వృద్ధిలోకి తేవడం లక్ష్యంగా వచ్చే ఏడాదికి కార్యాచరణ సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణరుుంచింది. ఈ మేరకు ఈ నెల 6న నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించనుంది. ఒక్కో ప్రాజెక్టు కింద నెలవారీగా చేయాల్సిన పనులు, అవసరమైన బడ్జెట్, వివిధ శాఖలతో సమన్వయం, ఆయకట్టు లక్ష్యాలు తదితరాలపై చర్చించనున్నారు. నెలవారీ ప్రణాళికతో రావాలని చీఫ్ ఇంజనీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన పరీవాహకానికి నీరు పారించేందుకు రూ.1.38లక్షల కోట్లతో 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. వీటి ద్వారా 67.53లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణరుుంచారు. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల్లో పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. 2016-17కు గానూ రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులు పూర్తిగా, 11 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేసి, వీటి ద్వారా మొత్తం 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణరుుంచింది. ఇందులో ప్రధానంగా ఎల్లంపల్లి కింద 60వేలు, ఎస్సారెస్పీ-2 కింద 20వేలు, నెట్టెంపాడు కింద 1.47లక్షలు, భీమా కింద 1.25లక్షలు, కల్వకుర్తి కింద లక్ష, దేవాదుల కింద 80వేల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా నిర్ణరుుంచారు. మొత్తం ఆయకట్టు లక్ష్యం 67.53లక్షల ఎకరాలతో చూస్తే మరో 56.58 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది పూర్తికాని లక్ష్యం 5లక్షల ఎకరాలతో పాటు, వచ్చే ఏడాదికి ముందుగానే నిర్ణరుుంచిన లక్ష్యం మరో 5.55లక్షల ఎకరాలు కలిపి 10.55లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంది. -
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి - వైఎస్ జగన్ ఎదిగే నాయకుడు - విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ ఎమ్మిగనూరు: సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చి జిల్లాలోని ఆయకట్టుకు పుష్కలంగా నీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూశాఖా మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎమ్మెల్యే డా.బి. జయనాగేశ్వరరెడ్డితో కలసి ఆదివారం ఆయన ఎమ్మిగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా డోన్, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందుతోందన్నారు. ఈ ప్రాజెక్టు కాలువ విస్తరణకు రూ.1300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగే నాయకుడని, ఆయనకు మరింత భవిష్యత్తు ఉందన్నారు. అయితే ఇప్పటి నుంచే సీఎం కుర్చీపై కాకుండా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. రాష్ట్రాన్ని దారుణంగా విడగొట్టిన పాపం కాంగ్రెస్‌దని, ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడేమో రైతుల కోసం పోరాడుతున్నట్లు కవరింగ్ ఇచ్చుకునేందుకు డిల్లీ నాయకులతో సమావేశాలు పెట్టారని ఎద్దేవా చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పిన కేఈ.. అందువల్లే అంబూజ, సోలార్జీ, ఏరోడ్రమ్ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ఎమ్మిగనూరులో ఇండోర్ స్టేడియం, నందవరం రెవెన్యూ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్పర్సన్ పుష్పావతి, ఎంపీపీలు నరసింహారెడ్డి, శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, మార్కెట్‌యార్డు చైర్మన్ సంజన్న, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈరన్నగౌడ్, దేశాయ్మాధవరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు విక్రమ్‌కుమార్‌గౌడ్, ఆర్డీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
18న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల18వ తేదీన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల స్కూల్ నుంచి ఒక సైన్స్ గైడ్ టీచర్, విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి స్కూల్ ఈ ప్రదర్శనలలో పాల్గొవాలని ప్రాజెక్టును ఠీఠీఠీ.nఛిటఛి.ఛిౌ.జీn అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డిలను 9948605546, 8790111331 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సీమ ప్రాజెక్టులపై చిన్నచూపు
– సిద్ధేశ్వరం తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం – రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కోవెలకుంట్ల: రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాయలసీమ జేఏసీ కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ ఆరోపించారు. గుండ్రేవుల, గురురాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కోవెలకుంట్ల జేఏసీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో పట్టీసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సార్బీసీపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సీమలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లేకపోవడం విచారకరమన్నారు. తగినన్నీ రిజర్వాయర్లు లేక కేసీకి కేటాయించిన 39.9 టీఎంసీల నీటిని కూడా సీమ రైతులు వాడుకోలేకపోతున్నారన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం రిజర్వాయర్లను పూర్తి చేయకపోవడంతో నీరు నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వేల ఎకరాల అటవీ భూములకు యుద్ధప్రాతిపదికన అనుమతులు తెచ్చిన ప్రభుత్వం అవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న అటవీశాఖ భూముల నుంచి అనుమతి లభించలేదని పెండింగ్‌లో ఉంచడం దుర్మార్గమైనచర్యగా అభివర్ణించారు. కుందూనదిపై జోళదరాశి వద్ద 0.8 టీఎంసీ, రాజోలి వద్ద 3 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ల ఏర్పాటుకు రూ. 533 కోట్లు నిధులు మంజూరైనా నిర్మాణాలను పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సిద్ధేశ్వరం ఉద్యమ తరహాలో మరో పెద్ద ఉద్యమానికి జేఏసీ సిద్ధమవుతోందని హెచ్చరించారు. కుందూపోరాటసమితి, రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ జేఏసీ, ఇతర రైతు సంఘాలతో రైతు చైతన్య పరిచే యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు పాల్గొన్నారు. -
బెదిరింపులతో భూములు లాక్కుంటారా..?
అంగీకారం లేకుండా ప్రాజెక్టులను నిర్మించడం దుర్మార్గం డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తారా? ప్రజాభిప్రాయాన్ని గౌరవించరా? 2013 చట్టం ద్వారానే భూసేకరణ జరపాలి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో మల్లన్నసాగర్ ముంపు బాధితుల దీక్షలకు సంఘీభావం తొగుట: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపువాసులు చేపడుతున్న రిలే దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. గ్రామాల మధ్య 50 టీఎంసీల రిజర్వాయర్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టు డిటెయిల్డ్ రిపోర్టు తయారు చేయకుండానే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముం దుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల అం గీకారం లేకుండా ప్రాజెక్టులు నిర్మించడం దుర్మార్గమని మండిపడ్డారు. 123 జీఓతో భూసేకరణ చేయడమంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని ప్రజలు కోరినా ప్రభుత్వం ముందుకు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టంతో ప్రజలకు ఏ విధంగా నష్టమో స్పష్టం చేయాలన్నారు. ప్రభుత్వం మాట వినని ప్రజలపై 144 సెక్షన్ విధించి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులతో బెదిరింపులకు గురి చేసి భూములు లక్కోవడం దుర్మార్గమన్నారు. భూములన్నీ గుంజుకుని బహుళజాతి సంస్థలకు కట్టబెడతారా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టంలో నిరుపేదలకు అన్ని విధాలా హక్కులున్నాయని చెప్పారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అంటూ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రా జెక్టులు, పరిశ్రమల పేరిట భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీ జేఏసీ కోకన్వీనర్ పిట్టల రవీందర్, నిజాం కళాశాల ప్రొఫెసర్ పురుషోత్తం, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు రమేశ్, విద్యా సంస్థల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అమరేందర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
30, 35, 42 నింగిని తాకే నిర్మాణాలు
• 30.. ఆపైన అంతస్తుల్లో నివాసానికి కస్టమర్ల మొగ్గు • నిర్మాణానికి సిద్ధంగా 50కి పైగా ప్రాజెక్ట్‌లు 20, 25, 30, 42.. ఇవి కేవలం అంకెలేం కావు.. నగరంలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాల్లోని అంతస్తులు. ఒకప్పుడు 15 ఫ్లోర్ల భవనాలంటేనే అమ్మో అనిచూసే నగరవాసులిప్పుడు.. ఏకంగా 30 ఆపైన అంతస్తుల్లో నివాసానికే సై అంటున్నారు. దీంతో బిల్డర్లు ఎత్తై భవనాల నిర్మాణాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో భాగ్యనగరం ఆకాశహర్మ్యాలకు వేదికవుతోంది. సాక్షి, హైదరాబాద్ : స్థలాల లభ్యత క్రమంగా తగ్గుతుండటమే ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈ తరహా నిర్మాణాలు కొరియా, హాంకాంగ్, చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో ఎప్పుడో మొదలయ్యాయి. కానీ, హైదరాబాద్‌లో ఎత్తై నిర్మాణాలకు బీజం పడింది మాత్రం 2006లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లాట్ల విస్తీర్ణం, రోడ్డు వెడల్పును బట్టి నగరంలో ఎంత ఎత్తుకైనా నిర్మాణాల్ని చేపట్టేందుకు వీలుగా 86 జీవోను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణాలు మొదలయ్యాయి. అనుమతులూ త్వరగానే.. ఏటా నగరంలో ప్రభుత్వ విభాగాలు 8-10 వేలకు పైగా నిర్మాణాలకు అనుమతులిస్తున్నాయి. వీటిలో చిన్నా చితక నిర్మాణాలతో పాటు అపార్ట్మెంట్లు, ఆకాశహర్మ్యాలుంటాయి. నగరంలో ఇప్పటివరకు 20 అంతస్తుల భవంతులు తక్కువే. ఎత్తై భవనాల నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీ అనుమతితో పాటు అగ్నిమాపక ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), విమానాశ్రయ విభాగాల నుంచి కూడా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల అనుమతులు రావటానికి చాలా సమయం పట్టేది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఒకే ఒక్క ఎన్ఓసీ విధానం, సత్వర అనుమతులకు ఆన్లైన్ విధానం తీసుకురావటం వంటి నిర్ణయాలు తీసుకోవటంతో నిర్మాణదారులు కూడా ఎత్తై నిర్మాణాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 20 అంతస్తులకు మించినవి.. ప్రస్తుతం నగరంలో 20 అంతస్తులకు మించిన భవనాలను నిర్మించేందుకు 50కి పైగా ప్రాజెక్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇవి ఎక్కువగా పశ్చిమ ప్రాంతాల్లోనే వస్తున్నాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ, ఖాజాగూడ, కూకట్పల్లి, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ హైటెక్ సిటీ సమీపంలో మరీనా స్కైస్ పేరిట 31 అంతస్తుల్లో, గచ్చిబౌలిలో సుమధుర సంస్థ అక్రోపొలిస్ పేరిట 31 అంతస్తుల్లో నివాస సముదాయాలను నిర్మిస్తున్నాయి. ఇవే కాకుండా లోధా గ్రూప్ 42, ల్యాంకోహిల్స్ 36, సాకేత్ ఇంజనీర్స్ 25, మంజీరా 23, మంత్రి 24 అంతస్తుల్లో ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో స్థలాల లభ్యత తక్కువ. దీంతో స్థలం ఉన్న చోట్ల సాధ్యమైనంత ఎత్తులో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి శివారు ప్రాంతాల్లో స్థలాల లభ్యత ఎక్కువే కానీ, కొనుగోలుదారుల ఆసక్తి మేరకు ఆయా ప్రాంతాల్లోనూ 60 మీటర్ల కంటే ఎత్తై నిర్మాణాలొస్తున్నాయి. మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే.. ఇదిలా ఉంటే ఆకాశహర్మ్యాలు నిర్మించాలంటే నిర్మాణానికి తగ్గట్టుగానే పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని బిల్డర్లు చెబుతున్నారు. స్థలాల కొరత ఉన్న మహానగరాల్లో ఈ నిర్మాణాలే పరిష్కారమార్గమని సూచిస్తున్నారు. ఎత్తై నిర్మాణాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఉండేలా నిర్మాణంలో నాణ్యత పాటించడం ఆవశ్యకం. మరోవైపు ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు 6వ అంతస్తు పైనుంచి ప్రతి చ.అ.కు రూ.10-15 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 10 అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది. ఎత్తులో నివాసముంటే.. ⇔ ఆకాశహర్మ్యాల్లో నివాసముంటే అనుకూల, ప్రతికూలాలున్నాయి. ⇔ పై అంతస్తుల్లో నివసించే వారు బాల్కనీలోంచి చూస్తే నగరం మొత్తం కనిపిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ⇔ గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి. ⇔ పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ⇔ పర్యావరణ సమస్యలు, ధ్వని కాలుష్యం ఉండదు. ⇔ పై అంతస్తులో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యుత్ వినియోగం పెరిగి.. బిల్లూ పెరుగుతుంది. ⇔ తరచూ ఇళ్లు మారేవారికి సామగ్రి తరలించడం ఇబ్బందిగా ఉంటుంది. -
పర్యాటకాభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు
