ప్రాజెక్టులు ప్రజల పాలిట జలసమాధులు కావద్దు
ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మి స్తే స్థానిక ప్రజల ఆమోదం ఉండాలని.. ప్రాజెక్టుల పేరిట ప్రజలు జల సమాధి కాకూడదని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అన్నారు.
-
l ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా 13న మహాధర్నా
-
l ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మి స్తే స్థానిక ప్రజల ఆమోదం ఉండాలని.. ప్రాజెక్టుల పేరిట ప్రజలు జల సమాధి కాకూడదని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే అన్నారు.
సోమవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలను నిశిద్ధ ప్రాంతాలుగా మార్చి వేలాది పోలీసులకు మోహరించి బయటి వారు ఆ ప్రాంతాలకు పోకుండా, ప్రజలతో మాట్లాడకుండా ప్రభుత్వం ఫాసిస్టు ధోరణితో నిర్బంధాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. నెత్తురు దారబోసి.. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారి ప్రాణాలు తీస్తూ కాళ్లకు సంకెళ్లు వేస్తూ కొనసాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీ నాయకులు గళమెత్తి ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మల్లన్నసాగర్ ముంపు ప్రజలపై ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 13న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నా వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. సమావేశంలో టీడీఎఫ్ నాయకులు ప్రొఫెసర్ ఈసం నారాయణ, అభినవ్, బీరం రాములు, శివాజీ, జనగామ కుమారస్వామి, వీరబ్రహ్మచారి, వీరాచారి, సురేష్, రంజిత్ పాల్గొన్నారు.