జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపిక
జాతీయ స్థాయి సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపిక
Published Tue, Dec 6 2016 11:21 PM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
– రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు ఎంపిక
– జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపిక
కర్నూలు సిటీ: విజయవాడలో ఈనెల 3,4 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శనలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్రం నుంచి మొత్తం 17 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని, ఇందులో జిల్లాకు చెందిన రెండు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. నగరంలోని ఇండస్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఉమ్మెసల్మా, సిస్టర్‌స్టాన్సిలా పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సౌమ్య ప్రదర్శించిన ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాయని చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆ విద్యార్థినులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా అభినందించాయి.
Advertisement
Advertisement