రాష్ట్ర పర్యాటకా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాంత్ వైనతేయ తీర ప్రాంతాల పరిశీలన అమలాపురం టౌన్ / ఉప్పలగుప్తం : జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల ద్వారా పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వెల్లడించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి శ్రీకాంత్ అల్లవరం మండలం వైనతేయ నదీ తీర గ్రామాలైన బోడసకుర్రు, గోడితిప్ప, ఎస్.యానాం తీరంలోని బోట్ షికారుకు అనువుగా ఉన్న పర్ర ప్రాంతం, రిసార్ట్స్‌లకు అనువుగా ఉన్న ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. జిల్లాలో పర్యాటకానికి అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్న కార్యక్రమంలో భాగంగా రాజప్ప శ్రీకాంత్‌ను వైనతేయ నదీ పరివాహాక ప్రాంతాలను చూపించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో హోప్ ఐలెండ్, ఏజెన్సీ, అఖండ గోదావరి, కోనసీమ ఈ నాలుగు విభాగాల్లో నాలుగు పర్యాటక ప్రాజెక్టులను రూపొందిస్తున్నామన్నారు. కేరళలో పర్యాటకాభివృద్ధికి ధీటుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు అనేకం ఉన్నాయన్నారు. మడ అడవులు, సముద్ర తీరం, అఖండ గోదావరి, హోప్ ఐలెండ్ తదితర అందాలపై దృష్టి పెడితే పర్యాటకాభివృద్ధేకాక, ఆదాయం పెరుగుతుందన్నారు. టెంపుల్ టూరిజానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రైవేట్ రంగం ద్వారా జిల్లాలో రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసే యోచన ఉందన్నారు. 7 స్టార్, 5 స్టార్ స్థాయి రిసార్ట్స్‌ను నెలకొల్పేందుకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్ యానాంలోని రవ్వ చమురు క్షేత్రంలోని కెయిర్న్ ఎల్క్యూలో కెయిర్న్ అధికారులతో బీచ్ అభివృద్ధి్ద విషయమై చర్చించారు. రూ.300 కోట్లతో పర్యాటక అభివృద్ధి: హోంమంత్రి చిన రాజప్ప జిల్లాలో రూ.300 కోట్లతో పర్యాటక అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. ఇప్పటికే రూ.70 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. కాకినాడ నుంచి అంతర్వేది వరకూ ఉన్న బీచ్‌లను కూడా అభివృద్ధి చేయనున్నామని రాజప్ప తెలిపారు. కేరళ నుంచి వచ్చిన టూరిజం కన్సల్టెంట్ సిడిరక్, అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి భీమశంకరం, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, అల్లవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గునిశెట్టి చినబాబు, ఎంపీపీ గుబ్బల మాతా కస్తూరి పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి కె రామాంజనేయులు డిమాండ్ ఆత్మకూరు: రాయలసీమ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటిప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, సిద్ధాపురం చెరువు, తెలుగు గంగ ప్రాజెక్టులను శనివారం సీపీఐ బందం పరిశీలించింది. అంతకు ముందు మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివద్ధి చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన సీమ జిల్లాలను కూడా పట్టించుకోవాలని కోరారు. 10 ఏళ్లుగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ఈ పథకం పూర్తయితే 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భారీ నీటిపారుదలశాఖ మంత్రిని ఈ నెల 3న కలిసి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకువస్తామన్నారు. స్పందించకపోతే రాయలసీమ రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు రసూల్, బాబా ఫకద్ధిన్, పద్మన్రాజు, రఘురాంమూర్తి, ఏఐఎస్ఎప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి
-
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలాజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు స్పష్టమైన సాగునీటి ప్రణాళిక లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండినా కరువు ప్రాంతాలకు నీరు తరలించలేదని ఆరోపించారు. అనంతపురానికి 20 టీఎంసీల నీటిని వెంటనే తరలించి హెచ్ఎల్సీ ఆయకట్టును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు
ఏలూరు: జిల్లాలో ప్రజల సౌకర్యార్థం భారీ మంచినీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ.750 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గహంలో మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని భారీరక్షిత మంచినీటి పథకాలు చేపట్టాలన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో కొండపై ఓహెచ్ఎస్ఆర్ ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రావిటీ మీద ప్రజలకు రక్షితనీరు అందేలా చేపట్టిన పథకం బాగుందని, ఇదే విధానాన్ని అనుసరించి మరిన్ని నూతన భారీ మంచినీటి పథకాలకు రూపకల్పన చేయాలని అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
63 టీఎంసీలు గోదావరి పాలు
-
రబీలో పూర్తిస్థాయిలో నీరు
వర్షాలతో రాష్ట్రమంతా జలకళ.. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాల్కొండ : రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్ట్‌ల పూర్తి ఆయకట్టుకు రబీలో నీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్లతో కలిసి ఆయన ఎస్సారెస్పీని సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రబీలో ఎలాంటి షరతులు లేకుండా ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీటిని అందిస్తామన్నారు. ఖరీఫ్‌లో రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందించినట్లుగానే రబీలోనూ అన్ని రకాల విత్తనాలను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసి వాగులు, చెరువులు తెగడం వల్ల పంటలకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన చండీయాగం ఫలితంగానే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయ ఫలితాలు రైతులకు అందుతున్నాయన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఆర్డీవో యాదిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పంటల పరిశీలన ఆర్మూర్అర్బన్ : రాంపూర్ గ్రామాన్ని మంత్రి పోచారం స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి సందర్శించారు. రాంపూర్‌లో చెరువు ఉప్పొంగి మత్తడి ద్వారా వచ్చిన నీటితో పంటలు నష్ట పోయిన ప్రాంతాన్ని, మాటు కాలువకు పడిన గండిని పరిశీలించారు. గండి పడిన కాలువలు, తూములు, బ్రిడ్జీలకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు శాశ్వత మరమ్మతులు చేపడతామన్నారు. ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాటు కాలువలు కొట్టుకుపోతున్నా ఇరిగేషన్ ఏ ఈ నర్సింగ్ ఒక్కసారి కూడా పరిశీలించడానికి రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో ఏఈపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం ఆర్మూర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. సోమవారం ఆయన మామిడిపల్లిలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. వర్షాల వల్ల రాష్ట్రంలో లక్షా 30 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయన్నారు. అధికారులు పూర్తి స్థాయి నివేదిక సమర్పించాక నష్టం తీవ్రత తెలుస్తుందన్నారు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని 78 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 46 మైన ర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయన్నారు. చెరువుల్లోనే 5 కోట్ల 67 లక్షల హె క్టార్ల విస్తీర్ణంలో నీళ్లు నిలిచాయన్నారు. దీం తో రెండు పంటలకు నీళ్లు అందించవచ్చన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో అందరినీ అప్రమత్తం చేయడం వల్ల పెద్దగా ప్రాణనష్టం, ఆర్థిక నష్టం సంభవించలేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఎల్ఎంబీ రాజేశ్వర్, సంజయ్ సింగ్ బబ్లూ, రాజబాబు, శ్రీనివాస్, నర్సయ్య, రమాకాంత్, రమేశ్, గంగార్, గంగారెడ్డి, పండిత్ ప్రేమ్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
63 టీఎంసీలు గోదావరి పాలు
బాల్కొండ : భారీ వరదలతో ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రెండు ప్రాజెక్టుల ద్వారా 63 టీఎంసీల నీరు గోదావరి పాలయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద కొనసాగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతాలనుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 41 గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. శనివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు 50 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అంటే ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యంలో సగానికంటే ఎక్కువ నీరు గోదావరి పాలైందన్నమాట. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1,090(84 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. 17.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.. ఎస్సారెస్పీ జెన్కో గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2 వేల క్యూసెక్కుల నీరు కాకతీయ కాలువ ద్వారా, 2 వేల క్యూసెక్కుల నీరు ఎస్కేప్ గేట్ల ద్వారా వదులుతున్నారు. దీంతో జల విద్యుతుత్పత్తి కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా 17.34 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. పర్యవేక్షిస్తున్న అధికారులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రాజెక్ట్ వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి , తహసీల్దార్ పండరీనాథ్ పర్యవే క్షణ చేస్తున్నారు. నిజాంసాగర్‌లోకి 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంద ని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 19 వరదగేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా ఆదివారం సాయంత్రంనుంచి సోమవారం సాయంత్రం వరకు 13 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సింగితం రిజర్వాయర్‌లోకి 2,500 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 416 మీటర్లతో నిండుకుండలా ఉంది. అదనంగా వస్తున్న వరదనీరు అలుగుపై నుంచి పొంగిపొర్లుతోంది. కళ్యాణి ప్రాజెక్టు రెండు వరదగేట్ల ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మండలంలోని నల్లవాగు మత్తడి దుంకుతోంది. మత్తడికి 8,500 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో అంతే నీరు మత్తడి అలుగెల్లుతోంది. రామడుగులోకి.. ధర్పల్లి : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టు అయిన రామడుగులోకి సోమవారం 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,278.30 అడుగులతో నిండుగా ఉంది. అధిక నీరు అలుగుపైనుంచి ఔట్‌ఫ్లోగా వెళ్తోంది. కొనసాగుతున్న కౌలాస్‌నాలా నీటి విడుదల జుక్కల్ : కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంనుంచి నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్టు జేఈ గజానన్ తెలిపారు. దీంతో ఒక గేటు ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల(1.2 టీఎంసీలు)తో నిండుగా ఉంది. -
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు
హైదరాబాద్ : భారీ వర్షాలుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండకుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తడంతో అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. తెలంగాణలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుతం 1402.50 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1,16,000 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో లక్షా 3 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఇదే జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1088.60 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 403,462 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో లక్షా 3, 52, 628 క్యూసెక్కులుగా ఉంది. కరీంనగర్ జిల్లా : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 485 అడుగులు కాగా... ప్రస్తుతం 481.63 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్‌ఫ్లో 5,27,662 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,27,662 క్యూసెక్కులు ఉంది. మెదక్ జిల్లా: సింగూర్ ప్రాజెక్టులో జలకళ నెలకొంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1717 అడుగులు, ప్రస్తుతం 1716.96 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 79 వేల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 95 వేల క్యూసెక్కులు ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం1045 అడుగులు కాగా ప్రస్తుతం 1044.06 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,45,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,42,857 క్యూసెక్కులు ఉంది. కర్నూలు జిల్లా : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగులు నీరు ఉంది. ఇన్ ఫ్లో 1,40,592 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 77,282 క్యూసెక్కులు ఉంది. నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, కాగా.. ప్రస్తుతం 520.20 అడుగులకు నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 68,511 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 1350 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఇదే జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 163.71 అడుగులకు నీరు వచ్చి చేరింది. -
గోదావరి పరుగులు... కృష్ణమ్మ ఉరకలు
గోదావరి బేసిన్లో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత - ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరద సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు కొనసాగుతుండటం తో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగుతున్నాయి.మంగళవారం భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో నదీ తీర ప్రాంత గ్రామాలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో నీటినిల్వ 192.53 టీఎంసీలకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారం ఉదయం అధికారులు శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. గోదావరి ఉగ్రరూపం: గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు వంటి భారీ, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆదివారమే ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తింది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను ఆ రాష్ట్రం ఎత్తడంతో ఎస్సారెస్పీకి సోమవారం సాయంత్రం 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇక ఎల్లంపల్లికి 3.63 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3.70 లక్షల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక సింగూరుకు లక్ష క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా, 80 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ఈ నీరంతా నిజాంసాగర్‌కే చేరుతుండటం, దీనికి స్థానిక ప్రవాహాలు జత కావడంతో నిజాంసాగర్‌కు 1.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 99 వేల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. మరోవైపు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు వంటి ఉప నదులు ఉప్పొంగుతోండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 27.5 అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరం బ్యారేజీకి 2.42 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. డెల్టాకు విడుదల చేయగా మిగిలిన 2.41 లక్షల క్యూసెక్కుల (20.3 టీఎంసీలు)ను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 2,139.4 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలయ్యాయి. నిండేందుకు సిద్ధంగా శ్రీశైలం: మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలతో సోమవారం కృష్ణా నదికి వరద మరింత పెరిగింది. ఆలమట్టి, నారాయణపూర్ నుంచి భారీ ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జూరాలకు 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 1.42 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రానికి నీటి నిల్వ 192.53 టీఎంసీలకు చేరుకుంది. మరో 23.27 టీఎంసీలు వస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండుతుంది. శ్రీశైలం ఎడమ, కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 77,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 74,148 క్యూసెక్కులు చేరుతుండటంతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 147.46 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే మరో 164.59 టీఎంసీలు అవసరం. భారీ స్థాయిలో వరద వస్తేనే ఇది నిండే అవకాశం ఉంటుంది. -
జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి
-
జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి
మొయినాబాద్: జంట జలాశయాలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల తరువాత గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతో కొత్తనీటి కళకళలు చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు. 2010లో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదిలారు. అప్పట్లో జలాశయాలను చూసేందుకు సందర్శకులు భారీగా వచ్చారు. జలాశయాల కట్టలపై నుంచి కొత్తనీటిని చూస్తూ.. జలాశయం అందాలను సెల్ఫోన్లలో బందిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. పది రోజులకు పైగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి వరదనీరు పోటెత్తింది. గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1,779 అడుకులకు చేరింది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.5 అడుగులు కాగా 1,743 అడుగులకు చేరింది. ఈసీ వాగులో భారీగా వరద వచ్చింది. దీంతో సోమవారం ఉదయానికి మరో రెండు అడుగులకు పైగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. -
ప్రాజెక్టులు కళకళ
- గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహాలు - జూరాల, ఎస్సారెస్పీ, సింగూరుకు పోటెత్తుతున్న వరద - జూరాలకు 85 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - శ్రీశైలంలో 164 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ - నిండుకుండలా సింగూరు.. 3 గేట్లు ఎత్తివేత - ఎస్సారెస్పీలో 56.6 టీఎంసీల నీరు - పూర్తిగా నిండిన ఎల్లంపల్లి, కడెం - శుక్రవారం ఒక్కరోజే అలుగుపారిన 3 వేలకుపైగా చెరువులు సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇటు రాష్ట్రంలో, అటు ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ పూర్తిగా నిండాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతుండడంతో ఆ నీరంతా జూరాల వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే జూరాల నుంచి 41 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ, సింగూరుకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. సింగూరు నిండు కుండను తలపిస్తోంది. జూరాలకు వరదే వరద జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి నీటిని దిగువకు వదిలేస్తుండటం, జూరాల పరీవాహక ప్రాంతంలోనూ విసృ్తతంగా వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఇక్కడ్నుంచి పవర్హౌజ్కు 40 వేల క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 310 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి కూడా భారీగా వరద వస్తోంది. ఇక్కడ్నుంచి ఏపీ, తెలంగాణ మొత్తంగా 9,243 క్యూసెక్కుల నీటిని వివిధ ప్రాజెక్టుల అవసరాలకు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలంలో 215.8 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వకుగాను ప్రస్తుతం 164.75 టీఎంసీల నీరుంది. ఇక్కడ్నుంచి నాగార్జునసాగర్‌కు 9,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం సాగర్‌లో నీటి లభ్యత 139.26 టీఎంసీలకు చేరింది. సింగూరులో 22 టీఎంసీల నిల్వ గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్, సింగూరు, క డెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టు, నీల్వాయి, సాత్నాలతోపాటు ఖమ్మంలోని తాలిపేరు, కిన్నెరసాని వంటి మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా అడుగంటిన సింగూరుకు ప్రస్తుత వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి. సింగూరులోకి 74 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.09 టీఎంసీల నిల్వ ఉంది. శుక్రవారం రాత్రి మూడు గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. ఇక ఎస్సారెస్పీకి 54 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 14 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56.6 టీఎంసీల నిల్వ ఉంది. కాగా ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు పూర్తిస్థాయి మట్టాలకు చేరాయి. వీటికి కూడా వరద వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. గోదావరి బేసిన్ పరిధిలోని చెరువులకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఒక్క రోజే 3 వేలకు పైగా చెరువులు అలుగు పారినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
నల్గొండలో ముంచెత్తిన వాన
-
ముంచెత్తిన వాన
రాష్ట్రవ్యాప్తంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు - పలు గ్రామాలకు రాకపోకలు బంద్ - నల్లగొండ జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న మూసీ - వందల ఎకరాల్లో పంట నష్టం - బీబీనగర్- పోచంపల్లి మధ్య రాకపోకలు బంద్ - వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ వానలు - వరంగల్ జిల్లాలో వాగు దాటుతూ యువకుడు గల్లంతు సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రధాన రహదారులపైనా రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. నల్లగొండ జిల్లాలో కుండపోత వానలతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరంగల్ జిల్లాలో వాగులో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. నల్లగొండ నిండా నీళ్లు నల్లగొండ జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం కురిసిన భారీ వర్షానికి పలు పట్టణాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పిడుగురాళ్ల-గుంటూరు మధ్యలో రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో జిల్లా మీదుగా నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. ఇక ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో డిండి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పోచంపల్లి, బీబీనగర్ మధ్య.. పోచంపల్లి చెరువు అలుగుపోయడంతో రేవనపల్లి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టంగూర్ మండలంలోని చెరువులు, కుంటలన్నీ అలుగుపోస్తున్నాయి. ఈదులూరు, ఆరెగూడెం, పందెనపల్లి గ్రామాల్లో వరి నీట మునిగింది. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నుండి ఐదు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కేతేపల్లి-కొత్తపేట మధ్య మూసీ ప్రాజెక్టు కుడి కాల్వకు గండిపడింది. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద ఉన్న పులిచింతల ప్రాజెక్టులోకి ఏకంగా మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రాజెక్టు ముంపు గ్రామాలైన చింతిర్యాల, రేబల్లె, అడ్లూరు, వెల్లటూరు, నెమలిపురి వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం, పాలమూరుల్లో ప్రాజెక్టులు ఫుల్ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు దాదాపు నిండాయి. గురువారం పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో 7 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇల్లెందు మండలం గుండాలలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో తెల్కపల్లి మండలం తాళ్లపల్లి, నడిగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెల్కపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌కు వెళ్లే మార్గంలోని దేవమ్మ చెరువు పొంగి పొర్లుతోంది. నడిగడ్డలో గుట్టలపల్లి దుందుబీ వాగు పొంగి ప్రవహిస్తోంది. వాన ధాటికి మానవపాడు మండలంలో పలు ఇళ్లు కూలిపోయాయి. పొంగి ప్రవహిస్తున్న వాగులు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నవీపేట, ఎడపల్లి, భీంగల్ మండలాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. లింగంపేట మండలంలో పెద్దవాగు, పాముల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. మద్నూర్ మండలంలో లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి లోలెవల్ వంతెన నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా గురువారం 11 ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిజాంసాగర్‌లోకి నీరు వచ్చి చేరుతోంది. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరంగల్‌లో యువకుడు గల్లంతు వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. హన్మకొండలో లోతట్టు ప్రాం తాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు నీట మునగడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. చిట్యాల మండలం టేకుమట్ల గ్రామ శివారులో చలివాగును దాటుతూ.. మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగ మహేష్ (19) అనే యువకుడు గల్లంతయ్యాడు. కేసముద్రం వ్యవసాయ మా ర్కెట్లో దాదాపు 120 క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. -
ప్రాజెక్టులకు ప్రతిపక్షాల అడ్డంకులు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతుల దగ్గర భూములు లాక్కున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిజం కావన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి విపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే ముంపు తప్పనిసరని, ఇళ్లు, భూములు పోతాయని అన్నారు. -
అడ్డగోలు ప్రాజెక్టులతో అనర్థాలే
నల్లగొండ రూరల్: రాష్ట్రంలో పద్ధతి లేకుండా చేపట్టే ప్రాజెక్టులతో ప్రజాధనం వృథా అవుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. నల్లగొండలో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక ‘అభివృద్ధి - ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే, అడ్డగోలుగా భూములు లాక్కుంటామంటే ఊరుకోబోమన్నారు. అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు చేపడితే ప్రజాధనం వృథాతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పారు. ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలి: ఖమ్మం రూరల్: ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని కోదండరాం అన్నారు. హస్నాబాద్‌లో ఆదివారం ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, సంక్షేమ పథకాలు దక్కుతాయని తెలిపారు. -
ప్రాజెక్టులతో పెద్దగా ఉపయోగం ఉండదు
నీటి సద్వినియోగంపై ప్రజలను చైతన్యపరచాలి వాటర్షెడ్లతోనే అధిక లాభం గోదావరి వాటర్ యుటిలైజేషన్ సంస్థ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి జహీరాబాద్/కోహీర్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ సంస్థ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, అవసరమైతే అడ్డుకునేందుకూ సిద్ధమేనని గోదావరి వాటర్ యుటిలైజేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మెదక్ జిల్లా కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామంలో పదేళ్ల క్రితం నిర్మించిన వాటర్షెడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ముఖ్యంగా తక్కువ వ్యయంతో నిర్మించే వాటర్షెడ్లను ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు తమ సంస్థ తరపున కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. గొటిగార్‌పల్లిలో ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హన్మంత్‌రావు పదేశ్ల క్రితం చతుర్విద జల ప్రక్రియలో భాగంగా వాటర్‌షెడ్ నిర్మాణాలను ప్రోత్సహించారని గుర్తుచేశారు. రూ.60 లక్షలతో 2,500 ఎకరాల్లో గ్రామంలో రెండు వాటర్షెడ్లను అప్పట్లో నిర్మించారన్నారు. రాజస్థాన్‌లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని, అక్కడ నిర్మించిన వాటర్ షెడ్లు ఉత్తమ ఫలితాలు ఇచ్చాయన్నారు. వాటర్షెడ్ల వినియోగంపై తమ సంస్థ ద్వారా తెలుగు రాష్ర్టాలతో పాటు దేశవ్యాప్తంగా వాటర్షెడ్లను ప్రోత్సహించేందుకు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు సూచనలిస్తామన్నారు. సమావేశంలో పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, సర్పంచ్ రాచయ్య, కోహీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అష్రఫ్, మల్లన్న, రాందాస్, కండెం నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, జాఫర్, మాజిద్, సంగమేశ్వలతో పాటు అండాలమ్మ, నిరంజన్, రామేశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
ప్రాజెక్ట్‌లపై చర్చకు సిద్ధం
నీటి విడుదల షెడ్యూల్ తప్పితే సీఈ ఆఫీస్‌పై దాడి టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్ : ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు టీఆర్ఎస్ నాయకుల సవాల్‌కు ప్రతిసవాల్ విసిరారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఇచ్చిన ప్రాజెక్ట్‌లపై చర్చకు సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ఏయే గ్రామాలకు సాగునీరందించారో నిరూపించాలన్నారు. తనకు మతిభ్రమించిందనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీలో 25 టీఎంసీల నీరున్నప్పుడే ఆయకట్టు చివర భూములకు ఐదు దఫాలుగా నీరందింపజేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా సాగునీరందించలేని అసమర్థులు అధికార పక్షం నాయకులు అని విమర్శించారు. ఈద, దాసరిలకు చేతనైతే చివరి భూములకు నీరందించాలని సవాలు విసిరారు. తనపై ఇప్పటి వరకు 26 కేసులున్నాయని, ఎస్సారెస్పీకి సంబంధించినవే 12 కేసులు అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయకపోతే సీఈ కార్యాలయంపై దాడి చేయకతప్పదని హెచ్చరించారు. ఎల్లంపల్లి నీటి తరలింపును అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, సదానందం, పుట్ట నరేందర్, గట్టు యాదవ్, బాలాగౌడ్, జగన్‌గౌడ్, గాజె రమేశ్, తీట్ల ఈశ్వరి, కమలాకర్, సలీం, రమేశ్, రాజమల్లయ్య, అజయ్‌రెడ్డి పాల్గొన్నారు. -
'రాజ' ముద్ర
వైఎస్ హయాంలోనే ‘తెలంగాణ మాగాణ’కు బీజాలు - జలయజ్ఞంలో మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టిన నేత - అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలోనే.. కరువు రక్కసితో అల్లాడుతున్న తెలంగాణలో సిరులు పండాలి.. వలసబాట పట్టిన తెలంగాణ రైతన్న ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలి..సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు పారాలి.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలివి! ఈ మహా సంకల్పానికి మహోన్నత యజ్ఞం.. అదే జలయజ్ఞం!! ఏళ్ల తరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు చేవనిచ్చేందుకు చేపట్టిన ఆ యజ్ఞ ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరువవుతున్నాయి. తెలంగాణలో సుమారు 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు నాడు తలపెట్టిన సంకల్పం ప్రస్తుతం లక్ష్యానికి చేరువైంది. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టగా అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలో చేపట్టినవే. 18 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ, మరో ఫ్లడ్ బ్యాంకు పనులను రూ.1,11,433.23 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 387.88 టీఎంసీల కృష్ణా, గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చి 51.47 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో వైఎస్ హయాంలోనే గుత్ప, అలీసాగర్, సుద్దవాగు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వాటి కింద 1,07,584 ఎకరాలకు సాగు నీరిచ్చారు. ఏఎంఆర్పీ, దేవాదుల, ఎస్సారెస్పీ-2, మత్తడివాగు వంటి ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మరో 4 లక్షల ఎకరాలకు నీరందించారు. ఇప్పటివరకు జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులపై మొత్తం రూ.48 వేల కోట్లు ఖర్చుకాగా సుమారు 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో లక్ష ఎకరాల మేర స్థిరీకరణ జరిగింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. అందులో పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు ముందు వరుసలో ఉన్నాయి. - సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి ‘పాలమూరు’పై చెరగని ముద్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ముఖచిత్రం మార్చాలంటే పొలం తడపడం తప్ప మరో మార్గం లేదని భావించిన వైఎస్.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఈ జిల్లాకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు), కోయిల్‌సాగర్ (3.90 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టారు. 7.80 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్లతో వీటిని చేపట్టారు. భారీగా నిధులు కేటాయించడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2009లో సెప్టెం బర్ నాటికే ఈ 4 ప్రాజెక్టుల కింద 60% పనులు పూర్తయ్యా యి. రూ.2,990 కోట్లతో చేపట్టిన కల్వకుర్తిలో వైఎస్ హయాంలో రూ.2,904.01 కోట్లు ఖర్చవగా, భీమా కింద రూ.1,492.38 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.1,124.52 కోట్లు, కోయిల్‌సాగర్ కింద రూ.235.91 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మరణానంతరం వచ్చిన సీఎంలు ప్రాజెక్టులపై చిన్నచూపు చూశారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులో ఇబ్బందులు, రహదారులు, రైల్వే క్రాసింగ్‌లపై పట్టింపు తగ్గడంతో ప్రాజెక్టులు అటకెక్కాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటి పూర్తికి చొరవ చూపుతోంది. దీంతో ఈ ఏడాది 4.60 లక్షల ఎకరాలకు నీరందించే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంత ఆయకట్టుకు జూరాల నుంచి నీరు అందుతోంది. వచ్చే ఏడాది మిగతా 3.20 లక్షల ఎకరాలకు నీరిచ్చి మొత్తం ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా ప్రణాళికలు వేశారు. అదే జరిగితే ఆయకట్టుకు పారే ప్రతి నీటి బొట్టులో వైఎస్ ముద్ర కనబడటం ఖాయం. ఎల్లంపల్లి’ ఘనత వైఎస్‌దే.. 2004 జూలై 28న వైఎస్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లాలో 1,65,700 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వతో దీన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. గతేడాది 10 టీఎంసీల మేర నిల్వ చేయగా.. అది ఈ ఏడాది 20 టీఎంసీలకు చేరింది. గతేడాది నిల్వ చేసిన నీటితోనే ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చింది. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సుమారు 25 వేల ఎకరాలకు నీరివ్వాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న మేడారం పంప్‌హౌస్, గంగాధరం పంప్‌హౌస్‌కు త్వరలో ట్రయల్న్ ్రనిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు నీటిని అందించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు వెనుక వైఎస్ కృషిని మరవలేం. గోదావరి ప్రణాళిక ఆయనదే ఎగువ రాష్ట్రాల జల దోపిడీతో కృష్ణా జలాలు కిందకు రావడం కరువైన పరిస్థితుల్లో.. గోదావరి జలాలే తెలంగాణకు శరణ్యమని భావించిన వ్యక్తి వైఎస్సార్! సముద్రం పాలవుతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి.. ఉపనదులైన వార్దా, పెన్‌గంగ, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నీటిని ఎక్కడికక్కడ వినియోగంలోకి తెచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపలి,్ల, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులు ఇందులో ప్రధానమైనవి. వీటి ద్వారా 300 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక వేశారు. ఇందులో దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే వినియోగంలోకి రాగా, ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ చేసుకొని టెండర్ల దశలను దాటుకొని ముందుకు వెళ్తున్నాయి. ప్రాణహితకు ప్రాణం పోసిన నేత.. చెంతనే గోదావరి పారుతున్నా చుక్క నీటికి నోచుకోక బీళ్లుగా మారిన ఉత్తర తెలంగాణలోని పొలాలకు ఊపిరిలూదేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఊపిరిలూదారు వైఎస్! ఏకంగా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు, జంటనగరాల తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటికి 10 టీఎంసీలు వినియోగించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 డిసెంబర్ 16న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్.. మరుసటి రోజు.. అంటే డిసెంబర్ 17నే ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేశారు. టెండర్లు ఆహ్వానించి 28 ప్యాకేజీలకు ఒప్పందాలు చేసుకున్నారు. అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా, కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలపడమే కాకుండా ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చే సేందుకు సైతం ముందుకు వచ్చింది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ కేంద్రంపై వైఎస్ ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాలతో రీడిజైన్ చేస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. -
ఏదీ.. ఆ భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలనారంగ చరిత్రలో ఆయనది చెరగని సంతకం. ఆయన సాగించిన అభివృద్ధి.. ప్రజాసంక్షేమ ప్రస్థానం మరువలేని జ్ఞాపకం. ఆ మహానేత మరణించి ఏడేళ్లు గడచినా.. జిల్లా ప్రజలు ఆయనకు గుండెల్లో గుడికట్టి నేటికీ పూజిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా మన జిల్లాపై ఎనలేని మమకారం చూపించేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతన్నకు భరోసా ఉంటుందని నమ్మారు. దాని కోసం ఆయన తపించారు. జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా లక్షలాది ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఆకాంక్షించారు. దానికోసం ఆగమేఘాలపై పనులు ప్రారంభించారు. వైఎస్ మరణంతో ఆ పనులు మూలనపడ్డాయి. తర్వాత పాలకులు డెల్టా ఆధునికీకరణపై దృష్టి పెట్టలేదు. కనీసం నిర్వహణ పనులు కూడా సక్రమంగా జరగకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది. ఈ ఏడాది గోదావరిలో నీరున్నా డెల్టాలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. రైతు బాంధవుడిగా.. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతు రుణాలు మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతలంతా ఆయనను నేటికీ కొలుస్తూనే ఉన్నారు. ఆయన మరణానంతరం రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండు దఫాల్లో ఇచ్చిన సొమ్ము వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి ఉండగా, రైతులకు కొత్తగా రుణాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ౖÐð ఎస్ ఏ వర్గం ప్రజలనూ విస్మరించలేదు. ఆరోగ్యశ్రీ పథకంతో వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించారు. వైద్యం అందక పేద, మధ్య తరగతికి చెం దిన ఏ ఒక్కరూ మృత్యువాత పడకూడదనే సంకల్పంతో అన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చారు. వైఎస్ మృతి చెందాక ఆ పథకాన్ని పాల కులు నిర్వీర్యం చేశారు. పథకం పేరు మార్చి అందులో సగానికి పైగా వ్యాధులను తొలగించడంతో ప్రజలకు అందుబాటులో లేకుండాపోయింది. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు, ఉచితంగా మందులు అందించే 104 పథకం మూలనపడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించారు. జిల్లాలో వేలాది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. దీంతె పేద విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్‌హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్య సమీక్షలతో సంక్షేమ ప్రగతిని సామాన్యులకు అందించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు. పింఛన్లు, అభయహస్తం, పావలా వడ్డీ పథకం ఏదైనా ప్రస్తుతం నిధుల లేమితో చతికిలపడింది. వీటిలో కొన్నింటికి పేరు మార్చగా, మిగిలిన వాటిని నిధుల లేమి వెంటాడుతోంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వైఎస్ వెలుగు నింపితే.. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చిం ది. జీవితంలో ఎప్పుడూ వారికి రుణాలందకుండా చేసింది. చంద్రబాబుకు ఓటు వేసిన పాపానికి డ్వాక్రా మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. -
కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు అధిక నిధులు
ఆత్మకూరు (ఎం) : కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు రిడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహా రాష్ట్రతో జల ఒప్పందం వెనుక ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను‡ముఖ్యమంత్రి తన బంధువైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సంబంధికులకు కట్టబెట్టడం ఒక ప్రధాన కారణమన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేసిన పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్‌గుప్త, నాయకులు కందాడి అనంతరెడ్డి, యాస లక్ష్మారెడ్డి, కొడిమాల యాదగిరిగౌడ్, కట్టెకోల హన్మంతుగౌడ్, లోడి శ్రీను పాల్గొన్నారు. -
సర్కారు గోదారి నిద్ర
ఎగువ రాష్ట్రాల ఒప్పందాలపై ఏపీ సర్కార్ మౌనముద్ర తెలంగాణ ‘రీడిజైనింగ్’ పూర్తయితే గోదావరి డెల్టా ఎడారే ♦ రోజుకు 6.5 టీఎంసీలు తోడేస్తారు... ♦ నీటి పంపకాలు జరక్కుండానే తెలంగాణ బ్యారేజీలు.. ♦ ఓటుకు కోట్లు వల్లే నిలదీయని చంద్రబాబు ♦ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటున్నా గప్‌చుప్.. ♦ పోలవరమే శరణ్యమంటున్న సాగునీటిరంగ నిపుణులు సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ సర్కార్ అడ్డగోలుగా ప్రాజెక్టులు చేపట్టినా నోరుమెదపని ఏపీ సర్కార్.. ఇప్పుడు గోదావరి జలాలను మళ్లించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నా అదేతీరున నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పూర్తయితే గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతుందని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తవ్విన పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ఎత్తిపోతలతో చెంబుడు నీళ్లను కృష్ణా నదిలో కలిపి నదుల అనుసంధానం చేశానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై అస్సలు మాట్లాడడం లేదు. రాష్ర్టం బీడుగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నా నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినందునే ఆయన తెలంగాణ అక్రమప్రాజెక్టులపై మాట్లాడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందాలు ఇవే.. ⇒ గోదావరి జలాల వినియోగం కోసం మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు ముంబైలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ⇒ గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. ఈ రెండు బ్యారేజీల నుంచి రోజుకు 34,716 క్యూసెక్కుల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీలను తరలించి.. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ⇒ పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మించడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసి, జైనథ్, బేల మండలాలకు నీటిని అందించనున్నారు. అనుమతులు ఏవి? నాసిక్‌లో జన్మించే గోదావరి నది ప్రధాన స్రవంతిపై మహారాష్ర్టలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతుంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది. రీ-డిజైనింగ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత-చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది. దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది. వర్షాకాలం వరద ఉన్న సమయం మినహా మిగతా సమయాల్లో ఈ ప్రాజెక్టులను దాటుకుని వచ్చే జలాలు ఎన్ని ఉంటాయన్నది సందేహమే. శబరి, సీలేరులే ఇక శరణ్యం. పోలవరం పూర్తయి ఉంటే.. పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి, కష్ణా నదులపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్ర జల సంఘం.. కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటోంది. తమకు గోదావరి జలాల్లో 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. రోజుకు 6.5 టీఎంసీలు తోడేస్తారు.. ⇒ తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే రోజుకు 69,248 క్యూసెక్కుల ( సుమారు 6.5టీఎంసీల) నీటిని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి తోడేయనుంది. ⇒ మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాఖా - కొరటా బ్యారేజీలు నిండాలంటే 18.087 టీఎంసీలు నీళ్లు అవసరం. ⇒తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్ల నుంచి ఎత్తిపోతల ద్వారా రోజుకు 34,716 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకుగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతామారామ, భక్త రామదాస ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 69,248 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. గోదావరి డెల్టాకు కన్నీళ్లే.. ⇒ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాలకు ప్రస్తుతం జూన్‌లోనే వరద నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చేరుతున్నాయి. కానీ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వరద నీళ్లు రాష్ట్రానికి చేరడం కనీసం నెల ఆలస్యమవుతుంది. గోదావరి డెల్టాలో జూన్ నుంచి నవంబర్ 15 వరకూ ఖరీఫ్, డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ వరకూ రబీ పంటలను సాగు చేస్తారు. ⇒ జూన్ నుంచి అక్టోబరు వరకూ సగటున 60 రోజులపాటూ గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది. అక్టోబరు తర్వాత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల ద్వారా గోదావరిలోకి వచ్చే నీళ్లే డెల్టాకు ఆధారం. తెలంగాణ రీడిజైనింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అక్టోబర్ తర్వాత చుక్కనీరు కూడా దిగువకు వచ్చే అవకాశం లేదు. 2015, అక్టోబరు నుంచి 2016, ఏప్రిల్ వరకూ సీలేరు, బలిమెల రిజర్వాయర్లలో జల విద్యుదుత్పత్తి చేసి విడుదల చేసిన వాటితో కలిపి ధవళేశ్వరం బ్యారేజీకి సగటున ఏడు వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు. ⇒ ఒక్క గోదావరి డెల్టాకే రబీలో కనీసం 16 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు మరో 20 వేల క్యూసెక్కులు అవసరం. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. అక్టోబరు తర్వాత గోదావరి నుంచి చుక్క నీరు కూడా రాష్ట్రానికి చేరవు. అప్పుడు శబరి, సీలేరుల నీళ్లే ఆధారం. సీలేరు, శబరిల ద్వారా ఏడు వేల క్యూసెక్కులకు మించి లభించవు. నీటిపంపకాలు జరక్కుండానే.... గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిస్సాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1,172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్ కేంద్రం నీటిని పునర్వియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి.. పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.236 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది. ఓటుకు కోట్లు కేసుల్లో తెలంగాణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినందునే సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ వాదనను ఖండించలేకపోతున్నారు. తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 525.77 టీఎంసీలకే పరిమితం అవుతుంది. గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌లలో ఉండటం గమనార్హం. ఓటుకు కోట్లు కేసు వల్లే... ఎలాంటి అనుమతులూ లేకపోయినా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలకడం లేదు.. పలకడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినందువల్లే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలవరమే మనకు శరణ్యం.... గోదావరి, కృష్ణా డెల్టాలకు సాగునీళ్లు అందించాలన్నా.. ఉభయగోదావరి, విశాఖపట్నం, రాజధాని జిల్లాల(కృష్ణా, గుంటూరు) ప్రజల దాహార్తి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలన్నా పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం ఒక్కటే మార్గం. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వరదాయిని అని కేంద్రం గుర్తించి.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పునర్విభజన చట్టంలోనూ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించి.. దాన్ని తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. సీఎం చంద్రబాబునాయుడు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితోనే ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది. అదే సమయంలో ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీయలేకపోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతలపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెట్టి ఉంటే.. ఈ పాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చేవి. ఆ ప్రాజెక్టు పూర్తయితే.. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 301 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. గోదావరికి వరదలేని కాలంలో పోలవరంలో నిల్వ చేసుకున్న నీటిని గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలకు అందించి.. పంటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. -
అబద్ధాలు.. చిల్లర మాటలు: ఉత్తమ్
- దేశ సరిహద్దులో ప్రాణాలొడ్డి యుద్ధం చేశా.. - జైళ్లకు, తుపాకులకు భయపడతానా? సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత ప్రాజెక్టును కట్టడానికి 16 అనుమతులు వచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు దాచిపెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం అబద్ధాలతో చిల్లర మాటలు మాట్లాడుతూ, స్థాయిని దిగజార్చుకుని అసభ్య పదజాలాన్ని వాడితే వాస్తవాలు మారిపోతాయా నిలదీశారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, ఎం.రంగారెడ్డి, కొనగల మహేశ్‌తో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాల ముంపు కోసం ఒప్పించలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తారా అని దుయ్యబట్టారు. ప్రాణహితను తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులోనే కట్టాలని సీఎం కేసీఆర్ నియమించిన ఇంజనీర్లే నివేదిక ఇచ్చారన్నారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ ద్వారా పంపిస్తామని వెల్లడించారు. ‘‘మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాల ముంపుతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహితను ప్రతిపాదించాం. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్లు. విద్యుత్‌కు కూడా చాలా తక్కువ. నిర్వహణ వ్యయం శాశ్వతంగా తగ్గుతుంది. దీనికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 16 అనుమతులు వచ్చాయి. ఇందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఒప్పించలేక, ఆ రాష్ట్ర పాదాల దగ్గర తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? అనుచితంగా మాట్లాడి.. జైల్లో మూసేస్తామని, తుపాకులతో కాల్చివేస్తామని కేసీఆర్ మాట్లాడితే నేను భయపడను’’ అని ఉత్తమ్ అన్నారు. ‘‘దేశ సరిహద్దులో ప్రాణాలొడ్డి యుద్ధంలో పోరాటం చేసిన. నీలాగా అబద్ధాలు చేసి, మోసాలు చేసి రాజకీయాల్లోకి రాలే దు’’ అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేశారని, కేవలం ఒక్క టీఆర్ఎస్ ఎంపీతో తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై నోరు పారేసుకోవడం సరికాదన్నారు. ప్రాణహితను తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల కరెంటు అవసరాలు పెరుగుతాయని, ప్రాజెక్టు అంచనా వ్యయం, నిర్వహణ భారం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం చేస్తున్న ప్రాజెక్టు గురించి ప్రతిపక్ష పార్టీలతో చర్చించడానికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రజలకు నష్టం చేయకుంటే డీపీఆర్‌ను ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు చెబుతామని, సీఎం చేస్తున్న మోసాన్ని ఎండగడతామని హెచ్చరించారు. -
కరువు తరుముకొస్తున్నా పట్టించుకోరా?
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క వరంగల్: మూడేళ్లుగా అన్నదాత దిగాలు పడుతుంటే గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టేందుకు మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటున్నామంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంత్రి హరీష్‌రావు ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఇప్పటిదాకా గోదావరిపై జల ప్రాజెక్టుల పనులు ఎంతమేరకు జరిగాయనేది వెల్లడించాలన్నారు. నీటిఎద్దడి కారణంగా జిల్లాలో పత్తి, మొక్కజొన్న ఇప్పటికే ఎండిపోగా, వరి కూడా ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై దృష్టిసారించేందుకు అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమయం లేదన్నారు. రాష్ట్రంలోని జలాలను సిద్ధిపేట, గజ్వేల్‌లకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఫలితంగా జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం రైతులు ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. దేవాదుల ప్రాంతం నుంచి తపాస్‌పల్లి వరకు నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకుంటే చింతగట్టులోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, నాయకులు బాస్కుల ఈశ్వర్, మార్గం సారంగం, శ్రీరాముల సురేష్, రహీం, సంతోష్‌నాయక్, హన్మకొండ సాంబయ్య, జిల్లా అధికార ప్రతినిధి మార్క విజయ్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై ప్రేమ చూపరా?
నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథపై ఉన్న ప్రేమ ప్రాజెక్టులపై ఎందుకు లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథి గహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. అంతకుముందు జొన్నలబొగుడ వద్ద కేఎల్ఐ రెండో లిఫ్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండురోజుల్లో దీనికి నీరు వస్తుందని, పంపుద్వారా రోజుకు 0.06 టీఎంసీలను పంపింగ్ చేయవచ్చన్నారు. అంతేగాక కాల్వ, టన్నెల్ ద్వారా గుడిపల్లికీ వస్తాయన్నారు. ఈ నీటితో చుట్టుపక్కల చెరువులు, కుంటలను నింపాలన్నారు. కోయిల్‌సాగర్‌లో మోటారు కాలిపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పంటబీమాపై అధికారులు ప్రచారం చేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారిమళ్లిస్తోందని విమర్శించారు. సాగునీటి బడ్జెట్లో 50శాతం నిధులు ప్రాణహిత–చేవెళ్లకు కేటాయించినా ఎక్కడా పనులు పూర్తికాలేదని, దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పందించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలో ఎన్ని ప్యాకేజీలకు ల్యాండ్ అక్విజేషన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు, కౌన్సిలర్లు బాదం రమేష్, నరేందర్, బీజేపీ మండల నాయకులు కాశన్న, నసీర్, సత్యం, మన్నెపురెడ్డి పాల్గొన్నారు. -
‘కోటి’ లెక్కలు లూటీ కొరకే!
అసెంబ్లీలో సీఎం చెప్పిన కోటి ఎకరాల లెక్కలను కొట్టిపారేసిన టీపీసీసీ ♦ 2004-14 మధ్యే 51.47 లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం ♦ సాగుయోగ్య భూమి 1.11 కోట్ల ఎకరాలైతే.. ♦ కొత్తగా నీరివ్వాల్సింది 12.53 లక్షల ఎకరాలకు మాత్రమే ♦ దానికే రూ.1.5 లక్షల కోట్లు ఖర్చా?.. కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ ♦ పాలమూరు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు.. సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన అంశాలన్నీ కాకి లెక్కలేనని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఆయన చెప్పిన కోటి ఎకరాల లెక్కలు కేవలం లూటీ కోసమేనని విమర్శించింది. కోటి ఎకరాల ప్రణాళిక తమ హయాంలోనే పూర్తయిందని పేర్కొంది. ఇప్పుడు మీరు నీరిచ్చేందుకు గాల్లో భూమిని సృష్టిస్తారా అని ఎద్దేవా చేసింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ వెనుక కమీషన్ల కక్కుర్తి దాగుందని ఆరోపించింది. పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లెక్కడున్నాయని నిలదీసింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులను పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కొత్త ప్రాజెక్టులకు బడ్జెట్లో వేల కోట్లు కేటాయిస్తున్నారని దుయ్యబట్టింది. ఈ అంశాలన్నింటితో ‘తెలంగాణ వాస్తవ జలదృశ్యం’ పేరిట బుధవారం హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో టీపీసీసీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. శాసనసభలో సీఎం కేసీఆర్ పేర్కొన్న వివరాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వెనుక కుట్ర ఉందని ముఖ్యమంత్రి చేసిన విమర్శలకు జవాబిస్తూనే... ప్రస్తుతం కేసీఆర్ చెబుతున్న కోటి ఎకరాలు కాకిలెక్కలని విమర్శించింది. 1956 నుంచి 2004 మధ్య, 2004 నుంచి 2014 మధ్య ప్రాజెక్టుల నిర్మాణం, సాగు వివరాలను వెల్లడించింది. నిర్మాణంలోని ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, కొత్త ప్రాజెక్టులపై చూపుతున్న ఆసక్తిని ఎత్తి చూపింది. ‘కోటి’ఎకరాల ప్రణాళిక మాదే.. కోటి ఎకరాలకు నీరిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలన్నీ అవాస్తవమని టీపీసీసీ విమర్శించింది. నిజానికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరిచ్చేలా కాంగ్రెస్ హయాంలోనే ప్రణాళిక పూర్తయిందని పేర్కొంది. 1956 నాటికే రాష్ట్రంలో 17.38 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని... 2004 వరకు అది 47 లక్షల ఎకరాలకు చేరిందని తెలిపింది. 2004-14 మధ్య చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరో 51.47 లక్షల ఎకరాలకు నీరిచ్చే కార్యాచరణ పూర్తయిందని.. మొత్తంగా దాదాపు కోటి ఎకరాలకు తమ హయాంలోనే ప్రణాళిక పూర్తయిందని స్పష్టం చేసింది. మరి కొత్తగా సీఎం చెబుతున్న మరో కోటి ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించింది. రాష్ట్రంలో సాగుయోగ్య భూమి 1.11 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటికే 98.47 లక్షల ఎకరాలకు ప్రణాళిక ఉందని తెలిపింది. మిగతా 12.53 లక్షల ఎకరాలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తారా? అని నిలదీసింది. సీతారామ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ, ఎఫ్ఎఫ్సీ వంటి ప్రాజెక్టులతో 75 లక్షల ఎకరాలకు నీరిస్తామని ముఖ్యమంత్రి చెప్పనవన్నీ కాకిలెక్కలేనని విమర్శించింది. 2004- 2014 వరకు ప్రాజెక్టులు, ఆయకట్టు వివరాలు మొత్తం ఆయకట్టు 51,47,482 ఎకరాలు పెద్ద ప్రాజెక్టుల కింద 47,28,317 ఎకరాలు మధ్య తరహా ప్రాజెక్టుల్లో 1,83,610 ఎకరాలు చిన్న తరహా ప్రాజెక్టుల్లో 2,35,555 ఎకరాలు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే 29.8 లక్షల ఎకరాలకు నీరు తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులను టీపీసీసీ తమ ప్రజెంటేషన్‌లో ప్రధానంగా ప్రస్తావించింది. 80 నుంచి 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. కేవలం రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తే... 283 టీఎంసీలను అందుబాటులోకి తెచ్చి, 29.8 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం రూ. 860కోట్లు ఖర్చు చేస్తే.. 7,93,250 ఎకరాలకు నీరిచ్చే అవకాశమున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. అదే కొత్తగా తెచ్చిన పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం రూ.8వేల కోట్లు కేటాయించారని పేర్కొంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందెప్పుడు? సాగునీటి రంగంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన విప్లవం కారణంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ భారీ ప్రగతి సాధించిందని టీపీసీసీ పేర్కొంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే చర్యల ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి 2003-04లో ఉన్న 57.99 లక్షల టన్నుల నుంచి... 2013-14 నాటికి ఏకంగా 107.49 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపింది. గత రెండేళ్లలో మాత్రం ఉత్పత్తి 30 నుంచి 50 శాతం పడిపోయిందని విమర్శించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి వివరాలు ఏడాది ఉత్పత్తి (లక్షల టన్నుల్లో) 1955-56 13.78 2003-04 57.99 2013-14 107.49 2014-15 72.18 2015-16 49.35 -
లిఫ్ట్‌ల ద్వారా ప్రాజెక్టులా?
ప్రపంచంలో ఎక్కడా లేని వింత.. రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ జక్రాన్‌పల్లి : లిఫ్ట్‌ల ద్వారా ప్రాజెక్టులు నిర్మించిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన అర్గుల్‌లో విలేకరులతో మాట్లాడారు. గుత్ప ద్వారా జక్రాన్‌పల్లి మండలానికి సాగు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో జారీ చేసిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో సీఎం కే సీఆర్ లక్ష కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. 14 గ్రామాలను ముంచేసి లిఫ్ట్‌ల ద్వారా మల్లన్నసాగర్ కడతామంటే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ (డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు) బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గోదావరి నీళ్లు తెస్తామని అరచేతిలో వైకుంఠం చూపి రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఏ విధంగా నిజాంసాగర్‌కు నీళ్లు తెస్తారో వివరించాలన్నారు. రెండేళ్ల కాలంలో జిల్లాలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ల పాలనలో రాష్ట్రంలో రూ. 60 వేల కోట్ల అప్పులు ఉంటే రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో రూ. 60 వేల కోట్లు అప్పులు చేశారన్నారు. కామారెడ్డి పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గంలోని 211 గ్రామాలకు నీళ్లు అందించామని, ప్రధాని మోడీ రాష్టానికి వచ్చి 21 గ్రామాలకే నీళ్లు అందించే ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్,ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకుడు ఏబీ చిన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'
విజయవాడ: రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నామని ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.3 అడుగుల నీటి మట్టం ఉందని, బ్యారేజీ ద్వారా 15,110 క్యూసెక్కుల కృష్ణా జలాలను సాగు కోసం కాలువల ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉందని, ఐతే నీటి మట్టం ఇంకా పెంచాలని కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా 7 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణకు తరలించామని, దానిని 80 టీఎంసీలకు పెంచాలన్నది సీఎం చంద్రబాబు కోరికని మంత్రి తెలిపారు. -
జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాన్యం మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వచ్చే యేడాదిలో రైతులకు రుణ విముక్తి వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం మూడెకరాల భూపంపిణీ నిరంతర ప్రక్రియ రూ.147 కోట్లతోమానేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మాణం స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ ముకరంపుర : ప్రజల సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్ఫూర్తితో అసమానతలు లేని అభివృద్ధికి పాటుపడతామన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలు, ఆదర్శాల సాధనకు మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిలిచిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమంతో సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నామని వివరించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ చిన్నదే అయినా.. దేశ చిత్రపటంలో సమున్నత స్థానం సంపాదించుకున్నదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి వచ్చే మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మేడిగడ్డ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18.20 లక్షల ఎకరాలకు సాగు నీరిస్తామని, ఇందులో జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిమట్టం 48 టీఎంసీలకు చేరిన వెంటనే కాకతీయ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం జిల్లాకు 36 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, యంత్రపరికరాలను రైతులకు అందిస్తోందన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశామన్నారు. ఎన్నికల హామీ మేరకు మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేశామని, వచ్చే ఏడాదిలో పూర్తిగా రుణవిముక్తి కలుగుతుందని చెప్పారు. 19 కరువు మండలాల్లో 50 శాతం సబ్సిడీపై పశువులకు దాణా సరఫరా చేశామన్నారు. ఈ సంవత్సరం 3200 హెక్టార్లలో రూ.2.60 కోట్లతో బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయలో జలకళ చెరువుల పునర్నిర్మాణం ద్వారా కాకతీయుల నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 5939 చెరువులను పునరుద్ధరించనుండగా, మొదటి విడతలో 823 చెరువుల్లో 711 చెరువులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో దశలో 1082 చెరువుల్లో 115 చెరువుల్లో పూర్తయ్యాయని, మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 పెద్ద చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా తీర్చిదిద్దేందకు రూ.108.21 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు జలకళ సంతరించుకున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వందశాతం మరుగుదొడ్లు రాష్ట్రంలో సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి నియోజకవర్గాల్లో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి స్వచ్ఛ నియోజకవర్గాలుగా ప్రకటించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. త్వరలో హుజూరాబాద్‌ను స్వచ్ఛ నియోజకవర్గంగా ప్రకటించనున్నామని తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది డిసెంబర్ నాటికి వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. వెలుగుల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో సతమతం కాగా... స్వరాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందిందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. వ్యవసాయానికి ఏప్రిల్ నుంచి పట్టపగలే 9గంటలు సరఫరా చేస్తున్నామన్నారు. అందుకు రూ.200 కోట్లతో అదనపు విద్యుత్ సామగ్రిని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లో ఓల్టేజీ సమస్య నివారణకు 33/11 కేవీ సబ్స్టేషన్లు 47, 132/33 కేవీ సబ్స్టేషన్లు ఐదు, రెండు 220/132 సబ్స్టేషన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. ' బంగారు భవిష్యత్తుకే సన్నబియ్యం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకోసం ప్రభుత్వం అన్ని వసతిగృహాలు, పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం అమలు చేస్తోందని ఈటల చెప్పారు. ప్రతినెలా జిల్లాలో 1051 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో నాలుగు కిలోలున్న రేషన్ బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామన్నారు. మైనార్టీలకు మెరుగైన విద్యనందించేందుకు ఈ సంవత్సరం జిల్లాలో నాలుగు బాలుర, మరో నాలుగు బాలికల మైనారిటీ గురుకులాలను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలోనే ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటివరకు 6947 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామన్నారు. సీఎం కేసీఆర దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్‌లో 247 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ముల్కనూరు మాదిరిగానే ఈ ఏడాదిలో జిల్లాలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. – కరీంనగర్ బైపాస్ నుంచి సదాశివపల్లి మార్గంలో రూ.147 కోట్లతో మానేరు నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మరో రూ.150 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. – పర్యాటక అభివృద్ధిలో భాగంగా మైసూర్ బృందావన్ గార్డెన్ మాదిరిగా రూ.70 కోట్లతో బృందావన్ గార్డెన్ నిర్మిస్తామన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్లో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు రూ.100 కోట్ల చొప్పున ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రూ.300 కోట్ల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. – దళితులకు మూడెకరాల భూపంపిణీలో భాగంగా జిల్లాలో 411 మంది రైతులకు 1100 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. మరో 500 ఎకరాలు పంపిణీ చేస్తామని, ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతుందన్నారు. – జిల్లాలో 5,68,412 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకం ద్వారా ప్రతినెలా రూ.70 కోట్ల పింఛన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా 2167 మందికి రూ.11,05 కోట్లు, షాదీముబారక్ ద్వారా 2217 మందికి రూ.11.30 కోట్లు మంజూరు చేశామన్నారు. – జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.2వేల కోట్లతో 307 పనులు మంజూరు చేసిందన్నారు. 146 పనులు పూర్తికాగా మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. రోడ్లకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే ప్రథమమన్నారు. – జిల్లాకు 750 పడకల ఆస్పత్రి మంజూరయ్యిందని, సరిపడా వైద్య సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 10 పడకలతో ఐసీయూ యూనిట్, ఆరు పడకలతో పాలీట్రామా సేవలను ప్రారంభించామన్నారు. – రూ.6వేల కోట్లతో పునరుద్ధరించనున్న రామగుండం ఎరువుల కర్మాగానికి ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుపస్థాపన చేయడం శుభపరిణామమని, ఇందులో 2018లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. – రామగుండంలో రూ.10,500 కోట్లతో రెండు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లకు కూడా శంకుస్థాపన చేయగా 2018లో పూర్తవుతాయన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్‌కు సైతం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయగా పనులు శరవేగంగా జరుగుతాయని మంత్రి వివరించారు. – హరితహారంలో ఇప్పటివరకు 3.20 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి లక్ష్యాన్ని అధిగమించేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, కరీంనగర్, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, టీఆఎర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, ఎస్పీ జోయెల్‌డేవిస్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, నగర పాలక సంస్థ కమిషనర్ డి.కృష్ణభాస్కర్, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి టి.వీరబ్రహ్మయ్యతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి
17న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ : ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం తప్ప నీటి ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధపడడం లేదన్నారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎల్లంపల్లి నీటిని వృథా చేయకుండా వెంటనే చెరువులు, కుంటలు నింపాలన్నారు. వేంనూరు, మేడారం, నారాయణపూర్ పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా ఎల్ఎండీలో నీరు నింపాలన్నారు. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజ్వర్వాయర్కు తీసుకొస్తే వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల ఎద్దడి తొలగుతుందన్నారు. ఈనెల 17న కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి సమావేశ మందిరంలో ప్రాజక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నట్లు తెలిపారు. కర్ర రాజశేఖర్, ఒంటెల రత్నాకర్, దిండిగాల మధు, ఉప్పరి రవి, తాటికొండ భాస్కర్, ఎలగందుల మల్లేశం, సరిళ్ల ప్రసాద్, కటుకం వెంకటరమణ, నాగి శేఖర్, యామ లక్ష్మీరాజం, టేల భూమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు ప్రజల పాలిట జలసమాధులు కావద్దు
l ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా 13న మహాధర్నా l ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మి స్తే స్థానిక ప్రజల ఆమోదం ఉండాలని.. ప్రాజెక్టుల పేరిట ప్రజలు జల సమాధి కాకూడదని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అన్నారు. సోమవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలను నిశిద్ధ ప్రాంతాలుగా మార్చి వేలాది పోలీసులకు మోహరించి బయటి వారు ఆ ప్రాంతాలకు పోకుండా, ప్రజలతో మాట్లాడకుండా ప్రభుత్వం ఫాసిస్టు ధోరణితో నిర్బంధాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. నెత్తురు దారబోసి.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారి ప్రాణాలు తీస్తూ కాళ్లకు సంకెళ్లు వేస్తూ కొనసాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీ నాయకులు గళమెత్తి ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మల్లన్నసాగర్ ముంపు ప్రజలపై ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 13న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నా వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. సమావేశంలో టీడీఎఫ్ నాయకులు ప్రొఫెసర్ ఈసం నారాయణ, అభినవ్, బీరం రాములు, శివాజీ, జనగామ కుమారస్వామి, వీరబ్రహ్మచారి, వీరాచారి, సురేష్, రంజిత్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులతో ‘మంజీర’ ఎడారి
మల్లన్న సాగర్ మన ప్రాజెక్టులకు గుండెకాయ కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం రాజకీయదురుద్దేశంతో ప్రతిపక్షాల అడ్డంకులు నిజాంసాగర్ రిజర్వాయర్ భూగర్భంలో వేదిక రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్ : మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో ఎగువ ప్రాంతాల నుంచి చుక్కనీటి ప్రవాహం లేక మంజీర నది ఏడారిగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంజీర నదికి ఎగువన 47 అక్రమ ప్రాజెక్టులతో సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు చేరని దుస్థితి వచ్చిందన్నారు. అలాగే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 400 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం వలన శ్రీరాంసాగర్ పరిస్థితి అన్నమో రామచంద్రా అన్నట్లు మారిందన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని అదుకునేందు కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయ భవిషత్తు ఉండదన్న దురుద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి మల్లన్నసాగర్ సాధన సదస్సును పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొ న్నారు. ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన మల్లన్నసాగర్ సాధన సదస్సు కోసం శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల కింద రిజర్వాయర్ భూగర్భంలో సభాస్థలాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు 20 వరదగేట్ల వద్ద ఆరేడ్ శివారులో స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు వేసుకున్నారన్నారు. కృష్ణా నది పరీవాహకంలో జురాల, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టులు పూర్తి స్థాయి జలకళను సంతరించుకున్నాయన్నారు. కాని మంజీర, గోదారి నదీ పరీవాహకంలో సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీరు చేరని పరిస్థితులు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల వల్లే గోదావరి, మంజీరలు నీళ్లులేక ఎండాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలకు పుట్టగతులుండవన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా రెండేళ్ల లో మల్లన్నసాగర్ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. మల్లన్నసాగర్ సాధన సదస్సుకు అన్ని జిల్లాల రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్‌రాజు, టీఆర్ ఎస్ నాయకులు వినయ్‌కుమార్, మోహన్‌రెడ్డి, దుర్గారెడ్డి, విఠల్, పోచారం భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, నార్ల సురేశ్, రజనీకాంత్‌రెడ్డి, అన్నారం వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నర్సాగౌడ్, ఎజాజ్ తదితరులు న్నారు. -
‘ఎల్లంపల్లి’ గేట్ల ఎత్తివేత
18 టీఎంసీలకు తగ్గని ప్రాజెక్ట్ నీటి మట్టం భారీగా చేరుతున్న వరద నీరు.. 147.38 మీటర్లకు చేరిన నీరు మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత వరుసగా రెండో రోజు గురువారమూ కొనసాగింది. కురుస్తున్న భారీ వర్షాలతోపాటు కడెం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.38 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రాజెక్ట్‌లో 18.45 టీఎంసీల నీరుంది. 24,197 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 16,400 క్యూసెక్కులు గేట్ల ద్వారా వదులుతున్నారు. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 158 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి నీటిని తరలిస్తున్నారు. అర్ధరాత్రి పది గేట్ల ఎత్తివేత.. ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుండడంతో బుధవారం అర్ధరాత్రి పది గేట్లు ఎత్తారు. గురువారం ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు గేట్లు ఎత్తి నీటిని గోదావరి నదిలోకి వదిలారు. 16,400 క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో కలుస్తోందని ప్రాజెక్ట్ ఎస్ఈ విజయభాస్కర్, డీఈ పార్వతీశ్వర్ తెలిపారు. ఆసిఫాబాద్‌లో.. ఆసిఫాబాద్ : భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులో నీరు చేరడంతో గురువారమూ మండలంలోని కొమురం భీమ్, వట్టివాగు ప్రాజెక్టుల్లో ఒక్కో గేటు ఎత్తారు. పెరిగిన నీటి ప్రవాహంతో ‘భీమ్’ ప్రాజెక్టులో 239.35 మీటర్లు నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 480 క్యూసెక్కులు, వట్టివాగు ప్రాజెక్టులో నీటిమట్టం 286.6 మీటర్లు, ఇన్‌ఫ్లో 1610 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2400 క్యూసెక్కులు ఉంది. -
ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం
రాష్ట్రానికి రూ.17,011 కోట్ల ‘కేంద్ర’ ప్రాజెక్టులు: దత్తాత్రేయ హైదరాబాద్: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ నెల 7న తెలంగాణలో నిర్వహించనున్న తొలి పర్యటనలో రాష్ట్రాభివృద్ధి కోసం రూ.17,011 కోట్ల విలువ చేసే వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పనులకు శంకుస్థాపన చేస్తారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్రానికి వరం అని, రాష్ట్రాభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై బుధవారం ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.5,250 కోట్ల వ్యయంతో రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. 12.7 మెట్రిక్ టన్నుల వార్షిక యూరియా ఉత్పత్తి చేయనున్న ఈ కర్మాగారం 2018-19లోగా నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. గ్యాస్ ఆధారంగా నడిచే ఈ కర్మాగారం కోసం విజయవాడలోని మల్లవరం నుంచి రామగుండం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణాన్ని 2018లోగా పూర్తి చేస్తామన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ల నుంచి ఈ పరిశ్రమకు గ్యాస్ కేటాయింపులను కేంద్రం జరిపిందన్నారు. అదే విధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 1,600(2‘800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.10,599 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్‌ను కేంద్రం తెలంగాణకు కేటాయించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.1,161 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు రైల్వే రవాణా పరంగా అనుసంధానం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1,275 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉందన్నారు. వరంగల్‌కు మంజూరు చేసిన టెక్స్టైల్స్ పార్కు పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు. కేంద్రంలోని ఏ ప్రభుత్వం వల్లా జరగని ప్రయోజనం ప్రధాని మోదీ పర్యటన వల్ల రాష్ట్రానికి జరగబోతోందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, తాము మాత్రం ఈ ప్రాజెక్టులన్నింటినీ కట్టి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తికావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భూసేకరణ, కేంద్ర నిధుల వినియోగం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు. మహా సమ్మేళనంపై మోదీ ఆరా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనం వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారని దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలసి పర్యటన వివరాలను తెలియజేయగా... పార్టీ కార్యకర్తల సమావేశంపై ప్రధాని ఆసక్తి చూపారన్నారు. ఈ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీకి నూతనోత్సాహం వస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
123 జీవో రద్దుతోనైనా కళ్లు తెరవాలి
ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జగిత్యాల రూరల్: జీవో 123 రద్దుతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ద్వారా పరిహారం చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం 123 జీవో ద్వారా ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతోనే హైకోర్టు జీవో 123ని రద్దు చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లు, పరిశ్రమల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పించాలని చట్టంలో ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి, రాజరిక పాలన తలపించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజ్టెల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. ముంపు నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇన్నిసార్లు కోర్టు మందలించిన దాఖలు లేవని, కోర్టు తీర్పు చెంపపెట్టు కావాలన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకీ ఏడుపు?
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం మెదక్: ‘ఆరు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదు. మేమా పనిచేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమ ఉనికి ఎక్కడ గల్లంతవుతుందోనని కన్నీళ్లు పెడుతున్నారు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట, మెదక్ పట్టణాలలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లాకు చెందాల్సిన సాగునీటిని ఆంధ్రా నాయకులు వారి ప్రాంతానికి మళ్లించుకుపోతే ఈ ప్రాంత నాయకులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. స్వరాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి తెలంగాణ ద్రోహులైన టీడీపీ నాయకులతో కలసి ప్రెస్‌మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణలోని మెదక్‌తో పాటు మరో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేసే అటు మల్లన్నసాగర్‌ను అడ్డుకుంటూ, ఘణపురం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో మరో 20 వేల ఎకరాలకు సాగునీరిస్తామంటే అడ్డు పడుతూ కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న రాజకీయాలు ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చుచేసి పాలమూరు జిల్లాలోని 4.50 లక్షల ఎకరాల బీడు భూములకు నీరందించనుందని మంత్రి తెలిపారు. మరో 8 లక్షల ఎకరాలకు పులిచింతల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి సాగు నీరందిస్తామన్నారు. -
మంత్రులుగా నాడు ఏం ఒరగబెట్టారు?
ప్రాజెక్టులను అడ్డుకోవడం దారుణం దామోదర, సునీతపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు తూప్రాన్: కాంగ్రెస్ హయాంలో జిల్లా నుంచి సునీతారెడ్డి, దామోదర్ రాజనరసింహ ఇద్దరూ మంత్రులుగా ఉండి జిల్లాకు ఒరగబెట్టిందేమిటని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం తూప్రాన్ మండలం మనోహరాబాద్‌లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ఓ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులుగా ఉండి జిల్లాకు న్యాయం చేయలేకపోయారని, ఇప్పుడు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేకపోయారు. ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. మంత్రులుగా ఏమి చేశారో వారిద్దరు ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని ఆయన సూచించారు. మంత్రులుగా మీరు జిల్లా ప్రజలకు చేసిన అన్యాయాన్ని తాము సరిదిద్ది జిల్లాను సస్యశ్యామం చేసేందుకు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. ‘మంత్రిగా మిమ్మల్ని ఈ స్థాయిని తెచ్చిన నర్సాపూర్‌కు లక్ష ఎకరాలకు నీరందిస్తుంటే మీరు తలుపులు అడ్డుపెడుతున్నారు. మీరు ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా..?’ అని సునీతారెడ్డిని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ హయాంలో సింగూరు ప్రాజెక్ట్‌లో చుక్కనీరు లేదు. ప్రాజెక్ట్ కోసం 27 గ్రామాలను ముంచెత్తిన కాంగ్రెస్ హయాంలో ఒక్క గ్రామానికి నీరిచ్చావయ్యా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలంగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, రాఘవేంద్రగౌడ్, సుధాకర్‌రెడ్డి, మన్నే నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కుండపోత
ఆదివారం రికార్డు స్థాయి వర్షం మోర్తాడ్‌లో 15, బాల్కొండలో 14 సెం.మీ. ఈ సీజన్లో ఇదే అత్యధికం పొంగిపొర్లుతున్న వాగులు ప్రాజెక్టులు, చెరువులకు జలకళ నీట మునిగిన పంట పొలాలు ఇందూరు : ఇందూరు పరవశించింది.. కుండపోతతో తడిసి ముద్దయింది.. కరువుతో తాగునీటికీ కటకటలాడిన జిల్లా గొంతు తడారింది.. ఆదివారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 179 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతపెద్ద మొత్తంలో వర్షం కురియడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. మోర్తాడ్‌లో 15, బాల్కొండలో 14, కమ్మర్‌పల్లిలో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం కురిసిన భారీ వర్షంతో అత్యధిక వర్షపాతం నమోదైన మండలాల సంఖ్య 17కు చేరింది. 18 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఒక్క తాడ్వాయి మండలం మాత్రం లోటు జాబితాలో ఉంది. పొంగిన వాగులు.. నిండిన చెరువులు ఎడతెరిపి లేకుండా కురిసిన జడివానతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో గల చిన్న, పెద్ద ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చాలాచోట్ల చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. భూగర్భ జలాలు పెరగడం, బోర్ల నుంచి పుష్కలంగా నీరు వస్తుండడంతో రైతులు వరినాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాలతో పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. భీమ్‌గల్ మండలం బాబానగర్‌లో చెరువులోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో తూములకు గండికొట్టారు. కమ్మర్పల్లి మండలంలో పలు చెరువులు నిండుకుండల్లా మారాయి. పల్లె చెరువు, పటేల్ చెరువు, గుండ్లకుంట (బతుకమ్మ చెరువు), గారడీ కుంట, కుడికుంట చెరువు, గండి కుంట హాసాకొత్తూర్‌లోని కొత్త చెరువు, పటేల్ కుంట చెరువు జలకళను సంతరించుకున్నాయి. కోనాపూర్ రాళ్లవాగు ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. కమ్మర్పల్లి–ఉప్లూర్ రహదారిలోని వరద కాలువ సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి. బాల్కొండ మండలంలోని రెంజర్ల, బాల్కొండ, సోన్‌పేట్ గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పెద్ద వాగు, గుండె వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. వరినాట్లు కొట్టుకుపోయాయి. సావెల్–కోడిచర్ల రహదారి నీట మునిగింది. బోధన్‌లోని సరస్వతీనగర్, వెంకటేశ్వర కాలనీ, డీగ్రీ కళాశాల, రాకాసీపేట్ తదితర ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. వేల్పూర్ మండలంలో వాగులు పొంగి పొర్లాయి. ప^è ్చలనడ్కుడ మీదుగా ప్రవహించే పెద్దవాగుకు మొదటిసారి వరద ప్రవాహం వచ్చింది. కప్పలవాగు, ముత్యాలమ్మ వాగులు వరదతో పోటెత్తాయి. జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్, జక్రాన్‌పల్లి గ్రామాల పెద్ద చెరువులు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. కూలిన ఇళ్లు.. భీమ్‌గల్ మండలంలో ఆదివారం రెండిళ్లు నేలమట్టమయ్యాయి. మండలంలోని కారేపల్లిలో ధారవత్ నారాయణ అనే వ్యక్తికి చెందిన ఇళ్లు కుప్ప కూలింది. బడాభీమ్‌గల్‌లో సుద్దులం ఉజారావ్, నర్సయ్యలకు చెందిన ఇళ్లు నేలమట్టమయ్యాయి. తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో మంగళి నారాయణకు చెందిన పెంకుటిల్లు కుప్పకూలింది. భారీ వర్షంతో కమ్మర్‌పల్లిలో ఓ ఇల్లు కూలింది. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌లో గొల్ల దేవన్నకు చెందిన ఇల్లు కూలిపోయింది. -
ప్రాజెక్టుల పేరుతో రైతులకు అన్యాయం
మంత్రి నియోజకవర్గంలో ఎక్కువ, ఇతర చోట్ల తక్కువ ధరకు కొనుగోలు తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి హన్మకొండ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు తక్కువ ధరకు లాక్కోవాలని చూస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందల చంద్రారెడ్డి అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావు నియోజవర్గంలోని చిన్నకోడూరు మండలం పోచగుట్టపల్లిలో ముంపు ప్రాంత రైతులకు ఎకరానికి రూ.16 లక్షలు ఇచ్చారని, ఇదే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో మహబూబ్‌నగర్ వట్టెం వద్ద రూ.5.50 లక్షలకే ఎకరం తీసుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద రూ.4.50 లక్షలకు అసైన్డ్ భూమికి పరిహారం కూడా ఇవ్వకపోతే రైతు గుండె పగిలి చనిపోయాడన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ వద్ద ఎకరం అసైన్్డ్స భూమికి రూ.8లక్షలు, పట్టా భూమికి రూ.12 లక్షలు ఇస్తూ చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే లిఫ్ట్ పెట్టాల్సిన చోట రిజర్వాయర్లు కడుతున్నారని, సాంకేతిక కమిటీ సూచనలు పాటించడంలేదన్నారు. ఆలస్యంగా వ్యవసాయ ప్రణాళిక జూన్ 15న ప్రకటించాల్సిన వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వం నెలరోజులు ఆలస్యంగా ప్రకటించిందన్నారు. కాంటింజెన్సీ ప్రణాళినకు వి డుదల చేయలేదన్నారు. రుణమాఫీ ఒకేసారి చేయకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పా ల్పడుతున్నారన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం వ్యవసాయానికి రూ.64,317 కోట్లు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 43,444 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. జిల్లా నాయకులు పెద్దారపు రమే ష్, గట్ల కొండల్‌రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
జైల్లో వేసైనా ప్రాజెక్టులు కడతాం
అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోం: తలసాని సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రాజెక్టులు అడ్డుకుంటామంటే లోపలేసి తీరుతాం. ఇప్పుడు అరెస్టులు చేసి వదిలేస్తున్నాం. రేపు కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తాం. ప్రభుత్వం చేతు లు కట్టుకుని కూర్చోదు. తాటాకు చప్పుళ్లకు భయపడం.ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం’’ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టొద్దా, రైతులు బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఏపీలో బందరు పోర్టుకు 5వేల ఎకరాలన్నార ని, విజయనగరం ఎయిర్‌పోర్టు అంశం వివాదంగా మారిందని.. అక్కడొక డ్రామా ఇక్కడొక డ్రామానా అని నిలదీశారు. మేజర్ ప్రాజెక్టులను నిర్మించాల్సి వస్తే కొంత నష్టం ఉంటుందని, బాధితులకు ఇబ్బంది ఉంటుందన్నారు. కానీ వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామా కంపెనీలు ఏ ర్పాటు చేసుకొని నాట కాలాడుతున్నాయని.. వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందన్నారు. బీజేపీ కూడా ఇక్కడొక డ్రామా.. మరోచోట మరో డ్రామా ఆడుతోందన్నారు. ఇలా చేస్తే ఆ పార్టీలు 20 ఏళ్లు అడ్రస్ లేకుండా పోతాయన్నారు. ప్రజలు చిల్లర రాజకీయ నాయకుల భ్రమలో పడొద్దని.. మల్లన్నసాగర్ రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులపై లాఠీచార్జి అనేది చెదరగొట్టే ప్రయత్నమేనని.. కక్షగట్టి ఎవరినీ కొట్టలేదన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న 15 మందిలో ప్రతిఒక్కరూ సీఎం అభ్యర్థులే కనుక ఆ పార్టీలో మనిషికో విధా నం ఉంటుందని ఎద్దేవా చేశారు. కోదండరాం ఏ పార్టీకీ చెందినవారు కాదని, ఆయన ప్రజాప్రతినిధి కూడా కాదని.. ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంద న్నారు. ఇక రైతులను లక్ష్యంగా చేసుకొని లాఠీచార్జి చేయడంపై పరిశీలిస్తామన్నారు. -
ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?
ఇలాంటి విపక్షాలు ఉండడం సిగ్గుచేటు: తుమ్మల నాగర్‌కర్నూల్: ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాల ని బంద్‌లు, ధర్నాలు చేస్తారని, కానీ ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్షాలు బంద్‌లు చేయ డం ఏమిటని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండ టం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని, అయినా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయన్నారు. గత పాలకుల అసమర్థతతోనే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చేసి నీరందిస్తున్నా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయన్నా రు. ప్రతిపక్షాలు చిల్లరరాజకీయాలను మా నుకోవాలని మంత్రి హితవు పలికారు. లెక్కలు చెప్పేందుకు సిద్ధమే: జూపల్లి తెలంగాణలో ఎవరెవరి హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు కేటాయిం చారో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరి నా ఎవరూ ముందుకు రావడంలేదని జూపల్లి అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు పట్టువదలమని నాగం, రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగంను ఓయూలో ఓ పట్టుపట్టాకే తెలంగాణ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. -
ప్రాజెక్టులను నిర్మించితీరుతాం
అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు ‘సింగూరు’ నీరు జిల్లాకే వినియోగం ‘ఘనపురం’ను పట్టించుకోని నాటి పాలకులు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అడ్డుకుంటే వారికి ప్రజలే బుద్ధిచెబుతారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కరువు, కాటకాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాజెక్ట్‌ల నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఆదివారం ఆమె మెదక్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక ఇప్పటి వరకు ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ సిమెంట్‌లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించామన్నారు. సింగూరు నీటిని జిల్లాలో సాగునీటికే వాడాలని , హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం గోదావరి, కృష్ణ జలాలను రప్పించడం జరుగుతుందని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో అదనంగా ఆయకట్టు సాగవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆ పనులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతారెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా ఘనపురం ప్రాజెక్ట్‌ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆమె వెంట జెడ్పిటీసీ లావణ్యరెడ్డి ఉన్నారు. -
‘పాలమూరు’ సస్యశ్యామలం
భూసేకరణకు రైతులు సహకరించాలి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయం భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు కొత్తకోట: ఎన్ని కుట్రలు పన్నినా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోలేక పోయాయని, సుప్రీం కోర్టులో కూడా తెలంగాణ వాదనలే నిజమయ్యాయని, ఇకనుంచి ఈ పథకాన్ని జెట్స్పీడ్తో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. గురువారం ఆయన జిల్లాలోని భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు. భీమా ఫేజ్–2లోని రెండవ లిఫ్ట్ ద్వారా 64వేల ఎకరాలకు నీళ్లను విడుదల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు ఎంపీగా గెలిచిన కేసీఆర్ ఇక్కడి నుంచే ఉద్యమాన్ని ఉధతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. పాలమూరుకే తొలిఫలాలు అందాలనే సంకల్పంతో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 12వేల ఎకరాల భూమిని సేకరించారని, త్వరలోనే మరో 8వేల ఎకరాలను సేకరిస్తామని, అందుకు రైతులు సహకరించాలని కోరారు. జూరాల నిర్మాణాన్ని 30 ఏళ్లకు గాని పూర్తిచేయలేకపోయారని కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. వీరు అధికారంలో ఉన్నాళ్లు జిల్లాలో రైతులు కూలీలుగా మారి వలసబాట పట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, వచ్చే ఖరీఫ్ నాటికి 8లక్షల ఎకరాలను సాగులోకి తెస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.నిరంజన్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి
చిట్యాల : ప్రజామోదం మేరకు ప్రాజెక్టులను, పరిశ్రమలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆస్తులను కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. హైవే వెంట హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల్లో ఎన్ని నాటుకున్నాయో సీఎం సమీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మామిడి సర్వయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముల్కపల్లి రాములు, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నారబోయిన శ్రీనివాస్, శీలా రాజయ్య పాల్గొన్నారు.